దీపికను జంతువులతో పోల్చుతున్న డైరెక్టర్
on May 15, 2015
బాలీవుడ్ లో టాప్ రేసులో రేసుగుర్రంలా పరిగెడుతున్న హీరోయిన్ ఎవరంటే మనకు వెంటనే దిపికా పదుకొణే పేరు గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొణే, దర్మకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇద్దరూ ఓ ప్రత్యేకమై బంధంతో ముందుకు సాగుతున్నారని బాలీవుడ్ లో టాక్. దీనికి దీపికా పదుకొణే, సంజయ్ కూడా స్సందించి అవునూ మేమిద్దరం మంచి స్నేహితులం అందులో దాచిపెట్టడానికి ఏమీ లేదని సమాధానం ఇచ్చారు. సంజయ్ నన్ను రకరకాల జంతువుల పేర్లతో పిలుస్తుంటాడని, తన ఎత్తు చూసి జిరాఫీ అని, తన మెడ చూసి రాజహంస అని, తన పరుగు చూసి ఆఫ్రికా జింకతో పోల్చుతాడని.. అంతటి స్నేహం ఉంది మాఇద్దరి మధ్య అని దీపికా తెలిపింది. ఈ రెండేళ్లలో తమ మధ్య చనువు బాగా ఏర్పడిందని, ఈ బంధాన్ని మాటల్లో చెప్పలేనని దీపికా చెప్పింది. సంజయ్ దర్శకత్వంలో దీపికా, రణవీర్ సింగ్ జంటగా 'రామ్ లీల' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జంటతో సంజయ్ 'బాజీరావ్ మస్తానీ' తెరకెక్కిస్తున్నారు. మరి సంజయ్ తో ఈ అమ్మడు చనువుగా ఉండటానికి రణవీర్ ఒప్పుకుంటాడో లేదో చూద్దాం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
