బాహుబలి 2 ని అక్కడ కొనేవాళ్లే లేరు
on Mar 28, 2017
బాహుబలి మొదటి భాగం విడుదలకి ముందు పంపిణీదారులు ఎక్కువ మొత్తం పెట్టి రైట్స్ కొన్నప్పుడు నవ్విన వాళ్ళు ఎక్కువే. ఎందుకంటే సినిమా అటు ఇటు అయితే గనుక జీవితాలు తారుమారయ్యేవి. అదృష్టం కొద్దీ సినిమా పలు సంచలనాలు సృష్టించి అతి పెద్ద హిట్ అయ్యి, బయ్యర్లకు భారీగా లాభాలు తెచ్చి పెట్టింది. అదే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు మల్లి పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి బాహుబలి 2 రైట్స్ కొంటున్నారు. సినిమా బానే ఉంటుంది, అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, అంచనాలు తలకిందులయిన ఓపెనింగ్స్ తో అన్ని రికార్డులు కొట్టే సత్తా ఈ సినిమాకుంది. దాదాపు అన్ని ఏరియాల్లో బిజినెస్ పూర్తయింది, కానీ కర్ణాటక రైట్స్ కొనడానికి మాత్రం ఎవరు ముందుకు రావడం లేదు. ఒక వర్గం సత్యరాజ్ కావేరి జలాల విషయంలో అభ్యంతరంగా మాట్లాడినందుకు నిరసనలు తెలుపుతుంటే, నిర్మాతలు డిమాండ్ చేస్తున్న అమౌంట్ చూసి బయ్యర్లకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయంట. అన్నింటిని మించిన అసలు కారణం ఏంటంటే, కర్ణాటక లో వచ్చే నెల నుండి థియేటర్ల రెంట్లు పెంచనున్నారు. ఇది డిస్ట్రిబ్యూటర్లకు ఒక విధంగా భారమైన విషయమే. బాహుబలి 2 విడుదలకి ఇంకా నెల రోజులే ఉంది. చూద్దాం, ఎవరు ధైర్యం చేసి సినిమాని కొనుక్కుంటారో!