రెడ్డి గారి సినిమా ఎప్పుడు?
on Dec 2, 2014
హీరో విశాల్ రెడ్డి తెలుగు కుర్రాడేనన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటిదాకా అతను ఒక్కటికూడా తెలుగు సినిమా చేయలేదు. తమిళ్ ఇండస్ట్రీలో పోటీ ఎక్కువగా ఉన్నా అక్కడ విశాల్ కు మంచి పేరుంది. మాస్ హీరోగా స్పెషల్ క్రేజ్ ఉంది. అందుకే అతను తమిళ్ ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టేశాడు. ఆ మధ్య తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. కానీ ఇప్పటిదాకా ఆ ఊసే లేదు.
టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పటిదాకా విశాల్ డబ్బింగ్ సినిమాలే చూస్తూ వచ్చారు. అతని ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతూనే ఉంది. అయితే విశాల్ నేరుగా తెలుగు సినిమాలో నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఎప్పటినుంచో కోరుకుంటున్నాడు. మంచి హైట్, సూపర్ యాక్టింగ్ కలగలసి ఉండే విశాల్ తెలుగులో నటిస్తే బావుంటుందని సినీ పెద్దలు కూడా సూచించారట. కానీ పాపం విశాల్ కు తమిళ్ తోనే సరిపోతుంది. తెలుగులో నటించాలని ఉన్నా కాల్షీట్స్ బిజీగా ఉండడం వల్ల ఇక్కడ చేయలేకపోతున్నాడు. విశాల్ మాత్రం తాను తెలుగులో తప్పక నటిస్తానని చెబుతున్నాడు. టైమ్ చెప్పలేను కానీ సినిమా మాత్రం పక్కా అంటున్నాడు. అయితే ఆ సినిమా త్వరగా రావాలని సినీ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు..