రచ్చ గెలిచి ఇంటగెలిచిన కత్రినా!
on May 9, 2015
ఇంటగెలిచి రచ్చగెలవాలి అంటారు. కానీ కత్రినా మాత్రం రచ్చగెలిచాకే ఇంట గెలిచింది. ఇంతకీ ఏం జరిగిందంటారా? తన క్రేజ్ గురించి పదే పదే చెప్పినా నీకంత సీన్ లేదులే అని కొట్టిపడేసే ఫ్యామిలీ మెంబర్స్...పారిస్ లోని మ్యూజియం విజిట్ చేశాక ఆశ్చర్యపోయారట. కత్రినాకు ఆ మ్యూజియంకు లింకేంటి అనే ఆలోచనలో పడ్డారా! అక్కడికే వస్తున్నా. క్యాట్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు పదేళ్లైంది. ఆరంభంలో అంత సీన్ లేదనిపించినా...తర్వాత కాస్త నిలదొక్కుకుని క్రేజ్ సంపాదించుకుంది. ఆమె కుటుంబ సభ్యులు ఎన్ ఆర్ ఐ లు కావడంతో ఇక్కడి సినిమాలగురించి పెద్దగా పట్టించుకోలేదట. అమ్మడు చెబుతున్నా డబ్బా కొట్టుకోకులే ఏడిపించేవారట. కానీ రీసెంట్ గా పారిస్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో కత్రినా మైనపు విగ్రహం చూసిన అవాక్కయ్యారట. పైగా ప్రముఖ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మైనపుబొమ్మ పక్కనే కత్రినా ప్రతిమ ఉండటంతో రియల్లీ గ్రేట్ అంటూ ఆకాశానికెత్తేశారట. భారీ ఫాలోయింగ్ ఉన్న చికినీ చమేలి గురించి ఆమె ఇంట్లో లేట్ గా తెలియడం ఆశ్యర్యమే మరి.