బ్రహ్మీ... ఇది టూ మచ్!
on Nov 3, 2014
బ్రహ్మానందం పేరు చెబితే నిర్మాతలు హడలిపోతున్నారు. ఆయన సినిమాలో ఉంటేగానీ బండి నడవదు. కానీ... ఆయనమాత్రం బహు కాస్ట్లీ నటుడు. రోజుకి రూ.6 లక్షలు తగ్గడు. ఆయన పాత్రని ఒకట్రెండు రోజుల్లో చుట్టేద్దామనుకొంటే కుదర్దు. రోజుకి రెండు మూడు సన్నివేశాల కంటే ఎక్కువ తీయకూడదు. అది ఆయన పెట్టే మరో రూలు. మొత్తానికి సినిమా అంతా బ్రహ్మానందమే కనిపించాలంటే నిర్మాతలకు కళ్లు బైర్లు కమ్మేయాల్సిందే. యమలీల విషయంలోనూ అదే జరిగింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యమలీల 2. ఇందులో బ్రహ్మానందంది చిత్రగుప్తుడు వేషం. యముడు, చిత్రగుప్తుడు మధ్య చాలా సన్నివేశాలున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే సినిమా మొత్తం వీళ్లే కనిపిస్తారు. కనీసం 25 రోజుల నుంచి 30 రోజులు పాటు కాల్షీట్లు సమర్పించుకోవాల్సివ చ్చింది. ఈ సినిమా కోసం బ్రహ్మానందం రూ.1 కోటి 30 లక్షల వరకూ పారితోషికం అందుకొన్నాడని పరిశ్రమ వర్గాలు చెప్పుకొంటున్నాయి. వామ్మో... అంత రేటా..?? మన చిత్ర గుప్తుడు అంత కాస్ట్లీ మరి. యముడు పాత్ర పోషించిన మోహన్ బాబుకి సైతం కోటిన్నర పారితోషికంగా దక్కిందచి తెలుస్తోంది. వీరిద్దరికే దాదాపు రూ. 3 కోట్లు అయ్యాయన్న మాట. సినిమా కోసం రూ.25 కోట్లు ఖర్చు పెట్టారట. ఓ కొత్త కుర్రాడితో ఎస్వీ కృష్ణారెడ్డి ఇంత సాహసానికి ఎలా ఒడిగట్టాడో మరి.