రకుల్ కొంచెం ఎక్కువ బిల్డప్పే ఇచ్చింది..!
on Aug 28, 2015
మామూలుగా లిప్ కిస్ చూస్తే కుర్రాళ్లకు జివ్వుమంటుంది. కానీ కిక్-2 కిస్ అలాంటి ఫీలింగ్సేమీ కలిగించదు. ఆడియన్స్ ను రెచ్చగొట్టేలా కాకుండా.. మంచి ఫీలింగ్ కలిగించేలా ఆ సీన్ తీశాడు సురేందర్ రెడ్డి. ఈ లిప్ కిస్ గురించి రకుల్ ప్రీత్ దగ్గర ప్రస్తావిస్తే.. అబ్బో ఆ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోయానని చెప్పింది.
‘‘ఆ సీన్ చిత్రీకరించే ముందు రోజు వరకు అది లిప్ లాక్ అని చెప్పలేదు. ఓ రొమాంటిక్ సన్నివేశం షూట్ చేయబోతున్నట్లు చెప్పారు. ఆరోజు సడెన్ గా ఆ సీన్ చేయమని చెప్పగానే నేను వెనుకా ముందు చూసుకున్నాను. మా అమ్మ అక్కడే ఉంది. అమ్మను అలా బయటకు తీసుకెళ్లమని చెప్పాను. ఆ తర్వాత ఆ సీన్ చేశాను’’ అని చెప్పింది రకుల్.
ఐతే రకుల్ కు లిప్ లాక్ లు లాగించడం కొత్తేమీ కాదు. హిందీలో ‘యారియాన్’ అనే సినిమాలో హీరోతో లాగించిన లిప్ లాక్ చూస్తే దిమ్మదిరగడం ఖాయం. ఎందుకంటే ఆ ముద్దు చాలా సేపుంటుంది. పైగా అది డీప్ లిప్ లాక్ అని చెప్పాలి. రవితేజతో చేసినట్లు ఊరికే అలా పెదవులు తాకించి వచ్చేసే ముద్దు కాదిది. కిక్-2 లిప్ లాక్ గురించి అంత కంగారు పడిపోయినట్లు బిల్డప్ ఇస్తున్న రకుల్.. హిందీ సినిమాలో చేసిన ఫస్ట్ లిప్ లాక్ విషయంలో ఎలా ఫీలయిందో మరి. స్క్రిప్టు డిమాండ్ చేస్తే ముద్దు సీన్లు చేయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదంటున్నది రకుల్.