‘లోఫర్’లో సమ్‌థింగ్ స్పెషల్
on Dec 16, 2015
పూరి జగన్నాథ్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘లోఫర్’ సినిమా గురువారం నాడు విడుదలవుతోంది. మెగా ఫ్యామిలీకి హిట్స్ ఇవ్వడంలో సిద్ధహస్తుడైన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో మెగా హీరో నటించిన చిత్రం కావడంతో ‘లోఫర్’ మీద భారీ అంచనాలున్నాయి. తిట్లను టైటిల్‌గా పెట్టి సక్సెస్‌లు కొట్టే పూరి తత్వం కూడా ఈ ‘లోఫర్’ సినిమా మీద అంచనాలను పెంచింది. ఈ సినిమా కథ ఏమిటన్నది పూర్తి స్థాయిలో రివీల్ కాకపోయినప్పటికీ, ఈ సినిమా చాలా వైవిధ్యమైన పాయింట్‌తో రూపొందిందని, చూడగానే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్‌లో సదరు పాయింట్ వుంటుందని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. అలాగే ఈ సినిమాలో ‘సమ్‌థింగ్ స్పెషల్’ అని చెప్పదగ్గ విషయం ఒకటి వుందన్న కామెంట్లు ఫిలింనగర్లో వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంతవరకూ ఎలాంటి ‘లీక్స్’ లేవని, వెండితెరమీదే ఆ సమ్‌థింగ్ స్పెషల్ రివీల్ అయ్యే అవాకాశం వుందని అనుకుంటున్నారు. అదేంటో రేపు తెలుస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
