తాను హిట్ కొట్టాడు..తమ్ముడికి ఇస్తాడా?
on Sep 28, 2015
శేఖర్ కమ్ముల స్కూల్ నుంచి వచ్చిన దర్శకుల్లో సాయికిరణ్ అడివి ఒకరు. మొదటి సినిమా ‘వినాయకుడు’తోనే తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకొని మంచి అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. దీని తరువాత ఆయన చేసిన ‘విలేజ్ లో వినాయకుడు’ మాత్రం లాభాలు రాబట్టలేకపోయిన మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాత తన మూడో సినిమా కోసం చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఈ మధ్యే దిల్ రాజు బ్యానర్ లో ఆయన చేసిన 'కేరింత' సినిమా మంచి హిట్ కొట్టింది.
కేరింత ఇచ్చిన కిక్క్ తో మనోడు తన తమ్ముడు శేష్ అడివి కోసం ఓ మంచి కథను సిద్దం చేశాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయిందట. నటీనటులను వెతికే ప్రయత్నంలో వున్నారట. అయితే ఇంతకముందు శేష్ దర్శత్వంలో సాయి కిరణ్ ప్రొడ్యూస్ చేసిన ''కిస్'' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడడంతో..ఈ సారి తమ్ముడికి తానే హిట్టివ్వాలని డిసైడ్ అయినట్టు సమాచారం.