దిల్ రాజు మళ్ళీ గోల్డెన్ రాజు అయ్యాడు
on Sep 28, 2015
దిల్ సినిమాతో నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టిన దిల్ రాజు, ఆ తరువాత వరుస చిన్న సినిమాలతో భారీ హిట్ లు కొట్టి టాలీవుడ్ గోల్డెన్ ప్రొడ్యూసర్ గా మారాడు. కొత్తవాళ్లు, చిన్న సినిమాలు అంటే కేరాఫ్ అడ్రస్ దిల్ రాజు అనే రెంజుకి వచ్చాడు. అయితే ఏమైందో గానీ సడన్ తన స్ట్రాటజీ మార్చుకున్నాడు.
వరుసగా టాలీవుడ్ సూపర్ స్టార్ లతో సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. వీటి వల్ల శ్రమ పెరిగింది కానీ లాభాలు రావడం కూడా తక్కువైపోయాయి. ఓ దశలో దిల్ రాజు పని అయిపోయిందని ఇండస్ట్రీ టాక్ మొదలైంది. దీంతో మళ్ళీ ఆలోచనలో పడిన దిల్ రాజు మళ్ళీ పాత దారిలోకే వచ్చాడు.
చిన్న సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ వరుస హిట్ సాధించడం మొదలుపెట్టాడు. ఓకే బంగారం, కేరింత సినిమాలు ఓకే అనిపించుకున్న రాజుగారికి మాత్రం లాభాలు తెచ్చిపెట్టాయి. లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ తో తీసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ బాక్స్ ఆఫీస్ రాజు గారికి బాగానే కాసులను రాబట్టుతోంది. ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారో తెలియదు గానీ... మొదటి వీకెండ్ అయ్యేసరికి 8కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం.
ఈ సినిమాకు మహా అయితే పది కోట్లు రాజు గారు ఖర్చుపెట్టి వుంటారు. అంటే శాటిలైట్ అన్ని కలుపుకొని మొదటి నాలుగు రోజులకే సేప్ జోన్ లోకి వెళ్లిపోయినట్లే అనుకోవాలి. అందుకనే స్టార్ లతో నలభై కోట్ల సినిమాలు తీసి, ఆయాసపడే కంటే మంచి కంటెంట్ తో కోటి వెనకేసుకోవడం బెటర్ భావిస్తున్నాడట. ఇప్పుడు సునీల్, సాయి ధరమ్ తేజ లతో కృష్ణాష్టమి, సుప్రీం సెట్ ల మీద వున్నాయి.లేటెస్ట్ బజ్ ఏమిటంటే నానితో ఓ సినిమా ఓకె చేసేందుకు అంగీకారం కుదర్చుకున్నారట. మొత్తానికి మళ్ళీ దిల్ రాజు..గోల్డెన్ రాజు అయ్యాడు.