LATEST NEWS
తెలంగాణ కాంగ్రెస్లో సీన్ రివర్స్ అవుతోందా? ఒకప్పుడు, సీనియర్లను పక్కన పెట్టి, జూనియర్ నాయకులకు, మరీ ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన, చిట్టి పొట్టి నాయకులకు ఎత్తు పీట వేసి పెద్ద చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పడు, సీనియర్ల వైపు చూస్తోందా? అంటే, కాంగ్రెస్ వర్గాల నుచి అవుననే సమాధానమే వస్తోంది.  నిజానికి, సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. అంతే  కాదు, యంగ్ లీడర్స్ టాలెంట్ గుర్తించక పోవడం, పదవులు పక్కదారి పట్టి సీనియర్ నాయకులకు చేరడంతో   యువ నాయకులు అనేక మంది వేరే దారులు వెతుకున్నారు. ఉదాహరణకు,   రాజస్థాన్, మధ్య ప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధిష్టానం యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సచిన్ పైలెట్ ను కాదని, వృద్ద నేత అశోక్ గెహ్లాట్ ను ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కించింది. మధ్య ప్రదేశ్ లోనూ అంతే, జ్యోతిరాదిత్య సింధియా ను కాదని కమల్ నాథ్ ను  సిఎంను చేసింది.  నిజానికి, పైలెట్, సింధియా ఇద్దరు కూడా రాహుల్ గాంధీకి సన్నిహితులు. రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన నాయకులు. సచిన్ పైలెట్ తండ్రి రాజేష్ పైలెట్  కాంగ్రెస్  పార్టీలో, ప్రభుత్వాలలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహ రావు మంత్రివర్గంలో పనిచేసారు. జ్యోతిరాదిత్య సిందియా తండ్రి మాధవ  రావు   సిందియా విషయం అయితే చెప్పనే అక్కర లేదు. నాలుగైదు సార్లు ఎంపీగా గెలవడమే కాదు,   గ్వాలియర్ నుంచి పోటీ చేసిన అటల్ బిహారీ వాజ్ పేయిని ఓడించారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు.  పైలెట్, సింధియా ఇద్దరూ కూడా. వారసులుగా రాజకీయ ఎంట్రీ ఇచ్చినా, నాయకులుగా నిరుపించుకున్నారు. ఎంపీలుగా గెలిచారు, ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. మన్మోహన్ సింగ్   మంత్రి వర్గంలో మంత్రులుగా పనిచేసి, పరిపాలనా అనుభవం సంపాదించుకున్నారు. రెండు రాష్ట్రల్లోనూ 2018 ఎన్నికలలో  కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ ఇద్దరే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.  అయినా, కాంగ్రెస్ అధిష్టానం యువ నాయకులను కాదని, వృద్ధులకు పదవులు కట్టబెట్టింది. నిజానికి  ఆ ఇద్దరనే కాదు, కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చిన అనేక మంది యూత్ లీడర్స్ కు పార్టీలో  గుర్తింపు దక్కలేదు. అందుకే జితిన్  ప్రసాద, ఆర్పీ సింగ్ మొదలు నిన్న మొన్న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన,  కేంద్ర మాజీ మంత్రి ఏకే అంటోనీ కుమారుడు అనిల్ అంటోనీ వరకు ఎంతో మంది యువ నేతలు ముఖ్యంగా రెండు మూడు తరాలుగా, కాంగ్రెస్ కుటుంబాలుగా ముద్ర వేసుకున్న  నేతల కుమారులు, కాంగ్రెస్ అధిష్టానం తమకు గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని బయటకు వెళ్లి పోయారు. ఈ మధ్యనే  జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి సేవలు అందించిన, అహ్మద్ పటేల్ కుమారుడు, ఫైసల్  పటేల్   కాంగ్రెస్ పార్టీ తీరుతో విసిగిపోయి, ఇక చాలని తప్పుకున్నారు. అయినా  యంగ్ టాలెంట్ బయటకు వెళ్లి పోతున్నా చాలా వరకు రాష్ట్రాల్లో ఇప్పటికీ  సీనియర్ నాయకులకే కుర్చీలు వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, ఎదుకనో ఒక్క తెలంగాణ విషయంలో మాత్రం, ఆనవాయితీకి భిన్నంగా, రెండుమూడు పార్టీలు మారి, కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్ రెడ్డిని మాత్రం చేయి పట్టుకుని రాజకీయ వైకుంఠపాళిలో పాముల నోటిన పడకుండా నిచ్చెనలు ఎక్కించుకుంటూ   పైకి తీసుకు పోయింది. 2017లో  తెలుగు దేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి   అధిష్టానం అండదండలతో చకచకా  నిచ్చెన మెట్లు ఎక్కారు.   బహుశా కాంగ్రెస్ పార్టీలో ఇంత వేగంగా పదవుల మెట్లు ఎక్కినా నాయకుడు మరొకరు ఉండక పోవచ్చును. 2021 లో సీనియర్ నాయకుల నుంచి తీవ్ర  ప్రతిఘటన  ఎదుర్కుని కూడా ఆదిష్ఠానం   అండదండలతో  టీపీసీసీ  అధ్యక్షుడయ్యారు. అదే క్రమంలో 2023లో కాంగ్రెస్ అధిష్టానం,సీనియర్ కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ని  ముఖ్యమంత్రిని చేసింది.  అయితే  ఇప్పడు అదే అధిష్టానం కారణాలు ఏమిటో ఖచ్చితంగా తెలియక పోయినా సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్  నియామకం జరిగిన తర్వాత, ఈ  మార్పు   స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.  అలాగే, ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డిని  పక్కకు నెట్టి, జానా రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ అధిష్టాం సీనియర్ నాయకులకు  త్వరలోనే పూర్వ వైభవం వస్తుందనే సంకేతాలు ఇచ్చినట్లు, అయ్యిందని సీనియర్ నాయకులు సంతోషం వ్యక్త పరుస్తున్నారు. అలాగే మీనాక్షి నటరాజన్ రాకతో, అధిష్ఠానానికి సీనియర్ నాయకులకు మధ్య మాజీ రాష్ట్ర ఇన్ చార్జిలు, కోటరీ నేతలు కట్టిన అడ్డు గోడలు తొలిగి పోయాయి. సీనియర్ నాయకుడు జానా రెడ్డి వారధిగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో  సీనియర్ నాయకులకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయనే విశ్వాసం వ్యక్తమవుతోంది  అంటున్నారు. అలాగే, ఇటీవల గుజరాత్ లో రాహుల్ గాంధీ, బీజేపీతో భూత, భవిష్యత్, వర్తమానాల్లో పత్యక్ష, పరోక్ష సంబంధాలున్న అందరికీ  ఉద్వాసన తప్పదని చేసిన హెచ్చరిక  నేపధ్యంగా రాష్రంలో చోటు చేసుకుంటున్న  పరిణామాలను సీనియర్ నాయకులు  శుభ సంకేతాలుగా తీసుకుంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యంలో భాగంగా ఉన్న పార్టీనే గానీ.. ప్రజాస్వామికంగా నడిచే పార్టీ కాదు. ఒక వ్యక్తి స్థాపించి.. తానే ఆ పార్టీకి మోనార్క్ అని భావించుకుంటూ.. నియంతలా నిర్వహిస్తున్న పార్టీ అది. రికార్డుల్లో కూడా అలాంటి పోకడే ఉండాలనే ఉద్దేశంతోనే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి తనను తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకుని.. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం- ఆ పప్పులన్నీ ఉడకవని మొట్టికాయలు వేసిన తరవాత నాలిక్కరచుకుని వెనక్కు తగ్గారు. అలాంటి పార్టీలో ఎవరైనా చెలామణీ అవుతున్నారంటే.. వారందరరూ జగన్ దయాదాక్షిణ్యాల మీదనే బతుకుతున్నట్టుగా ఆయన భావిస్తూ ఉంటారు. అలాంటి వాతావరణం ఉండే పార్టీలో ఆయనను ధిక్కరించి నడుచుకునే వాళ్లు ఉండరు. సాధారణంగా అలాంటి వారు పార్టీని వదలి తమ దారి తాము చూసుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ శాసనసభలో జరిగిన పరిణామాలను గమనిస్తే.. వైసీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు.. జగన్ పట్ల ధిక్కార ధోరణిని ప్రదర్శించాలనుకుంటున్నారా? ఇలాంటి చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.  శాసనసభలో పది శాతం ఎమ్మెల్యేలు ఉంటే తప్ప ప్రతిపక్ష నేత హోదా దక్కదు అనే సంగతి తనకు స్పష్టంగా తెలిసినప్పటికీ, అదే మాటలతో గతంలో చంద్రబాబును ఎద్దేవా చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త నాటకానికి తెరతీశారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప సభకు రాబోనంటూ పట్టుపట్టారు. తన పార్టీ తరఫున గెలిచిన మిగిలిన పదిమందినీ కూడా వెళ్లనివ్వకుండా నియంత్రించారు. అయితే.. ఈలోగా.. వరుసగా 60రోజులు సభకు గైర్హాజరైతే పదవి పోతుందనే రాజ్యాంగ నిబంధన తెరపైకి వచ్చింది. జడుసుకున్న జగన్, తొలుత మేకపోతు గాంభీర్యంతో మాట్లాడారు గానీ  పిమ్మట అందరినీ వెంటబెట్టుకుని ఒక రోజు సభకు వచ్చి వెళ్లారు.  ఆ తరువాత కూడా ఏడుగురు ఎమ్మెల్యేలు వేర్వేరు సందర్భాల్లో సభ దాక వచ్చి అటెండెన్సులో సంతకాలు చేసి.. సమస్యలపై సభకు ప్రశ్నలు ఇచ్చేసి.. సభలోనికి అడుగుపెట్టకుండానే బయటకు వెళ్లిపోతున్నారని ఇవాళ స్పీకరు అయ్యన్నపాత్రుడు గుర్తించారు. దొంగ చాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లాల్సిన, దొంగల్లాగా వ్యవహరించాల్సిన ఖర్మ వారికేం పట్టిందంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు కూడా. దీనికి ఆ ఏడుగురిలో ఒకరైన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కౌంటర్ ఇస్తూ .. తాము దొరల్లాగానే వచ్చి వెళ్లాం అని వివరణ ఇచ్చారు కూడా.  ఆ సంగతి పక్కన పెడితే.. వ్యక్తిస్వామ్య పార్టీగా నడిచే వైఎస్సార్ కాంగ్రెస్ లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలను సభకు వెళ్లవద్దని నిర్దేశించిన తర్వాత.. వారు సంతకం పెట్టడం మాత్రం ఎలా జరిగింది? సంతకాలు పెట్టేయడం ద్వారా.. తమ మీద అనర్హత వేటు పడకుండా కాపాడుకోవాలని వారు అనుకున్నారా? లేదా, ఈ విషయం దాచేస్తే దాగేది కాదు కాబట్టి, తద్వారా జగన్మోహన్ రెడ్డి ఆదేశం పట్ల తమ ధిక్కార స్వరాన్ని బహిరంగంగానే వినిపించదలచుకున్నారా? అనే మీమాంస ఇప్పుడు పార్టీలో నడుస్తోంది. తాను వద్దని చెప్పిన తర్వాత సభకు వెళ్లిన వారి మీద జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో తాటిపర్తి చంద్రశేఖర్ వివరణ కూడా రావడం విశేషం.  ఈ ఏడుగురి వైఖరి ఖచ్చితంగా జగన్ పట్ల ధిక్కారమేనని, అయితే, వారి మీద కోపం వచ్చినా కూడా ఇదివరకటిలాగా ప్రదర్శించలేని దుర్బల స్థితిలో జగన్ రెడ్డి ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏ ఎమ్మెల్యే మీద ఆగ్రహిస్తే వారు పార్టీకి రాజీనామా చేసేస్తారో అనే భయం ఆయనలో ఉన్నదని ప్రజలు కూడా అనుకుంటున్నారు.
ఛత్తీస్గఢ్ లో గురువారం మార్చి ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో 22 మందిమావోయిస్టులు హతమయ్యారు. రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లోని గంగలూరు ఆంఢ్రీ అడవులలో  ఈ ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఒక జవాన్ కూడా మరణించినట్లు చెబుతున్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరుగుతుండటంతో తరచూ ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి కల్లా దేశాన్ని నక్సల్ ముక్త దేశంగా చూడాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఏడాది జనవరి 6న ప్రకటించారు. అప్పటి నుంచే దండకారణ్యంలో పోలీసు యాక్షన్ ముమ్మరమైంది. కూంబింగ్ ఆపరేషన్ ఎడతెగకుండా సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి9న జరిగిన భారీ ఎన్ కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.    తాజాగా గురువారం (మార్చి 20)  ఉదయం కూంబింగ్ జరుపుతున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. దీంతో ఇరు పక్షాల మధ్యా కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో  22 మంది మావోయిస్టులు మరుణించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.    దేశంలో మావోయిస్టు పార్టీలను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శపథంలో భాగంగా గత ఏడాది జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటి వరకు 300లకు పైగా మావోయిస్టులు హతమైనట్లు కేంద్ర హోంశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా తాజా ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా  సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆ పోస్టులో  మన సైనికులు నక్సల్ ముక్త భారత్ అభియాన్ దిశగా ఒక గొప్ప ముందడుగు వేశారని పేర్కొన్నారు.  మోడీ  ప్రభుత్వం నక్సలైట్లపై కఠినమైన విధానంతో ముందుకు సాగుతోంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా ఉంటుంది. అనే పేర్కొన్నారు. 
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ , ధన శ్రీ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు గురువారం (మార్చి 20)తో తెరపడింది. వీరికి విడాకులు మంజూరు చేస్తూ ముంబైలోని బాంద్రా కోర్టు తీర్పు చెప్పింది. ఈ విషయాన్ని చాహల్ తరపు న్యాయవాది కన్ఫర్మ్ చేశారు. ధన శ్రీకి భరణం క్రింద రూ 4. 75 కోట్లు చెల్లించేందుకు చాహల్ అంగీకరించారు. విడాకులు కేసు తుది దశకు చేరుకోవడంతో చాహల్ ఇంకా ఐపిఎల్  టీమ్ లో చేరలేదు. చాహల్, ధనశ్రీ సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలు గుప్పు మన్నాయి. వీరువురికి 2020లో  పెద్దల సమక్షంలో సాంప్రదాయంగా పెళ్లయ్యింది34 ఏళ్ల చాహల్ 2025 ఐపిఎల్ ఆడటానికి సిద్దమవుతున్నట్లు తెలిసింది. అతను పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నారు. ఈ టోర్నమెంట్ మార్చి 22న ప్రారంభమౌతుంది. పంజాబ్ జట్టు మార్చి 25న గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.  బాలివుడ్ నటి  ప్రీత జింతా యాజమాన్యంలో ని పంజాబ్ కింగ్స్ చాహల్ కు భారీ ఆఫర్ ఇచ్చి కొనుగోలు చేసింది. చాహల్ ను కొనుగోలు చేయడానికి  పంజాబ్ కింగ్ రూ 18 కోట్ల బిడ్ వేసింది 
మన దేశం మరో మారు  మిస్ వరల్డ్  (ప్రపంచ సుందరి) పోటీలకు వేదిక అవుతోంది.  అది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.  మే 7 నుంచి 31 వరకు  హైదరాబాద్ నగరంలో నిర్వహించే ఈ అందాల పోటీలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.   ఇంచు మించుగా,నెల రోజుల పాటు జరిగే ఈ పోటీలలో 140 దేశాల అందాలు భామలు పాల్గొంటారు. ఆ 140 దేశాల అందాల భామలు హైదరాబాద్ లో కురిపించే  అందాలను  కెమేరాతో పట్టుకుని   ప్రపంచానికి చూపేందుకు మూడు వేల టీవీ ఛానల్స్  నెల రోజుల పాటు  హైదరాబాద్  నగరంలో విడిది చేస్తాయి. ఈ మూడు వేల టీవీ ఛానల్స్  రాక పోకలు ఎలాంటి అవరోధాలు లేకుండా సాఫీగా సాగేందుకు అవసరమైన అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి విదేశాంగ మంత్రి జయశంకర్ తో మంతనాలు జరిపి  వచ్చారు. దీంతో ప్రపంచ సుందరి  పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తోంది.  అంతే  కాదు  ప్రపంచ సుందరి పోటీలకు తమ ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నదో కూడా ముఖ్యమంత్రి స్వయంగా శాసన సభకు వివరించారు. ఇది అలాంటి ఇలాంటి వేడుక కాదు, ఇతవరకు 72 సార్లు  ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తే ఒకే ఒక్క సారి 1998లో  మన దేశంలో బెంగుళూరులో నిర్వహించారు. అదికూడా అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ (ఏబీసీ) సంస్థ నిర్వహించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పడు మా ప్రభుత్వమే ప్రపంచ సుందరి  పోటీలు నిరహిస్తోందని సగర్వంగా సభకు తెలిపారు. (ముఖ్యమంత్రి ఎందుకు ప్రస్తావించలేదో ఏమో కానీ, లాస్ట్ ఇయర్, 2024 లోనూ మన దేశంలో  ముంబై/ ఢిల్లీలోనే మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. సరే అది వేరే విషయం.) ఈ పోటీలను ఇక్కడ హైదరాబాద్’లో  నిర్వహించడం వలన రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని,అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ సుందరి పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, నిర్ణయించిందని వివరించారు.  అయితే ఎప్పుడో జరిగే అందాల పోటీల విషయం ఎలా ఉన్నా ఇప్పుడది, రాష్ట్ర  రాజకీయాల్లో మరో వివాదానికి తెర తీసింది. పెద్ద దుమారాన్నే రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రపంచ సుందరి పోటీలను హైదరాబాద్ లో నిర్వహించడం  ద్వారా  పర్యాటక రంగం పరుగులు తీస్తుందని, అంటుంటే, ప్రధాన ప్రతి పక్ష పార్టీ బీఆర్ఎస్  మాత్రం  అందాల పోటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృధా చేస్తోందని ఆరోపిస్తోంది. అసలే రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో అందాల పోటీలా ...?  అంటూ ప్రశ్నలు సంధిస్తోంది. బీఆర్ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పోటీల నిర్వహణకు రూ.200 కోట్ల ప్రజాధనం ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆరోపించారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.46 కోట్లు ఖర్చుచేసి  ఫార్ములా - ఈ కార్  రేస్ నిర్వహిస్తేనే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులో ఏదో జరిగిపోయిందని  ఏసీబీ కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే  కేవలం రూ.46 కోట్లతో  ప్రపంచంలోనే ప్రప్రధమంగా ఫార్ములా - ఈ  రేస్  నిర్వహిం చడమే తప్పయితే, రూ.200 కోట్లు ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహించడం ఎలా రైట్  అవుతుందని బీఆర్ఎస్ నేతలు లాజికల్ గా  ప్రశ్నిస్తున్నారు. సరే.. అదలా ఉంటే, ఇందులో ఇంకొక సీరియస్ కోణం వుందని అంటున్నారు. 1998లో అమితాబచ్చన్ కార్పొరేషన్ (ఏబీసీ) బెంగుళూరులో ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు చాలా  పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.  మహిళా సంఘాల నిరసనలు, ఆత్మాహుతి ప్రయత్నాల కారణంగా స్విమ్ సూట్’ ఈవెంట్ ను రద్దు చేయడం కూడా జరిగిందని  గుర్తు చేస్తున్నారు.అంతే కాదు  చిత్రంగా, ప్రగతిశీల వామపక్ష మహిళా సంఘాలు, హిందూ జాతీయ వాద మహిళా సంఘాలు ఒకే గొంతుకతో  నిరసన గళం వినిపించాయి. అయితే, ఇప్పడు మళ్ళీ అలాంటి పరిస్థితి పునరావృతం అవుతుందా? శాంతి భద్రతల సమస్య వస్తుందా, అంటే చెప్పలేము. అయితే ఇటీవల ఉత్తర ప్రదేశ్, ప్రయాగ రాజ్ లో 45 రోజుల పాటి సాగిన మహా కుంభ మేళ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సాగిన మాటల యుద్ధం, తీవ్ర రాజకీయ దుమారన్నిరేపింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సహా పలువురు నాయకులు, సనాతన హిందూ ధర్మాన్ని తూలనాడుతూ చేసిన వ్యాఖ్యలు  అందుకు వ్యతిరేకంగా బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థల నాయకులు, కాంగ్రెస్ పార్టీని హిందూ వ్యతిరేక, సనాతన ధర్మ వ్యతిరేక పార్టీగా చిత్రీకరిస్తూ చేసిన ప్రతి విమర్శలు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా కొంత ఇబ్బందికి గురిచేశాయి అనే అభిప్రాయం వుంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, కుభమేళ ప్రభావం కొంత మేర ఉందనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లోఉంది. ఈ నేపధ్యంలో భారతీయ, సనాతన సంస్కృతీ, సంప్రదాయాలకు విరుద్ధమనుకునే మిస్ వరల్డ్ అందాల పోటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించడం పై బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు ఎలా స్పందిస్తాయి.. కాంగ్రెస్ ఆదిస్థానం ఎలా రియాక్ట్ అవుతుంది అనేవి ఇప్పడు మిస్ వరల్డ్ ముందున్న ప్రశ్నలు. అలాగే  ఈ అందాల వివాదం  చిలికి చిలికి వికృతంగా వికారంగా మారుతుందా, లేక  లాస్ట్ ఇయర్ లాగా,  కూల్ గా సర్దు మణిగి పోతుందా  అనేది ముందు ముందు గానీ తెలియదు.
ALSO ON TELUGUONE N E W S
Thalapathy Vijay has announced that his next Jana Nayagan is his final film and he would be concentrating on his political career. The movie is directed by H.Vinoth and music is composed by Anirudh Ravichander. Pooja Hegde, Mamitha Baiju are playing leading ladies in the film.  Now, several reports state that KVN Productions, the producers have run into financial issues. It is stated that they could not pay to daily workers for 22 days of schedule and halted the shoot. Once, their issues clear, they will re-start the shooting and finish it as soon as possible.  The daily workers have complained to FEFSI and hence, the shoot had to be halted mid-way. KVN Productions are facing this issue, due to IT raids on a company that they have invested in and their accounts have been seized for inspection. So, they are working on raising funds to finish the shoot, say reports.  Vijay did not intervene and took the time off to plan his next political move and strategy, suggest reports. For now, the makers are confident about resolving the issues and start the shooot. Jana Nayagan is expected to release two months before 2026 Tamil Nadu Assembly Elections. 
Prakash Raaj has been held accountable for promoting Betting Apps and a police case has been registered against him in Miyapur PS, about his involvement. The actor turned into a politician and started questioning different leaders about their stance.  Now, he had to answer in this matter and he begun his video, by addressing the same. He stated that he is accountable and stated that he did the mistake. He expressed regret over being ambassador of such an app. He stated that he got to know that it is wrong to promote them and immediately, stopped it.  Prakash Raaj explained that he got an offer in 2016 and he took it without understanding the gravitas of promoting the app. When he got to know that it is wrong, he stated that he cancelled any extension of contract and asked them to not use his name anymore.  He revealed that he further asked another company who bought the app also to not use his name. He stated that he sent them legal notices as well to stop using his name in any manner. He stated that he did not receive any intimation from police but he will cooperate with them in this matter. 
Megastar Chiranjeevi is known for his heartfelt messages. He wrote one exceptional message expressing his gratitude to Bridge India for conferring Lifetime Achievement Award for Excellence in Public Service through Cultural Leadership. He also got honoured by many esteemed Members of Parliament, Ministers & Under Secretaries, and Diplomats at the House of Commons in the UK Parliament. This is a great achievement for Chiranjeevi as it is the first Lifetime Achievement award from the association as well.  Grateful for the recognition, Chiranjeevi took to social media to express his heartfelt thanks. He wrote, "Heart filled with gratitude for the honour at the House of Commons - UK Parliament by so many Esteemed Members of Parliament, Ministers & Under Secretaries, Diplomats. Humbled by their kind words. Heartened by the LifeTime Achievement Award by Team Bridge India." Saying that this honour will further motivate him to continue his exemplary work, Chiranjeevi penned, "Words are not enough. But a heartfelt Thank You to each one of my wonderful loving fans, blood brothers, blood sisters, my film family, well-wishers, friends and all my family members and everyone who in every which way contributed to my journey and participated in the humanitarian causes I have been championing. This honour motivates me to continue my work with greater vigour. And Love to each one of you for your beautiful congratulatory messages." The event was graced by the presence of several distinguished personalities, including ministers, Members of Parliament (MPs), Lords, and diplomats. Chiranjeevi expressed his gratitude to each of them through social media.
The highly renowned producer Dil Raju, has made his production house, Sree Venkateswara Creations, SVC, synonymous for good films and successful ones. But his new movie, in the direction of Marco director, Haneef Adeni has been announced to be produced on Dil Raju Productions.  Harshith Reddy and Hanshitha Reddy will be producing the big budget mult-starrer as a Pan-India film with Sirish as the presenter. With Marco, Haneef scored a massive hit and turned heads with the gruesome violence and epic action. Now, he is set to bring his signature high-impact storytelling to Telugu cinema.  Seems like the producer is slowly starting to seggregate his production assets and Dil Raju productions could be taken forward more prominently while SVC will also be in action but with much bigger stars. Seems like Dil Raju changed his operative mode post Game Changer debacle. Let's see if that's the case or not.  On the other hand, fans are quite excited about the cast announcement. The collaboration of three unique forces joined and set to bring an exciting project that will create a sensation across Pan India. Sunita Tati of Guru Films will be associated with this project . More details about this project will be announced soon.
Ilaiyaraaja, the legendary composer of Indian Cinema, has produced many memorable songs and BGMs that many start their day with his music and end their day with the same. He left such a mark on Indian Cinema that it is hard to ignore for generations to come. Now, some reports suggest that Ilaiyaraaja could be conferred Bharat Ratna. The composer has been awarded with Padma Bhushan and Padma Vibhushan in 2010 and 2018, respectively, by the Government of India. Recently, in 2022, he has been nominated to Rajya Sabha, by President Ramnath Kovind, too. Still, he has been actively composing for films and garnering appreciation.  Looking at his tireless contribution to Indian Cinema and the reach he gained worldwide with his compositions for Indian music, the Government is thinking about announcing Bharat Ratna to the legendary composer, say reports. As he always stayed apolitical, nobody will object it state the reports.  After M. G. Ramachandran, Satyajit Ray, M. S. Subbulakshmi, Ravi Shankar, Lata Mangeshkar, Bismillah Khan, Bhimsen Joshi, Ilaiyaraaja would be one to receive Bharat Ratna, for his excellence in Arts and Humanities. If the government of India confirms, this would be one of the biggest honor for Indian Cinema, for sure.
ఇటీవలికాలంలో తెలుగు సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ హడావిడి బాగా ఎక్కువైంది. ఒక పాటను మించి మరొకటి ఉండాలనే ఆరాటంలో దర్శక నిర్మాతలు తమ సినిమాలోని ఐటమ్‌ సాంగ్‌ మరింత స్పెషల్‌గా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఆ పాట లిరిక్స్‌, ఐటమ్‌ గర్ల్‌తో వేయించే స్టెప్స్‌ని ఎంతవరకు ప్రేక్షకులు స్వీకరిస్తారు అనే విషయంలో విచక్షణ కోల్పోతున్నారని ఈమధ్యకాలంలో వస్తున్న పాటలు చూస్తుంటే అర్థమవుతుంది. ఇలాంటి పాటల విషయంలో నియంత్రణ అవసరం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. భారతీయ సినిమాలకు కథ ఎంత అవసరమో, పాటలు కూడా అంతే అవసరం. దీన్ని కొన్ని దశాబ్దాలుగా మన దర్శకనిర్మాతలు పాటిస్తూ వస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు పాటలు తీస్తూ ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనిపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ స్పందించింది. ఇటీవల వస్తున్న సినిమాల్లోని పాటల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది.  కొన్ని సినిమా పాటల్లోని డాన్స్‌ స్టెప్స్‌ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందడంతో కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం. ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. పాటల చిత్రీకరణ విషయంలో దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు బాధ్యతగా వ్యవహించాలని, మహిళలను తక్కువ చేసి చూపించే అసభ్యకరమైన స్టెప్స్‌ను వెంటనే నిలిపి వేయాలని హెచ్చరించింది. దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.  సినిమా అనేది సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని మహిళా కమిషన్‌ ఈ సందర్భంగా గుర్తు చేసింది. సమాజానికి సానుకూలమైన సందేశాలను అందించాలని, అదే సమయంలో మహిళల గౌరవాన్ని కాపాడే నైతిక బాధ్యతను దర్శకనిర్మాతలు, కొరియోగ్రాఫర్లు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయవచ్చునని ప్రకటించింది. దీనిపై నిశితంగా పరిశీలన చేసి అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇటీవల విడుదలై రాబిన్‌హుడ్‌లోని ఐటమ్‌ సాంగ్‌లో కేతిక శర్మ నటించింది. శేఖర్‌ మాస్టర్‌ నేతృత్వంలో ఆ పాటను చిత్రీకరించారు. అదిదా సర్‌ప్రైజ్‌.. అంటూ సాగే పాటలో కేతికతోపాటు మిగతా డాన్సర్లు వేసిన హుక్‌ స్టెప్పులు అందర్నీ కలవరపరిచాయి. దీంతో ఆ పాటపై ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మహిళా కమిషన్‌ కూడా పాటల తీరు తెన్నులపై స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాబిన్‌ హుడ్‌ మేకర్స్‌కి నోటీసులు కూడా అందినట్టు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు రిపీట్‌ అవుతున్న తరుణంలో దర్శకులు, కొరియోగ్రాఫర్లు తమ డాన్స్‌ మూమెంట్స్‌పై మరింత జాగ్రత్త వహించాలని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. గ్లామర్‌, మాస్‌ మూమెంట్స్‌ ఒక కొలమానానికి మించి విస్తరిస్తే, ప్రేక్షకుల్లో అసంతృప్తి పెరుగుతుందనే అంశాన్ని గుర్తించాలి.  నిర్మాతలు, దర్శకులు హుక్‌ స్టెప్పుల విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాలని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ఇదిలా ఉంటే.. అదిదా సర్‌ప్రైజ్‌ పాటలోని స్టెప్పులపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. కొందరు ఆ పాటను వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో అమ్మాయిలు, మహిళలు చేస్తున్న డాన్స్‌ గురించి ప్రస్తావిస్తున్నారు. సినిమాల్లోని ఐటమ్‌ సాంగ్స్‌ని మించి వాళ్లు స్టెప్పులేస్తున్నారని, అవి సమాజంపై, పిల్లలపై ప్రభావం చూపించవా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి సోషల్‌ మీడియాలో ఈ ధోరణి బాగా పెరిగిపోయింది. కేవలం సినిమాని మాత్రమే దృష్టిలో పెట్టుకొని హెచ్చరికలు జారీ చేయడం హాస్యాస్పదంగా ఉందని కొందరు వాదిస్తున్నారు. మరి మహిళా కమిషన్‌.. టాలీవుడ్‌కి ఇచ్చిన వార్నింగ్‌ను ఏ విధంగా తీసుకుంటుందో, ఎలా స్పందస్తుందో చూడాలి. 
తెలుగు సినిమా ఉన్నంత కాలం నటప్రపూర్ణ,కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు(MOhan Babu)నటప్రస్థానానికి ప్రత్యేక పేజీ ఉంటుంది.అంతలా తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతు వస్తున్న తన సినీ ప్రస్థానంలో ఆయన చూడని విజయం గాని,రికార్డు గాని లేదు.నిర్మాతగాను కొన్ని తరాల ప్రేక్షకులు మాట్లాడుకునే సినిమాలని నిర్మించాడు.ప్రస్తుతం తన కొడుకు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'కన్నప్ప' కి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఒక కీలక పాత్ర కూడా పోషించాడు.  నిన్న మార్చి 19 న మోహన్ బాబు పుట్టిన రోజు.ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలు తిరుపతి(tirupathi)లో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ప్రసంగించిన మోహన్ బాబు మాటల్లో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అసెంబ్లీ రౌడీ మూవీ గురించి ప్రస్తావనకి వచ్చింది.ఆ చిత్రాన్నిఉద్దేశించి మోహన్ బాబు మాట్లాడుతు అసెంబ్లీ రౌడీని ఆపేయాలని అసెంబ్లీ లో గొడవ చేసారు.ఆ సమయంలో గుంటూరులో ప్రదర్శితమవుతున్న ఒక థియేటర్ దగ్గర నాది 100 అడుగుల కట్ అవుట్ పెట్టారు. ఆ కట్ అవుట్ ని కాల్చింది అప్పట్లో యువజన కాంగ్రెస్ నాయకుడుగా ఉన్న వెంకట్రావు.కానీ ఇప్పుడు నేను,వెంకట్రావు కుటుంబసభ్యుల్లా కలిసి ఉంటున్నామని చెప్పుకొచ్చారు.స్టేజ్ పైకి వెంకట్రావుని పిలిచి అందరకి పరిచయం చేసి సన్మానించడం కూడా జరిగింది. సోషల్ మీడియాలో ఈ స్పీచ్ వైరల్ గా మారడంతో మోహన్ బాబు మంచి మనసుకి ఇదే నిదర్శనం అంటు ఆయన అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వేడుకలకి తమిళ హీరో శరత్ కుమార్(Sarathkumar)తో పాటు ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పిలవబడే ప్రభుదేవా(Prabhudeva)ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఆధ్యంతం ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుగగా ప్రభుదేవా,మోహన్ బాబు చేసిన డాన్స్ ఆ ఈవెంట్ కి హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు.     
  బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారంటూ విజయ్ దేవరకొండ సహా మొత్తం 25 మందిపై హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీని వల్ల విజయ్ చిక్కుల్లో పడతాడా? అని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారికి విజయ్ టీమ్ నుంచి ధైర్యాన్ని నింపే వార్త వచ్చింది. (Vijay Deverakonda)   బెట్టింగ్ యాప్స్ కు విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే వార్తల నేపథ్యంలో ఆయన టీమ్ స్పందించింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ ప్రచారం నిర్వహించాడని, అవి చట్టప్రకారమే నిర్వహిస్తున్నారని టీమ్ తెలియజేసింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ ప్రచారకర్తగా పరిమితమయ్యాడని పేర్కొంది.   ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకూ విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించలేదని టీమ్ తెలిపింది. అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశాడని, సుప్రీం కోర్టు సైతం రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు తెలియజేసిందని టీమ్ గుర్తు చేసింది. అలాగే ఏ 23 కంపెనీతో విజయ్ ఒప్పందం గతేడాది ముగిసిందని, ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. విజయ్ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది.  
A case has been filed in Miyapur PS against Vijay Deverakonda for promoting Betting Apps. While TV celebrities and social media influencers are being questioned regarding the case, Vijay team released a press note clarifying that Vijay never supported betting.  They stated that he just acted as a brand ambassador for online skill-based games that too for a limited period of contract. They argued as the skill-based games are legally permitted in certain territories, they should not be misunderstood with gambling.  They further revealed that as Apex Court of India permitted online rummy, taking legal opinion, then only, Vijay agreed to promote A23. They stated that as the company is recognised as legal, his endorsement was lawful and not illegal. Currently, the actor is busy completing his commitment for his upcoming film, Kingdom.  Here's the complete PR document released by Vijay's team This is to inform the public and all concerned parties that Mr. Vijay Deverakonda had officially entered into a contract with a company solely for the limited purpose of serving as a brand ambassador for skill-based games. His endorsement was strictly confined to regions and territories where online skill-based games are legally permitted. It is important to clarify that skill-based games, including online games such as rummy, have been repeatedly recognized by the Honourable Supreme Court of India as distinct from gambling or gaming. The court has upheld that such games involve skill rather than chance, making them legally permissible. Mr. Vijay Deverakonda’s legal team and agencies carefully review all associations before entering into any agreements. After a thorough legal review, he had agreed to endorse the skill-based gaming platform A23, ensuring that his association aligned with the law standards. However, his endorsement term ended in 2023, and he is no longer associated with the brand. This press release is being issued to eliminate any misconceptions / misinformation and to emphasize that Mr. Vijay Deverakonda’s past endorsement of a legally recognized skill-based gaming company was completely lawful.
సోషల్ మీడియాలో ప్రసారమయ్యే బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిందుకుగాను హైదరాబాద్ పోలీసులు పలు సినీ,టీవి,యూట్యూబర్ లపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.విజయ్ దేవరకొండ(Vijay devarakonda)రానా(Rana)నిధి అగర్వాల్,ప్రకాష్ రాజ్,మంచులక్ష్మి, ప్రణీత,శ్రీముఖి,రీతూ చౌదరి,యాంకర్ శ్యామల,నీతూ అగర్వాల్,వర్షిణి,అనన్య నాగళ్ళ,విష్ణుప్రియ,సిరి హనుమంతు,వంశీ సౌందర్య రాజన్,వసంత కృష్ణ,శోభాశెట్టి, అమృత చౌదరి,నాయిని పావని,నేహా పతాన్ ,పాండు,పద్మావతి ,ఇమ్రాన్ ఖాన్,సాయి,భయ్యాసన్నీ,టేస్టీ తేజ,బండారుశేషసుకృతి వంటి వారు కేసులు నమోదైన లిస్ట్ లో ఉన్నారు. రీసెంట్ గా పంజాగుట్ట పోలీసులు విష్ణుప్రియ(Vishnu Priya)ని విచారించగా ఆమె పోలీసులతో మొత్తం 15 బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసానని,ఒక్కో వీడియోకి 90 వేలు తీసుకున్నానని చెప్పడం జరిగింది.బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి పలు కీలక విషయాలని కూడా విష్ణు ప్రియ చెప్పడంతో స్టేట్‌మెంట్ ని పోలీసులు రికార్డు చేసారు.ఆమె ఫోన్ ని కూడా పోలీసులు సీజ్ చెయ్యడం జరిగింది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  వేసవి అంటే చాలా మంది ఎదురుచూసేది మామిడి పండ్ల కోసమే. పండ్లకు రారాజు అయిన మామిడి సువాసన నుండి రుచి వరకు మైమరచిపోయేలా చేస్తుంది. అయితే చాలామంది పచ్చి మామిడిని కూరలు, పచ్చళ్ల కోసం,  పండిన మామిడిని జ్యూసులు,   నేరుగా తినడం కోసం ఉపయోగిస్తారు. కానీ వేసవిలో పచ్చి మామిడిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పులుపును బాగా ఇష్టపడేవారు మామిడిని బాగా తింటుంటారు. కానీ పచ్చి మామిడిని అందరూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. పచ్చి మామిడి వల్ల కలిగే ప్రయోజనాలు.. వేసవికాలంలో చాలామంది భయపడేది వడదెబ్బకు.  అయితే ఈ వడదెబ్బకు చెక్ పెట్టేది పచ్చి మామిడి.  పచ్చి మామిడి పండును కాస్త ఉడికించి అందులో తగినంత నీరు పోసి మిరియాలు,  ఉప్పు లేదా పంచదార వంటివి కలిపి తాగితే వడదెబ్బ భయమే ఉండదు. వేసవిలో శరీరం డీహైడ్రేట్ కావడాన్ని ఇది చెక్ పెడుతుంది. పచ్చి మామిడిలో పొటాషియం,  ఇతర ఎలక్ట్రోలైట్లు ఉంటాయి.  ఇవి వేసవిలో చెమట పట్టడం వల్ల కలిగే ఎలక్ట్రోలైట్ల అసమతుల్యతను భర్తీ చేయడంలో సహాయపడుతుంది. సాధారణంగా కొబ్బరి బొండం వంటి పానీయాలలో ఉండే ఎలక్ట్రోలైట్లు పచ్చి మామిడిలో కూడా ఉంటాయి. కాబట్టి పచ్చి మామిడిని తప్పక తినాలి. పచ్చి మామిడిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.  ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  వేసవిలో జీర్ణసమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి జీర్ణసమస్యలకు చెక్ పెట్టాలంటే పచ్చి మామిడి కాయను ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. పుల్లగా ఉన్న పండ్లలో విటమిన్-సి సమృద్జిగా ఉంటుంది.  పచ్చి మామిడి కూడా అలాంటి వాటిలో ఒకటి. పచ్చి మామిడిని ఆహారంలో తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్-సి లభిస్తుంది.  శరీరంలో వేడి సంబంధిత వ్యాధులతో పోరాడటానికి ఇది సహాయపడుతుంది.  పైగా రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. పచ్చి మామిడి కాయలు ఆల్కలీన్ ల7ణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఆమ్ల స్థాయిలను సమతుల్యం చేస్తాయి.  శరీరంలో ఆమ్లత అంటే యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి.   పచ్చి మామిడి కాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.  ఇది శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుతుంది.  పచ్చి మామిడి కాయతో చారు లాగా చేసుకుని ఆహారంలో తీసుకుంటే  శరీరానికి చలువ చేస్తుంది. వేసవి వేడి తగ్గుతుంది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆధునిక జీవనశైలి,  ఫాస్ట్ ఫుడ్ తినడం మొదలైనవి   ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వీటి కారణంగా  మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్స్,  ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో  ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు,  ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి.  ఇవి శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం,  మూత్రపిండాల పనితీరు బలహీనపడటానికి దారితీస్తాయి. మూత్రపిండాల్లో లవణాలు,  ఖనిజాలు స్ఫటికీకరించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల  మూత్రపిండాల్లో రాళ్లు నివారించవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ఒక సాధారణ సమస్యగా మారుతున్నప్పటికీ, వాటిని నివారించడం సులభం. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం, సమతుల్య ఆహారం,  సహజ మూలికల వాడకంతో  రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడకూడదు అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి.. హైడ్రేషన్:  మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి  హైడ్రేటెడ్ గా ఉండటం. "రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగడం వల్ల రాళ్లు ఏర్పడటానికి దోహదపడే కాల్షియం, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్‌ల వంటి ఖనిజాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. సాధారణ నీటితో పాటు, కొబ్బరి నీరు, బార్లీ నీరు అద్భుతంగా సహాయపడతాయి.  శరీరం నుండి విషాన్ని తొలగించడాన్ని ప్రోత్సహిస్తాయి.  నిమ్మకాయలు,  నారింజ వంటి సిట్రస్ పండ్లు కూడా మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయపడతాయి. ఎందుకంటే వాటిలో ఉండే సిట్రేట్లు ఆక్సలేట్‌లు స్ఫటికాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. సరైన హైడ్రేషన్ మూత్రపిండాలలో ఖనిజాలు పేరుకుపోకుండా మూత్రపిండాల పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తాయి.   మూలికలు.. కొన్ని మూలికలు మూత్రపిండాల పనితీరుకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి.  రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తాయి. సహజ నివారణలు విషాన్ని బయటకు పంపడంలో, ఖనిజాలు పేరుకుపోకుండా నిరోధించడంలో,  మొత్తం మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అత్యంత ప్రభావవంతమైన మూలికలు.. పునర్నవ .. ఇది సహజ మూత్రవిసర్జనగా పనిచేస్తుంది, అదనపు ద్రవాలు, విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. గోక్షుర .. మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇస్తుంది,  ఖనిజ స్ఫటికీకరణను నిరోధించడంలో సహాయపడుతుంది. అరటి కాండం రసం.. మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేసి బయటకు పంపుతుంది. శతావరి.. మూత్రపిండాల వడపోతను పెంచుతుంది, ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. బూడిద గుమ్మడికాయ రసం.. 95 శాతం నీటి శాతం,  ఆల్కలీన్ లక్షణాలతో ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.  రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ల నివారణకు ఆహార విధానాలు.. కాల్షియం తీసుకోవడం పెంచాలి..  కాల్షియం గట్‌లోని ఆక్సలేట్‌లతో బంధిస్తుంది, మూత్రపిండాలలో వాటి స్ఫటికీకరణను నిరోధిస్తుంది. సోడియం వినియోగాన్ని పరిమితం చేయాలి.. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల కాల్షియం విసర్జన పెరుగుతుంది, రాళ్ళు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలను తగ్గించాలి.. పాలకూర, దుంపలు,  బెండకాయలు వంటి ఆహారాలను మితంగా తినాలి,  వాటి ప్రభావాలను సమతుల్యం చేయడానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో జత చేయాలి. ఆల్కలీన్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. దోసకాయలు, పుచ్చకాయ,  కొబ్బరి నీరు మూత్రంలో ఆరోగ్యకరమైన pH సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. జంతు ప్రోటీన్‌ను పరిమితం చేయాలి.. మాంసం, గుడ్లు,  చేపలను అధికంగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  మలబద్దకం.. మలవిసర్జన సరిగా జరగకపోతే ఏర్పడే సమస్య.  ప్రతి రోజూ సాఫీగా మలవిసర్జన జరగడం శరీరం ఆరోగ్యంగా ఉన్నది అనడానికి ఒక ముఖ్య సంకేతం.  అయితే వారానికి 2-3 సార్లు మాత్రమే మల విసర్జన జరుగుతూ ఉంటే.. దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారే సమస్యకు దారి తీస్తుంది.  ముఖ్యంగా  మలబద్ధకం వల్ల పైల్స్, రక్తంతో కూడిన పైల్స్, ఆపై పగుళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మలబద్దకం తగ్గిపోవాలన్నా,  మలబద్దకం ఫైల్స్ సమస్యకు దారి తీయకూడదన్నా.. 6 రకాల పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో  మంచిదని అంటున్నారు ఆహార నిపుణులు.  దీని గురించి తెలుసుకుంటే.. కెవి.. డెంగ్యూ చికిత్సలో కివి తినడం మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది,  ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఆకుపచ్చ పండులో ఆక్టినిడిన్ ఉందని, ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. పియర్.. పియర్  పండులో సార్బిటాల్ ఉంటుంది. ఇది చక్కెర ఆల్కహాల్, ఇది భేదిమందుగా పనిచేస్తుంది. కానీ దానిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సార్బిటాల్‌ను అధికంగా తీసుకోవడం వల్ల ఉబ్బరం,  విరేచనాలు వస్తాయి. ఇందులో అధిక FODMAP రసాయనం ఉంటుంది. అందువల్ల ఇలా జరుగుతుంది. ఆపిల్.. ఆపిల్ తినడం వల్ల మలబద్ధకంతో సహా అన్ని రకాల వ్యాధులను నయం చేయవచ్చు. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది . ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. ఆపిల్ తినడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. బొప్పాయి.. ఎన్నో ఏళ్ల  నుండి బొప్పాయి కడుపుకు మంచిదని చెబుతున్నారు . ఇది మలబద్ధకాన్ని తొలగించి కడుపుని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. వైద్యుల ప్రకారం ఇది జీర్ణ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది, ఇవి ఆహారం సరిగా జీర్ణం కావడానికి  బాధ్యత వహిస్తాయి. ప్రూనే, బెర్రీలు. ఈ రెండు పండ్లు  చాలా అద్బుతం చేస్తాయ్. ప్రూనేలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అవి ప్రేగు కదలికను సులభతరం చేయడానికి గొప్ప మార్గం. బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు,  ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.                                        *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...