'బాహుబలి'ని టార్గెట్ చేసిన 'రోబో'..!!
on Sep 29, 2015
శంకర్, రజనీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ సంచలన విజయం సాధించిన విషయం విదితమే. దానికి సీక్వెల్ గా రోబో 2 సినిమాను తెరకెక్కించబోతున్నాడు శంకర్. ‘రోబో’ను మించేలాగా రోబో-2 స్క్రిప్టు సిద్ధం చేశాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా రజనీకాంత్ బర్త్ డే డిసెంబర్ 12న అఫీషియల్ గా మొదలుపెడతారని ఇండస్ట్రీ టాక్.
రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి' ఇండియన్ సినిమా రికార్డులను కొల్లగొట్టగా..ఇప్పుడు ఆ సినిమా రికార్డులను బద్దలుకొట్టాలని శంకర్ డిసైడ్ అయ్యారట. అందుకోసం బహుబలి కంటే ఎక్కువ బడ్జెట్ తో ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నాడట. అయితే కోలీవుడ్ లోని బడా నిర్మాతలెవరూ ఈ రేంజ్ బడ్జెట్ భరించేందుకు ముందుకు రాకపోవడం వల్లే... శంకర్ విదేశీ నిర్మాతను వెతికి పట్టాడనే ప్రచారం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
లండన్ కు చెందిన ఓ బడా బాబు ఈ కాస్ట్ లీ మూవీకి ప్రొడ్యూసర్ గా ఉండేందుకు ముందుకు వచ్చినట్టు కోలీవుడ్ టాక్. రోబో 2ను త్రీడీలో రూపొందించబోతుండటం మరో విశేషం. ఏదేమైనా... ఇండియన్ స్క్రీన్ పై ఇంతవరకు తెరకెక్కనంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకోబోతున్న రోబో 2... కలెక్షన్ల విషయంలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.