LATEST NEWS
తప్పొప్పులకు బాధ్యత ఎవరిది అన్న విషయాన్ని పక్కన పెడితే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఎంత కాదనుకున్నా ప్రభుత్వ ప్రతిష్ఠను ఒకింత మసకబార్చింది. కూటమి పార్టీలలో కూడా తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎవరి వాదన వారిదన్నట్లుగా కనిపిస్తోంది. తొక్కిసలాట బాధితులను పరామర్శించేందుకు ఒకే రోజు తిరుపతిలో పర్యటించిన తెలుగుదేశం, అధినేత ముఖ్యమంత్రి, జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు తమదైన శైలిలో ఘటనపై స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకునే విషయంలో అధికారుల కంటే ప్రత్యక్ష సాక్షులు, ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి సమాచారం తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సంఘటనకు బాధ్యులు ఫలానా వారని చెప్పకుండానే.. మీడియా సమక్షంలోనే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయ లోపం ఎందుకొచ్చిందని నిలదీశారు. ఎస్పీపై అయితే ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పద్ధతి మార్చుకోరా? ఏం తమాషాగా ఉందా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  మరో వైపు పవన్ కల్యాణ్ తిరుపతి తొక్కిసలాటకు బేషరతు క్షమాపణలు చెప్పారు. బాధితులను ఆదుకుంటామనీ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామనీ చెబుతూనే.. టీటీడీలో వీఐపీ యాటిట్యూడ్ మారాలని కుండబద్దలు కొట్టారు. ఈ ఘటనకు ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరిల మధ్య సమన్వయ లోపమే కారణమని ఎత్తి చూపారు. అలాగే పోలీసుల వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కొందరు పోలీసులు బాధ్యతగా వ్యవహరించినా, కొందరు మాత్రం తొక్కిసలాట సమయంలో ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు.  ఇక పోతే తిరుపతి తొక్కిసలాటకు ఎవరు కాదన్నా, ఔనన్నా బాధ్యత వహించాల్సింది మాత్రం తిరుమల తిరుపతి దేవస్ధానమే.  టీటీడీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న సంగతి సీఎం సమీక్షలోనే ప్రస్ఫుటంగా బయటపడింది.  ఆ సమీక్షలో ఏకంగా సీఎం ముందే టీటీడీ చైర్మన్, ఈవో శ్యామలరావులు వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.  ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ఈవోపై చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేశారు.  దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరినీ మందలించారు.   టీటీడీ చైర్మన్, ఈవో శ్యామలరావుల మధ్య సమన్వయం లేదన్న వార్తలు గత కొంత కాలంగా బలంగా వినిపిస్తున్నాయి. పాలకమండలి సభ్యులే ప్రైవేటు సంభాషణల్లో పలు మార్లు ఈ విషయంపై చర్చించుకున్నారు.  ఆ కారణంగానే వైకుంఠ ద్వార దర్శనం టోకోన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. టోకెన్ల జారీ కేంద్రం తలుపులు ఎప్పుడు తెరవాలి, పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులను ఎలా నియంత్రించాలి అన్న దానిపై ఎవరికి తోచినట్లు వారు ప్రకటనలు చేయడంతో, ఈ విషయంలో పనుల పరిశీలన, సమీక్షల్లో కూడా ఎవరి దారి వారిదే, ఎవరిగోల వారిదే అన్నట్లుగా సాగడంతో కింది స్థాయి అధికారులలో గందరగోళం ఏర్పడిందంటున్నారు.   తొక్కిసలాట ఘటన అనంతరం ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేయీవో గౌతమిలపై ప్రభుత్వంబదిలీ వేటు పడింది.  టీటీడీ చీఫ్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారి  శ్రీధర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించానే కారణంతో ఆయననూ బదిలీ చేశారు. ఇక ప్రాథమిక నివేదికలో తొక్కిసలాటకు కారణం డీఎస్పీ రమణ బాబు అన్న కలెక్టర్ నివేదికతో ఆయనను సస్పెండ్ చేశారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. అయితే తొక్కిసలాట ఘటనకు సంబంధించి మరింత మందిపై చర్యలు ఉంటాయన్న చర్చ కూడా జరుగుతోంది. మరీ ముఖ్యంగా టీటీడీ చైర్మన్ లో సమన్వయం లేకుండా వ్యవహరించిన ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరిలపై కూడా బదిలీ వేటు పడే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భక్తుల సౌకర్యాలు, భద్రత కంటే తమ సొంత ఇగో శాటిస్ ఫ్యాక్షన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న భావన టీటీడీ పాలకమండలి సభ్యుల నుంచి బలంగా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వారిరువురిపై కూడా బదలీ వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు. 
ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం గంటగంటకు మారుతుంది. నిన్న దాదాపు ఎనిమిది గంటల పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెటీఆర్ ను    ఎసిబి విచారణ చేసింది. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఎసిబి విచారించింది. మాజీమంత్రి కెటీఆర్ ఆదేశం మేరకు  విదేశీ సంస్థకు తాను నిధులు మళ్లించినట్టు ఆయన ఒప్పుకున్నారు. మళ్లీ మేమే అధికారంలో వస్తాం. అనుమతులు అవసరం లేదని కెటీఆర్ తనతో అన్నట్టు అరవింద్ కుమార్ వెల్లడించారు. తాజాగా శుక్రవారం ఈ కేసులో ఎ 3 గా ఉన్న చీప్ ఇంజినీర్ బిఎల్ ఎన్ రెడ్డి  ఎసిబి విచారణకు హాజరయ్యారు. అరవింద్ కుమార్ , కెటీఆర్ స్టేట్ మెంట్ ఆధారంగా బిఎల్ ఎన్ రెడ్డి ని విచారిస్తున్నారు. ఎసిబి  అధికారుల ప్రశ్నలకు బిఎల్ ఎన్ రెడ్డి సహకరించడం లేదని తెలుస్తోంది. 
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో  హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణకు శుక్రవారం (జనవరి 10) హాజరయ్యారు. రేసు జరిగిన సమయంలో ఆయన హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ గా ఉన్నారు. ఆ సమయంలో రేసును నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ ఖాతా నుంచి నగదు బదిలీ చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.  ఈ కేసులో బీఎల్ఎన్ రెడ్డి ఏ3గా ఉండగా... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ2గా ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్ లను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కేటీఆర్ ను ఏసీబీ  అధికారులు గురువారం (జనవరి 9)   దాదాపు ఏడు గంటల సేపు విచారించారు. విచారణ అనంతరం కేటీఆర్ తాను ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించినట్లు చెప్పుకున్నారు. అయితే ఏసీబీ మాత్రం కేటీఆర్ తమ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదనీ, మరో సారి విచారణకు పిలుస్తామని చెబుతున్నారు. ఇప్పుడు బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారిస్తున్నది. ఈ సందర్భంగా ఆయన ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ ను ఏసీబీ మరోసారి విచారించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  
మాజీ ఎంపీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్ ను ఏపీ హైకోర్టు శుక్రవారం (జనవరి 10) కొట్టివేసింది.  రఘురామకృష్ణం రాజు హత్యకు పన్నిన కుట్రలో  అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి కూడా భాగస్వామి అన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందు. రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ ఆరోపణలపై  జీజీహెచ్‌లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికను అందజే యాల్సిందిగా  మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను ఆమె బేఖాతరు చేశారనీ, ఆస్పత్రిలోని ఇతర వైద్యులు రఘురామకు పరీక్షలు నిర్వహించి ఇచ్చిన నివేదికలను ఆమె తొక్కిపెట్టారని రఘురామరాజుపై కస్టోడియల్ టార్చర్ జరగలేదనీ, ఆయన ఆరోగ్య పరిస్థితి సవ్యంగా ఉందనీ, ఎటువంటి గాయాలూ లేవనీ కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆమె యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆమెను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. 
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు చెల రేగిపోతున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు దేశ వ్యాప్తంగా 328 కేసులు నమోదయ్యాయి. ఒక్క తెలంగాణలో 30 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.  హైదరాబాద్ పోలీసులు ఎపి, కర్నాటక, యుపి, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ లు నిర్వహించి 23 మందిని  సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి  సెల్ ఫోన్లు, చెక్ బుక్ లు, సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
  ఈ సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలపడుతున్నాయి. అయితే వీటిలో 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్' సినిమాల మధ్యనే ప్రధాన పోటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే మెగా-నందమూరి బాక్సాఫీస్ వార్ కి ఎప్పుడూ ఫుల్ క్రేజ్ ఉంటుంది. పైగా సంక్రాంతి సీజన్ కావడంతో ఈ రెండు సినిమాల పోరుపై ప్రేక్షకుల దృష్టి మరింత పడింది. 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్' లలో ఏ సినిమా సంక్రాంతి విజేతగా నిలుస్తుందనే ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. 'డాకు మహారాజ్' చిత్రమే పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. (Game Changer)   'గేమ్ ఛేంజర్' తాజాగా ప్రేక్షకుల ముందుకు రాగా, 'డాకు మహారాజ్' జనవరి 12న థియేటర్లలో అడుగుపెట్టనుంది. అయితే 'గేమ్ ఛేంజర్'పై విడుదలకు ముందు నుంచే నెగటివ్ వైబ్స్ కనిపించాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం ఈ చిత్రాన్ని ప్రకటించారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ కావడంతో.. మొదట్లో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగానే ఉంది. కానీ ఇండియన్-2 కారణంగా 'గేమ్ ఛేంజర్' షూటింగ్ బాగా ఆలస్యమవ్వడంతో.. ఆ ఆసక్తి సన్నగిల్లుతూ వచ్చింది. ఇక ట్రైలర్ విడుదల తర్వాత.. ఇది ఒకప్పటి శంకర్ మార్క్ సినిమా కాదని, ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ అనే క్లారిటీకి అందరూ వచ్చేశారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా విడుదలైన ఈ చిత్రం, మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. భారీతనం, చరణ్ నటన తప్ప సినిమాలో చెప్పుకోడానికి ఏం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి 'డాకు మహారాజ్'పై పడింది. (Daaku Maharaaj)   'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'డాకు మహారాజ్'పై మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలన్నాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా ట్రైలర్ లో విజువల్స్ మెస్మరైజ్ చేశాయి. ఇప్పుడు 'గేమ్ ఛేంజర్'కి నెగటివ్ టాక్ రావడంతో, 'డాకు మహారాజ్'కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు రాబట్టే అవకాశముంది. అదే జరిగితే 'డాకు మహారాజ్' సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుంది.  
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన రెండు తెలుగు రాష్ట్రాలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని గురించి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకపై స్టార్‌ హీరోల సినిమాలకు సంబంధించి బెనిఫిట్‌ షోలకుగానీ, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి గానీ అనుమతులు ఇవ్వబోమని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఈ ప్రకటనతో సంక్రాంతి సినిమాలు అయోమయంలో పడ్డాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘గేమ్‌ ఛేంజర్‌’పై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపు విషయంలో సానుకూలంగా స్పందించి అనుమతులు ఇచ్చింది.  ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చేసిన ప్రకటనను పక్కన పెట్టి ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రానికి బెనిఫిట్‌ షోలకు, టికెట్‌ రేట్లు పెంచుకునే వీలు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది టికెట్‌ ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఓ పక్క ఇకపై పెద్ద హీరోల సినిమాలకు ప్రత్యేకమైన అనుమతులు రద్దు చేశామని చెబుతూనే స్పెషల్‌ షోలకు అనుమతి ఇవ్వడం ఏమిటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అర్థరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత, తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పున: సమీక్ష చెయ్యాలని హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. 
తెలుగు సినిమా స్టామినా ఏమిటీ అనేది ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. అంతర్జాతీయ స్థాయి మార్కెట్‌ని పెంచడంలో రాజమౌళి చేసిన కృషి అంతా ఇంతా కాదు. 2001లో స్టూడెంట్‌ నెం.1 నుంచి 2022లో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించిన రాజమౌళి అన్ని సినిమాలనూ సూపర్‌హిట్‌ చేయడం అనేది వెరీ రేర్‌ ఫీట్‌ అని చెప్పాలి. అయితే ఆ క్రమంలో తనతో సినిమాలు చేసిన ప్రతి హీరోకీ ఆ తర్వాత చేసిన సినిమాలు ఫ్లాప్‌ అవడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. 21 సంవత్సరాల్లో రాజమౌళి ఏడుగురు హీరోలతో సినిమాలు చేశారు. అయితే ఆ హీరోలందరూ రాజమౌళితో సినిమా చేసిన తర్వాత భారీ పరాజయాల్ని అందుకున్నారు. ఈ ఏడుగురు హీరోల్లో ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌ మాత్రమే రాజమౌళితో మళ్ళీ సినిమాలు చేశారు. ఒక దశలో రాజమౌళితో చేసిన సినిమా హిట్‌ అయిన తర్వాత మళ్ళీ రాజమౌళి హిట్‌ ఇచ్చే వరకు ఎన్టీఆర్‌ వంటి హీరోకి హిట్‌ రాలేదంటే రాజమౌళి సినిమాల ప్రభావం ప్రేక్షకులపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళితో సినిమా చేయగానే ఆ హీరోలకు ఆ తర్వాతి సినిమా డెఫినెట్‌గా ఫ్లాప్‌ అవుతుందనే సెంటిమెంట్‌ ఉంది. అయితే దాన్ని ఎన్టీఆర్‌ దేవర చిత్రంతో బ్రేక్‌ చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత కొరటాల శివ కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ చేసిన దేవర ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు కలెక్ట్‌ చేసి అప్పటివరకు వున్న సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేసింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఇద్దరూ కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటించారు. తాజాగా రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ఛేంజర్‌ విడుదలైంది. ఈ సినిమా మొదటి షో నుంచే నెగెటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది. కాబట్టి రాజమౌళి వల్ల మరోసారి రామ్‌చరణ్‌కి ఫ్లాప్‌ తప్పలేదనేది తేటతెల్లమైంది.  రాజమౌళి కెరీర్‌ని పరిశీలిస్తే.. మొదటి సినిమా స్టూడెంట్‌ నెం.1 నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు అతనితో సినిమా చేసిన హీరోలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎలాంటి అపజయాల్ని చవిచూశారు అనేది తెలుసుకుందాం. ఎన్టీఆర్‌, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందిన మొదటి సినిమా స్టూడెంట్‌ నెం.1. ఈ సినిమా సూపర్‌హిట్‌ అయిన తర్వాత వెంటనే సుబ్బు సినిమా చేశారు ఎన్టీఆర్‌. ఇది ఒక డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆదితో సంచలన విజయం సాధించారు. ఆ వెంటనే వచ్చిన అల్లరి రాముడు, నాగ చిత్రాలు డిజాస్టర్స్‌ కావడంతో ఎన్టీఆర్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలోనే రాజమౌళితో సింహాద్రి చేశారు. ఈ సినిమా సంచలన విజయం సాధించి ఎన్టీఆర్‌ను హీరోగా ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ చేసిన ఆంధ్రావాలా పెద్ద డిజాస్టర్‌ అయింది. ఆ తర్వాత మరో 5 సినిమాలు చేసినా సాంబ ఒక్కటే కమర్షియల్‌గా ఓకే అనిపించింది. మళ్ళీ రాజమౌళితో యమదొంగ చేసేవరకు ఎన్టీఆర్‌కు మరో భారీ హిట్‌ పడలేదు. యమదొంగ చిత్రంతో మరో భారీ ఘనవిజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్‌. ఆ తర్వాత చేసిన సినిమాల్లో కొన్ని హిట్‌, కొన్ని ఫ్లాపులుగా నడిచాయి. అయితే అంతకుముందు రాజమౌళితో చేసిన సినిమాల తర్వాత వచ్చిన డిజాస్టర్స్‌లా కాకుండా అప్‌ అండ్‌ డౌన్‌గా ఎన్టీఆర్‌ కెరీర్‌ సాగింది. మళ్ళీ ఆర్‌ఆర్‌ఆర్‌తో ఎన్టీఆర్‌ కెరీర్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పుంజుకుంది. ఆ తర్వాత వచ్చిన దేవరతో దాన్ని నిలబెట్టుకొని ఫ్లాప్‌ల సెంటిమెంట్‌ నుంచి బయటపడ్డారు. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోల్లో ఎన్టీఆర్‌ కెరీర్‌కే ఇన్ని అప్‌ అండ్‌ డౌన్స్‌ ఉండడం గమనార్హం.  నితిన్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన సై అప్పట్లో ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత నితిన్‌ ఫ్లాప్‌ల పరంపర మొదలైంది. ఏకంగా 12 సినిమాలు వరసగా ఫ్లాప్‌ అవ్వడంతో అతని కెరీర్‌ అగమ్యగోచరంగా మారింది. ఆ సమయంలో ఇష్క్‌ వంటి సూపర్‌హిట్‌తో నిలదొక్కుకోగలిగాడు. ప్రభాస్‌ విషయానికి వస్తే.. ఛత్రపతి వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత అతన్ని ఫ్లాపులు వెంటాడాయి. వరసగా ఆరు  ఫ్లాప్‌లతో సతమతమయ్యాడు. మళ్ళీ డార్లింగ్‌ చిత్రంతో కోలుకున్నాడు. ఆ తర్వాత బాహుబలి సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో, కలెక్షన్లపరంగా ఎన్ని రికార్డులు క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సిరీస్‌ తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ వంటి సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేదు.  ఇక నాని వంటి హీరోకి కూడా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్‌ల గొడవ తప్పలేదు. ఈగ వంటి సూపర్‌హిట్‌ తర్వాత నానికి వరసగా 6 ఫ్లాప్‌లు వచ్చాయి. మళ్లీ భలే భలే మగాడివోయ్‌ చిత్రంతోనే కమర్షియల్‌ హిట్‌ని అందుకోగలిగాడు. అప్పటివరకు కమెడియన్‌గా కొనసాగిన సునీల్‌ కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన తర్వాత మర్యాదరామన్న వంటి డీసెంట్‌ హిట్‌ సినిమా అతనికి దక్కింది. అయితే ఈ సినిమా సునీల్‌ కెరీర్‌కి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఈ సినిమా అందించిన విజయం వల్ల హీరోగా అతని కెరీర్‌కి ఊపు రాలేదు. రామ్‌చరణ్‌ విషయానికి వస్తే.. రాజమౌళితో ఫస్ట్‌టైమ్‌ చేసిన మగధీర బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయి రామ్‌చరణ్‌ని స్టార్‌ హీరోని చేసింది. అయితే ఆ సినిమా తర్వాత చేసిన ఆరెంజ్‌ భారీ డిజాస్టర్‌ అయింది. ఈ సినిమా వల్ల నిర్మాత నాగబాబు తీవ్రంగా నష్టపోయారు. రాజమౌళితో చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. ఈ సినిమా తర్వాత ఇందులో హీరోలుగా నటించిన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పరిస్థితి ఏమిటి అని అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో దేవరతో రాజమౌళి సెంటిమెంట్‌ని ఎన్టీఆర్‌ బ్రేక్‌ చేశారు. గేమ్‌ఛేంజర్‌తో చరణ్‌ కూడా ఫ్లాప్‌ల సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. మరోసారి రాజమౌళి సినిమా తర్వాత రామ్‌చరణ్‌కి ఫ్లాప్‌ తప్పలేదు. దీన్నిబట్టి రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాత చేసే సినిమా ఫ్లాప్‌ అవుతుంది అనే సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేసిన హీరో ఎన్టీఆర్‌ ఒక్కరే అనేది కన్‌ఫర్మ్‌ అయింది.
బాలీవుడ్ భామ దీపికా పదుకునే(Deepika padukone)కి భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది.షారుఖ్ ఖాన్(Sharukh Khan)హీరోగా  2007 లో విడుదలైన 'ఓం శాంతి ఓం' తో ప్రారంభమయిన ఆమె సినీ ప్రస్థానం దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి అప్రహాతీతంగా కొనసాగుతుంది. బాలీవుడ్ లో ఉన్న అందరి అగ్ర హీరోల సరసన నటించిన దీపికా గత సంవత్సరం జూన్ లో ప్రభాస్ తో కలిసి కల్కి 2898 ఏడి లో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక రీసెంట్ గా ఎల్ అండ్ టీ కంపెనీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్(sn subrahmanyan)తన సంస్థలో పనిచేసే ఉద్యోగులపై కొన్ని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు వాటిపై  సోషల్ మీడియా వేదికగా దీపికా స్పందిస్తు 'ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అలాంటి ప్రకటన చేయడం చాలా షాక్ గా ఉంది #mentalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.సుబ్రమణియన్ కి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని దీపికా చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సుబ్రమణియన్ తన దగ్గర పని చేసే ఉద్యోగుల గురించి మాట్లాడుతు వారానికి 90 గంటలు పని చెయ్యడంతో పాటు ఆదివారాల్లోను ఆఫీస్‌ కు రావాలి.ఎప్పుడూ ఇంట్లో ఉంటూ ఏం చేస్తారు,ఎంతసేపు భార్య ముఖం చూస్తు ఉంటారంటు వెటకారంగా మాట్లాడాడు. ఆయన తీరుపై నెటిజన్లు  కూడా విరుచుకు పడుతున్నారు.   
  ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు అని వింటున్నాం. కానీ అప్పట్లోనే వివిధ భాషల ప్రేక్షకులు మెచ్చేలా భారీ సినిమాలను రూపొందించారు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్. ఇప్పటి యంగ్ జనరేషన్ కి ఆయన విలువ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఆరోజుల్లో శంకర్ అంటే ఒక బ్రాండ్. 'జెంటిల్ మేన్', 'భారతీయుడు', 'ఒకే ఒక్కడు', 'అపరిచితుడు', 'రోబో' ఇలా ఒకటేమిటి ఆయన చేసిన ప్రతి సినిమా సంచలనమే. (Shankar)   కేవలం తమిళ్ లోనే కాకుండా, మొత్తం సౌత్ ఇండియాలోనే శంకర్ సినిమాలకు ఎంతో క్రేజ్ ఉండేది. శంకర్ సినిమా అంటే బలమైన కథాకథనాలతో పాటు భారీతనం ఉండేది. టెక్నికల్ గా ఆయన సినిమాలు ఎంతో అడ్వాన్సుడ్ గా ఉండేవి. గ్రాఫిక్స్ అంటే ఏంటో పెద్దగా ఎవరికీ తెలియని రోజుల్లోనే.. వెండితెరపై అద్భుతాలు సృష్టించారు శంకర్. అలాంటి బ్రిలియంట్ డైరెక్టర్ కొన్నేళ్లుగా వెనకబడిపోయారు. 2010లో వచ్చిన 'రోబో' తర్వాత ఇది శంకర్ సినిమా అని గర్వంగా చెప్పుకునేలా, అభిమానులు నూటికి నూరు శాతం సంతృప్తి చెందిన సినిమా రాలేదనే చెప్పాలి. 'స్నేహితుడు', 'ఐ', '2.0' సినిమాలు కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ.. అభిమానులను పూర్తిస్థాయిలో తృప్తి పరచలేదనేది వాస్తవం. ఇలా సినిమా సినిమాకి శంకర్ స్థాయి పడిపోతూ వస్తోంది. (Game Changer)   గతేడాది శంకర్ డైరెక్ట్ చేసిన 'ఇండియన్-2' విడుదలై దారుణంగా నిరాశపరిచింది. అసలు ఇది శంకర్ సినిమానేనా అని అభిమానులు తలలు పట్టుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా శంకర్ సినిమాపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో కనీసం 'గేమ్ ఛేంజర్'తోనైనా కమ్ బ్యాక్ ఇస్తాడు అనుకుంటే.. మళ్ళీ అదే తంతు. 'గేమ్ ఛేంజర్'లో భారీతనం ఉంది, నటుడిగా రామ్ చరణ్ కష్టం కనిపిస్తుంది. కానీ సినిమాకి ఏదైనా మైనస్ ఉందంటే అది డైరెక్టర్ శంకర్ మాత్రమే. ఒకప్పుడు తన సినిమాలు అంతటి వండర్స్ ఎందుకు క్రియేట్ చేశాయో.. ఒకసారి శంకర్ తనని తాను క్వశ్చన్ చేసుకోవాలి. కేవలం నిర్మాతల చేత వందల కోట్లు ఖర్చు పెట్టిస్తే సినిమాలు ఆడవని గ్రహించాలి. (Ram Charan)   అప్పటి శంకర్ సినిమాలను గమనిస్తే.. బలమైన కథాకథనాలు, కట్టిపడేసే సన్నివేశాలు, హత్తుకునే భావోద్వేగాలు, అద్భుతమైన సంగీతం.. ఇలా ప్రతిదీ ఎంతో గొప్పగా ఉండేది. వాటికి భారీతనం, టెక్నాలజీ తోడు కావడంతో.. ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేశాయి. కానీ శంకర్ మాత్రం కేవలం ఆ భారీతనం, టెక్నాలజీ మాయలో పడిపోయి.. స్క్రిప్ట్ ని గాలికి వదిలేస్తున్నారు. 'ఇండియన్-2', 'గేమ్ ఛేంజర్' సినిమాల విషయంలో జరిగింది అదే. ప్రతి ఫ్రేమ్ లో ఖర్చు కనిపిస్తుంది. కానీ సినిమాతో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో శంకర్ పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు.    'ఇండియన్-2'తోనే శంకర్ పనైపోయిందనే అభిప్రాయానికి చాలా మంది వచ్చేశారు. ఇక ఇప్పుడు 'గేమ్ ఛేంజర్'తో శంకర్ 'గేమ్ ఓవర్' అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక మీదట శంకర్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎవరూ సాహసించకపోవచ్చు. శంకర్ కూడా స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టకుండా.. కేవలం భారీతనం పేరుతో నిర్మాతలు చేత ఖర్చు పెట్టించడమే పనిగా పెట్టుకునేటట్లయితే.. ఇకపై ఆయన సినిమాలు చేయకపోవడమే బెటర్. అలా చేస్తే, కనీసం అప్పటి ఎవర్గ్రీన్ సినిమాల దర్శకుడిగా శంకర్ తన గౌరవన్నయినా కాపాడుకోవచ్చు. లేదంటే శంకర్ చేతులారా తన పేరుని తానే చెడగొట్టుకున్నవాడు అవుతాడు.   
అల్లరి నరేష్(Allari naresh)హీరోగా 'సోలో బతుకే సోలో బెటర్' ఫేమ్ సుబ్బు(subbu mangadevi)దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'బచ్చల మల్లి'(Bachala malli) 'హనుమాన్'(Hanuman)మూవీ ఫేమ్ 'అమృత అయ్యర్'(amritha aiyer)హీరోయిన్ గా చెయ్యగా రావు రమేష్,హరితేజ,అచ్యుత్ కుమార్,అంకిత కొయ్య,తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.హాస్య క్రియేషన్స్ పై రాజేష్ దండ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 20 న థియేటర్స్ లో అడుగుపెట్టి పర్వాలేదనే టాక్ ని పొందింది. ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో అడుగుపెట్టింది.అమెజాన్ ప్రైమ్ ద్వారా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.ఒక వ్యకి ఎంత మంచి వాడైనా సరే జీవితంలో తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయాల్లో మనల్నిప్రేమించే వాళ్ళు మనకి ఎంత మంచి చెప్తున్నా కూడా,మూర్ఖత్వంతో వాళ్ల మాటలు వినం.దీంతో  మన జీవితమే కాకుండా మనల్ని నమ్ముకున్న జీవితాలు కూడా ఎలా పతనమైపోతాయోఈ మూవీలో చాలా చక్కగా చూపించారు.   ఇక అల్లరి నరేష్ మాస్ నటన  ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్ ని కలిగిస్తుంది.'బచ్చల మల్లి' క్యారక్టర్ లో జీవించాడని చెప్పవచ్చు,అమృత అయ్యర్ తో పాటు రావు రమేష్ నటన కూడా ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.ముఖ్యంగా క్లైమాక్స్ లో నా మూర్కత్వంతో జీవితంలో సాధించింది ఏది లేదు,పైగా నా కోసం ఎన్నో వదులుకొని,నేనే జీవితంగా బతికిన ప్రియురాలని కూడా ఆత్మహత్య చేసుకునేలా చేసానని  తలుచుకొంటు 'బచ్చల మల్లి' మరణించడం ప్రతి ఒక్కర్ని ఆలోచింపచేస్తుంది.   
పవన్ కళ్యాణ్(Pawan Kalyan)హీరోగా భీమనేని శ్రీనివాస్(Bhimineni srinivas)దర్శకత్వంలో వచ్చిన సుస్వాగతం లోని 'హ్యాపీ హ్యాపీ బర్త్ డే' సాంగ్ తో పాటు నువ్వే కావాలిలోని 'అనగనగ ఆకాశం ఉంది',సూర్య వంశంలోని 'రోజావే చిన్ని రోజావే' వంటి పాటలని ఆలపించిన గాయకుడు పి.జయచంద్రన్(p.Jayachandran)మలయాళ చిత్ర సీమకి చెందిన జయచంద్రన్ మలయాళంతో పాటు తెలుగు,తమిళ,కన్నడ,హిందీ భాషల్లో ఎన్నోఅద్భుతమైన పాటలని ఆలపించి అశేష ప్రేక్షకులని అలరించారు. గత కొన్నాళ్ల నుంచి జయచంద్రన్( అనారోగ్యంతో బాధపడుతున్నాడు.ఈ మేరకు కేరళలోని త్రిసూర్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స కూడా తీసుకుంటున్నాడు.కానీ నిన్నరాత్రి పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడవడం జరిగింది.16000 వరకు పాటలు పాడిన జయచంద్రన్ ఉత్తమ నేపధ్య గాయకుడుగా జాతీయ అవార్డు గెలుచుకోవడంతో పాటు ఐదు సార్లు కేరళ స్టేట్ అవార్డులు కూడా గెలుచుకున్నాడు.ఆయనకి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.      
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)శంకర్(Shankar)కలయికలో తెరకెక్కిన'గేమ్ చేంజర్'(Game Changer)ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అర్ధరాత్రి ఒంటి గంట నుంచే షోస్ ప్రారంభమవ్వగా,మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా మూవీ చూడటానికి థియేటర్స్ కి పోటెత్తారు. రామ్ చరణ్ ఇందులో తండ్రి కొడుకులుగా చాలా బాగా చేసాడని,ఐపీఎస్ ఆఫీసర్ గా అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో పాటు,అప్పన్న క్యారక్టర్ లో కూడా బాగా చేసాడని,ముఖ్యంగా ఎంటైర్ తన కెరీర్ లోనే అద్భుతమైన పెర్ ఫార్మ్ ని ఆ క్యారక్టర్ ద్వారా ఇచ్చాడని,అప్పన్న క్యారక్టర్ తన కోసమే పుట్టినట్టుగా చెయ్యడంతో పాటు,ఆ క్యారక్టర్ తీరు తెన్నులు పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ భావాలని ఉద్దేశించి చేసిందనే అభిప్రాయాన్ని పవన్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.  శ్రీకాంత్(Sreekanth)క్యారెక్టర్ కూడా చాలా బాగుందని,కథలో చాలా కీలకమైన క్యారెక్టర్ చేసాడనే మాటలు కూడా వినపడుతున్నాయి.ఇక మిగతా పాత్రలో చేసిన కియారా అద్వానీ(Kiara adwani)అంజలి(Anjali)ఎస్ జె సూర్య,సముద్ర ఖని తదితర  నటులందరు కూడా తమ క్యారెక్టర్స్ లో చాలా చక్కగా  చేసారని,థమన్ సంగీతం,తిరు ఫొటోగ్రఫీకి కూడా సినిమాకి అదనపు బలం చేకూరిందని అంటున్నారు.  
సినిమా పేరు: గేమ్ చేంజర్ తారాగణం: రామ్ చరణ్,కియారా అద్వానీ, అంజలి,ఎస్ జె సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, బ్రహ్మానందం  తదితరులు సంగీతం: థమన్‌ ఎడిటర్: షమీర్ మహమ్మద్ సినిమాటోగ్రఫీ: తిరు మాటలు : సాయిమాధవ్‌ బుర్రా ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల కథ: కార్తీక్ సుబ్బరాజ్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్  నిర్మాత: దిల్‌రాజు, శిరీష్‌ బ్యానర్: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ విడుదల తేదీ: జనవరి 10, 2025  ఆర్ ఆర్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని పొందిన రామ్ చరణ్ ఈ రోజు 'గేమ్ చేంజర్' గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.పైగా 'శంకర్' దర్శకుడు కావడం,శంకర్ గత చిత్రం భారతీయుడు 2 పరాజయం చెందటంతో గేమ్ చేంజర్' రిజల్ట్ విషయంలో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. పైగా నిర్మాత  'దిల్ రాజు' కూడా గేమ్ చేంజర్ ఘన విజయం సాధిస్తుందని ప్రమోషన్స్ లో కూడా చెప్పాడు.పైగా ఆయన  బ్యానర్ లో 50 వ చిత్రం కూడాను.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ: బొబ్బిలి సత్యమూర్తి(శ్రీకాంత్) రూలింగ్ పార్టీ అభ్యుదయ పార్టీ తరుపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తుంటాడు.గతంలో చేసిన ఒక పాపం తనని వెంటాడుతుందని భావించిన సత్యమూర్తి  ఎలక్షన్స్ కి ఇంకా సంవత్సరం మాత్రమే ఉండటంతో ప్రజలకి మంచి చేయాలనుకుంటాడు.ఈ క్రమంలో రామ్ నంద(రామ్ చరణ్) యూపీ నుంచి ఆంధ్రప్రదేశ్ కి కలెక్టర్ గా వస్తాడు.సత్యమూర్తి కొడుకు మినిస్టర్ అయినటువంటి బొబ్బిలి మోపిదేవి(ఎస్ జె సూర్య) అరాచకాల్ని అడ్డుకుంటూ కలెక్టర్ పదవి  అంటే ఎంత గొప్పదో,దాని ద్వారా సమాజానికి ఎంత మంచి చెయ్యచ్చో రుజువు చేస్తుంటాడు. వృద్యాప్యంలో ఉన్నఅప్పన్న(రామ్ చరణ్) భార్య  అంజలి(పార్వతి) ని చూసీ సత్యమూర్తి భయపడతాడు.సత్యమూర్తి చనిపోవడంతో మోపిదేవి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడు. మరి అతని కోరిక నెరవేరిందా? అప్పన్న ఎవరు?ఆయన కథ ఏంటి? పార్వతి ని చూసీ సత్యమూర్తి ఎందుకు భయపడ్డాడు? రామ్ నంద ఐఏఎస్ అవ్వడానికి దీపిక( కియారా అద్వానీ) ఎలా కారణమయ్యింది? అసలు రామ్ నంద ఎవరు? అతని ఆశయం ఏంటనేదే ఈ కథ  ఎనాలసిస్ మూవీ ఫస్ట్ నుంచి చివరి దాకా ఎక్కడా బోర్ కొట్టకుండానే సాగింది.కానీ సీన్స్ అన్ని కూడా గతంలో చాలా సినిమాలో వచ్చినవే.అదే విధంగా ఇలాంటి కథ తో చాలా సినిమాలే వచ్చాయి.మహేష్ హీరోగా వచ్చిన 'భరత్ అనే నేను' మూవీ కూడా ఇలాంటి లైన్ తోనే వచ్చింది.ఇక ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే రామ్ చరణ్ ఎంట్రీ తో పాటు శ్రీకాంత్ ఎస్ జె సూర్య ల ఎంట్రీ సూపర్ గా ఉంటుంది.ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న శ్రీకాంత్ ఈ పాపం అయితే చేసానని బాధపడుహతున్నాడో,తన వల్ల నష్టపోయిన వాళ్ల కోసం వెతకడం అనేది చూపించాల్సింది.రామ్ చరణ్, కియారా అద్వానీ మధ్య వచ్చే  కాలేజీ ఫ్లాష్ బ్యాక్ బాగుంది.మిగతా క్యారక్టర్ లు ని పెద్దగా చూపించకపోయినా కూడా ప్రతి సీన్ ని చరణ్ తన భుజ స్కందాలపై వేసుకొని నడిపించాడు.ఇంటెర్వేల్ ట్విస్ట్ అదిరిపోయినా కూడా దాని తాలూకు భావోద్వేగాలు మిస్ అయినట్ట్టుగా కనిపిస్తాయి.ఇందుకు కారణం క్యారక్టర్ ల మధ్య నడిచే భావోద్వేగాలు మిస్ అవ్వడమే.ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే అప్పన్న క్యారక్టర్ తో పాటు ఆయన ఆశయం,చూపించారు.కాకపోతే అప్పన్న గురించి ఆంధ్రప్రదేశ్ లోని అందరకి తెలిసేలా కొన్ని సీన్స్ ఉండాల్సింది.ఇక అప్పన్న క్యారక్టర్ ముగిసాక రామ్ చరణ్,ఎస్ జె సూర్య ల మధ్య వచ్చే సీన్స్ అన్ని కూడా కొంచం బలహీనంగా ఉన్నాయి.అలాంటి సీన్స్ నిత్యం చాలా సినిమాల్లో వస్తూనే ఉన్నాయి.   క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అభిమానులకి మంచి కిక్ ని ఇస్తుందని చెప్పవచు    నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: రామ్ చరణ్ తన రెండు క్యారెక్టర్ లోను కూడా సూపర్ గా చేసాడు.ఎంతలా అంటే తన టాగ్ లైన్ కి తగ్గట్టే నటనలో కూడా గ్లోబల్ హీరోలాగా మెప్పించడం జరిగింది.ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్  ఎలా ఉంటాడో పర్ఫెక్ట్ గా చూపించాడు. డాన్స్, ఫైట్స్ ల్లో కూడా  తనకి ఎప్పటికి  తిరుగులేదని మరో సారి  నిరూపించాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ క్యారక్టర్ లో అయితే తన నట విశ్వ రూపాన్ని చూపించాడు. ఆ క్యారెక్టర్ మొత్తం పంచె కట్టులో కనపడి ఓల్డ్ సినిమాల్లోని తన తండ్రి చిరంజీవిని మరిపించాడని చెప్పాలి.ఇక హీరోయిన్లుగా చేసిన కియారా అద్వానీ, అంజలి తమ తమ క్యారక్టర్ లో పర్ఫెక్ట్ గా సూటయ్యారు.ఆ ఇద్దరి వల్ల ఆయా క్యారెక్టర్స్ కి మరింత నిండుతనం కూడా వచ్చిందని చెప్పవచ్చు.  ఇక శంకర్ డైరెక్షన్ కూడా ఆయన గత చిత్రాలకి తగ్గ రేంజ్ లోనే ఉంది. శంకర్ అభిమానులు కూడా ఈ విషయంలో హ్యాపీగా ఉన్నారు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్ గా ఉంది. ఆయన పెట్టిన ఖర్చు మొత్తం స్క్రీన్ పై కనపడింది. ఆయన చాలా ఇంటర్వూస్ లో చెప్పినట్టుగా సాంగ్స్ కి పెట్టిన 75 కోట్లు ప్రేక్షకుల కంటి ముందు కనపడతాయి.కాకపోతే నానా హైరానా సాంగ్ మాత్రం మూవీలో రాలేదు. ఇక థమన్ సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, తిరు ఫొటోగ్రఫీ గేమ్ ఛేంజర్ కి అదనపు హంగుల్ని సమకూర్చాయని చెప్పవచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే గేమ్ చేంజర్ లాంటి  కథ, సన్నివేశాలు గతంలో చాలానే సినిమాలు రావడం ఒక్కటే ఈ సినిమాకి మైనస్.కానీ రామ్ చరణ్ తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల  సినిమాకి నిండు తనం వచ్చింది. రేటింగ్ 2 .5 /5                                                                                                   అరుణా చలం                                 
Cast: Ram Charan, Kiara Advani, SJ Suryah, Srikanth, Anjali, Sunil, Samuthirakani, Subhalekha Sudhakar, Jayaram  Crew:  Story by Karthik Subbaraj  Dialogues by Sai Madhav Burra Music by S Thaman  Cinematography by Tirru Editing by Ruben, Shameer Mohammad Screenplay by S. Shankar, Vivek, S. Venkatesan Directed by S. Shankar  Produced by Dil Raju, Shirish  Ram Charan after RRR has received huge recognition worldwide for his acting prowess and screen presence. When he announced his next with Shankar after a Rajamouli movie, everyone felt this movie will be his true career Game Changer at best. Interestingly, even makers came up with same title. A movie mounted on a massive scale of Rs.400 crores budget with Shankar's typical lookout for technical brilliance and social message, what more can a film fan expect for Sankranti! Let's discuss Game Changer is able to sustain and deliver on this belief! Plot:  Ram Nandan(Ram Charan) after being appointed as IPS, works hard to become IAS and becomes collector of Vizag. He searches for his true love doctor Deepika(Kiara Advani) and gets to know that she runs an old age home. After meeting her, he gets to know that an old tribal woman also stays with her. She asks him to take her to ageing CM Bobbili Satyamurthy(Srikanth)'s open meeting. There she questions him and in fact orders him to work for people.  But his foster son, Bobbili Mopidevi(SJ Suryah) intervenes and Ram Nandan slaps him for manhandling the old lady. CM suspends Ram and even expels Mopidevi from party. Mopidevi decides to kill Murthy and becomes CM, even decides to murder Ram. But as his death wish, Satyamurthy decides to honor his mentor Appanna and  asks party people to elect Ram as CM. Why? Who is that old lady? What is her relation with Ram and Appanna? Watch the movie to know more.  Analysis:  Ram Charan aced the character of Appanna and put his maximum efforts in each and every scene. He carried the film on his shoulders and proved that he is able actor. His energy, screen presence and efforts elevated flashback portion. Even as young Ram Nandan, he is adorable.  Next, we have to mention SJ Suryah's performance but he is getting slightly monotonous with loud acting. Still, he delivered his best in well-written scenes. Srikanth got a great scope to perform and he utilised it to mixamum. Anjali did her role well and rest of them did their best within the permits of screenplay.  Technically, the movie has set high standards and production values have to be praised. We can see each paisa spent on the movie, on screen. The budget spent on songs and grandeur in scenes is palpable for the span. Production house did not back out from spending massively on screen. S Thaman background score also is good but his songs could have been better. His work in emotional scenes stands out.  Everything said and done, the movie falls flat with an uninspired writing by Shankar. Karthik Subbaraj's story is routine and scenes created by Shankar are also similarly old. The imaginative Shankar, who made us all awe at his ability to insert emotions in big commercial films has failed to connect us with emotions in this one.  His concentration on using new age camera and techniques to tell a scene, have diluted the impact further. Where we can find a good scene there we definitely find an irritating and irrational camera movement that just makes it hard to watch. As a director, Shankar needs to understand where his technical brilliance should end and where the script needs to take over.  But here, he used all his tried and tested troupes from Oke Okkadu, Shivaji and it seems obvious that he isn't challenged enough as a writer and director to bring out something unique in his last four outings. He is looking for technical brilliance to cover up for it and it is not working as anticipated. Hence, the movie which looks good on paper did not translate with similar impact on screen. For Ram Charan and few good scenes, this is at best a one-time watch.  In Conclusion:  A diluted political drama with inspired Ram Charan's performance.  Rating: 2.5/5
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ఈ  రోజుల్లో  రాజకీయ నాయకులు అనగానే డబ్బు, హోదా, ఖరీదైన కార్లు  గుర్తొస్తాయి. ఎందుకంటే రాజకీయం అనగానే డబ్బు ఆర్జించే ఒక మార్గం అయిందిప్పటి కాలంలో. కానీ ఒక జాతీయ స్థాయి నాయకుడై  ఉండి, ఒక దేశ ప్రధానై  ఉండి కూడా  ఒక పాత కారుని ఈఎంఐ పద్ధతిలో  కొనుక్కున్నారొక మహనీయుడు.   వ్యక్తిగత ఆస్తి కూడబెట్టటం కంటే ప్రజా సేవనే ధ్యేయంగా పని చేశారాయన.  ఆయన ఎవరో కాదు..  జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో భారత ప్రజలను చైతన్యం చేసిన లాల్ బహదూర్ శాస్త్రి.  అందరూ ముద్దుగా శాస్త్రిజీ అని పిలుచుకునే లాల్ బహదూర్ శాస్త్రిగారు ఆస్తులకన్నా ఆదర్మాలే ముఖ్యమని నమ్మారు. అదే నేడు ఆయన్ను గొప్ప దేశ నాయకుడిగా నిలబెట్టింది. నిబద్దత, క్రమశిక్షణ, నిస్వార్థ గుణం,నమ్రత, విధేయత  కలిగిన పాతతరపు నాయకుల్లో ఈయన ఒకరు. మన దేశానికి రెండవ ప్రధానమంత్రిగా సేవలందించిన  లాల్ బహదూర్ శాస్త్రి వర్థంతి నేడు.. ఈ సందర్భంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు తెలుసుకంటే.. లాల్ బహాదూర్ శాస్త్రి 1904 అక్టోబర్2న మొగల్‌సరాయ్‌లో జన్మించారు. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయారు. తండ్రి మరణానంతరం లాల్ బహాదూర్ శాస్త్రి  ఆయన చెల్లెల్లు వారి మామయ్య అయిన మున్షీ హజారీలాల్ ఇంట్లో పెరిగారు. 1928లో శాస్త్రి గారెకి  లలితా దేవితో వివాహం జరిగింది. ఆయనకి  నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుటుంబ సభ్యులు అంతా కూడా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. స్వాతంత్రోద్యమంలో పాత్ర.. లాల్ బహాదూర్ శాస్త్రి హరిశ్చంద్ర హైస్కూల్‌లో ఉన్నప్పుడు దేశభక్తి, ప్రజాదరణ పొందిన ఉపాధ్యాయుడు నిష్కామేశ్వర్ ప్రసాద్ మిశ్రాగారి  ప్రేరణతో స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు.  మహాత్మా గాంధీ, పండిట్ మదన్ మోహన్ మాలవ్య నిర్వహించిన ఒక సమావేశానికి వెళ్ళిన శాస్త్రి  ప్రభుత్వ పాఠశాలల నుండి విద్యార్థులు బయటకు రావాలన్న  పిలుపు మేరకు, ఆ మరుసటి రోజే హరిశ్చంద్ర హైస్కూల్‌ను వదిలేశారు. వాలంటీరుగా చేరి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఆయన అనేక సార్లు జైలు శిక్షను అనుభవించారు. 1925లో కాశీ విద్యాపీఠం నుండి “శాస్త్రి” బిరుదుతో పాటూ తత్వశాస్త్రం, నైతిక శాస్త్రంలో పట్టా పొందారు. ఆయన లాలాలజపతిరాయ్ స్థాపించిన “లక్ సేవక్ మండల్”లో చేరి మహాత్మా గాంధీ నాయకత్వంలో ముజఫర్‌పూర్‌లో హరిజనుల కోసం పనిచేశారు. 1928లో మహాత్మా గాంధీ ఆదేశాల మేరకు భారత జాతీయ కాంగ్రెస్‌లో పూర్తి స్థాయి సభ్యుడిగా చేరారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నందుకు రెండు సంవత్సరాలపాటు జైలులో ఉన్నారు. 1940లో వ్యక్తిగత సత్యాగ్రహానికి మద్దతు తెలపడం వల్ల ఏడాది జైలులో గడిపారు. 1937, 1946లలో ఆయన యునైటెడ్ ప్రావిన్సెస్ శాసనసభకు ఎన్నికయ్యారు. నిర్ణయాలు అద్బుతం.. భారత స్వతంత్రానంతరం శాస్త్రి ఉత్తరప్రదేశ్‌లో రవాణా, పోలీసుశాఖా మంత్రిగా సేవలందించారు. ఆయన రాజకీయ  పరంగా తీసుకున్న నిర్ణయాలు చాలా అద్బుతమైనవి. ఆయనే మొదటిసారి మహిళా కండక్టర్ల నియామకానికి మార్గం చూపించారు.  నిరసనల సమయంలో లాఠీలకు బదులుగా నీటి గొట్టాలను ఉపయోగించడానికి ఆదేశాలు జారీచేశారు. 1951లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, 1952లో రైల్వే, రవాణాశాఖ మంత్రిగా, 1961లో హోం మంత్రిగా పని చేశారు. నెహ్రూ మరణానంతరం 1964లో భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రధానిగా.. 1965భారత-పాక్ యుద్ధం సమయంలో ‘జై జవాన్ జై కిసాన్’ అనే  నినాదంతో జవాన్లను, రైతులను చైతన్య పరిచారు. పాల ఉత్పత్తిని పెంచడానికి అతి పెద్ద ఉద్యమానికి మద్దతుగా  అమూల్ సహకార సంఘానికి అండగా నిలిచారు. హిందీ భాషకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను శాంతి పూర్వకంగా పరిష్కరించారు. పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో కలిసి తాష్కెంట్ డిక్లరేషన్‌పై సంతకం చేశారు. ఆయన హయాంలో విధ్యా సంస్థలు, డ్యాములు, పోర్టులు ఎన్నో నిర్మితమయ్యాయి.   దేశ అభివృద్ధిలో ఆయన చేసిన  కృషి అమోఘం. ఆయన  ప్రధానమంత్రి హోదాలో  సోవియట్ యూనియన్, ఇంగ్లాండ్, కెనడా, నేపాల్, ఈజిప్ట్, బర్మా వంటి అనేక దేశాలను సందర్శించి విదేశాలతో మన దేశ సంబంధాలు మెరుగుగా ఉండేలా చేశారు. మరణం.. శాస్త్రిగారు  1966వ సంవత్సరం,  జనవరి 11న తాష్కెంట్‌లో మరణించారు. 1965 ఇండో-పాక్ యుద్ధానికి శాంతి ఒప్పందంపై సంతకం చేసిన మరుసటి రోజే ఇలా జరిగింది. ఆయనను ఒక జాతీయ హీరోగా గుర్తించి, ఢిల్లీలో విజయ ఘాట్ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. లాల్ బహాదూర్ శాస్త్రి చాలా సాధారణ జీవితం గడిపారు. వ్యక్తిగత ఆస్తిని కూడబెట్టకుండా, ప్రజలకు సేవ చేయడంలో జీవితం గడపాలని ఉద్దేశించిన సేవక్ సొసైటీ సభ్యుడుగా ఉండేవారు.  శాస్త్రిగారి జీవితం నైతిక విలువలు, నమ్రత,  ప్రజా సేవకు ఆదర్శంగా నిలిచింది. తన జీవితాంతం ప్రజల కోసం పనిచేసి, దేశ అభివృద్ధికి విశేషమైన కృషి చేసి భారతదేశ చరిత్రలో మర్చిపోని నాయకుడిగా నిలిచారు.                                            *రూపశ్రీ.
చాణక్యుడి గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ఈయన చెప్పిన ఎన్నో విషయాలు అర్థం చేసుకోవాలి గానీ జీవితంలో వైఫల్యం అనేదే ఎదురుకాదు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితాలు, వ్యక్తుల మద్య సంబంధాలు.. ఇలా ఒక్కటనేమిటి? ఎన్నో విషయాల గురించి చాణక్యుడు కుండ బద్దలు కొట్టినట్టు విషయాలను స్పష్టంగా చెప్పాడు. ముఖ్యంగా డబ్బు చేతికి వచ్చినప్పుడు చాలామంది తమకు తెలియకుండానే కొన్ని, తెలిసి కొన్ని తప్పులు చేస్తారు. వీటి వల్ల  వ్యక్తుల దగ్గర డబ్బున్నా  ప్రశాంతత, సంతోషం అనేది మాత్రం అస్సలుండవట. మరికొందరు పతనానికి చేరుకుంటారట. డబ్బు చేతిలో ఉన్నప్పుడు చేయకూడని ఆ తప్పులేంటో తెలుసుకుంటే.. డబ్బు చేతిలో ఉన్నప్పుడు చాలామంది తాము ఇబ్బంది పడిన రోజులను, బాధతో గడిపిన రోజులను మరచిపోతాడు. పూర్తీగా చేతిలో డబ్బుందనే మాయలో పడిపోతారు. ఇలా మరచిపోవడం,  కష్ట సమయాలను, బాధల్ని మరచిపోవడం, డబ్బు విషయంలో తప్పు పనులు చేయడానికి దారితీస్తుంది. దీనివల్ల మళ్లీ డబ్బు లేని స్థితికే చేరుకుంటాడు. సహజంగా ప్రతి ఒక్కరూ డబ్బులేనప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తారు. డబ్బున్నప్పుడు. డబ్బులోనే సంతోషాన్ని చూస్తున్నప్పుడు దేవుడిని పక్కన పెడతాడు.  ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొన్నిసార్లు తప్పు మార్గంలో కూడా వెళతాడు. ఇలాంటి వారు డబ్బును మధ్యలోనే పోగొట్టుకుంటారు. తిరిగి అశాంతికి, కష్టానికి, బాధలకు దగ్గరవుతారు. కొంతమందికి డబ్బు చేతికి రాగానే అహంకారం వస్తుంది. కుటుంబ సభ్యులతోనే గౌరవం లేకుండా ప్రవర్తిస్తారు.  అయితే పొరపాటున కూడా కుటుంబ సభ్యుల ముందు డబ్బు గర్వాన్ని చూపించకూడదు. డబ్బు ఈరోజు ఉండి రేపు పోవచ్చు. కానీ మరణం వరకు తోడుండే ఆత్మీయులు మాత్రం డబ్బు వల్ల దూరం అయితే మళ్లీ దగ్గరకు రావడం కష్టం. డబ్బు సంపాదించడం మంచిదే కానీ డబ్బు సంపాదించడమే పరమావధి కాకూడదు. మరీ ముఖ్యంగా ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి మరీ డబ్బు సంపాదించే పనులు ఎప్పుడూ చేయకూడదు.  అలాంటివారితో ఎక్కడా ఎవరూ బ్రతకలేరు. ముఖం మీదనే చెప్పి దూరం వెళ్లిపోతారు. అందుకే డబ్బుకోసం ఆత్మగౌరవం విషయంలో అస్సలు రాజీ పడవద్దు. డబ్బు దండిగా ఉన్నప్పుడు అయినా, డబ్బు లేనప్పుడు అయినా ఒకే విధంగా ఉండే వాడే ఎప్పటికైనా జీవితంలో సఫలం అవుతాడు. డబ్బు ఉంది కదా అని అనవసరంగా ఖర్చు చేస్తే అది చాలా తప్పు. కానీ డబ్బు ఉన్నప్పుడు అందులో కొంత భాగాన్ని మతపరమైన కార్యక్రమాలలో  వినియోగించడం ఉత్తమమని చాణక్యుడు చెప్పాడు. డబ్బు వృధా కంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇతరులకు సహాయం చెయ్యడం చాలా మంచిది. దీని వల్ల మానసిక ఆరోగ్యం, ప్రశాంతత చేకూరతాయి. డబ్బు సంపాదించడం ధనవంతుడు కావడం  గొప్పే.. కానీ  ఆ డబ్బును ఇతరులకు హాని తలపెట్టడానికి ఉపయోగిస్తే మాత్రం పతనానికి చేరుకుంటారు. ఇలాంటి పనులవల్ల ఎంత గొప్ప ధనవంతుడు అయినా పేదవాడిగా మారిపోవడం ఖాయమని చాణక్యుడు చెప్పాడు.                                           *నిశ్శబ్ద.
  “ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని,  నిలుపరా నీ జాతి నిండు గౌరవము" అనే గేయాలను చదువుకుంటూ పెరిగినవాళ్లం. దీనికి తగ్గట్టు కొందరు మాతృదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తుంటారు.  అలాంటి వారిలో మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద నుండి చాలామంది ప్రముఖులు  ఉన్నారు.  ఈ జాబితాలో ప్రవాస భారతీయుల పాత్ర చాలా ఉంది. ఈ రోజుల్లో పొట్ట కూటి కోసం ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళేవాళ్ళు కొందరైతే, తమ చదువుకి, ప్రతిభకి తగిన అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తున్నవాళ్లు కొందరున్నారు. ఉన్నత విద్య అభ్యసించడానికో.. ఉన్నత విద్య ద్వారా వచ్చిన ఉద్యోగ అవకాశాల కోసమో విదేశాలకు వెళ్తున్న భారతీయుల సంఖ్య ప్రతి ఏడూ పెరుగుతూ వస్తోంది. దీనికి తగ్గట్టే విదేశాలలో భారతీయుల హవా సాగుతోంది.     మన భారతదేశం నుంచి ప్రపంచ నలుమూలలకి వెళ్ళిన మన వాళ్ళు భారతీయతను చాటి చెప్పటానికి మన దేశ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నారు.  అలాంటి  ప్రవాస భారతీయులు, భారతీయ మూలాలున్న వ్యక్తులు దేశ అభివృద్ధిలో చేసిన, చేస్తున్న సేవలకి గుర్తింపుగా ప్రవాస భారతీయుల దినోత్సవం జరుపుకుంటారు. అయితే దీనికి ముఖ్యమైన మూలం మహాత్మా గాంధీ..   మహాత్మా గాంధీ విద్యాభ్యాసం కోసం దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడి  నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన రోజునే ప్రవాస భారతీయుల దినోత్సవం జరుపుకుంటున్నారు.   2003 సంవత్సరం నుంచి  ప్రతీ ఏటా జనవరి 9వ తేదీన   ప్రవాస భారతీయుల  దినోత్సవం( ఎన్‌ఆర్‌ఐ డే)  జరుపుకుంటున్నాము. ప్రవాస భారతీయుల దినోత్సవం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుంటే.. 2025 లో జరగబోయే 18వ ఎన్‌ఆర్‌ఐ డే  ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్‌లో జనవరి 8 నుండి 10 వతేదీ వరకు  జరగనుంది. ప్రవాస భారతీయ దినోత్సవం.. మన భారతదేశం  ప్రపంచంలోనే  ఎక్కువ ప్రవాస భారతీయులు ఉన్న దేశంగా పేరుపొందింది. ఈ ప్రవాస భారతీయులు తమ   ఆర్థిక సహకారాలు, పెట్టుబడులు ద్వారా దేశ అభివృద్ధిలో, గ్లోబల్‌గా మన దేశ గుర్తింపుని  పెంచటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న పెద్ద పెద్ద కంపెనీల సి‌ఈ‌ఓలు, రాజకీయ నాయకులు ఇలా చాలామంది మన దేశం వారు లేదా మన దేశ మూలాలున్న వారు విదేశాలలో  ఉన్నారు.  అందుకే ఈ ప్రవాస భారతీయుల దినోత్సవం  వ్యాపారం, విద్య, కళలు, శాస్త్రం, సాంకేతికత వంటి రంగాలలో  ప్రవాస భారతీయుల విజయాలను గుర్తించి, ప్రోత్సహించడమే కాకుండా అంతర్జాతీయంగా  భారతదేశ ప్రతిష్టను మరింత బలోపేతం చేయడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. మన దేశంతో వారి సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి,  భారతీయ మూలాలున్న వ్యక్తులు,  భారతీయ సంస్థల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించటానికి ,  అలాగే ఎన్‌ఆర్‌ఐ లను  ప్రభావితం చేసే ప్రభుత్వ విధానాలపై చర్చించటానికి ఈ ప్రవాస భారతీయుల దినోత్సవం  ఒక వేదికగా  నిలుస్తుంది. భవిష్యత్తులో వివిధ రంగాలలో భారతదేశ అభివృద్ధికి వనరులను, నైపుణ్యాలను, సాయాన్ని  సమీకరించడం కోసం ప్రవాస భారతీయుల సహకారం చాలా అవసరం అవుతుంది.  దీనికి గానూ వారు ఎలా సహకరించగలరో చర్చించేందుకు ఒక  ప్రవాస భారతీయుల దినోత్సవం ఒక వేదిక అవుతుంది. ప్రవాసీయుల సహకారం.. భారతదేశ కలకు సాకారం.. ఏదైనా ఒక దినోత్సవం జరపడం మొదలుపెడితే ప్రతి ఏడాది ఒక విశేషమైన అంశాన్ని ఎంచుకుని ఆ అంశం దిశగా కృషి చేయడం, లక్ష్యాలు సాధించడం జరుగుతుంది.  ప్రవాస భారతీయుల దినోత్సవానికి అలాంటి అంశాల ఎంపిక ఉంది.  ఈ ఏడాది..     “అభివృద్ధి చెందిన భారతదేశపు సంకల్పంలో  ప్రవాస భారతీయుల సహకారం”  అనే అంశాన్ని  ఎంపిక చేశారు. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశ జాబితా నుంచి అభివృద్ధి చెందిన దేశ జాబితాలో మన దేశం చేరేందుకు గానూ  విదేశాలలో ఉండే భారతీయుల  పాత్రని  ఈ అంశం ప్రతిబింబిస్తుంది.    సేవ..  గుర్తింపు.. ఈ ఎన్‌ఆర్‌ఐ దినోత్సవం జరుపుకోవడంలో భాగంగా అందరిని ఆకట్టుకునే ప్రధాన విషయం.. సేవలను గుర్తించడం. ఇవే..  ‘ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డులు’. ఇవి భారతీయ ఎన్‌ఆర్‌ఐ లు  చేసిన అసాధారణ సేవలను గుర్తించి సత్కరించేందుకు ఇచ్చే పురస్కారాలు. ఈ అవార్డులు భారత రాష్ట్రపతి చేతులు మీదుగా అందజేయబడతాయి. ఈ గుర్తింపు  భవిష్యత్తులో భారతదేశానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసులకి  మధ్య మరింత సహకారం పెరిగేలా చేస్తుంది. ఈ సారి ప్రవాస భారతీయుల దినోత్సవానికి  వేదిక అయిన భువనేశ్వర్ 50 కంటే ఎక్కువ దేశాల నుండి వచ్చే ప్రవాస భారతీయులను హృదయపూర్వకంగా స్వాగతించనుంది. ఈ సంవత్సరం కార్యక్రమానికి ట్రినిడాడ్ & టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగలో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగం ఇవ్వబోతున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు ప్రవాస భారతీయులను ఆకర్షించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.  మొదటి రోజు యూత్ ప్రవాస భారతీయ దివస్‌కు కేటాయించబడింది. ఈ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖతో కలిసి నిర్వహించనున్నారు. ఇది యువ నాయకత్వం,  సాధికారతపై దృష్టి సారిస్తుంది. ప్రసిద్ధి చెందిన డెవ్ ప్రగాద్ (సి‌ఈ‌ఓ, న్యూస్వీక్) వంటి ప్రసంగకర్తలు ఇందులో పాల్గొంటారు. ఈ సంధర్బంగా మన దేశ యువత కూడా తమ ప్రతిభా నైపుణ్యాలని సరిగా ఉపయోగించుకుని, దేశం వీడినా దేశ సేవ చేస్తున్న  ప్రముఖ ప్రవాస భారతీయులను ఆదర్శంగా తీసుకుని  తమ జీవితాలని మెరుగుపర్చుకోవటమే కాకుండా దేశ అభివృద్ధిలో కూడా భాగం అయితే భారతదేశం అభివృద్ది చెందిన దేశం అవుతుంది.                                                 *రూపశ్రీ.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా రకాల విటమిన్లు అవసరం అవుతాయి. వాటిలో విటమిన్-సి ముఖ్యమైనది.  విటమిన్-సి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది.  జబ్బు పడినప్పుడు విటమిన్-సి ఆధారిత పండ్లు, కూరగాయలు తీసుకుంటే చాలా తొందరగా కోలుకుంటారు.  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా విటమిన్-సి ఆధారిత పండ్లు, కూరగాయలు బాగా తీసుకుంటే రోగనిరోధక శక్తి బలపడుతుంది.  సాధారణంగా విటమిన్-సి లోపం రావడం అరుదే అయినప్పటికీ..  ఈ లోపం ఏమాత్రం ఉన్నా ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది. విటమిన్-సి లోపం తొలగాలన్నా,  రోగనిరోధక శక్తి పెరగాలన్నా ఈ కింది సూపర్ ఫుడ్స్ తప్పనిసరిగా తినాలి. బ్రోకలీ.. బ్రోకలీలో విటమిన్-సి మోతాదు ఎక్కువగా ఉంటుంది.  అలాగే కాల్షియం,  ఫైబర్, పొటాషియం, విటమిన్-ఎ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి.. ఉసిరికాయలు విటమిన్-సి కి చాలా మంచి మూలం.  నిమ్మకాయలో ఉండే విటమిన్-సి కంటే 10 రెట్లు విటమిన్-సి  ఉసిరికాయలలో ఉంటుంది.  ఉసిరికాయను పొడి రూపంలో తీసుకున్నా,  జ్యూస్ రూపంలో తీసుకున్నా.. అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా రోజూ ఒక కాయను పచ్చిగానే తిన్నా చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది.   రోగనిరోధక శక్తిని బలపరచడమే కాకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. చర్మం మెరిచేలా చేస్తుంది. చర్మ సంబంధ సమస్యలు తొలగిస్తుంది. నారింజ.. నారింజ సిట్రస్ పండ్లలో ప్రముఖమైనది. నారింజను తినడం వల్ల  రోగనిరోధక శక్తి అద్బుతంగా పెరుగుతుంది.  ప్రతిరోజూ ఒక నారింజ పండు తింటుంటే వృద్దాప్యం త్వరగా రాదట.  జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందట.  తెల్ల జుట్టు సమస్య అస్సలే ఉండదని ఆహార నిపుణులు అంటున్నారు.  నారింజలో పైబర్,  విటమిన్-ఎ, పొటాషియం, విటమిన్-సి ఉంటాయి.    ఇన్పెక్షన్ ప్రమాదాలు తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాప్సికం.. క్యాప్సికంలో విటమిన్-సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  ఇందులో విటమిన్-సి,  విటమిన్-ఎ,  బీటా కెరోటిన్ ఉంటాయి.  దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్-సి లోపం తొలగిపోతుంది.  దీన్ని సలాడ్ లలోనూ,  వెజిటబుల్ జ్యూస్ లోనూ జోడించుకోవచ్చు. బొప్పాయి.. బొప్పాయిలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  బొప్పాయి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  ఇధి మాత్రమే కాకుండా ఇది శరీరం డిటాక్స్ కావడంలో సహాయపడుతుంది. అంటే.. శరీరంలో ఉన్న వ్యర్థపదార్థాలు, మలినాలు, విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.                                      *రూపశ్రీ  
నిద్ర దివ్యౌషధం అంటారు.  ఆరోగ్యకరమైన నిద్ర శరీరం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.  ప్రతి వ్యక్తికి రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర  కచ్చితంగా ఉండాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే హాయిగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కదా అని మరీ అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి చేటు చేస్తుందట. అతిగా నిద్రపోవడం వల్ల కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. ఊబకాయం.. అతిగా నిద్రపోవడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది.  ఎక్కువ సేపు నిద్రపోయే వారు శారీరక కష్టం ఏమీ చేయని వారై ఉంటారు.  ఎందుకంటే ఎక్కువ నిద్రపోయే అలవాటు ఉన్నవారు వృత్తి కార్యకలాపాలు నిర్వర్తించడం, చిన్న పనులు చేయడాన్నే పెద్దగా ఫీలైపోతారు.  శారీరక శ్రమ,   వ్యాయామం,  ఇతర విషయాలు, పనులను కూడా వాయిదా వేస్తుంటారు. దీనివల్ల దీర్షకాలిక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. జీవక్రియ.. ఎక్కువ సేపు నిద్రపోయే వారిలో జీవక్రియ మందగిస్తుంది.  బరువు  పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది.  శరీరంలో కేలరీలను బర్న్ చేసే అవకాశం ఉండదు.  జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల ఇతర సమస్యలు కూడా పెరుగుతాయి. గుండె.. ఎక్కువ సేపు నిద్రపోవడం గుండెకు ప్రమాదం అని వైద్యులు అంటున్నారు.  ఎందుకంటే ఎక్కువ సేపు నిద్రపోవడం అనేది రక్తప్రసరణను నెమ్మదిస్తుంది.  ఈ కారణంగా గుండెకు రక్తప్రసరణ తగ్గి గుండె జబ్బులు,  హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతసేపు.. రోజుకు 7 గంటల నిద్రపోవడం ఆరోగ్యకరం.  7 గంటల కంటే ఎక్కువ అయినా 9 గంటలు నిద్రపోవడం ఆరోగ్యమే.. కానీ 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా 9 గంటలు నిద్రపోయే వారిలో 46శాతం ఎక్కువగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధనలలో తేలింది. థైరాయిడ్.. అధిక నిద్ర కారణంగా థైరాయిడ్ సమస్యలు,  అతిగా తినడం అనే సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందట.  వీటి కారణంగా అధిక బరువు,  ఊబకాయం,  డయాబెటిస్ కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.                                       *రూపశ్రీ.
  నిద్ర మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం. నిద్రను గొప్ప ఔషదంగా పరిగణిస్తారు.  మంచి నిద్ర ఉంటే  శరీర ఆరోగ్యం చాలా వరకు సాఫీగా ఉంటుంది. కానీ నేటి కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రవ్వగానే హాయిగా నిద్రపోవాలని అనుకుని, పడుకుని నిద్ర పట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతూ కాలయాపన చేసేవారు.. నిద్రరాక గంటలు గంటలు శూన్యంలోకి చూస్తూ ఆలోచనలలో గడిపేవారు చాలా మంది ఉంటున్నారు. కొందరైతే నిద్ర  బాగా రావాలని పడుకునే ముందు కొన్ని రకాల పానీయాలు కూడా తాగుతుంటారు. అయితే ఇలా నిద్ర రాకపోవడం అనేది సాధారణంగా కొట్టే పడేయాల్సిన విషయం కాదట. ఇలా నిద్ర రాకపోవడం అనేది కొన్ని అనారోగ్య సమస్యలను సూచిస్తుందని అంటున్నారు.   నిద్రలేమి వివిధ కారణాల వల్ల సంభవించినా.. దీర్ఘకాలం ఈ సమస్య ఎదుర్కొంటూ ఉంటే మాత్రం అది కొన్ని తీవ్రమైన వ్యాధుల వల్ల జరుగుతుంది. నిద్ర లేమి అనేది చాలా వరకు డిప్రెషన్ తో బాధపడేవారికి ఎదురయ్యే సమస్య.  డిప్రెషన్ కారణంగా నిద్ర పట్టడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. చాలామంది ఈ కాలంలో అతి ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు, మానసిక ఒత్తిడి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యలు కూడా నిద్రను ప్రభావితం చేస్తాయి.   కొందరిలో స్లీప్ అప్నియా అనే సమస్య ఉంటుంది.  ఇది నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో అంతరాయం కలిగించే వ్యాధి.  దీని వల్ల శ్వాస సరిగా ఆడక మళ్లీ మళ్లీ నిద్ర మధ్యలో మేల్కొంటు ఉంటారు. హైపర్ థైరాయిడిజం సమస్య ఉంటే అది జీవక్రియను ప్రభావితం చేస్తుంది.  జీవక్రియ సరిగా లేకపోవడం వల్ల శరీర వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది. ఇది రాత్రి సమయంలో నిద్రలేమి సమస్య కలుగజేస్తుంది. ఆర్థరైటిస్,  మైగ్రేన్ లేదా ఇతర వ్యాధులు ఉన్న వారు కూడా సరిగా నిద్ర పోలేరు. ఈ వ్యాధుల కారణంగా  నిద్రలో పదే పదే మెలకువ వస్తుంది.  ఈ సమస్యలు ఉన్నవారిలో నిద్ర సమస్యలు కూడా పెరుగుతాయి. అధికంగా ఆల్కహాల్,  కెఫీన్ పానీయాలు తీసుకునే వారు కూడా నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారు. ఈ అలవాట్లు ఉన్నవారు రాత్రి సమయంలో సరిగా నిద్రపోలేరు.                                           *రూపశ్రీ.