రెడీ ఫర్..నందమూరి బ్రదర్స్ హంగామా
on Oct 29, 2015
కిక్ 2 దెబ్బకు కష్టాల్లోకి వెళ్ళిన అన్నను ఆదుకోవడానికి ఎన్టీఆర్ అన్న బేనర్లో ఓ సినిమా చేయడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తన మిత్రుడు..రైటర్ వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడు ఎన్టీఆర్. అంతకముందు ఎన్టీఆర్ సినిమాలకు వక్కంతం అందించిన కథలు పెద్దగా హిట్ అవ్వలేదనే చెప్పాలి. దీంతో వక్కంతం వంశీ యంగ్ టైగర్ కు కోసం ఓ మంచి పవర్ ఫుల్ కథను సిద్దం చేసి రెడీగా వున్నాడట. ఇందులో మరో విశేషం ఏమిటంటే..ఈ సినిమాలో ఓ ప్రముఖ పాత్రను కళ్యాణ్ రామ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇంతకుముందే ఈ విషయం గురించి రూమర్లు వినిపించాయి కానీ.. ఇప్పుడు వక్కంతం స్వయంగా ఈ విషయాన్ని సన్నిహితుల దగ్గర కన్ఫమ్ చేసినట్లు సమాచారం. సో వెండితెరపై నందమూరి బ్రదర్ ఎలా సందడి చేయబోతున్నారో చూడాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.