కొరటాల కోసం స్టార్ హీరోస్ వెయిటింగ్..!!
on Sep 27, 2015
శ్రీమంతుడు సినిమాతో దర్శకుడిగా తన సత్తాను చాటుకున్న కొరటాల శివ కోసం మన స్టార్ హీరోలు పోటీ పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. మిర్చి చిత్రంతో డెబ్యూ గా పరిచయం అయిన కొరటాలశివ. ఆ తరువాత గ్యాప్ తీసుకుని మహేష్ బాబు తో శ్రీమంతుడు చిత్రం చేశాడు. చిన్న పాటి పాయింట్ ను క్లాస్ గా తెరకెక్కించి ఒక బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ తోపాటు, మిగిలిన స్టార్ హీరోలందరి దృష్టి కొరటాల శివ పైనే ఉంది. మెగా హీరో బన్నీ అయితే ఏకంగా కొరటాల శివ కు అడ్వాన్స్ ఇచ్చి కథను సిద్దం చేయమన్నారనే టాక్ వినిపిస్తుంది. వాస్తవంగా శ్రీమంతుడు కంటే ముందే, ఎన్టీఆర్ తో చేయాల్సి వుంది. కానీ, అది ట్రాక్ ఎక్కలేదు. అయితే శ్రీమంతుడు తరువాత ఎన్టీఆర్ చిత్రం ఓకే అయినట్టు సమాచారం. ఈ సినిమాకి కూడా మైత్రీ మూవీస్ నిర్మించబోతున్నారు. ఈ సినిమా అల్లు అర్జున్ తో కొరటాల చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయని ఇండస్ట్రీ టాక్. మొత్తానికి కొరటాల శివ కోసం హీరోలు వెయిట్ చేయడం ప్రారంభించారు ఇదే సక్సెస్ పవర్.