కిక్ 2 అట్టర్ ఫ్లాప్
on Aug 26, 2015
కిక్ సినిమాతో పోలిస్తే కిక్ 2 ఓవర్సీస్ మార్కెట్ లో డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ఇప్పటికి మూడు లక్షల డాలర్లు .. అంటే 2కోట్లు వసూలు చేసింది. 99 థియేటర్ల నుంచి వచ్చిన వసూళ్లు ఇవి. కథ కథనం లేని కిక్2లో రవితేజ నటన కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఇలాంటి ఫలితం ఎదుర్కోవాల్సి వచ్చిందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. కిక్ లో ఉన్న కిక్కు కిక్2లో లేదని అందుకే విదేశీ ప్రేక్షకుల ఆదరణ పొందలేదని అంటున్నారు. కిక్ 2 విషయంలో ఓవర్సీస్ పంపిణీదారులు బయ్యర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫెయిల్యూర్ ని ఊహించలేదని వాపోతున్నారంతా. శ్రీమంతుడు మూడోవారంలోనూ వసూళ్లు దుమ్ము దులిపేస్తుంటే కిక్ 2 మాత్రం పూర్తిగా చతికిలబడింని సమాచారం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
