ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ చేరుకున్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక  ఆయన రెండోసారి ఎపిలో పర్యటిస్తున్నారు. ఆయన విశాఖకు చేరుకోవడం చర్చనీయాంశమైంది. కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. సిరిపురం చౌరస్తానుంచి ఏయు ఇంజినీరింగ్ కాలేజివరకు ర్యాలీ నిర్వహించారు. ఒకే వాహనంపై ప్రధాని మోడీ,  ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటిసిఎం పవన్ కళ్యాణ్ ర్యాలీగా వెళ్లడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.   
ఫార్ములా-ఈ కార్‌ కేసులో  ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ కు ఒకే సమయంలో మోదం; ఖేదం కలిగేలా కోర్టు తీర్పు వెలువరించింది.  కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు కొద్ది సేపటి కిందట తీర్పు వెలువరించింది.    ఏసీబీ విచారణకు తన వెంట లాయర్ ను తీసుకువెళ్లే వెసులుబాటు ఇచ్చిన న్యాయస్థానం అదే సమయంలో విచారణ గది బయటి వరకూ మాత్రమే న్యాయవాదికి అనుమతి ఇచ్చింది.   ఏసీబీ నోటీసుల నేపథ్యంలో కేటీఆర్ గురువారం ఏసీబీ ఎదుట విచారణకు హాజరు కానున్న సంగతి తెలిసిందే.  
ఇప్పటికే ఫార్ములా ఈ రేసు కేసులో చిక్కులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుపై మరో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు ఔటర్ రింగు రోడ్డు టెంటర్లలో అవినీతికి సంబంధించింది. ఈ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ బీసీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు రాచల యుగంధర్ గౌడ్ చేశారు. ఔటర్ రింగు రోడ్డు టెంటర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన రాచల యుగంధర్ గౌడ్ ఈ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందని పేర్కొన్నారు.ఈ విషయంలో ఈడీ,ఏసీబీ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నరు. ఓఆర్ఆర్ టెండర్లలోఐఆర్ బీ కంపెనీకి అనుచిత లబ్ధి చేకూరిందనీ, ఇందుకు కేటీఆర్, కేసీఆర్ కారకులని ఆరోపించారు.  ఐఆర్ బీ కంపెనీకి 2023 ఏప్రిల్ లో ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకు ఇచ్చేశారనీ, అందుకు ప్రతిగా ఆ కంపెనీ నుంచి పాతిక కోట్ల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ అందుకుందని ఆరోపించారు.  ఓఆర్ఆర్ ను కేవలం 7వేల కోట్ల రూపాయలకు 30 ఏళ్ల పాటు ఐఆర్బీకి ఎలా లీజుకు ఇస్తారని ఆయన ఆ ఫిర్యాదులో ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఈడీ, ఏసీబీలకు ఫిర్యాదు చేశారు.  
ALSO ON TELUGUONE N E W S
Pushpa 2 The Rule makers wanted to increase their revenues during Sankranti festival by adding additional footage and re-release it wide. They have locked 11th January release date but giving way to Game Changer and postponed to 17th January.  Many have started speculating about Allu Arjun's strategy in releasing the reloaded version on 11th Jan. Many started trolling him and also tried to state that he has some issue with Ram Charan in making such plans. But the makers have decided to change the date to 17th Jan.    Mythri Movie Makers might have decided to not give competition to Ram Charan who is doing his next two films in their production house. In any case, Game Changer has not issue with Pushpa 2 reloaded version for a week. 
Victory Venkatesh starrer Sankrantiki Vasthunnam has been able to create huge anticipation among Sankranti releases. Movie is releasing on 14th January and entire team has been busy with promotions. Aishwarya Rajesh has interacted with media promoting the movie.  She stated that her character Bhagyam will be loved by everyone. She stated that finding the character became very difficult for her at first but after 10 days, she was able to perform it better. She remarked that she never had such a chartbuster hit like Godari Gattu song, and thanked the team for it.  She stated that she is a fan of Venkatesh and loved working with him. She shared that she could not hold back her laughter while working in comic scenes. She stated that she loved how director Anil Ravipudi handled the film and the characters.  Sankrantiki Vasthunnam is releasing on 14th January and it is produced by Shirish with Dil Raju presenting it. Meenakshi Chaudhary is playing another leading lady role. Bheems Ceciroleo scored chartbuster songs for the film. 
Shraddha Srinath got a golden opportunity to act besides Nandamuri Balakrishna in his upcoming movie, Daaku Maharaaj. The movie is releasing on 12th January all over and the actress interacted with media about the film. She shared a lot of insights about the film and her character. Here are excerpts.  Q: You’ve been in the industry for over a decade, working with multiple stars across languages. What’s unique about Nandamuri Balakrishna? Shraddha Srinath: Despite being in the industry for decades, Balakrishna sir remains curious and innocent in his approach. He genuinely listens to what the director wants to convey without any starry inhibitions. He surrenders himself completely to the director’s vision, which is very rare for a star of his stature. Q: How did you feel when you were offered a role in Daaku Maharaaj? Shraddha Srinath: The films I’ve done so far are mostly subtle, serious, or thrillers. But Daaku Maharaaj is different. Being part of a Balakrishna film means the entire world will be watching me. For me, it’s an opportunity to showcase my talent to a wider audience. It’s a do-or-die opportunity, and I am determined to give my best. Q: Can you tell us about your character? Shraddha Srinath: I play Nandini, a composed and soft-spoken yet courageous character. She knows when to speak and what to say. My role has a lot of emotional depth. Commercial cinema is often about looking pretty with limited scope for performance, but in this film, I got to do both. It was a challenging role, and I thoroughly enjoyed it. Q: Did you have any reference points for your character? Shraddha Srinath: Bobby garu had a clear vision of how my character should look on screen. We did extensive research and put a lot of effort into the look and costumes, down to details like nail polish. Q: Do you believe Daaku Maharaaj will have an impact on your career? Shraddha Srinath: I am super confident about this film. I truly believe it will have a very positive impact on my career. Q: Did you dub for your role? Shraddha Srinath: Yes, I dubbed for myself. Q: How was your working experience with Balakrishna? Shraddha Srinath: His energy surpasses all of ours combined. He’s so cool and asked me to call him “Bala” instead of “sir,” though I didn’t have the courage to do so. He jokes around on set, but when the camera rolls, he transforms into his character effortlessly. Q: How does it feel to work with Sithara Entertainments again after Jersey? Shraddha Srinath: I feel they have a lot of trust in me. They gave me one memorable film with Jersey, and I’m thrilled to be working with them again for Daaku Maharaaj. I look forward to being associated with them for more films. Their lineup is always exciting, with the perfect mix of content and entertainment. Q: Tell us about your experience working with Bobby Kolli. Shraddha Srinath: Bobby Kolli is extremely passionate and has an incredible understanding of acting. I often joke that I want to learn acting from him. Initially, I wasn’t sure if I could pull off this character, but I followed his instructions and trusted his vision. I’ll always be grateful to him for believing in me.
Fans of Ram Charan — Aravapalli Manikanta (23) and Thokada Charan (22) — lost their lives in a tragic road accident at Gaigolupadu area of Kakinada while returning from the pre-release event of Game Changer in Rajamahendravaram on Saturday.   Heartbroken by the unfortunate incident Ram Charan expressed his deep condolences. Charan shared that he was saddened by the incident and that he was experiencing the same pain as the bereaved. Following the incident, he announced Rs. 5 lakhs relief for both the families. Soon, the actor sent his team to the grieving families to show solidarity with them during this hour After the aid was transferred to the parents of Manikanta and Charan on Tuesday, fans of Ram Charan met the families on Wednesday. They met Manikanta's mother, Aravapalli Bhavani, and Charan's father, Thokada Apparao and offered their condolences. They assured to extend all possible assistance and help them navigate through this challenging time.
తెలుగు ప్రజలు అభిమానించే కథానాయకుల్లో మంచు మోహన్ బాబు(MOhanbabu)కూడా ఒకడు.1975 లో దాసరి నారాయణరావు(Dasari narayanarao)దర్శకత్వంలో వచ్చిన 'స్వర్గంనరకం'అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన మోహన్ బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించాడు.ప్రస్తుతం తన తనయుడు విష్ణు(Vishnu) హీరోగా చేస్తున్న 'కన్నప్ప'(Kannappa)అనే చారిత్రాత్మక మూవీలో ఒక కీలకమైన క్యారెక్టర్ లో చేస్తుండటమే కాకుండా వన్ అఫ్ ది ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక మోహన్ బాబు ప్రతి సంవత్సరం తిరుపతి రంగం పేట లోని తన మోహన్ బాబు యూనివర్సిటీ లో సంక్రాంతి వేడుకల్నినిర్వహిస్తుంటాడు.ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే యూనివర్సిటీ లో సంక్రాంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నాడు.స్వయంగా ఆ వేడుకల్లో తను కూడా విద్యార్థులతో పాల్గొని ఇప్పటి తరం మర్చిపోయిన సంక్రాంతి సందర్భంగా ఆడే పాత తరం ఆటలన్నీ విద్యార్థుల చేత అడిస్తున్నాడు.ఈ సందర్భంగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతు ఆగామి కర్మ,సంచిత కర్మ,ప్రారబ్ధ కర్మ అని మూడు కర్మలు ఉంటాయి.జరగనున్నది జరగకుండా మానదు.  కానున్నది కాక మానదు.పోనున్నది పోక మానదు.భగవంతుడ్ని దర్శనం చేసుకొని సాష్టంగ నమస్కారం చేసినా కూడా మనం ఎన్ని జన్మల్లో పాపాలు చేసినా,మన తల్లి తండ్రులు చేసినా పాపాల వలన,మనం కర్మలని అనుభవించక తప్పదని చెప్పుకొచ్చాడు. ఇటీవల తన చిన్న కొడుకు మనోజ్(manoj)కి,మోహన్ బాబు కి మధ్య జరిగిన గొడవ దృష్త్త్యా ఇప్పుడు ఆయన  మాట్లాడిన మాటలు చర్చినీయాంశమయ్యాయి.
ప్రముఖ మలయాళ హీరోయిన్ హనీ రోజ్(honey rose)కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు ఒక వ్యాపార వేత్త నన్ను  లైంగికంగా వేధిస్తున్నాడు.నన్ను కావాలని అవమానించడానికి ప్రయత్నిస్తున్నాడు.నేను సైలెంట్ గా ఉంటె అతని వ్యాఖ్యలని నువ్వు సమర్దిస్తున్నావా అని అడుగుతున్నారు.ఆ వ్యక్తి గతంలో కొన్ని కార్యక్రమాలకి నన్ను ఆహ్వానించాడు.కానీ నేను వెళ్లకపోయే సరికి నన్ను టార్గెట్ చేసి లైంగికంగా వేధిస్తున్నాడని  చెప్పిన విషయం తెలిసిందే. పోలీసులని కూడా ఆశ్రయించడంతో  కేసు కూడా నమోదయ్యింది. హానీ  ఫిర్యాదుతో దాదాపు 27 మంది పై పోలీసులు కేసు నమోదు చేసారు.ఇందులో కీలక పాత్రధారి,హనీ రోజ్ ని వేధిస్తున్న బాబీ చెమ్మనూరు అనే వ్యాపారవేత్త ని వాయనాడ్ లో అరెస్ట్ చేసి అతనిపై నాన్ బెయిల్ సెక్షన్ కింద కేసులు కూడా నమోదు చెయ్యడం జరిగింది.అరెస్ట్ విషయంపై హాని రోజ్ మాట్లాడుతు ఇప్పుడు నాకెంతో ప్రశాంతంగా ఉంది.ఈ కేసు గురించి ఇప్పటికే ముఖ్యమంత్రి పినరయి విజయ్  దృష్టికి తీసుకెళ్ళాను నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్టుగా కూడా చెప్పుకొచ్చింది  2005 లో బాయ్ ఫ్రెండ్ అనే చిత్రం ద్వారా మలయాళ సినీ రంగ ప్రవేశం చేసిన హానీ రోజ్ తమిళ,కన్నడ, తెలుగు భాషలతో కలిపి మొత్తం సుమారు ముప్పై ఐదు చిత్రాల దాకా చేసింది.బాలకృష్ణ(Balakrishna)తో చేసిన వీరసింహారెడ్డి హానీ రోజ్ కి తెలుగులో మంచి గుర్తింపుని ఇచ్చింది.   
Indians are deeply connected with Lord Shri Ram and it is hurtful to even speak against him to many. Anchor Sreemukhi in her over enthusiasm to praise producers Shirish and Dil Raju, she equated them with Shri Ram and Lakshman. While doing so, she called Lord Ram and Lakshman fictional.  She made these comments at Sankrantiki Vasthunnam trailer release event at Nizamabad. It is normal to hype up heroes, producers and talk about them in high esteem but when comparing them with Ram and Lakshman, stating that they are fictional is highly irresponsible.  Now, deep rooted Hindu religion based cultural clubs or Sanghas have started objecting to her comments asking her to take those comments back. Sage Valmiki wrote Ramayana as Ithihasam - which means History and he did not mention them as fictional characters.    Even if someone believes so, when dealing with religious comparisons and drawing parallels to mythological characters that are highly connected to every Indian, any person should maintain a decorum, say Hindu culture leaders. They are asking for an apology from her with immediate effect for her hurting comments.  These comments made by anchor Sreemukhi have hurt many religious sentiments of Hindus and it has become a trending issue on social media. Sankrantiki Vasthunnam starring Victory Venkatesh, Aishwarya Rajesh, Meenakshi Chaudhary is releasing on 14th January.
గత కొంత కాలంగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)వరుస పరాజయాలని చవి చూస్తున్నాడు.ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే పట్టుదలతో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtham thinnanuri)దర్శకత్వంలో తన కొత్త మూవీ చేస్తున్నాడు.వీడీ 12(Vd12)గా తెరకెక్కుతున్న ఈ మూవీని సితార ఎంటర్ టైనర్ పతాకంపై నాగవంశీ(Naga vamsi)భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.మార్చి 28 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.ఈ మేరకు మేకర్స్ నుంచి అధికార ప్రకటన కూడా వచ్చింది. ఇక విజయ్ దేవర కొండ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటాడనే విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రీసెంట్ గా ఇనిస్టాగ్రమ్ వేదికగా  ఒక వీడియో రిలీజ్ చేసాడు.అందులో విజయ్ మాట్లాడుతు కొంత మంది మనకి ఫోన్ చేసి మీ పాత ఫ్రెండ్ ని అని,లేదా మీ నాన్న స్నేహితుడిని అని మీ దగ్గర డబ్బులు కాజేయాలని చూస్తారు.ఫేక్ మెసేజ్ లతో ఎక్కువ డబ్బులు మన అకౌంట్ లో పడినట్టుగా చెప్పి మన డబ్బులని దోచుకుంటారు.ఉదాహరణకి 5000 అకౌంట్ లో పడాల్సింది 50000 పడినట్టుగా ఫేక్ మెసేజ్ ని సృష్టిస్తారు.నా  స్నేహితుడి విషయంలో ఒక సారి ఇలాగే జరిగింది.అందుకే యుపిఐ పేమెంట్ సురక్షితం. మీ శ్రేయోభిలాషిని, మీ స్నేహితుడ్ని అంటూ మభ్య పెట్టి డబ్బులు దోచేసే వారి విషయంలో జాగ్రతగా ఉండండి.ఎవరైనా మిమ్మల్ని మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తే నేను మూర్ఖుడు ని కాదని చెప్పండి అని పేర్కొన్నాడు.  
  యాంకరింగ్ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఎంతో విషయ పరిజ్ఞానం ఉండాలి. అదే సమయంలో ఎవరినీ నొప్పించకుండా, సందర్భానికి తగ్గట్టుగా మాటలను అల్లుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ మధ్య అలాంటి యాంకర్లు అత్యంత అరుదైపోయారు. విషయ పరిజ్ఞానం ఉండట్లేదు. కొందరు ఏకంగా ముఖ్యమంత్రుల పేర్లు మర్చిపోతున్నారు. ఇంకా కొందరైతే, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వివాదమవుతుందనే కనీస అవగాహన లేకుండా.. నోటికొచ్చింది మాట్లాడేసి విమర్శల పాలవుతున్నారు. తాజాగా యాంకర్ శ్రీముఖి కూడా ఆ లిస్టులో చేరింది.  (Sreemukhi)   ఇటీవల 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించింది. ఈ సందర్భంగా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లను పొగడ్తలతో ముంచెత్తడానికి ప్రయత్నించి.. పురాణ పురుషులైన రామలక్ష్మణులను కల్పిత పాత్రలు అంటూ హిందువులకు ఆగ్రహం తెప్పించింది. "రామ్ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్. కానీ సాక్షాత్తూ నా కళ్ళ ముందు కూర్చున్నారు.. ఒకరు దిల్ రాజు అయితే, ఇంకొకరు శిరీష్ గారు" అంటూ శ్రీముఖి కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలపై హిందూ సమాజం భగ్గుమంటోంది. శ్రీముఖి వెంటనే తన కామెంట్స్ ని వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి.   శ్రీముఖి కొత్త యాంకరేమీ కాదు. యాంకరింగ్ ఫీల్డ్ లో ఎప్పటి నుంచో ఉంది. అలాంటి శ్రీముఖి.. కనీస ఆలోచన లేకుండా ఇలా హిందు దేవుళ్ళ గురించి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈమధ్య యాంకర్ల తీరే ఇలా ఉంటుంది. ఒక్కో ఈవెంట్ కి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయినా వాళ్ళు.. కాస్ట్యూమ్స్, మేకప్ మీద పెడుతున్న శ్రద్ధ కంటెంట్ మీద పెట్టడం లేదు. సరైన ప్రిపరేషన్ లేకుండానే స్టేజ్ ఎక్కేస్తున్నారు. ఆ టైంకి నోటికి వచ్చిందేదో మాట్లాడి ఇలా వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. కొందరైతే మరక మంచిదే అన్నట్టుగా.. ఈ వివాదాలు వల్ల కూడా బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని సంబరపడుతున్నారు. మరి శ్రీముఖి కూడా అలాగే సంబరపడి ఈ వివాదాన్ని ముదిరేలా చేస్తుందో? లేక ముందే క్షమాపణలు చెప్పి తన తప్పుని సరి చేసుకుంటుందో? చూడాలి.    
  గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన మూవీ 'డాకు మహారాజ్' (Daaku Maharaaj). బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ కోసం బాలకృష్ణ అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) రంగంలోకి దిగుతుండటం విశేషం.   'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం(జనవరి 9) సాయంత్రం అనంతపురంలో ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాయలసీమలో బాలకృష్ణకు ఏ స్థాయి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది అక్కడ 'డాకు మహారాజ్' ఈవెంట్ జరగనుండటం, ఆ వేదికపై మామ అల్లుళ్ళు బాలయ్య-లోకేష్ కనిపించడనుండటంతో.. అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు అనడంలో సందేహం లేదు.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  వైకల్యం.. మనిషి కొనితెచ్చుకునే సమస్య కాదు. కొందరు పుట్టుకతో వైకల్యంతో పుడతారు.  మరికొందరు ప్రమాదవశాత్తు వైకల్యానికి లోనవుతారు.  అయితే వైకల్యం ఉంది కదా మన వల్ల ఏం అవుతుందిలే అని కొందరు జీవితంలో ముందుకు వెళ్ళలేక ఆగిపోతారు.  ఏదో ఒక విధంగా జీవితాన్ని అలా కానిచ్చేస్తూ ఉంటారు. కానీ మరికొందరు మాత్రం తమ వైకల్యం తమ లక్ష్యాలకు అడ్డు కాదని భావిస్తారు.  జీవితంలో నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ఫలితంగా ప్రతిభతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.  అలాంటి వారిలో స్టీఫెన్ హాకింగ్ ఒకరు.  కేవలం ఒకే ఒక కదలికతో ఏకంగా విశ్వాన్ని శోధించిన ఘనుడు ఆయన.  జనవరి 8వ తేదీ స్టీఫెన్ హాకింగ్ జననం.  ఈ సందర్భంగా ఆయన కృషిని గుర్తు చేసుకుంటే జీవితానికి కావలసినంత చైతన్యం లభిస్తుంది. స్టీఫన్ విలియం హాకింగ్..  1942, జనవరి 8వ తేదీన జన్మించారు.  ఈయన ప్రసిద్ధ బ్రిటీష్ సైద్దాంతిక శాస్త్రవేత్త. ముఖ్యంగా విశ్వనిర్మాణ శాస్త్రవేత్త.  ఈయన మరణించే సమయానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ థియరిటికల్ కాస్మాలజీ రీసెర్చ్ సంస్థకు డైరెక్టర్ గా ఉన్నాడు. వైకల్యం.. విధి మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది.  ఆడుతూ పాడుతూ సాగుతున్న సాఫీ జీవితంలో పెద్ద సునామీలా సమస్యలు విరుచుకుపడేలా చేస్తుంది.  స్టీఫెన్ హాకింగ్ జీవితంలో కూడా అంతే.. ఆయనకు 21ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు వచ్చింది.  ఇది కాలంతో పాటు పెరుగుతూ పోయింది. క్రమంగా స్టీఫెన్ హాకింగ్ శరీరంలో ప్రతి అవయవాన్ని కబళించింది.  ఆయన శరీరం చచ్చుబడిపోయేలా చేసింది. స్టీఫెన్ హాకింగ్ తన 20 ఏళ్ల వయసులో కాస్మాలజీ, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కు వెళ్ళాడు. అక్కడి వెళ్ళిన తరువాతే ఆయన జీవితం మలుపు  తిరిగింది.  భోజనం చెయ్యాలన్నా, బూట్లు లేసులు వేసుకోవాలన్నా, ఇతర పనులు చెయ్యాలన్నా కూడా శరీరం సహకరించేది కాదు. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు ఆయన పరిస్థితి ఆయన కుటుంబం ఆందోళన చెందింది.  వైద్య పరీక్షలు నిర్వహించగా మోటార్ న్యూరాన్ వ్యాధి అనే భయంకరమైన జబ్బు ఉన్నట్టు తేలింది. నరాలు, వెన్నుపూసపై ఇది ప్రభావం చూపుతుంది. దీని కారణంగానే తొందరలోనే ఆయన శరీరం చచ్చుబడిపోయింది. అయితే ఆయన మెదడు మాత్రం అద్భుతంగా పనిచేసేది. అంతేకాదు ఆయన ముఖంలో ఒక దవడ ఎముక మాత్రం కదిలేది. ఆ ఒక్క దవడ ఎముక కదలికలే.. స్టీఫెన్ హాకింగ్ ప్రయోగానికి  మూలాధారం.  ఆ దవడ ఎముకకు ఒక పరికరాన్ని అమర్చారు. స్టీఫెన్ హాకింగ్  ఆలోచనలు అన్నింటిని ఆ పరికరం సంభాషణ రూపంలో వ్యక్తం చేసేది.  ఇలా ఆయన శరీరం కదలని స్థితిలో కూడా విశ్వాన్నిశోధిస్తూ తన పరిశోధనలు సాగించాడు. అలాంటి స్థితిలోనే కృష్ణబిలాలకు సంబంధించిన అనేక విషయాలు కనుగొన్నాడు.  1985లో ఆయనకు నిమోనియా వచ్చింది.అప్పటి నుంచీ ఒక చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు.  తన చేతి చిటికెన వేలి కదలికల సాయంతో  ‘వాయిస్‌ సింథసైజర్‌’తో తన ఆలోచనలను శాస్త్ర లోకానికి అందించేవాడు. చిటికెన వేలు కదలికల్ని ఒక హ్యాండ్‌ కంట్రోలర్‌ యంత్రానికి అమర్చిన తెరపై అక్షరాలను స్కాన్‌ చేసే కర్సర్‌ నియంత్రిస్తుంది. ఆయన ఎంచుకున్న అక్షరాల్ని, యంత్రంలోని వ్యవస్థ తనంతట తానే పని చేసే ‘అల్గారిదమ్‌’ సాయంతో మాటలు వాక్యాల రూపంలో తెరపై ప్రదర్శిస్తుంది. ఆయన కృషికి కొందరు మిత్రుల సహకారం కూడా తోడైంది.  కంప్యూటర్‌ ఇంజనీర్‌ డేవిడ్‌ ఒక చిన్న కంప్యూటర్‌ని స్టీఫెన్‌ హాకింగ్‌ వీల్‌ఛైర్‌కు అమర్చాడు. అందులోని సింథసైజర్‌ ఆయన ఆలోచనను మాటగా మార్చి ఎదుటి వారికి వినిపిస్తుంది.  స్టీఫెన్ హకింగ్ ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన గొంతునే  సింథసైజర్ కు అమర్చారు. దాని వల్ల స్టీఫెన్‌ హాకింగ్‌ నేరుగా మాట్లాడినట్టే ఉండేది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా.. కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది.                                           *రూపశ్రీ. 
  వివాహం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా కీలకమైన దశ.  ఈ దశలో చాలామంది జీవితాలు మారిపోతుంటాయి. ఈ కాలంలో వివాహం తర్వాత జీవితం ప్రశాంతంగా లేదని చెప్పేవారే ఎక్కువ.  కొందరైతే ఏకంగా విడాకుల వరకు గొడవలను తీసుకువెళుతుంటారు.  మరికొందరు కేసులు, కోర్టులు అంటూ సమస్యలు పెద్దవి చేసుకుంటారు. ఇలాంటి వాటికి ఆచార్య చాణక్యుడు సరైన సలహాలు, సూచనలు ఇచ్చారు. చాణక్యుడు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని వాటిని పాటిస్తుంటే వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుందట. ఇంతకీ ఇందుకోసం ఏం చేయాలంటే.. ప్రేమ, నిజాయితీ.. ఒక బంధం విజయవంతంగా ఉండాలన్నా,  ఆ బంధం బలంగా మారాలన్నా ఆ బంధంలో ఉన్న వ్యక్తుల మధ్య ప్రేమ, నిజాయితీ ఉండాలి. నిజమైన ప్రేమ, నిజాయితీతో కూడిన ప్రవర్తన బంధాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి.  వివాహ బంధంలో ఉన్ వ్యక్తి తన జీవిత భాగస్వామితో ప్రేమగా, నిజాయితీగా ఉంటూ.. జరిగే తప్పొప్పులు,  వచ్చే సమస్యలను అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇలా ఉంటే జీవితంలో ఒకరిమీద ఒకరికి నమ్మకం బలపడుతుంది.   అహం.. మనిషి జీవితంలో ఏ బంధంలో అయినా అహం అనేది పెద్ద శత్రువుగా మారుతుంది.  ఇది భార్యాభర్తల మధ్య సంబంధం అయితే ఈ అహం అనేది చాలా పెద్ద సమస్యకు దారితీస్తుంది.  బంధంలో చీలికలు సృష్టించడానికి కారణం అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ, గౌరవం అనేవి లేకుండా చేయడంలో అహం ప్రధాన శత్రువు అవుతుంది. వైవాహిక బంధంలో అహంను పక్కన పెట్టి ఒకరి పట్ల మరొకరు ప్రేమతో, గౌరవంతో ఉండాలి.  ఇలా ఉంటే ఇద్దరు దూరమయ్యే పరిస్థితులే రావు. నిజం.. వైవాహిక బంధంలో నిజం మాట్లాడటం, నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. భార్యాభర్తలు నిజంగా, నిజాయితీగా మాట్లాడితే వారిద్దరూ ఒకరి మీద మరొకరు  గౌరవం కలిగి ఉంటారు. వారి అపార్థాలు కూడా తలెత్తవు. ఎప్పుడూ నిజం మాట్లాడే వ్యక్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు.  ఎలాంటి పరిస్థితిని అయినా ధైర్యంగా ఎదుర్కుంటారు. గౌరవం.. నేటి కాలంలో భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు పెత్తనం చేసుకోవడం, పురుషహంకారం చూపించడం వంటివి చేయడం వల్ల బంధం చెడిపోతుంది.  భార్యాభర్తలు ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకోవాలి.  భర్త భార్యను బానిసలాను, పని మనిషిలాను ట్రీట్ చేయడం,  తన అధికారాన్ని భార్య మీద చూపడం వంటివి చేయకూడదు. భర్త భార్యను కానీ, భార్య భర్తను కానీ పదిమంది ముందు దోషిగా నిలబెట్టి అవమానించడం మానుకోవాలి.  ఇలా అవమానిస్తే అది సంబంధంలో చీలిక ఏర్పడటానికి దారితీస్తుంది. కమ్యూనికేషన్.. భార్యాభర్తలు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఇద్దరూ ఎదురుగా  ఉన్నప్పుడు కూర్చుని సామరస్యంగా మాట్లాడుకోవాలి.  భార్యాభర్తలు ఇద్దరూ తమ  సమస్యలను,  తమ ఆలోచనలను, భావాలను, తాము చేయాలనుకున్న పనులను  స్నేహపూరితంగా వివరించి చెప్పాలి.  మాటల్లో ఎలాంటి అపార్థాలు లేకుండా వివరించాలి.  అదే విధంగా భాగస్వామి ప్రతిస్పందనను కూడా అంతే స్నేహపూరితంగా తీసుకోవాలి.  ఇలా ఉంటే భార్యాభర్తలు మాట్లాడుకునే సందర్భాలలో ఎప్పుడూ గొడవలు రావు.                                             *రూపశ్రీ.
  ఈ ప్రపంచం ఇప్పటివరకూ రెండు ప్రపంచ యుద్ధాలని చూసింది. అధికారం కోసమో, అస్థిత్వం కోసమో లేక నాయకుల అహంకారపు విధానాల వల్లనో రోజూ ఏదో మూలన చిన్నదో, పెద్దదో యుద్ధం జరుగుతూనే ఉంటుంది.. మనం వింటూనే ఉంటాము. కానీ  మనలో చాలామంది ఆలోచనలు యుద్ధంలో  ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఏ సైనికులు, ప్రజలు ఎంతెంతమంది  చనిపోయారు? అనే ప్రశ్నల దగ్గరే ఆగిపోతాయి.. కానీ, ఆ యుద్ధాలవల్ల కొందరి బ్రతుకులు ఒక్క రోజులోనే చీకట్లోకి నెట్టివేయబడుతున్నాయన్న విషయం  మనమంతా మర్చిపోతుంటాము. ఎవరివి ఆ జీవితాలు అనుకుంటున్నారా... ఇంకెవరివి!! దేశ రక్షణ కోసం ప్రాణాలు ధారబోయటంతో  అనాథలైన   సైనికుల పిల్లలవి..  అలాగే జీవితం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ బాంబో వచ్చిపడి అందరూ చనిపోయి అనాథలుగా మిగిలిపోయిన సామాన్య ప్రజల పిల్లలవి.... ఇటువంటి వారి పరిస్థితి ఏమిటా అని ఎప్పుడైనా ఆలోచించారా?.. ఆలోచిస్తేనే భయంగా ఉంది కదా..!  మరి వారి భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారు?. ఇలా ప్రపంచ యుద్దం కారణంగా అనాథలైన పిల్లల గురించి అనాథల గురించి ఆలోచించే దిశగా ప్రజలను చైతన్యం చేసేదే ప్రపంచ యుద్ద అనాథల దినోత్సవం.  దీని గురించి తెలుసుకుంటే.. ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం ఎప్పుడు మొదలైంది.... యుద్ధం వల్ల అనాథలైన  సైనికుల పిల్లల గురించి ఆలోచించి వారి కోసం మొదటగా అనాథాశ్రమాలు ఏర్పాటు చేసిన  ఘనత రోమన్లకి దక్కుతుందని చరిత్ర చెబుతుంది. అయితే   ఆధునిక ప్రపంచంలో  ప్రస్తుత   యుద్ధాల కారణంగా అనాథలుగా మారిన పిల్లల గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం,  అనాథలైన  పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఎదుర్కొనే మానసిక, సామాజిక,  శారీరక ఆటంకాలను గుర్తు చేయడం కోసం   ‘ఎస్ఓఎస్ ఎన్ఫాంట్స్ ఎన్ డిట్రెసెస్’ అనే ఫ్రెంచ్ సంస్థ ఈ ప్రపంచ యుద్ధ అనాథల  దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి6 న జరపడం మొదలుపెట్టింది.  ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు వేదికను అందించడం, వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థ, ప్రభుత్వాల దాకా అందరినీ  ఇందులో భాగం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనాథల హక్కులు, సమస్యలు గురించి పోరాడేలా చేయటం, వారి భవిష్యత్తుకి మంచి పునాది వేయటమే దీని ఉద్దేశ్యం.    ఎందుకు జరుపుకోవాలి.... యూనిసెఫ్ ప్రకారం, 1990 నుంచి 2001సంవత్సరాల మధ్య జరిగిన యుద్ధాల కారణంగా  అనాథల సంఖ్య విపరీతంగా పెరిగింది.  ప్రపంచవ్యాప్తంగా 140 మిలియన్లకుపైగా అనాథలు ఉన్నారు.  2001 నుంచి ప్రతి సంవత్సరం 0.7 శాతం అనాథల సంఖ్య తగ్గుతున్నప్పటికీ అది చెప్పుకోతగ్గ  మార్పెమీ  కాదు. పైగా  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం,  ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం,  కొత్తగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రగులుతున్న చిచ్చు వంటి   ప్రస్తుత ప్రపంచ రాజకీయాలు చూస్తే  అనేక మంది పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం పడుతుందని అనిపిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంత మంది అనాథ పిల్లలు  నిర్లక్ష్యం చేయబడకుండా ఉండటం కోసం ప్రతి సంవత్సరం ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం జరుపుకోవాలి. అటువంటి అనాథ  పిల్లలు జీవితంలో ఎదుర్కునే అన్ని సమస్యలను  గుర్తు చేసుకోవడం కోసం, అలాగే ఈ ప్రపంచంలో ఎవరూ ఇలా అనాథలుగా మిగలకుండా, యుద్ధం లేని ప్రపంచ స్థాపన కోసం కృషి చేయటంలో అందరి బాధ్యతని  గుర్తు చేయటం కోసం  ఈ దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యుద్ధాలవల్ల పిల్లలకి జరుగుతున్న అన్యాయం.. యుద్ధ కాలంలో పిల్లలపై జరుగుతున్న అన్యాయాలని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గుర్తించి, వాటిని నివారించాలని ప్రపంచ దేశాలకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. పిల్లలకు మానవతా సహాయం అందకుండా చేయటం  పిల్లలను కిడ్నాప్ చేయటం,  చంపేయడం,  బలాత్కారం లేదా ఇతర తీవ్రమైన లైంగిక హింసకి పాల్పడటం.  స్కూల్ల్స్, హాస్పిటల్ల మీద దాడులు చేయడం వంటి ఎన్నో  అన్యాయాలు జరుగుతున్నాయి. ఇంకా దారుణంగా పిల్లలని సాయుధ దళాల్లో  లేదా రెబల్ గ్యాంగుల్లో చేర్పించి వాళ్ళని  అక్రమ కార్యాలకి ఉపయోగించుకోవటం కూడా చేస్తున్నారు.  ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే  ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవ వేదికగా ప్రజలందరూ ప్రశ్నించి, నిలదీయాలి. ఒకవేళ వ్యవస్థలు, ప్రభుత్వాలు ఇటువంటి వారిని నిర్లక్ష్యం చేస్తే, వారు మన సమాజంలో ఉన్న అసాంఘిక, ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి చిక్కి, తప్పుడు దారిలో నడుస్తారు. అది మన సమాజానికి, ప్రపంచానికి మంచిది కాదు. మన సమాజంలో ఏ ఒక్క వ్యక్తీ నిర్లక్ష్యం చేయబడకూడదు, పైగా సర్వస్వం కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలు అస్సలు నిర్లక్ష్యం చేయబడకూడదు.                                             *రూపశ్రీ.
  నిద్ర మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం. నిద్రను గొప్ప ఔషదంగా పరిగణిస్తారు.  మంచి నిద్ర ఉంటే  శరీర ఆరోగ్యం చాలా వరకు సాఫీగా ఉంటుంది. కానీ నేటి కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రవ్వగానే హాయిగా నిద్రపోవాలని అనుకుని, పడుకుని నిద్ర పట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతూ కాలయాపన చేసేవారు.. నిద్రరాక గంటలు గంటలు శూన్యంలోకి చూస్తూ ఆలోచనలలో గడిపేవారు చాలా మంది ఉంటున్నారు. కొందరైతే నిద్ర  బాగా రావాలని పడుకునే ముందు కొన్ని రకాల పానీయాలు కూడా తాగుతుంటారు. అయితే ఇలా నిద్ర రాకపోవడం అనేది సాధారణంగా కొట్టే పడేయాల్సిన విషయం కాదట. ఇలా నిద్ర రాకపోవడం అనేది కొన్ని అనారోగ్య సమస్యలను సూచిస్తుందని అంటున్నారు.   నిద్రలేమి వివిధ కారణాల వల్ల సంభవించినా.. దీర్ఘకాలం ఈ సమస్య ఎదుర్కొంటూ ఉంటే మాత్రం అది కొన్ని తీవ్రమైన వ్యాధుల వల్ల జరుగుతుంది. నిద్ర లేమి అనేది చాలా వరకు డిప్రెషన్ తో బాధపడేవారికి ఎదురయ్యే సమస్య.  డిప్రెషన్ కారణంగా నిద్ర పట్టడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. చాలామంది ఈ కాలంలో అతి ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు, మానసిక ఒత్తిడి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యలు కూడా నిద్రను ప్రభావితం చేస్తాయి.   కొందరిలో స్లీప్ అప్నియా అనే సమస్య ఉంటుంది.  ఇది నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో అంతరాయం కలిగించే వ్యాధి.  దీని వల్ల శ్వాస సరిగా ఆడక మళ్లీ మళ్లీ నిద్ర మధ్యలో మేల్కొంటు ఉంటారు. హైపర్ థైరాయిడిజం సమస్య ఉంటే అది జీవక్రియను ప్రభావితం చేస్తుంది.  జీవక్రియ సరిగా లేకపోవడం వల్ల శరీర వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది. ఇది రాత్రి సమయంలో నిద్రలేమి సమస్య కలుగజేస్తుంది. ఆర్థరైటిస్,  మైగ్రేన్ లేదా ఇతర వ్యాధులు ఉన్న వారు కూడా సరిగా నిద్ర పోలేరు. ఈ వ్యాధుల కారణంగా  నిద్రలో పదే పదే మెలకువ వస్తుంది.  ఈ సమస్యలు ఉన్నవారిలో నిద్ర సమస్యలు కూడా పెరుగుతాయి. అధికంగా ఆల్కహాల్,  కెఫీన్ పానీయాలు తీసుకునే వారు కూడా నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారు. ఈ అలవాట్లు ఉన్నవారు రాత్రి సమయంలో సరిగా నిద్రపోలేరు.                                           *రూపశ్రీ.
  ఆహారం శరీరానికి శక్తి వనరు.  ఆహారం సరిపడినంత తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆహారం నుండే శరీరానికి కావలసిన పోషకాలు,  విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ అన్నీ లభిస్తాయి. అయితే కొన్ని ఆహారాలకు ప్రత్యేకత ఉంటుంది.  కొన్ని గుండెకు మేలు చేస్తాయి.  కొన్ని కండరాలకు మేలు చేస్తాయి.  కొన్ని కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  ఇలా మేలు  చేసే ఆహారాలలో మెదడుకు మేలు చేసే ఆహారాలు ముఖ్యమైనవి.  మెదడు పనితీరు బాగుండటం ప్రతి ఒక్కరికి అవసరం.  ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మెదడు లేదా అని ఆంటుంటారు. అంటే.. మంచి ఆలోచనలకు,  జ్ఞాపకశక్తికి, శరీర కార్యకలాపాలకు మెదడు శక్తివంతంగా ఉండటం అవసరం. అలాంటి మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, మెదడు పనితీరు బావుండాలన్నా మెదడుకు  శక్తిని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలి. మెదడుకు అమృతంతో సమానమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి.  అవేంటో తెలుసుకంటే.. వాల్ నట్,  బాదం.. వాల్ నట్, బాదం పప్పులు మెదడు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి.  వాల్ నట్ లలోనూ,  బాదం లోనూ అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మానసికంగా బలహీనంగా ఉన్నా,  జ్ఞాపకశక్తి బలహీనంగా ఉన్నా,  ఆలోచనా పనితీరు, మెదడు చురుగ్గా ఉండాలన్నా వాల్ నట్ లు, బాదం పప్పులు ప్రతిరోజూ తీసుకోవడం మంచిదట. వాల్ నట్ లు బాదం పప్పులలో విటమిన్-ఇ,  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.  ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. శరీరంలో నరాల పనితీరు బాగుండాలంటే నాడీ వ్యవస్థ బాగుండాలి. నాడీ కణాలు ఆరోగ్యంగా ఉండాలి.  నాడీ కణాలకు పోషణ ఇవ్వడం ద్వారా అల్జీమర్స్ వంటి వ్యాధుల నుండి రక్షించడంలో వాల్ నట్స్, బాదం పప్పులు సహాయపడతాయి. వాల్ నట్స్,  బాదం పప్పులలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫాలీ ఫెనాల్స్ ఉంటాయి. ఇవి వయసుతో పాటు ఆలోచనా సామర్థ్యం తగ్గిపోవడాన్ని నిరోధిస్తాయి. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వాల్ నట్స్ లో మెలటోనిన్ ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా  అవసరం.  నిద్రను మెరుగుపరచడం ద్వారా మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు కణాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాదు.. వాల్ నట్స్ లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్, బాదం పప్పులో ఉండే పొటాషియం మెదడులో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.                                                  *రూపశ్రీ.
  హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ ఇన్‌ఫెక్షన్ చైనా నుండి మొదలైంది. ఇది కొత్తగా పుట్టినదేమీ కాదట.  ఇది ఆరు దశాబ్దాల నుండి ఉనికిలో ఉంది.  శాస్త్రవేత్తలకు గత 25 సంవత్సరాలుగా దీని గురించి తెలుసు. ఇది ఆర్‌ఎన్‌ఏ వైరస్.  అందుకే ఇది సజీవంగా ఉండటానికి సహజంగా పరివర్తన చెందుతూ ఉంటుంది. నివేదికల ప్రకారం హెచ్ఎంపీవీలో  కొత్త మ్యుటేషన్ కూడా సంభవించింది.  దీని కారణంగా చైనాలో  కేసులు వేగంగా పెరగడం ప్రారంభించాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీడియా నివేదికలు,  వీడియోలు చైనాలోని ఆసుపత్రులు శ్మశానవాటికలకు భారీ సంఖ్యలో జనాలను తరలించడం చూపించాయి. ఈ వార్తలు చూస్తుంటే చైనా నుండి మరో అంటువ్యాధి కరోనా మాదిరిగా  ప్రపంచమంతటా వ్యాపిస్తుందా అనే ప్రశ్నలు పుడుతున్నాయి.  ప్రజలు ఇంకా కరోనా నుండి సరిగ్గా కోలుకోలేదు.  కానీ అప్పుడే హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతోంది.  ఇది ప్రజలను కలవరపెడుతోంది.  అన్నింటిలో మొదటిది దేశంలో వైరస్ వ్యాప్తి కారణంగా  ఆసుపత్రులు,  శ్మశానవాటికలలో రద్దీని పెంచిందని చైనా నుండి వార్తలు వచ్చాయి. పిల్లలు ఎక్కువగా ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని గుర్తించారు. చైనా తర్వాత ఇతర దేశాలలో కూడా హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందుతోంది. సోమవారం (డిసెంబర్ 6), ఈ అంటు వ్యాధి మొదటి కేసు భారత్ లో కూడా నమోదైంది ఈ వైరస్ గురించి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ కరోనా వైరస్‌తో సమానంగా ఉంటుందట.  దాని లక్షణాలు కరోనా కంటే కొంచెం ఎక్కువ లేదా కరోనా కంటే కొంచెం తక్కువ తీవ్రతతో ఉంటాయట.  కరోనా మాదిరిగానే హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ కూడా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా ప్రజలు జలుబు,  శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారట.                                                 *రూపశ్రీ.