చిన్నిచిన్ని ఆశ... తమన్నా ఆశ...
on Dec 16, 2015
సాధారణంగా అమ్మాయిలకి ఆశలు ఎక్కువ అంటారు. సినిమా హీరోయిన్లకయితే ఆ ఆశలు మరింత ఎక్కువగా వుంటాయేమోనని తమన్నా చెప్పే మాటలు వింటే అనిపిస్తూ వుంటుంది. సాధారణంగా అమ్మాయిలు ఏ విషయంలో ఎక్కువ ఆశ వ్యక్తం చేస్తారంటే... అందంగా కనిపించే విషయంలో. తమన్నా కూడా ఈ విషయంలో బోలెడంత ఆశను వ్యక్తం చేస్తోంది. విషయానికి వస్తే, తమన్నా పదేళ్ళక్రితం ఎలా వుందో ఇప్పటికీ అలాగే వుంది. ‘మిల్కీబ్యూటీ’ అనే తన బిరుదుకు ఎలాంటి ఢోకా లేకుండా అందంతో మెరిసిపోతూ వుంది. అయితే ఈ మెరుపు మరో పదేళ్ళపాటు వుండాలని తమన్నా కోరుకుంటోంది. అంటే, మరో పదేళ్ళపాటు సినిమా హీరోయిన్‌గా కొనసాగాలనేగా తమన్నా ఉద్దేశం అని సినీ జనాలు అనుకుంటున్నారు. తమన్నా అందగత్తే.. కానీ ఆమె అందం విషయంలో ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. మొదట్లో తమన్నాలో లేత అందం కనిపించేది.. ఇప్పుడు ఆ అందం ఇప్పుడిప్పుడే కొద్దిగా ‘ముదురు’గా కనిపిస్తోంది. మరో పదేళ్ళ తర్వాత తమన్నా ఇలాగే వుంటుందా అంటే సందేహమే. బట్... తమన్నా మాత్రం తాను ఇలాగే వుండాలని కోరుకుంటోంది. పోన్లేండీ... ఈ చిన్నదాని చిన్నిచిన్ని ఆశ నెరవేరాలని ఆశిద్దాం..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
