మా ఆయన ఏమీ అనడు!
on Jun 25, 2015
ఫ్రీడమ్ ఇచ్చే లైఫ్ పాట్నర్ ఉంటే ఎవ్వరికైనా సంతోషమే. కానీ అందరికన్నా మా ఆయన బంగారం అని గారాలు పోతోంది కరీనా కపూర్. ఏంటమ్మా అంత స్పెషల్ అంటే పెళ్లయ్యాక కూడా హీరోయిన్ గా కొనసాగడం అంటే మాటలా అని సెలవిచ్చిందట. అమ్మడి మాటలు విన్న బీటౌన్ జనాలు అవును నిజమే అంటున్నారు.
పెళ్లయ్యాక పక్కోళ్లతో కాస్త క్లోజ్ గా మూవ్ అయితేనే ఇంట్లో రచ్చరచ్చ చేస్తారు. అందుకే ఇలా మూడుముళ్లు పడ్డాయో లేదో నో ఎక్స్ పోజింగ్, నో లిప్ లాక్స్, నో హాట్ సీన్స్ అంటూ కండిషన్స్ పెడతారు. కానీ కరీనా మాత్రం హద్దుల్లేకుండా లిప్ లాక్ లు, బెడ్ రూమ్ సీన్స్ లోచెలరేగిపోతున్నా....సైఫ్ సైలెంట్ గా ఉన్నాడంటే గ్రేటే మరి.
అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే....నా సినిమాలు నువ్వు చూడొద్దు నీ సినిమాలు నేను చూడను అని ప్రామిస్ చేసుకున్నారట. అదీ సంగతి. మొత్తానికి తన ప్రతి గెలుపు వెనుక భర్త సైఫ్ ఉన్నాడంటోంది కరీనా. ఆ మాటలకు సైఫ్ ఫ్లాట్ అయ్యాడో లేదో కానీ...బీటౌన్ జనాలు మాత్రం బెబో అదిరావ్ పో అంటున్నారు.