ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లలో అవకతవకలు.. కేటీఆర్ పై మరో ఫిర్యాదు

ఇప్పటికే ఫార్ములా ఈ రేసు కేసులో చిక్కులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుపై మరో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు ఔటర్ రింగు రోడ్డు టెంటర్లలో అవినీతికి సంబంధించింది.

ఈ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ బీసీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు రాచల యుగంధర్ గౌడ్ చేశారు. ఔటర్ రింగు రోడ్డు టెంటర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన రాచల యుగంధర్ గౌడ్ ఈ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందని పేర్కొన్నారు.ఈ విషయంలో ఈడీ,ఏసీబీ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నరు.

ఓఆర్ఆర్ టెండర్లలోఐఆర్ బీ కంపెనీకి అనుచిత లబ్ధి చేకూరిందనీ, ఇందుకు కేటీఆర్, కేసీఆర్ కారకులని ఆరోపించారు.  ఐఆర్ బీ కంపెనీకి 2023 ఏప్రిల్ లో ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకు ఇచ్చేశారనీ, అందుకు ప్రతిగా ఆ కంపెనీ నుంచి పాతిక కోట్ల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ అందుకుందని ఆరోపించారు.  ఓఆర్ఆర్ ను కేవలం 7వేల కోట్ల రూపాయలకు 30 ఏళ్ల పాటు ఐఆర్బీకి ఎలా లీజుకు ఇస్తారని ఆయన ఆ ఫిర్యాదులో ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఈడీ, ఏసీబీలకు ఫిర్యాదు చేశారు.