మలబద్దకం పైల్స్ గా మారకూడదు అంటే.. ఈ 6 పండ్లు తినండి చాలు..!

 


మలబద్దకం.. మలవిసర్జన సరిగా జరగకపోతే ఏర్పడే సమస్య.  ప్రతి రోజూ సాఫీగా మలవిసర్జన జరగడం శరీరం ఆరోగ్యంగా ఉన్నది అనడానికి ఒక ముఖ్య సంకేతం.  అయితే వారానికి 2-3 సార్లు మాత్రమే మల విసర్జన జరుగుతూ ఉంటే.. దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారే సమస్యకు దారి తీస్తుంది.  ముఖ్యంగా  మలబద్ధకం వల్ల పైల్స్, రక్తంతో కూడిన పైల్స్, ఆపై పగుళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మలబద్దకం తగ్గిపోవాలన్నా,  మలబద్దకం ఫైల్స్ సమస్యకు దారి తీయకూడదన్నా.. 6 రకాల పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో  మంచిదని అంటున్నారు ఆహార నిపుణులు.  దీని గురించి తెలుసుకుంటే..

కెవి..

డెంగ్యూ చికిత్సలో కివి తినడం మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది,  ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఆకుపచ్చ పండులో ఆక్టినిడిన్ ఉందని, ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

పియర్..

పియర్  పండులో సార్బిటాల్ ఉంటుంది. ఇది చక్కెర ఆల్కహాల్, ఇది భేదిమందుగా పనిచేస్తుంది. కానీ దానిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సార్బిటాల్‌ను అధికంగా తీసుకోవడం వల్ల ఉబ్బరం,  విరేచనాలు వస్తాయి. ఇందులో అధిక FODMAP రసాయనం ఉంటుంది. అందువల్ల ఇలా జరుగుతుంది.

ఆపిల్..

ఆపిల్ తినడం వల్ల మలబద్ధకంతో సహా అన్ని రకాల వ్యాధులను నయం చేయవచ్చు. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది . ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. ఆపిల్ తినడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి.

బొప్పాయి..

ఎన్నో ఏళ్ల  నుండి బొప్పాయి కడుపుకు మంచిదని చెబుతున్నారు . ఇది మలబద్ధకాన్ని తొలగించి కడుపుని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. వైద్యుల ప్రకారం ఇది జీర్ణ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది, ఇవి ఆహారం సరిగా జీర్ణం కావడానికి  బాధ్యత వహిస్తాయి.

ప్రూనే, బెర్రీలు.

ఈ రెండు పండ్లు  చాలా అద్బుతం చేస్తాయ్. ప్రూనేలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అవి ప్రేగు కదలికను సులభతరం చేయడానికి గొప్ప మార్గం. బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు,  ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.


                                       *రూపశ్రీ.

 

గమనిక:


ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...