రుద్రమదేవి కష్టాలు తీరేది ఎప్పుడు?
on Aug 28, 2015
రుద్రమదేవి విషయంలో గుణశేఖర్ లక్ కలసి రావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సినిమాని విడుదల చేయడంలో ఉన్న సమస్యల్ని అధిగమించలేకపోతున్నాడు. సెప్టెంబరు 4న ఖాయం అనుకున్న సినిమా కాస్తా వాయిదా పడి.. తర్వాతి రిలీజ్ డేట్ విషయంలో తలనొప్పులు ఎదుర్కొంటోంది. 4న అయితే ఏ సమస్యా ఉండేది కాదు. కానీ తర్వాత ఏ డేట్ అనుకున్నా కష్టమే అన్నట్లుంది. అనేక తర్జన భర్జనల అనంతరం సెప్టెంబరు 17న రిలీజ్ డేట్ ఫిక్స్ చేద్దామని చూశాడు గుణ. కానీ ఇక్కడే ఓ పెద్ద సమస్య వచ్చి పడింది.
తమిళంలో విజయ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘పులి’ ఆ రోజే విడుదల కాబోతోంది. దీంతో ఆ రోజు విడుదల వద్దంటూ తమిళ డిస్ట్రిబ్యూటర్ అడ్డం పడ్డాడట. ఐతే తమిళ వెర్షన్ కోసమని రాజీ పడితే గుణశేఖర్ కు మళ్లీ సరైన డేటు దొరికే అవకాశం లేదు. నవంబరుకు గానీ సినిమాను విడుదల చేసుకోలేడు. అలాగని తెలుగు వెర్షన్ ముందు రిలీజ్ చేసి.. తర్వాత తమిళంలో రిలీజ్ చేద్దామంటే భారీ మొత్తానికి ‘రుద్రమదేవి’ హక్కులు తీసుకున్న తమిళ డిస్ట్రిబ్యూటర్ అందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నాడు. మొత్తానికి రుద్రమదేవి కష్టాలు తీరేదేప్పుడో?

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
