LATEST NEWS
హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని  నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా  సినీ నిర్మాత, న‌టుడు బండ్ల గ‌ణేశ్ ట్విట్ట‌ర్‌ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన జనాలు ఇది ఖచ్చితంగా ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ట్వీట్ అని తెలుస్తోంది.   మూవీఆర్టిస్ట్ అసోసియేషన్ ( మూవీ) ఎన్నికల్లో  మా అధ్యక్ష  పదవికి పోటీ పడిన ప్రకాశ్ రాజ్ కు అప్పట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దత్తు పలికారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో రియాక్ట్ కావడాన్ని పవన్ కళ్యాణ్ వీరాభి మాని అయిన బండ్ల గణేష్ స్పందించారు.  “కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి..!” అని ఆయ‌న ట్వీట్ చేశారు.  మా అధ్యక్ష పదవికి మంచువిష్ణుకు పోటీగా ప్రకాశ్ రాజ్ నిల్చున్నారు. అప్పట్లో జనసేనాని ప్రకాష్ రాజ్ వెంటే నిలిచారు. . పాత విషయాలను నెమరువేసుకున్న బండ్ల గణేష్ ట్వీట్ పొలిటికల్ గా హీటెక్కించింది.పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ లోని రెండు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. రేవంత్ రెడ్డి చేసిన మార్చురీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖరరెడ్డి, కునా వివేకానందగౌడ్ లు పేట్ బషీర్ బాగ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారిరువురూ వ్యక్తిగతంలో పేట్ బషీర్ బాగ్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఇక రేవంత్ రెడ్డిపై ఫిల్మ్ నగర్ పోలీసు స్టేషన్ లో మరో ఫిర్యాదు దాఖలైంది. ఈ ఫిర్యాదును కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన దాసోసు శ్రవణ్  ఇచ్చారు. పీఎస్ లో రేవంత్ పై ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన దాసోజు  కేసీఆర్ పై మార్చురీ కామెంట్లు చేయడంపై రేవంత్ ను తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ కేసీఆర్ హత్యకు ప్లాన్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ విఫల హామీలపై నిలదీస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఖతం చేయాలనుకుంటున్నారా? అని నిలదీశారు. బెదరింపు రాజకీయాలను రేవంత్ మానుకోవాలని దాసోజు అన్నారు.  అంతకు ముందు తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి మార్చురీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  
 తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు?  అంటే చెప్పడం కష్టం. అసలు ఉంటుందా? అంటే అదీ అనుమానమే? ఎందుకలా? నిన్న మొన్నటి దాకా, ఇదిగో, అదిగో అంటూ ఊహాగానాలు చేస్తూ వచ్చిన మెయిన్ స్ట్రీమ్  మీడియా కూడా ఇప్పడు ఎందుకు మౌనం పాటిస్తోంది?  అంటే  స్పష్టమైన సమాధానం ఏదీ రాక పోయినా కాంగ్రెస్  అధిష్టానం  కొత్త ఆలోచనల కారణంగానే కాబినెట్ విస్తరణ అలోచన అటకెక్కిందని   విశ్వసనీయ వర్గాల సమాచారంగా కాంగ్రెస్  వర్గాలు పేర్కొంటున్నాయి. అంతే కాదు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న ముఖ్యమంత్రి   పంచాయతీ ఇప్పట్లో తేలేది కాదని,  సో .. మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో జరగే అవకాశాలు అంతగా  లేవనీ  ఒక విధంగా చెప్పాలంటే  మంత్రి వర్గ విస్తరణ నిరవధికంగా వాయిదా పడినట్లేనని అంటున్నారు.  నిజానికి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా ఇంతవరకు పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పడలేదు. ముఖ్యమైన హోం, విద్యా శాఖలు సహా మరి కొన్ని మంత్రులు లేని శాఖల పరిస్థితి అక్క మొగుడే’ దిక్కన్నట్లు తయారైందని  అధికార వర్గాలు అసంతృప్తి వ్యక్త పరుస్తున్నాయి.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో  ముఖ్యమంత్రితో కలిపి 12 మంది మత్రులున్నారు. మరో ఏడుగురు మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానంతో సంబంధాలు బాగున్న రోజుల్లో  ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా  పార్టీ అధిష్టానం ముందుంచిన ఎజెండాలో మంత్రి వర్గ విస్తరణ తప్పక ఉండేదని అంటారు. అంతే కాదు  రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మరో ఒకటి రెండు సార్లు మంత్రి పొంగులేటి, ఇతర మంత్రులు మంత్రి వర్గ విస్తరణ కొంచెం అటూ ఇటుగా ఫలానా తేదీ లోగా ఉంటుందని ముహూర్తాలు కూడా నిర్ణయించారు. అయితే ముహూర్త తిథులు, తేదీలు  వచ్చాయి,  పోయాయి కానీ  మంత్రి వర్గ విస్తరణకు  ముడి  పడలేదు.  అదలా ఉంటే, ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే ప్రచారం ఒకటి కాంగ్రెస్ పార్టీలో జోరుగా జరుగుతోంది. కారణాలు వేరైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ విచారణ నివేదిక ఆధారంగానే ఉద్వాసనకు నిర్ణయం జరిగిందని  సో, ఆ ముగ్గురుకి ఉద్వాసన తప్పక పోవచ్చనే  ప్రచారం జరుగుతోంది.    అదొకటి  అలా ఉంటే  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా నేరుగా ఢిల్లీ నుంచి టికెట్ తెచ్చుకున్న విజయ శాంతికి కాబినెట్ బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటుగా, మరో ముగ్గురు కొత్త వారికి అవకాశం దక్కే అవకాశం  ఉందని అంటున్నారు. అయితే  ఇందంతా జరిగేది ఎప్పుడు  అంటే మాత్రం  ఎవరూ స్పష్టమైన సమాధానం చెప్పలేక పోతున్నారు. ముందుగా ప్రస్తుతానికి ఆలోచ , విచారణ దశలోనే ఉన్న ముఖ్యమంత్రి మార్పు విషయంలో ఒక నిర్ణయం తీసుకున తర్వాతనే మంత్రి వర్గ నిర్ణయం ఉంటుందని  ఢిల్లీతో టచ్ లో ఉన్న నాయకులు అంటున్నారు.  అయితే అదే సమయంలో  ముఖ్యమంత్రి మార్పు పై నిర్ణయం అంత సులభంగా తేలే వ్యవహారం కాదని, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టచ్ చేస్తే విపరీత పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని అధిష్టానానికి కూడా తెలుసని అంటున్నారు. అలాగే  కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎవరెవరి వెంట ఎంత మంది ఉన్నారు, ఇతర పార్టీలతో టచ్’లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది, ఇతర పార్టీల ఎమ్మెల్యేలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, లేదా ఇతర  ముఖ్య నాయకులతో  టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎందరు? వంటి వివరాలన్నీ అధిష్టానం సిద్దం చేసుకుందని అంటున్నారు. అలాగే, ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు గోడ దూకుడు లెక్కలకు సంబంధించి వివరాలు సైతం  అధిష్టానం వద్ద ఉన్నట్లు ఒక ప్రచారం జరుగుతోంది.  సో.. ఎలా చూసినా కాంగ్రెస్ అధిష్టానం తొందరు పాటు నిర్ణయం తీసుకోదని అంటున్నారు.  సో... చివరికి ఏ  నిర్ణయం తీసుకోకపోవడమే ఉత్తమ నిర్ణయంగా అధిష్టానం తీసుకున్నా  తీసుకోవచ్చని కాంగ్రెస్ వర్గాల సమాచారం.  ఇదలా ఉంటే రామాయణంలో పిడకల వేట అన్నట్లు, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పని కాదని, రాములమ్మలా నేరుగా దేహికి వెళ్లి మంత్రి పదవి తెచ్చుకుంటానని సంచలన ప్రకటన చేశారు.
మామూలుగానే దక్షిణాదిలో బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు వచ్చిన క్షణం నుంచీ దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ నేతల పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. డీలిమిటేషన్ తో పాటు.. త్రిభాషా సూత్రాన్ని బీజేపీ హై కమాండ్ చర్చలోకి తీసుకురావడంతో దక్షిణాదిలో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఆ పార్టీ నేతలకు ప్రజలనుంచి ముఖం చాటేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.   తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ డీలిమిటేషన్, త్రిభాషా సూత్రాలకు వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా మోడీకి వ్యతిరేకంగా ఆందోళనకు నాయకత్వం వహించేందుకు ముందుకు వచ్చారు. దక్షిణాది రాష్ట్రాల తరఫున తన గొంతును బలంగా వినిపిస్తున్నారు. దక్షిణాది రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దక్షిణాది పార్టీలను కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఏకం చేయడానికి నడుంబిగించారు. ఇప్పటికే ఆ పార్టీ ప్రతినిథులు తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నాయకులను చెన్నై వేదికగా ఈ నెల 22న జరిగే అఖిల పక్ష భేటీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. చెన్నై వేదికగా డీఎంకే నేతృత్వంలో జరగనున్న అఖిలపక్ష భేటీలో కేంద్రం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రయత్నాలకు, కసరత్తుకు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. కేంద్రం ప్రతిపాదించిన విధంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లుతుంది. డీఎంకే నేతలు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కర్నాటక సీఎం సిద్దరామయ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలను అఖిలపక్ష భేటీకి ఆహ్వానించారు. త్రిభాషా సూత్రం విషయంలో దక్షిణాది రాష్ట్రాల నాయకులలో, పార్టీలలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంలో మాత్రం దక్షిణాది రాష్ట్రాల నేతలందరిలో ఏకాభిప్రాయమే వ్యక్తం అవుతోంది. పార్టీలకు అతీతంగా నేతలంతా డీలిమిటైజేషన్ ను వ్యతిరేకిస్తున్నారు.  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాదిరిగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మోడీ సర్కార్ డీలిమిటేషన్ కసరత్తును బహిరంగంగా విమర్శించారు.  దక్షిణాదికి చెందిన రాజకీయ నేతలంతా డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఒకే వేదికపైకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో దక్షిణాదికి చెందిన బీజేపీ నేతలు మాత్రం ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో పడ్డారని పరిశీలకులు అంటున్నారు.  ఇష్టం ఉన్నా లేకున్నా డీలిమిటేషన్ కు అనుకూలంగా తప్ప వ్యతిరేకంగా నోరెత్తలేని సంక్లిష్ట స్థితిలో వారు మిగిలిపోయారు. ఎందుకంటే పార్టీ లైన్ కు వ్యతిరేకంగా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నోరెత్తలేరు.. అలాగని దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం చేకూర్చే నియోజకవర్గాల పునర్విభజనకు అనుకూలంగా మాట్లాడే ధైర్యం చేయలేదు. డిలిమిటేషన్ పేరిట కాంగ్రెస్, డీఎంకేలు విభజన రాజకీయాలకు తెరతీస్తున్నారని బీజేపీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండి పడ్డారు. దక్షిణాది బీజేపీ నేతలు డిలిమిటేషన్ పై ఈ విమర్శ మాత్రమే చేయగలరనీ, అయితే ఇదేమీ వారికి పెద్దగా ప్రయోజనం చేకూర్చే అవకాశం లేదనీ పరిశీలకలు విశ్లేషిస్తున్నారు.  దక్షిణాదిలో కర్నాటక మినహా మరే రాష్ట్రంలోనూ బీజేపీకి చెప్పుకోదగ్గ బలం లేదు. కర్నాటక వినా మరే దక్షిణాది రాష్ట్రంలోనూ బీజేపీ ఇంత వరకూ ఒక్కటంటే ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఒకింత బలపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ డిమిలిటేషన్ వ్యవహారం తెలంగాణలో కూడా ఆ పార్టీ పరిస్థితిని మళ్లీ మెదటికి తీసుకువస్తుందన్న భావన రాజకీయవర్గాలలోనే కాదు, బీజేపీ శ్రేణులలో సైతం వ్యక్తం అవుతోంది.  
అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత పక్కింట్లో పిడుగు పడినా తమకు పట్టనట్టుంటున్నారు. ఇరుగు పొరుగు అనే కాన్సెప్ట్ పూర్తిగా కనుమరుగైంది. నగరాల్లో ఇలా ఉంటే గ్రామాల్లో శుభవార్త అయినా, దుర్వార్త అయినా కలిసి పంచుకుంటున్నారు. రష్యాలో ఓ సర్కస్ లో రెండు ఏనుగుల్లో ఒకటి  చనిపోయింది. మరోటి తట్టుకోలేకపోయింది. కంటితడి పెట్టింది. అంతేకాదు చనిపోయిన ఏనుగు దగ్గరికి ఎవరినీ రానీయకుండా కాపాలా కాసింది.  ఇది చూసిన సర్కస్ కంపెనీ సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు. సర్కస్ కంపెనీలో  ఓ ప్రేక్షకుడే  వీడియో తీసి  సోషల్ మీ డియాలో పో స్ట్ చేశాడు.  ఈ వీడియో నెట్టింట  వైరల్  అయ్యింది. పాతికేళ్ల పాటు ఈ జోడి ఏనుగులు సర్కస్ కంపెనీలో చేసిన వినోదం అంతా ఇంతాకాదు. తన పార్ట్ నర్ చనిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఏనుగు గంటలకొద్దీ అక్కడే గడిపింది.  జెన్నా,  మాగ్దా పేర్లు గల ఏనుగుల్లో ఒకటి చనిపోవడంతో మరోటి తట్టుకోలేకపోయింది.   మనుషుల్లో  బంధాలు బంధవ్యాలు తగ్గిపోతున్న తరుణంలో  ఈ ఏనుగుల బంధం గొప్ప సందేశాన్ని సభ్య సమాజానికి అందించాయి.   
ALSO ON TELUGUONE N E W S
  మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.   'విశ్వంభర' షూటింగ్ దాదాపు పూర్తయింది. ఒక్క ఐటెం సాంగ్ తప్ప షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. ఏప్రిల్ లో ఈ ఐటెం సాంగ్ ని చిత్రీకరించనున్నారని సమాచారం.   ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న 'విశ్వంభర'లో పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. ఇప్పటికే మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ అదిరిపోయింది అనే టాక్ వచ్చింది. ఇక ఈ ఐటెం సాంగ్ కూడా సరికొత్తగా, ఒక ఊపు ఊపేలా ఉంటుందట.    సోషియో ఫాంటసీ ఫిల్మ్ అయినప్పటికీ మెగా అభిమానులు, మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు 'విశ్వంభర'లో పుష్కలంగా ఉంటాయట. ముఖ్యంగా అదిరిపోయే సాంగ్స్, మెగాస్టార్ స్టెప్పులతో.. మెగా ట్రీట్ ఉంటుందని అంటున్నారు.   'విశ్వంభర' సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఛోటా కె. నాయుడు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్స్ గా కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  
నితిన్(Nithiin)కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మూవీ'గుండెజారి గల్లంతయ్యిందే'(Gunde jaari Gallanthayyinde)2013లో ప్రేక్షకుల ముందుకు రాగా నిత్య మీనన్,ఇషాతల్వార్ హీరోయిన్లుగా చేసారు.కొండా విజయ్ కుమార్(Konda Vijaykumar)దర్శకత్వంలో శ్రేష్ట్ మీడియాపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మించడం జరిగింది.విక్రమ్ గౌడ్ సమర్పకుడిగా వ్యవహరించాడు.ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ 'గుత్తాజ్వాల'(Jwala Gutta)తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెట్టి 'గుండెజారి గల్లంతయ్యిందే' లో ఒక స్పెషల్ సాంగ్ చేసి తన డాన్స్ తో,అందంతో ప్రేక్షకులలో గిలిగింతలు కూడా రేపింది. రీసెంట్ గా గుత్తా జ్వాల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నితిన్ నాకు చాలా మంచి స్నేహితుడు.ఒక పార్టీలో కలిసినపుడు'గుండెజారి గల్లంతయ్యిందే' గురించి చెప్పి మూవీలో ఒక సాంగ్ ఉంది.నువ్వు చేయాలనీ అనగానే నేను సరే అన్నాను.ఆ తర్వాత కొన్ని రోజులకి వచ్చి చేయాలనే అనగానే నో అని చెప్పాను.కానీ నితిన్ ఒప్పుకోకుండా సాంగ్ ఫైనల్ అయ్యింది చేయమనే సరికి ఇక చేసేది లేక ఆ సాంగ్ లో చేశాను.ఆ మూవీ ఘన విజయం సాధించాక నీ వల్లే నా సినిమాకి నేషనల్ మీడియాలో ప్రమోషన్స్ జరుగుతుందని చెప్పాడు.నాలుగు రోజుల పాటు ఆ సాంగ్ ని షూటింగ్ చేసాం.ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది. నితిన్ మూవీలో చేయక ముందే  చాలా సార్లు సినిమా ఆఫర్స్ వచ్చాయి.కానీ బ్యాడ్మింటన్ లో బిజీగా ఉండటం వల్ల ఆఫర్స్ కి నో చేప్పాను.ఇండస్ట్రీలో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు.ఇందులో రాణించాలంటే సిగ్గు అనేది ఉండకూడదు.ఎన్నో విషయాల్లో సర్దుకుపోతు ఉండాలి.అలా చెయ్యడం నా వల్ల కాదని చెప్పుకొచ్చింది.గుత్తాజ్వాల 2021 లో ప్రముఖ తమిళ నటుడు,నిర్మాత విష్ణు విశాల్ ని వివాహం చేసుకుంది.ప్రపంచ పోటీల డబుల్స్‌లో కాంస్యం గెలుచుకున్న జ్వాల, కామన్వెల్త్ పోటీల్లో అదే విభాగంలో విజేతగా నిలిచింది.2010 వరకు పదమూడు సార్లు జాతీయ బాడ్మింటన్ విజేతగా నిలవడమే కాకుండా 2011  లో కేంద్ర ప్రభుత్వం చేత అర్జున అవార్డు(Arjuna Award)ని కూడా అందుకుంది.    
Devi Sri Prasad, DSP, the renowned music director of Indian Cinema, especially, Telugu Cinema, has made interesting comments in an interview. He stated that he doesn't encourage remixes and copying tunes. He remarked that he loves to work on his original ideas and is open for inspiration but not copy.  Explaining the difference, he stated that listening to a song and trying to make something like that is different from copying the instrumentation and even the tune. He made it clear that he is against such copying and even he faced many incidents when directors asked him to remix and he quit the film.  Now, his comments have given some fuel to haters and trollers on social media to attack Thaman. They started insinuating the remarks as his remarks against Thaman. As the Akhanda composer keeps facing trolls on his compositions as copy and too loud, these comments have given a huge tool to attack him, again.  Well, Devi Sri Prasad and Thaman are very good friends and they do not have such ego issues to attack each other. Even for Pushpa 2 BGM, Thaman clarified with DSP to try his hand and not to take it as any sort of animosity. So, even social media people should be avoiding such unnecessary ignition between two popular composers. 
  టాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ వంద సినిమాల మైలురాయిని అందుకున్నారు. ఇప్పుడు నాగార్జున వంతు వచ్చింది. నాగార్జున వందో సినిమాకి.. డైరెక్టర్ కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది. అయితే సాధారంగా మైల్ స్టోన్ మూవీస్ చేసేటప్పుడు.. స్టార్ డైరెక్టర్ల వైపు మొగ్గు చూపుతారు హీరోలు. కానీ, నాగార్జున మాత్రం అందుకు భిన్నంగా కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడితో వందో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. (Akkineni Nagarjuna)   2024 సంక్రాంతికి 'నా సామిరంగ'తో కలిసి అలరించిన నాగార్జున.. ప్రస్తుతం ధనుష్ 'కుబేర', రజినీకాంత్ 'కూలీ' సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో నాగార్జున సోలో మూవీ, అందునా వందో సినిమా కోసం.. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే నాగార్జున ఎట్టకేలకు తన వందో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కోలీవుడ్ డైరెక్టర్ రా. కార్తీక్ దర్శకత్వంలో నాగార్జున తన మైల్ స్టోన్ మూవీ చేయనున్నట్లు వినికిడి.    'నితమ్ ఒరు వానం' అనే రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ తో కార్తీక్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తెలుగులో 'ఆకాశం' పేరుతో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కార్తీక్ ఇటీవల నాగార్జునను కలిసి ఒక కథ వినిపించాడట. కథ బాగా నచ్చడంతో.. కార్తీక్ డైరెక్షన్ లో మూవీ చేయడానికి నాగ్ ఓకే చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.   ఒక స్టార్ హీరో తన వందో సినిమాకి కేవలం ఒక్క సినిమా అనుభవమున్న దర్శకుడికి అవకాశం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ, నాగార్జున అలాంటి లెక్కలు పట్టించుకోరు. యువ దర్శకులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు తన వందో సినిమా విషయంలో సైతం.. నాగార్జున ఇదే ఫాలో అవుతున్నారని సమాచారం.  
చిరంజీవి(Chiranjeevi)బాలకృష్ణ(Balakrishna)నాగార్జున(Nagarjuna)వెంకటేష్(venkatesh)వంటి అగ్ర హీరోల సరసన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన రోజా(Roja)తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.రీఎంట్రీలోను అవకాశం కుదిరినప్పుడల్లా ప్రాముఖ్యత గల క్యారక్టర్ లని  పోషిస్తు వస్తుండటమే కాకుండా పలు టివి షోస్ కూడా చేస్తు అభిమానులని అలరిస్తుంది.కళామతల్లి ఇచ్చిన గుర్తింపుతో రాజకీయాల్లోకి కూడా ప్రవేశించి మంత్రిగా కూడా పని చేసారు. రీసెంట్ గా తెలంగాణ(Telangana)అసెంబ్లీ సమావేసాలు జరుగుతున్నాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ప్రతి పక్ష నాయకుడు కేసిఆర్(Kcr)ని ఉద్దెశించి  మాట్లాడుతు కేసిఆర్ ముఖ్యమంత్రి తో పాటు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీశైలం జూడాల నుంచి తెలంగాణాకి రావాల్సిన నీటి విషయంలో అన్యాయం జరిగింది.రాయలసీమ(Rayalaseema)కి నీటిని తీసుకుపోతుంటే అప్పటి ప్రభుత్వాన్ని నిలదీయకుండా రోజా ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిన్నాడు.రాయలసీమని రతనాల సీమ చేస్తానని కూడా చెప్పొచ్చాడని రేవంత్ రెడ్డి మాట్లాడటం జరిగింది. దీంతో రోజా రొయ్యల పులుసు అంటు సోషల్ మీడియాలో వార్త  వస్తుండటంతో సినీ అభిమానుల్లో ఈ న్యూస్  వైరల్ గా మారింది.               
దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad)సంగీతానికి ఉన్న బ్రాండ్ ఏ పాటిదో ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు.మెలోడీ,బీట్,రాంప్,ఫోక్,పేరడీ ఇలా సంగీతానికి సంబంధించి ఎన్నిరకాల ట్యూన్స్ ఉంటాయో,వాటన్నిటిలో రెండున్నర దశాబ్దాల నుంచి అద్భుతమైన ట్యూన్స్ ని అందిస్తూ ప్రేక్షకులకి సరికొత్త ఎనర్జీని ఇస్తు వస్తున్నాడు.మ్యూజిక్ తో ఒక మూవీని ప్రేక్షకుల చెంతకు చేరవేయ్యడంతో పాటు,ఆ మూవీ ఘన విజయంలో కూడా కీలక పాత్ర పోషించడం దేవి స్టైల్.  లేటెస్ట్ గా 'పుష్ప 2 'తండేల్' తో విజయాల్ని అందుకొని మంచి జోరు మీద ఉన్నాడు. దేవి  రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన సంగీతంలో వచ్చిన పాటల గురించి మాట్లాడుతు ఒక సాంగ్ విని స్ఫూర్తి పొందటం అంటే అలాంటి ఇంకో పాటని ట్యూన్ చెయ్యడం,అంతే కానీ కాపీ కొట్టడం కాదు.నా పాటల్ని చాలా మంది కాపీ కొట్టారు.కానీ నేను మాత్రం కాపీ కొట్టను.ఇప్పటి వరకు రీమేక్ సాంగ్స్ కూడా చెయ్యలేదు.గద్దల కొండ గణేష్ మూవీకి సంబంధించి ఒక పాటని రీమేక్ చేయాలన్నారు.అలా చెయ్యడం ఇష్టం లేక ఆ సినిమాని వదిలేసాను,దర్శకుడు హరీష్ శంకర్ ఈ విషయాన్నీ చాలా పాజిటివ్ గా తీసుకున్నాడు. నేను పని చేసిన దర్శకులందరు నా అభిప్రాయాలని గౌరవిస్తారు.'ఉప్పెన' మూవీలోని'నీ కన్నునీలిసముద్రం' ట్యూన్ విని సుకుమార్ అసూయపడ్డారు.నా శిష్యుడు బుచ్చిబాబుకి ట్యూన్ ఇస్తున్నావు కాబట్టి ఒకే లేదంటే నా సినిమాకి వాడేవాడ్నినని అన్నారు.పుష్ప 2(Pushpa 2)లోని 'సూసేకి' సాంగ్ ని 10 నిమిషాల్లో పూర్తి చేస్తే ఆ పాట విని ఆనందంతో సుకుమార్(Sukumar)చంద్రబోస్(Chandrabose)డాన్స్ చేసారని చెప్పుకొచ్చాడు.  
చిరంజీవి హిట్ సినిమాల్లో 1997 లో వచ్చిన మాస్టర్ మూవీ కూడా ఒకటి.ఈ మూవీ ద్వారా నటుడుగా గుర్తింపు పొందిన శివాజీ, ఆ తర్వాత హీరోగా మారి తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయకుడుగా  మారాడు.ఏ క్యారక్టర్ లోకైనా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులని మెప్పించేలా చెయ్యడం శివాజీ నటనకి ఉన్న స్టైల్.కామెడీ నటుడుగాను విజృంభించి నటించగలడు.గత సంవత్సరం  90's ఏ  మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటాడు.ఈ నెల 14 న విదుదలైన 'కోర్ట్'అనే మూవీలో కూడా మంగపతి అనే క్యారక్టర్ ని పోషించి,మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు.ప్రేక్షకులు కూడా మంగపతి క్యారక్టర్ కి ఎంతగానో కనెక్ట్ అవుతున్నారు రీసెంట్ గా శివాజీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నా భార్య పిల్లలు అడగడంతో సినిమాల్లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాను.కాకపోతే అవకాశాలు ఇవ్వమని ఎవర్ని అడిగేవాడ్ని కాదు.సొంత ప్రాజక్ట్ నిర్మించాలనే లక్ష్యంతో  ఈటీవీ యాజమాన్యాన్ని కలిస్తే  90's వెబ్ సిరీస్ అవకాశం వచ్చింది.అది  హిట్ అవ్వడంతో సుమారు 80 కథలు నా దగ్గరకి వచ్చాయి.కానీ వాటిల్లో ఎక్కువగా తండ్రి క్యారక్టర్లే కావడంతో చాలా వరకు రిజెక్ట్ చేశాను. కానీ కోర్ట్ లోని మంగపతి క్యారక్టర్ తో నా ఇరవై ఐదేళ్ల కల నెరవేరడంతో పాటుగా,హీరో నాని ద్వారా ఆ అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.మంగపతి క్యారక్టర్ పూర్తిగా నా కోసమే పుట్టగా అందులోని సహజమైన ఎమోషన్ అందరకి నచ్చుతుంది.ప్రతి కుటుంబంలోను మంగపతి లాంటి వాళ్ళు కనపడుతుంటారు.షూటింగ్ టైంలో మంగపతిగా నా అరుపులకి సెట్ లో వాళ్ళు చాలా సార్లు భయపడ్డారు.క్రూరమైన క్యారక్టర్ లతో ప్రేక్షకులని ఆశ్చర్య పరచాలనే కోరిక చాలా బలంగా ఉందని కూడా చెప్పుకొచ్చాడు.     
తెలుగు సినిమా ప్రేమికులకి పరిచయం అక్కర్లేని నటి సురేఖవాణి(Surekha Vani)సుదీర్ఘ కాలం నుంచి తనదైన శైలిలో నటిస్తు ప్రేక్షకులని అలరిస్తు వస్తుంది.ఆమె కుమార్తె సుప్రీత(Supritha)కూడా తన తల్లి అడుగుజాడల్లోనే నడుస్తు నటిగా ప్రూవ్ చేసుకునే పనిలో ఉంది.సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్  గా కూడా రాణిస్తు ఎంతో మంది ఫాలోవర్స్ ని కూడా సంపాదించింది. రీసెంట్ గా హోలీ రోజు సుప్రీత ఒక వీడియో రిలీజ్ చేసింది.అందులో ఆమె మాట్లాడుతు ఎవరు కూడా ఈజీ మనీకి అలవాటు పడకండి.  కొంత మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్స్ తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్  చేసిన వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని.ఆ విధంగా ప్రమోట్ చేసినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు అలాంటివి మానేసాను.ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే వాటిని చూసి ఎంకరేజ్ చెయ్యకుండా,అలాంటి యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేయ్యండి.అసలు అలాంటి వ్యక్తులని సోషల్ మీడియాలో ఫాలో కూడా అవ్వద్దని చెప్పుకొచ్చింది.      
తెలుగు సినిమా అగ్ర హీరోల్లో ఒకరు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్(Pawan Kalyan)2014 మార్చి 14 న జనసేన(Janasena) పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణ(Telangana)రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)లో పుట్టిన ఈ పార్టీ నిన్న తన 12 వ ఆవిర్భావదినోత్సవ వేడుకల్ని ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం సమీపాన జరుపుకుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభకి హాజరైన పార్టీ జనసేన కార్యకర్తల్ని,వీరమహిళలని, ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతు మనం 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు  మీసాలు మెలేశారు,జబ్బలు చరిచారు.ప్రయాణంలో ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయలేదు.అన్నీ ఒక్కడినై పోరాటం చేశా.ఓడినా అడుగు ముందుకే వేసి రుద్రవీణ వాయిస్తా,అగ్నిధారలు కురిపిస్తా అనే మాటలు నిజం చేశాం.మనం నిలబడటంతో పాటు పార్టీని నిలబెట్టాం.నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం. మన కార్యకర్తలను, వీరమహిళలను అనేక బాధలు పెట్టారు. నన్నుఅణచివేసేందుకు అనేక కుట్రలు చేశారు.అసెంబ్లీ గేటును తాకనివ్వం అని ఛాలెంజ్ చేశారు.వాళ్ల ఛాలెంజ్‌లు సవాలుగా తీసుకుని పోరాడి,.వైసిపీ దాష్టీక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడమే కాకుండా దేశమంతా మనవైపు చూసేలా వందశాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించాం. మన పార్టీకి 11వ సంవత్సరం.వాళ్లను 11 సీట్లకు పరిమితం చేసాం. జనసేన జన్మస్థలం తెలంగాణ. కర్మస్థానం ఆంధ్రప్రదేశ్‌.నా తెలంగాణ కోటి రతనాల వీణ,కరెంట్‌షాక్‌ కొట్టి చావుబతుకుల్లో ఉంటే తెలంగాణలోని కొండగట్టు అంజన్న ప్రాణం పోశాడు.గజ్జెకట్టి ప్రజలను ప్రభావితం చేసిన గద్దర్‌ అన్నకు నివాళులు.ఖుషి సినిమా చూసి గద్దర్‌(Gaddar)నన్ను ప్రోత్సహించారు.మా జనసేన వీరమహిళలు,రాణిరుద్రమలు.తేడా వస్తే కాల్చి ఖతం చేసే లేజర్ బీమ్‌లు.తమిళనాడు,మహారాష్ట్ర,కర్ణాటకలోను రాజకీయపరంగా మన పార్టీకి అభిమానులున్నారు. తమిళులు నా తెలుగు ప్రసంగాలు వింటున్నారని తెలిసింది.వారు నాపై చూపుతున్న ప్రేమకి కృతజ్ఞుడిని.మనదేశానికి బహుభాషలే మంచిది.తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలి.  సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్‌ శ్రీపతి రాముడు నన్ను ఎంతో ప్రభావితం చేశారు.పోలీసులకు స్వయం నిర్ణయాధికారం ఉండదు.విధుల నిర్వహణే ఉంటుంది.సగటు మధ్యతరగతి మనిషిగా బతకడమే నా కోరిక.నేను డిగ్రీ చేసి ఎస్‌ఐను కావాలని మా నాన్న అనేవారు.చంటి సినిమాలో మీనాను పెంచినట్లు మా ఇంట్లో నన్ను పెంచారు.బయటకు వెళ్తే ఏమవుతానో అని మా ఇంట్లో నిత్యం భయపడేవారు.సినిమాల్లోకి, రాజకీయాల్లోకి వస్తానని నేనెప్పుడూ అనుకోలేదు.మా నాన్న చిన్నప్పుడు ఎంతో క్రమశిక్షణతో పెంచారు.కోట్లమందికి సేవ చేసేందుకు అవకాశం ఇచ్చింది ఆ భగవంతుడే. నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమే అని చెప్పుకొచ్చారు. హిందీ,తమిళం,మరాఠీ,కన్నడ,ఆంగ్ల భాషల్లో కూడా పవన్ ప్రసంగం సాగింది.  
  ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో టక్కున చెప్పమంటే అభిమానులు కూడా తడబడతారు. మిగాతా స్టార్స్ కి సాధ్యంకాని విధంగా వరుస భారీ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్', హను రాఘవపూడి డైరెక్షన్ లో 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ తర్వాత స్పిరిట్, సలార్-2, కల్కి-2 తో పాటు ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. మరికొన్ని ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ మరో కొత్త సినిమా కమిట్ అయ్యాడన్న వార్త ఆసక్తికరంగా మారింది. అది కూడా ప్రస్తుతం తాను వర్క్ చేస్తున్న డైరెక్టర్ హను రాఘవపూడితోనే.. ప్రభాస్ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.   ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఫౌజి' చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. అయితే హను టాలెంట్ మెచ్చిన ప్రభాస్.. ఆయనతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట.  ఇప్పటికే హోంబలే ఫిలిమ్స్ నుంచి హనుకి అడ్వాన్స్ కూడా ఇప్పించినట్లు సమాచారం.   హోంబలే ఫిలిమ్స్ లో ప్రభాస్ మూడు సినిమాలు కమిట్ అయిన విషయం తెలిసిందే. అందులో ఒకటి సలార్-2 కాగా, మిగతా రెండు సినిమాలకు ప్రశాంత్ వర్మ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు హను ప్రాజెక్ట్.. ఆ మూడు సినిమాల్లో ఒక దాని ప్లేస్ లో ఉంటుందా? లేక ఇది నాలుగో ప్రాజెక్ట్ ఆ? అనేది తెలియాల్సి ఉంది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మనకిష్టమైన వాళ్ళు మన ఎదురుగా ఉంటే నిజంగానే లైఫ్ కలర్ ఫుల్ గానే  కనిపిస్తుంది. కాని కొన్ని రోజులు అయ్యాకా దాటాకా రోటీన్ లైఫ్ తో బోర్ కొడుతుంది ఎవరికైనా. పొద్దున్నే లేవటం అవే ఉరుకులు పరుగులు, అదే టైం టేబుల్. జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఉండే బ్రైట్నెస్ రానురాను కరువవుతుంది. అందులోనూ ఇంట్లోనే ఉండే హోం మేకర్స్ ఇంకా ఇంకా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడూ చేసిన పనే చేస్తూ, మళ్ళీ తెల్లారిందా అనుకుంటూ వాళ్ళు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. అలాంటి లైఫ్ లో కాస్త రంగులు నింపితే.....ఆనందాలు రెట్టింపయ్యి, అనురాగాలు విరబూస్తాయి, కదూ. మరి ఆ రంగుల్ని నింపటానికి ఏం చెయ్యాలంటే...... రొటీన్ లైఫ్ కి కాస్త భిన్నంగా ఉండాలంటే వీకెండ్స్ లో ఏదైనా లాంగ్ డ్రైవ్ గాని, లేదా చిన్న ట్రిప్ గాని ప్లాన్ చేసుకోవచ్చు. అలా వెళ్లివస్తే మన మూడ్ హాయిగా ఉంది నిజంగానే జీవితం రంగులమయంగా కనిపిస్తుంది. మనం రోజూ వాడే బట్టల్ని పక్కకి పెట్టి ఏదో ఒక న్యూ స్టైల్ ని మార్చాలి. రోజూ పంజాబీ డ్రెస్, సారీ వేసుకునే వాళ్ళు కాస్త డిఫెరెంట్ గా జీన్స్, కుర్తీ లాంటివి ట్రై చేస్తే మీలో వచ్చే మార్పు మీరే గమనించచ్చు. ఇంట్లో ఉండే ఫర్నిచర్ ఎప్పుడు ఒకేలా ఉంటే మజానే రాదు. అందుకే ఇంటికి కొత్త కళ రావాలంటే వాటి ప్లేస్ లు మారుస్తూ ఉండాలి.  మీ భాగస్వామి ఇంటికి వచ్చేసరికి ఒక స్వీట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజులా కాకుండా ఇంట్లోనే కేండేల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుంటే రొటీన్ కి బిన్నంగా ఉంటుంది. మీకు సన్నిహితమైన వాళ్ళని ఇంటికి భోజనానికి పిలవండి. వాళ్ళు వచ్చారు వెళ్లారు అనేలా కాకుండా కాస్త వెరైటీగా కార్డ్స్ గేమ్ గాని, డంషరాడ్స్ లాంటి ఫన్నీ గేమ్స్ గాని ప్లాన్ చేసుకుంటే మనసు హాయిగా రంగులతో నిండిపోతుంది.  మాములుగా ఇంట్లో అందరు ఉన్నప్పుడు మీకు ఇష్టమైన సినిమా వస్తున్నా అది చూసే అవకాశం మీకు ఉండదు. పిల్లలు కార్టూన్ చూస్తామని, మిగిలిన వాళ్ళు సీరియల్స్ చూస్తామని రిమోట్ మీ చేతికి అందనీయరు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు హాయిగా మీకిష్టమైన సినిమాని ప్లే చేసి చూడండి. మీకిష్టమైన కలర్ డ్రెస్, అది మీ పార్టనర్ కి నచ్చకపోతే మీరు వేసుకోటానికి సాహసించరు. అందుకే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మీ ఫ్రెండ్స్ తో బైటకి వెళ్ళినప్పుడు ఆ కలర్ డ్రెస్ వేసుకుని మీ కోరికని తీర్చుకోవచ్చు. ఇంట్లో మీకు బాగా ఇష్టమైన పెంపుడు జంతువుని పెంచుకుంటే మీకు బోర్ కొడుతోంది అనే మాటే గుర్తు రాదు. ఖాళీగా ఉన్న సమయంలో వాటితో ఆడుకుంటూ టైం ఇట్టే గడిచిపోతుంది. మీకిష్టమైన వాళ్ళ స్పెషల్ డేస్ గుర్తుపెట్టుకుని వాళ్ళకి గ్రీటింగ్ గాని, ఫ్లవర్ బొకే గాని పంపితే వాళ్ళు తిరిగి మీకు రెస్పాండ్ అయ్యే విధానం మీ లైఫ్ లో ఖచ్చితంగా కలర్స్ నింపుతుంది. మనకున్నదే చిన్న లైఫ్, అందులో మనకి దొరికే టైం కూడా చిన్నదే. ఆ టైంని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ, ప్రతి సారి ఏదో ఒక కొత్త కోణంలో లైఫ్ ని చూసినట్లయితే మన లైఫ్ మనకి ఎప్పటికి బోర్ కొట్టదు. అది మన కళ్ళకి ఎప్పటికీ కలర్ ఫుల్ గానే కనిపిస్తుంది.  ...కళ్యాణి     
భారతీయుల సంప్రదాయంలో బోలెడు పండుగలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఋతువు మార్పుకు అనుగుణంగా జరిగేవి అయితే.. మరికొన్ని వివిధ కాలాలలో జరిగిన కొన్ని సంఘటనలకు గుర్తుగా జరుపుకునేవి. కొన్ని ప్రాంతీయత ఆధారంగా జరుపుకునేవి అయితే మరికొన్ని యావత్ భారతదేశం అంతా జరుకునేవి. ఇలా భారతీయులు అందరూ  దేశం మొత్తం జరుపుకునే వేడుకల్లో హోళి ఒకటి. రంగుల పండగ అయిన ఈ హోళి వెనుక చాలా కథనాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడికి, హోళి పూర్ణిమకు అవినాభావ సంబంధం ఎంతో ఉంది. అలాగే హోళిని దేశవ్యాప్తంగా జరుపుకున్నా ఒక్కో ప్రాంతంలో ఒకో విధంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పిల్లలు పెద్దలనే తేడా లేకుండా హోళి పండుగ జరుపుకోవడం చాలా చోట్ల కనిపిస్తుంది.  హోళి వెనుక చాలా కథలున్నాయ్! హోళీ పూర్ణిమను పలుచోట్ల కామ పున్నమి అని కూడా పిలుస్తారు. అంతే కాదు పౌర్ణమికి ముందురోజు కామదహనం కూడా నిర్వహిస్తారు. ఈ కామ దహనం వెనుక ఓ కథ ఉంది. తపస్సు చేసుకుంటున్న శివుడి మీద మన్మధ బాణాలు ప్రయోగిస్తాడు మన్మథుడు. దీనికి కోపం చెందిన శివుడు మన్మధుడిని తన మూడవ కంటితో భస్మం చేస్తాడు. తరువాత మన్మధుడి భార్య వేడుకోగా అతనికి పూర్వ రూపం ప్రసాదిస్తాడు. దీన్ని పురస్కరించుకుని వసంత మాసంలో వచ్చే పూర్ణిమను కామ పూర్ణిమగా జరుపుకుంటారు. మన్మధుడిని కాముడు అని పిలవడం అందరికీ తెలిసిందే.. హోళీ.. హోళిక.. హోళిక ఒక రాక్షసి. ఈమె హిరణ్యకశిపుడి చెల్లెలు. తన అన్నయ్య హిరణ్యకశిపుడు నరసింహ అవతారం చేతిలో మరణించినందుకు ప్రహ్లాదుని మీద ఎనలేని ద్వేషం పెంచుకుంది. ఎలాగైనా ప్రహ్లాదుని చంపాలని మంటల్లోకి తోసింది. కానీ నారాయణుడి అభయం ఉన్న ప్రహ్లాదునికి ఏమి కాలేదు. హోళిక ఆ మంటల్లో దహనమైపోతుంది. చెడు మీద మంచి సాధించిన విజయం ఇదని, హోళిక చనిపోయిన సందర్భంగా హోళికా దహనం చేస్తారని చెబుతారు.  బాల కృష్ణుడు..   హోళి పండుగ రోజే.. బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేసినట్టు చెబుతారు. అందుకే డోలాయాత్ర పేరుతో కృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపుతారు. కన్నయ్యతో పాటు రాధను కూడా జతగా ఉంచుతారు.  ఇక హోళిని వివిధ ప్రాంతాల్లో విభిన్న రకాలుగా చేసుకుంటారు. హోళి అంటే ఉదయం నుండి రంగులు పట్టుకుని వీధులంతా  హంగామా చేయడమే మనకు తెలుసు. కానీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఆ శ్రీకృష్ణుడి నివాసమైన మధురలో చాలా ప్రత్యేకంగా హోళి జరుగుతుంది.  ఇక్కడ హోళి పండుగ వీధుల్లో జరుపుకోవడం ఎక్కడా కనిపించదు. పూర్తిగా దేవాలయాల్లో మాత్రమే హోళి జరుపుకుంటారు. అందుకు అనుగుణంగా ప్రజలందరూ దేవాలయాలకు బారులు తీరుతారు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు తమతో కలిసి రంగులు చల్లుకుంటూ, హోళి ఆడతాడనే నమ్మకం అక్కడి ప్రజల్లో ఉంది. ముఖ్యంగా బృందావనంలో హోళి సంబరాలు అంబరాన్నంటుతాయి. అంతే కాదు ఇక్కడి సంప్రదాయంలో భాగంలో ఆడవారు మగవారికి కర్రలతో కొడతారు. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 16 రోజుల పాటు హోళి సంబరాలు జరుగుతాయి. ఆ ఇంద్రధనస్సు వచ్చి మధుర, బృందవనాలలో వాలిందా అన్నట్టు అక్కడ రంగుల మయం అందరినీ మాయ చేస్తుంది. ఫలితంగా హోళి పండుగ రోజు ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు అదనపు పని పెడతారు, మరికొందరు తమలో ఉన్న ట్యాలెంట్ ను ప్రదర్శిస్తారు. ఇలా హోళి సందడి దేశమంతా వెల్లివిరుస్తుంది.                                       ◆నిశ్శబ్ద.
  రంగుల పండుగ అయిన హోలీ ఆనందంతో, నవ్వుతో అందరూ కలిసి మెలిసి ఉండే సమయం.  ముఖ్యంగా పిల్లలకు ఇది చాలా ఇష్టమైన పండుగ. రంగులు చల్లుకోోవడం, నీటి బుడగలు వదలడం,  ఉల్లాసంగా గడపడం పిల్లలు ఎంతో ఇష్టం.  అయితే హోలీ పండుగ సంతోషాన్నే కాదు  కొన్ని ప్రమాదాలను కూడా వెంటబెట్టుకుని వస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే  చాలా ప్రమాదం.  హోలీని గుర్తుండిపోయేలా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా జరుపుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  పిల్లల విషయంలో హోలీ నాడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుంటే.. ఆరోగ్యకరమైన హోలీ.. హోలీని సురక్షితంగా జరుపుకోవడానికి ముఖ్యమైన అంశాలలో ఒకటి సహజ, మూలికా లేదా సేంద్రీయ రంగులను ఉపయోగించడం. రసాయన ఆధారిత సింథటిక్ రంగులు  విషపూరిత పదార్థాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మపు చికాకు లేదా అలెర్జీ రియాక్షన్స్ కు  కారణమవుతాయి. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్న పిల్లలలో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.  రంగుల వల్ల  హానికరమైన ప్రభావాలను నివారించడానికి తల్లిదండ్రులు పర్యావరణ అనుకూలమైన, విషరహిత రంగులను ఎంచుకోవాలి. ఆడుకోవడానికి బయటకు వెళ్లే ముందు, పిల్లల చర్మం,  జుట్టుపై కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్‌ను బాగా పూయడం వల్ల చర్మం దెబ్బతినకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది చర్మంలోకి రంగు చొరబడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.  తరువాత రంగులను కడగడం సులభం చేస్తుంది. పిల్లలకు ఫుల్ హ్యాండ్స్   దుస్తులు,  పొడవాటి ప్యాంటులను వేయాలి.  ఇవి చర్మానికి రంగు అంటుకోకుండా,  సూర్యరశ్మి నుండి రక్షించడానికి  ప్రభావవంతమైన మార్గం. కళ్లకు  గాగుల్స్ అందించడంపెట్టడం  వల్ల ప్రమాదవశాత్తు రంగులు కళ్లలో చెందకుండా జాగ్రత్త పడవచ్చు. హోలీ వేడుకలు తరచుగా ఎండలో బయట జరుగుతాయి కాబట్టి నీరు త్రాగడం చాలా ముఖ్యం. వేడిలో ఆడటం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. కాబట్టి తగినంత తాగునీటిని అందుబాటులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. పిల్లలు విరామం తీసుకొని క్రమం తప్పకుండా నీరు త్రాగమని చెప్పాలి. దీని వల్ల వారు ఉత్సాహంగా,  చురుగ్గా ఉంటారు. పిల్లలు హోలీ ఆడుతున్నప్పుడు వారిని ఒక కంట కనిపెట్టి ఉండాలి. తల్లిదండ్రులు,  సంరక్షకులు,  బంధువులు ఇలా ఎవరో ఒకరు వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. రంగులు చల్లుకోవడం, లిక్విడ్స్ చిమ్మడం వంటివి  ఒకరి ముఖంపై నేరుగా వేయడం సరికాదని పిల్లలకు చెప్పాలి. దీని వల్ల ప్రమాదాలను అరికట్టివచ్చు. హోలీ లో చేయకూడని పనులు.. రంగులు హోలీకి ప్రధానమైనవి అయినప్పటికీ, అన్ని రంగులు సురక్షితం కాదు. తల్లిదండ్రులు రసాయన ఆధారిత రంగులను ఖచ్చితంగా నివారించాలి, ఎందుకంటే వాటిలో దద్దుర్లు, కంటి చికాకు లేదా పిల్లలలో మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే హానికరమైన విషపదార్థాలు ఉంటాయి. నీటి ఆటల్లో జాగ్రత్త అవసరం. నీటి బుడగలు, అధిక శక్తితో పనిచేసే నీటి పిస్టల్స్ శారీరక హాని కలిగిస్తాయి, ముఖ్యంగా కళ్ళు,  ముఖానికి వీటిని ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలి ఎందుకంటే అవి ఊహించని గాయాలకు దారితీయవచ్చు. పిల్లలు అసౌకర్యంగా ఉన్నప్పుడు హోలీలో పాల్గొనమని బలవంతం చేయడం కూడా మానుకోవాలి. రంగులు,  నీటి ఆటలతో ఒక్కొక్కరు ఒకో విధంగా రెస్పాండ్ అవుతారు.  పిల్లల ఇష్టాన్ని గౌరవించడం ముఖ్యం.   హోలీ సమయంలో పల్లం గా ఉన్న ప్రాంతాలు   ప్రమాదాన్ని కలిగిస్తాయి. తడి నేలలు,  నీటితో తడిసిన  వాతావరణం వల్ల  పడిపోవడం,  గాయాలకు దారితీయవచ్చు. తల్లిదండ్రులు పిల్లలు సురక్షితమైన, పొడి ప్రదేశాలలో ఆడుకునేలా చూసుకోవాలి,  తడి ఉపరితలాలపై పరిగెత్తకుండా ఉండాలి. పొడి రంగులను పీల్చడం వల్ల మరో ఆరోగ్య ప్రమాదం తలెత్తుతుంది. పెద్ద మొత్తంలో పొడిని విసిరినప్పుడు, సూక్ష్మ కణాలు పీల్చబడతాయి. ఇది శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది, ముఖ్యంగా ఆస్తమా లేదా అలెర్జీలు ఉన్న పిల్లలకు ప్రమాదం. తల్లిదండ్రులు పిల్లలకు ముక్కు,  నోరు ప్రాంతాల మీద రంగులు వేయకూడదని చెప్పాలి. పిల్లలను ఎప్పుడూ ఎవరూ పట్టించుకోకుండా వదిలివేయకూడదు. ముఖ్యంగా టబ్‌లు, ట్యాంకులు లేదా పెద్ద సమూహాలు వంటి నీటి వనరుల దగ్గర. సరైన పర్యవేక్షణ నిర్వహించకపోతే ప్రమాదవశాత్తు జారిపడటం, పడిపోవడం లేదా మునిగిపోవడం వంటి సంఘటనలు సంభవించవచ్చు. పిల్లలపై ఎల్లప్పుడూ నిఘా ఉంచడం వల్ల సురక్షితమైన,  భద్రమైన హోలీ అనుభవాన్ని పిల్లలు పొందగలుగుతారు.                                       *రూపశ్రీ
హోళి అంటే ఇష్టం లేనిది ఎవరికి?? చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు హోళి సందడిలో తమవంతు పాత్ర పోషిస్తారు. అయితే హోళి సంబరాలలో అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకుంటు ఉంటాయి. హోళిని హాయిగా ఎంజాయ్ చేస్తూ.. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. మీ చర్మ సంరక్షణ తప్పనిసరి:  చర్మాన్ని వీలైనంత జిడ్డుగా చేయడం చాలా ముఖ్యం, తద్వారా రంగులు చర్మం మీద  వ్యాప్తి చెందడానికి లేదా అంటుకునే అవకాశం ఉండదు. ఇందుకోసం కొబ్బరి నూనె రాసుకోవచ్చు. కొబ్బరి నూనె వల్ల మరొక లాభం ఏంటంటే చర్మం పొడిబారకుండా చేస్తుంది. అలాగే శరీరం మీద రంగులు క్లీన్ చేయడం సులువు అవుతుంది.   సేంద్రీయ రంగుల ఎంపిక:   పర్యావరణ అనుకూలంగానే కాకుండా మన చర్మానికి కూడా అనుకూలమైన రంగులతో హోలీని జరుపుకోవాలి. హానికరమైన రసాయనాలు కలిపిన రంగులను నివారించాలి. రసాయనాలు కలిపిన రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి అంతేకాఫు ఇవి నీటిలో చాలా తొందరగా కలిసిపోతాయి. ఈ రంగులు  చర్మం నుండి తొలగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. బంతి పువ్వు, గులాబీ, మందారం, చెట్ల ఆకులు, పసుపు ఇలా పువ్వుల రెక్కల నుండి రంగులు తయారుచేసుకోవచ్చు. .  హైడ్రేటెడ్ గా ఉండాలి:  హోలీ వేసవిలో వస్తుంది, హోళి సమయానికి వేసవి మొదలైపోయి ఉంటుంది. దీనివల్ల బయట ఎండలు భగ్గుమంటుంటాయి. ఈ ఎండల్లో రంగులు చల్లుకుని ఎంజాయ్ చేసినా.. మరొకవైపు ఎండ దెబ్బ మాములుగా ఉండదు.  కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. నీరు, గ్లూకోజ్, జ్యూస్‌లు, శరీరాన్ని తిరిగి శక్తివంతం చేయడంలో సహాయపడతాయి.  పైగా ఇవి చర్మం పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తాయి.   కళ్ళను తేలిగ్గా తీసుకోవద్దు:  మీరు రోజూ  కాంటాక్ట్ లెన్స్‌లను ధరించేవారు అయితే, రంగులతో ఆడుకునే ముందు వాటిని తీసివేయడం మంచిది. కళ్ళజోడు మీద రంగులు లేదా నీళ్లు పడితే ఎదుటి ప్రాంతాన్ని మసగ్గా కనిపించేలా చేస్తాయి. ఇది ఇబ్బందే అనుకోవచ్చు. అలాగని కళ్ళజోడు లేకుండా హొలీ ఆడేటప్పుడు రంగులు నేరుగా కళ్ళలోకి పడకుండా అజాగ్రత్త పడాలి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కాబట్టి కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి.  స్వీట్ల దగ్గరా జాగ్రత్త:  హోలీ సమయంలో మార్కెట్‌లో కల్తీ ఖోయా, మావా అమ్ముతారు. ఇంకా ఇలాంటి కల్తీ పదార్థాలతో స్వీట్లు తయారుచేస్తారు. ఇలాంటివే ఆఫర్స్ కింద, డిస్కౌంట్ల కింద అమ్మేస్తారు. కాబట్టి స్వీట్స్ కొనేముందు జాగ్రత్తగా ఉండాలి. .  శరీరాన్ని ఇలా కవర్ చేయాలి: హొలీ ఆడేటప్పుడు యావరేజ్ గా ఉన్న బట్టలు వేసుకోవాలి. దీనివల్ల వాటిమీద రంగులు వదలకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొత్త బట్టలు అయితే నాశనం అయిపోతాయి. ఫుల్ హాండ్స్ ఉన్న టాప్స్, ఫుల్ గా కాళ్లను కవర్ చేసే ప్యాంట్స్ వేసుకోవాలి. దీనీవల్ల రంగులు శరీరాన్ని పాడుచేసే అవకాశం తక్కువ. పాత డెనిమ్ జీన్స్, పొడవాటి పైజామాలను ఎంచుకోవచ్చు.  ఇలా ఆరోగ్యకరమైన హోళిని ఎంజాయ్ చేసి, ఆరోగ్యంగా ఉండండి.                                    ◆నిశ్శబ్ద.
    హోలీ అనేది రంగుల పండుగ. ఈ పండుగలో ప్రజలు తమకు ఇష్టమైన వారికి,  స్నేహితులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలుపుతారు.  రంగులు చల్లుకుంటూ  పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. రంగులు వేయడం అనేది మతానికి లేదా కేవలం సరదాకి మాత్రమే పరిమితం కాదు, దానికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. హోలీ రంగులతో ఆడుకోవడం కూడా ఆరోగ్యకరమేనట.  ఇది మన మానసిక స్థితి,  శక్తి స్థాయిలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఒక రకమైన కలర్ థెరపీ అంటున్నారు వైద్యులు. హోలీ సమయంలో రంగులతో ఆడుకోవడం వల్ల మనస్సులో ఆనందం, శక్తి,  ఆశావాదం కలుగుతాయి.  హోలీలో రంగులను ఉపయోగించడం ద్వారా  శారీరక, మానసిక,  భావోద్వేగ ప్రయోజనాలను పొందుతాము. కాబట్టి హోలీలోని రంగుల వెనుక నిజాన్ని అర్థం చేసుకోవాలి.  హోలీ రంగుల శాస్త్రీయ ప్రాముఖ్యత, కలర్ థెరపీ అంటే ఏమిటి.. దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. కలర్ థెరపీ అంటే ఏమిటి?   కలర్ థెరపీ అనేది రంగుల ద్వారా మానసిక,  శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పద్ధతి. దీనిని క్రోమోథెరపీ అని కూడా అంటారు. ఈ చికిత్సలో ప్రతి రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రంగులు,  లైట్లు ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కలర్ థెరపీ ఎలా పనిచేస్తుంది? కలర్ థెరపీలో, రంగుల ద్వారా శరీరంలోని అనేక అంశాలను సమతుల్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. మనం ఒక రంగును చూసినప్పుడు, మన మెదడు ఆ రంగు తరంగాలను అందుకుంటుంది.  మన భావోద్వేగాలు, శరీరం తదనుగుణంగా స్పందిస్తాయి.   కలర్ థెరపీ  ప్రయోజనాలు .. ఎరుపు ఎరుపు రంగు శక్తిని,  ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. ఈ రంగు ఉత్సాహాన్ని,  ధైర్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.  అలసటను తొలగిస్తుంది. అయితే అధిక ఎరుపు రంగు కోపం,  దూకుడును కూడా పెంచుతుంది.  కాబట్టి దీనిని సమతుల్య పద్ధతిలో ఉపయోగించాలి.   పసుపు రంగు పసుపు అనేది సానుకూలత,  తెలివితేటల రంగు. ఈ రంగు ఆనందం, ఆత్మవిశ్వాసం,  సృజనాత్మకతను పెంచుతుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది,  ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఈ రంగు మానసిక నిరాశ,  ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది.   ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ రంగు అంతర్గత శాంతి,  సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది గుండె,  ఊపిరితిత్తుల పనితీరును బలపరుస్తుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ రంగు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. నీలం రంగు నీలం చల్లదనం,  శాంతిని సూచిస్తుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.  ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో నీలం రంగు కూడా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. హోలీలో రంగుల శాస్త్రీయ ప్రాముఖ్యత.. హోలీ పండుగ వసంత ఋతువులో వస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు జరుగుతాయి. దీనివల్ల శరీరంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లు,  అలెర్జీలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందువల్ల, వసంతకాలంలో రంగులను ఉపయోగించడం వల్ల మన శరీరం సానుకూల శక్తితో నింపబడుతుంది. రంగులతో ఆడుకోవడం వల్ల ఎండార్ఫిన్లు (ఆనంద హార్మోన్లు) విడుదలవుతాయి, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. హోలీ సమయంలో, ప్రజలు తమ ఇళ్ల బయట ఎండలో రంగులతో ఆడుకుంటారు. సూర్యకాంతి ఎముకలకు మేలు చేసే విటమిన్ డి ని అందిస్తుంది. సహజ రంగులు చర్మానికి కూడా మేలు చేస్తాయి.  టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడతాయి.   కలర్ థెరపీని ఎలా తీసుకోవాలి? హోలీ రోజున రంగులతో ఆడుకోవడమే కాకుండా, అనేక విధాలుగా కలర్ థెరపీని తీసుకోవచ్చు.  ఇల్లు లేదా ఆఫీసు గోడలపై మనసును ప్రశాంతపరిచే రంగులను ఉపయోగించవచ్చు. రంగురంగుల చిత్రాలతో అలంకరించి వాటిని చూస్తుండాలి.  దుస్తులు,  వస్తువులను మీ మానసిక స్థితికి సరిపోయే రంగులను చేర్చండి. రంగురంగుల లైటింగ్,  అలంకరణలతో మానసిక స్థితిని ప్రభావితం చేయండి. రోజువారీ ధ్యానం లేదా యోగా సమయంలో తగిన రంగులపై ధ్యానం చేయాలి.                                                       *రూపశ్రీ.  
    హోలీ అనేది రంగులు చల్లుకుంటూ జరుపుకునే  ఉత్సాహాల పండుగ. ఎంతో రుచికరమైన ఆహారాలు తయారు చేయడం,  స్నేహితులు ఆత్మీయులను కలవడం, అన్నింటి కంటే ముఖ్యంగా రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని, ప్రేమను పంచుకోవడం  ఈ పండుగను చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే హోలీ ఆనందం ,  ఉత్సాహం మధ్య, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ముఖ్యం. హోలీ సమయంలో అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర పెరిగే ప్రమాదం ఉంది.  అయితే సింథటిక్ రంగులు,   ఆస్తమా,  శ్వాసకోశ సమస్యలను పెంచుతాయి. అలాంటి రోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. హోలీ ఆడుతున్నప్పుడు కంటి భద్రతను విషయంలో జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. సింథటిక్ లేదా కెమికల్ రంగులు కంటి చికాకు, ఎరుపుదనం,  తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. హోలీ ఆడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే, అది కార్నియల్ ఇన్ఫెక్షన్ లేదా కంటి చూపు పూర్తీగా పోవడం వంటి  కారణాలకు దారి తీయవచ్చు. హోలీ ఆడుతున్నప్పుడు కంటి సంరక్షణ ఎలాగంటే.. కొన్నిసార్లు మార్కెట్లో లభించే రంగులలో మెత్తగా రుబ్బిన గాజు,  హానికరమైన రసాయనాలు ఉండవచ్చు. ఇవి చర్మానికి,  కళ్ళకు తీవ్రమైన హాని కలిగిస్తాయి.  పొడి రంగులలో లేదా గులాల్‌లో మెరుపును చూసినట్లయితే, అది గాజు పొడి కావచ్చు. అందువల్ల, రంగులతో ఆడుకునేటప్పుడు కళ్ళు వంటి సున్నితమైన శరీర భాగాలను రక్షించుకోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. కంటి వైద్యులు ఏం చెప్తున్నారు.. హోలీ సమయంలో,  తరువాత, OPDలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని కంటి వైద్యులు చెబుతున్నారు. హోలీ ఆడుతున్నప్పుడు  కళ్ళను రక్షించుకోవడానికి గాగుల్స్ లేదా సన్ గ్లాసెస్ ధరించాలి. ఇది కళ్ళను రంగు,  మురికి నీటి నుండి రక్షించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు మీరు సేంద్రీయ,  మూలికా రంగులను మాత్రమే ఉపయోగించడం చాలా ముఖ్యం. రసాయనాలు కలిగిన రంగులు కళ్ళలో చికాకు,  అలెర్జీలకు కారణమవుతాయి. హోలీ తర్వాత  కళ్ళు మంటగా ఉంటే ఏమి చేయాలి? హోలీ తర్వాత కళ్ళలో చికాకు లేదా ఎరుపు అనిపిస్తే  కళ్ళకు ఉపశమనం కలిగించడానికి  సులభమైన ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. వాపు తగ్గించడానికి,  చికాకు నుండి ఉపశమనానికి శుభ్రమైన గుడ్డను ఉపయోగించి కోల్డ్ కంప్రెస్‌ను చేయాలి.  కళ్ళను శుభ్రపరచడానికి,  రిఫ్రెష్ చేయడానికి చల్లని రోజ్ వాటర్ ఉపయోగించాలి.  తాజా కలబందను కళ్ళ చుట్టూ రాయాలి. వెంటనే కళ్లు  చల్లగా కావడం కోసం  మూసిన కనురెప్పలపై చల్లని దోసకాయ ముక్కలను ఉంచాలి.        *రూపశ్రీ.