అల్లరి నరేష్ ‘జేమ్స్ బాండ్’ ఆడియో
on May 8, 2015
అల్లరి నరేష్ హీరోగా ఎ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘జేమ్స్ బాండ్’. . ‘నేను కాదు నా పెళ్లాం’ ట్యాగ్ లైన్. సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాయికిశోర్ మచ్చ దర్శకుడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 14న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా...చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘’మా బ్యానర్ లో వస్తున్న నాలుగో చిత్రం. మంచి ఎంటర్ టైనర్. ప్రస్తుతం సినిమా దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మన్మథుడు లాంటి భర్తకు పవర్ ఫుల్ మాఫియా డాన్ లాంటి భార్య దొరికితే ఎలా ఉంటుందనేదే కాన్సెప్ట్.
సాయికిషోర్ గారు చక్కగా డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో ఆరు పాటలుంటాయి. అన్నీ డిఫరెంట్ సాంగ్స్. పాటలు బాగా వచ్చాయి. ప్రస్తుతం బ్యాగ్రౌండ్ స్కోర్ జరుగుతుంది.సాయి కార్తీక్ అద్భుతైమన సంగీతాన్నందించారు. ఈ చిత్ర ఆడియో మే 14న విడుదల చేస్తున్నాం. సినిమాని కూడా త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
