బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం (అక్టోబర్ 18) నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై ఆయన  పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఆ దావాకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన నాంపల్లి కోర్టుకు వచ్చారు. తెలంగాణ భవన్ నుంచి పార్టీ నేతలూ, కార్యకర్తలతో కలిసి కోర్టుకు చేరుకున్నారు. తనపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ ఆమెపై  వేసిన పరువునష్టం దావాపై  నాంపల్లి  కోర్టు శుక్రవారం (అక్టోబర్ 18)విచారించనుంది. కోర్టులో  వాంగ్మూలం ఇచ్చిన తరువాత కేటీఆర్  సాయంత్రం  తెలంగాణ భవన్‌లో  మూసీ సుందరీకరణపై రేవంత్ వ్యాఖ్యలు సవాళ్లపై మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. 
గత ఐదేళ్లుగా   రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశ వ్యాప్తంగా నవ్వుల పాలు కావడానికి కారణమైన జగన్ పాలన అంతం కావడంతో అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ  తొలగిపోయాయి. అమరావతే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా తలెత్తుకుని ఠీవీగా నిలిచింది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం ఇక ఏ అవరోధాలూ లేకుండా సజావుగా సాగి నిర్దుష్ట సమయానికి పూర్తి అవుతుందన్న విశ్వాసం అందరిలోనూ వ్యక్తం అవుతోంది. రాజధాని అమరావతి కోసం స్వచ్ఛందంగా భూములిచ్చి గత ఐదోళ్లుగా అన్ని రకాలుగానూ క్షేభను అనుభవించిన రైతుల  తమ కష్టాలు కడతేరిపోయాయన్న ఆనందంలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన ప్రాధాన్యతలు పోలవరం, అమరావతి అని తన తొలి పర్యటనలకు వాటితోనే శ్రీకారం చుట్టడంతో తేటతెల్లం చేశారు.  అయితే జగన్ ఐదేళ్ల అధికారంలో అమరావతిని నిర్వీర్యం చేయడంతో రాజధాని ప్రాంతం అంతా ముళ్ల కంపలు, చెట్లతో ఒక అడవిలా మారిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ఆరంభించి పూర్తి చేసింది. జగన్ మూడు రాజధానుల డ్రామా కారణంగా అమరావతిపై కోర్టుల్లో విచారణ దశల్లో ఉన్న కేసుల ఉపసంహరణ దిశగా చంద్రబాబు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.  చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే అని విస్పష్టంగా  ప్రకటించడంతోనే  వివాదాలన్నీ సమసిపోయినట్లైంది. అమరావతిపై వివిధ కోర్టుల్లో విచారణ దశలో ఉన్న దాదాపు 100 కు పైగా కేసుల ఉపసంహరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వీటిలో  రైతులు వేసిన కేసుల ఉపసంహరణకు వారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా  ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేయడంపై రైతులు వేసిన కేసును  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌ ప్రకారమే రాజధాని నిర్మాణం అని ప్రకటించడంతో ఆ కేసు ఉపసంహరణకు రైతులు నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంలో మిగిలిన ఆంధ్రప్రదేశ్ ఇక  ఎంత మాత్రం రాజధాని లేని రాష్ట్రం కాదు. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి కళ్ల ముందు సాక్షాత్కరించబోతోంది. ప్రపంచం చూపు ఇప్పుడు అమరావతిపైనే ఉంది.  కేంద్ర సంస్థలు తరలివస్తున్నాయి. పెట్టుబడులు వెల్లువె త్తుతున్నాయి.  ఇక కేంద్రం నుంచి అమరావతి నిర్మాణం కోసం సంపూర్ణ సహకారం ఉంటుందన్న స్పష్టత వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి పురోగతిపై ఆసక్తి, హర్షం వ్యక్తం అవుతున్నాయి.  అయినప్పటికీ రాజధాని అమరావతిపై వైసీపీ కుట్రలు ఆగడం లేదు. అసత్య ప్రచారాలతో అమరావతిపై ప్రజలలో అనుమానాలు రేకెత్తించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటీవల భారీ వర్షాలు, వరదల సమయంలో అమరావతి మునిగిపోయిందంటూ అవాస్తవాల ప్రచారానికి తెరలేపింది. హైకోర్టు మునిగిపోయిందంటూ ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. చంద్రబాబు నివాసాన్ని కాపాడుకోవడానికి బుడమేరు గేట్లెత్తేసి సింగ్ నగర్ ను మంచేశారంటూ అభూత కల్పనలనుర ప్రచారం చేసింది.  హైకోర్టు, సచివాలయం పూర్తిగా మునిగిపోయాయనీ వైసీపీ సోషల్ మీడియా గగ్గోలు పెట్టేసింది.  అయితే వాస్తవాలు కళ్లకు కడుతుండటంతో వైసీపీ ఫేక్ ప్రచారాలను ఎవరూ నమ్మలేదు.  అన్ని అవాంతరాలు, కుట్రలు, కుతంత్రాలను తట్టుకుని అమరావతి ఠీవీగా నిలబడింది. ఇక ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ పూర్తి కావడం, ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు విడుదల కావడంతో అమరావతి నిర్మాణం పరుగులు పెట్టనుంది. 
కేంద్రంలో కొలువుదీరి ఉన్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సర్కార్  జమిలీ ఎన్నికలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మోడీ రెండో సారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ జమిలి ఎన్నికల జపం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మూడో సారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరువాత జమిలి ఎన్నికల నిర్వహణకు కార్యాచరణకు వేగవంతం చేశారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సమాయత్తమౌతున్నారు.   మూడోసారి ఎన్డీఏ  అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ  తమ ఎజెండాలోని ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని,అందుకోసం పార్లమెంట్లో త్వరలో బిల్లు పెడతామని  బీజేపీ ఖరాఖండిగా చెబుతున్నది. ఇందుకు భాగస్వామ్య పక్షాల మద్దతు కూడా కూడగట్టింది. లోక్ సభలో ఓకే.. అయితే ఈ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాలంటే అవసరమైన బలం సమకూర్చుకునేందుకు ఇప్పటి వరకూ ఆగింది. అయితే ఇప్పుడు రాజ్యసభలో కూడా ప్రధాని మోడీ సర్కార్ కు అవసరమైన బలం చేకూరింది. మిత్రపక్షాల అంటే భాగస్వామ్య పక్షాల మద్దతుతో  సునాయాసంగా బిల్లులకు ఆమోదం పొందగలిగే పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ప్రధానంగా ఒకేదేశం ఒకే ఎన్నిక అంటూ జమిలీ ఎన్నికల  నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల  పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కమిటీని నియమించింది.  ఆ కమిటీ పరిశీలన జరిపి ఇటీవల నివేదిక ఇచ్చింది.ఆ నివేదిక లో ఏమి ఉందో కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు కూడా ఊహించేయవచ్చు.  ఎందుకంటే ఆ కమిటీ నియమించిన ఉద్దేశమే జమిలి నిర్వహణ సాధ్యమే అన్న నివేదిక ఇచ్చేందుకు.   జమిలీ ఎన్నికలు అంటే ఒకేసారి పార్లమెంట్,అసెంబ్లీలకు ఎన్నికలు జరపడం. ఇలా జరపాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఐదు ఆర్టికల్స్ 83,85,172,174,356 సవరణ చేయాలి. అలాగే లోక్ సభ,రాజ్యసభ లలో 67 శాతం సభ్యులు మద్దతు అవసరం.  అలాగే 14 రాష్ట్రాల అసెంబ్లీలలో జమిలికి మద్దతుగా తీర్మానాలు చేయాలి. అప్పుడే జమిలీ ఎన్నికలు సాధ్యమవుతాయి. మాటలమాంత్రికుడు మోదీ  ఈ టాస్క్ లో తప్పక విజయం  సాధిస్తారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. జమిలీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే  2027 ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా లోక్ సభ,అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తున్నది. సాధారణంగా ఎన్నికలు  విడిగా  జరిగితే ప్రజలు లోక్ సభకు జాతీయ పార్టీలవైపు  అసెంబ్లీ ఎన్నికలలో  ప్రాంతీయ పార్టీలవైపు మొగ్గు చూపుతారు.  స్థానిక ప్రభుత్వాలయితే ఎక్కువ ప్రయోజనం పాటు స్థానిక నాయకత్వం పెరుగుతుందని ప్రజలు ఆలోచిస్తారు. కాని బీజేపీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే  ప్రజలు తమవైపే చూస్తారని ఆ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. అంతే కాకుండా ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలలో అధికారంలో ఉండటం బీజేపీకి గిట్టదు. ఆ విషయాన్ని పలు సందర్భాలలో బీజేపీ అగ్రనేతలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు కూడా. ప్రాంతీయ పార్టీలు జాతీయ ప్రయోజనాలకు ఆటంకమన్నది బీజేపీ భావనగా కనిపిస్తోంది.   ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా  300 మార్క్ దాటలేకపోవడానికి కారణం కూడా ప్రాంతీయ పార్టీలేనన్నది బీజేపీ భావనగా ఉంది. అందేకే ఎలాగైనా  జమిలికి అనుకూలంగా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొంది..  జమిలితో సొంతంగా పూర్తి మేజార్టీ సాధించాలని ఆ పార్టీ ప్రణాళిక అన్నది పరిశీలకులు విశ్లేషణ.  అయితే బీజేపీ జమిలి వ్యూహం వెనుక శాశ్వతంగా అధికారాన్ని చేతుల్లో ఉంచుకునే కుట్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జమిలి ద్వారా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం వైపు బీజేపీ ప్రయాణం సాగుతుందని అంటున్నారు. ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల ఎంతో ప్రజాధనం ఆదా అవుతుందని బీజేపీ చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవు.  ఏదిఏమైనా జమిలీ వల్ల ప్రాంతీయ పార్టీల ఉనికికి ప్రమాదం వాటిల్లడం మాత్రం తథ్యమన్నది రాజకీయ పరిశీలకులు భావన.  అంతే కాదు ఫెడరల్ వ్యవస్థగా ఉన్న పార్లమెంటరీ విధానం నెమ్మదిగా యూనిటరీ విధానంగా మారుతుందని విశ్లేషణలు చేస్తున్నారు.యూనిటరీ విధానంతో అధికారం కేంద్రీకృతమై  నిరంకుశత్వానికి దారితీసే ప్రమాదం లేకపోలేదంటున్నారు.  ఈ పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కొవాలంటే ఇండియా కూటమి బలంగా రూపుదిద్దుకోవాలి.  అందుకు కాంగ్రెస్ త్యాగాలకు సిద్ధపడాలి.  మొత్తం మీద జమిలి ఎన్నికలకు బీజేపీ తనదైన వ్యూహరచనతో మార్గం సుగమం చేసుకుంటుంటో.. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
ALSO ON TELUGUONE N E W S
యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan)దర్శక ధీరుడు రాజమౌళి(rajamouli)కాంబోలో 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఆర్ఆర్ఆర్.విశేషప్రేక్షాదరణని పొందటంతో పాటుగా ఇండియాలోనే వన్ అఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.కలెక్షన్స్ పరంగా కూడా చాలా ఏరియాల్లో సరికొత్త రికార్డులని నెలకొల్పడమే కాకుండా ప్రతిష్టాత్మక 'ఆస్కార్'(oscar)సైతం అందుకొని  తెలుగు వారి కీర్తిని విశ్వ వ్యాప్తం చేసింది. వరల్డ్ సినిమా పితామహుడిగా పిలవబడే జేమ్స్ కామెరూన్(James Cameron)సైతం ఆర్ఆర్ఆర్ ని వీక్షించి మెచ్చుకున్నాడు. ఇంతటి ప్రత్యేకతలు ఉన్న ఈ మూవీ తాజాగా ఒక అరుదైన ఘనతని సాధించింది.జపాన్(japan)దేశంలోని ఒక థియేటర్ లో సంవత్సరం తొమ్మిది నెలలు అంటే ఇరవై ఒక్క నెలల నుంచి ప్రదర్శితమవుతూ ఉంది. జపాన్ లో ప్రపంచ భాషలకి చెందిన చాలా సినిమాలు ఎప్పట్నుంచో విడుదల అవుతూనే ఉన్నాయి. కానీ ఏ సినిమా కూడా ఇంత వరకు ఈ రేంజ్ లో రన్ అవలేదు.అలాంటిది ఒక భారతీయ సినిమా, అందులోను తెలుగు సినిమా అన్ని రోజుల నుంచి కంటిన్యూ గా ఆడటం ఒక అరుదైన రికార్డు అని చెప్పాలి  ఆర్ఆర్ఆర్ యూనిట్ కూడా ఈ విషయం పై తమ ఆనందాన్ని వ్యక్తం చెయ్యడమే కాకుండా ఎంతో గర్వకారణంగా ఉందంటూ ట్వీట్ చేసింది.ప్రెజంట్ ఎంత పెద్ద హిట్ సినిమా అయినా కూడా యాభై రోజులు ఆడటం చాలా కష్టమయిపోతుంది.కలెక్షన్ లే  కొలమానంగా సినిమా హిట్ రేంజ్ గురించి చెప్పుకుంటున్నాం.అలాంటిది ఆర్ఆర్ఆర్ అన్ని రోజుల ఆడటం గ్రేట్ అని చెప్పుకోవాలి.  
Celebrities promote different apps, companies and products as brand ambassadors and attend to special events as guests upon invite. When such apps or companies scam people, then these celebrities do come under the radar of investigation agencies like ED, CBI. Latest entrant under ED radar is milky beauty Tamanaah Bhatia. The actress has been questioned by ED officials in Guwahati over HPZ Token Scam. The app has been found to be promoting fradulent schemes to investors promising hefty returns in Bitcoins and cryptocurrencies. The app promoters have said to have escaped with large chunks of money to foreign countries.  Tamannaah Bhatia has been summoned to appear in front of ED officials as she received a payment from one of app promoters for attending an event as celebrity guest. Officials asked her to record her statement involving the money trail. She complied to their summons on Thursday after postponing from earlier scheduled inquiry session.  The actress has said to have responded to every question posted by officials in a rather polite and friendly manner without hiding any details. Officials have asked her to be ready to appear for another session, if they require another further details. 
  సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)దర్శకధీరుడు రాజమౌళి(rajamouli)కాంబోలో ఒక మూవీ తెరకెక్కబోతుందనే విషయం తెలిసిందే.స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్(vijayendra prasad)ఆ చిత్రానికి కథని అందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆయన  మాట్లాడుతూ కథ తయారు చెయ్యడానికే రెండేళ్ల సమయం పట్టిందని,నెక్స్ట్ ఇయర్ జనవరిలో సినిమా ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చాడు.దీంతో   ఆ శుభమూర్తం కోసం మహేష్ జక్కన్న ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ సైతం  ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ మూవీకి సంబంచిన తాజా న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.మూవీని రెండు బాగాలుగా తెరకెక్కించే ప్లాన్ లో జక్కన్న ఉన్నాడని అంటున్నారు.అమెజాన్ అడవుల నేపథ్యంలో జరిగే అడ్వెంచర్ మూవీ కావడంతో కథలో ఎంతో స్పాన్ ఉందని, కాబట్టి రెండు మూడు గంటల్లో చెప్పడం కుదరదని, అందుకే  రెండు భాగాలుగా తెరకెక్కిస్తారనే యోచనలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.చిత్ర యూనిట్ కూడా జక్కన్న నిర్ణయానికి ఓకే అందని తెలుస్తుంది. మరి ఇదే కనుక నిజమైతే  ప్రభాస్ లాగా మహేష్ కూడా వరుసగా జక్కన్న తోనే రెండు సినిమాలకి కమిట్ అయినట్టు అవుతుంది.   అదే విధంగా గ్లోబల్ ఫిలిం గా తీసుకువచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని,అందుకోసమే హాలీవుడ్ తో పాటు వివిధ భాషలకి చెందిన  బిగ్ స్టార్స్ కూడా నటించబోతున్నారని  వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా జక్కన్న అధికారకంగా ప్రకటించేంత వరకు ఈ విషయాల్లో పూర్తి క్లారిటీ రాదు. చాలా రోజుల నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ(kl narayana) ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఈయన గతంలో హలోబ్రదర్, దొంగాట,ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, క్షణక్షణం,సంతోషం వంటి హిట్ చిత్రాలని నిర్మించాడు.  
శంకర ఐ హాస్పిటల్స్‌, ఫినిక్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యులందరికీ ఫ్రీ ఐ హెల్త్‌ చెకప్‌ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు విష్ణు మంచు, వైస్‌ ప్రెసిడెంట్‌ మాదాల రవి, ట్రెజరర్‌ శివ బాలాజీ పాల్గొన్నారు. ఈ ఫ్రీ ఐ హెల్త్‌ క్యాంప్‌లో మా సభ్యులందరూ పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మీడియాతో.. విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించిన శంకర ఐ హాస్పిటల్స్‌, ఫినిక్స్‌ ఫౌండేషన్‌లకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాల్గోని సద్వినియోగం చేసుకుని విజయవంతం చేసిన మా సభ్యులకు అభినందనలు.  పద్మశ్రీ డా. రమణి గారు గురించి మేం విన్నాం. భారతదేశం అంతా కూడా ఫ్రీగా ఐ హాస్పిటల్స్‌ నిర్వహిస్తున్నారు. కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదని అంటుంటారు. ఫీనిక్స్‌ సంస్థ, శంకర హాస్పిటల్స్‌ కూడా అదే చేస్తోంది. కంచి కామ కోటి మఠ పీఠాదిపతుల్ని మేం ఆరాధిస్తుంటాం. వాళ్ల ఆశీస్సులతో ఈ హాస్పిటల్స్‌ నడుస్తుండటం ఆనందంగా ఉంది. ’ అని అన్నారు.  మాదాల రవి మాట్లాడుతూ.. ‘ఫినిక్స్‌ సంస్థ నుంచి చుక్కపల్లి సురేష్‌ గారు, చుక్కపల్లి అవినాష్‌ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. శంకర ఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫ్రీ ఐ హెల్త్‌ క్యాంప్‌ను నిర్వహించడం ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన ఫీనిక్స్‌ సంస్థ నీలేష్‌ జానీ గారికి థాంక్స్‌. మా సభ్యులందరికీ ఫ్రీ చెకప్‌ చేసిన శంకర ఐ హాస్పిటల్‌ హెడ్‌ విశ్వ మోహన్‌ గారికి కృతజ్ఞతలు’ అని అన్నారు. శివ బాలాజి మాట్లాడుతూ.. ‘అందరూ కంటి సమస్యల గురించి పట్టించుకోరు.  ఇలా మా సభ్యులందరికీ ఫ్రీ ఐ హెల్త్‌ చెకప్‌ చేయించడం ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు 25 లక్షల మందికి ఫ్రీ ఆపరేషన్స్‌ చేయించారని తెలిసింది. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మేం అంతా కలిసి మీకు ఫ్రీగా ప్రచారం చేస్తామ’ని అన్నారు. ఫీనిక్స్‌ సంస్థ డైరెక్టర్‌ నీలేష్‌ జానీ మాట్లాడుతూ.. ‘మేం సాధ్యమైనంత వరకు బ్లైండ్‌ నెస్‌ను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నాం. ‘మా’తో అసోసియేట్‌ అవ్వడం వల్ల మేం మరింతగా జనాలకు రీచ్‌ అవుతామని అనుకుంటున్నామ’ని అన్నారు. శంకర హాస్పిటల్‌ హెడ్‌ విశ్వ మోహన్‌ మాట్లాడుతూ.. ‘సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ముందుగానే గుర్తించి కంటి సమస్యలను తొలగించుకోవాలి. మా సభ్యులతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్స్‌లో పూరి జగన్నాథ్‌ది ఒక డిఫరెంట్‌ స్టైల్‌. ఏ డైరెక్టర్‌కీ రాని డిఫరెంట్‌ థాట్స్‌ పూరికి వస్తాయి. పూరి సినిమాల్లోని హీరోల క్యారెక్టర్స్‌ డిఫరెంట్‌గా ఉంటాయి. అలాగే విలన్స్‌ కూడా డిఫరెంట్‌ మేనరిజమ్స్‌తో బిహేవ్‌ చేస్తుంటారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా తక్కువ టైమ్‌లోనే వరస హిట్స్‌ తీసి టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా యూత్‌లో పూరీకి మంచి క్రేజ్‌, ఫాలోయింగ్‌ ఉన్నాయి. అందుకే వారికి నచ్చే విధంగా కథలు రెడీ చేసుకుంటారు. అలాగే తనకు నచ్చిన విధంగా హీరోలను మౌల్డ్‌ చేసుకుంటారు. అలా తనకంటూ ఓ బ్రాండ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు పూరి. బాలకృష్ణ, నాగార్జున, మహేష్‌, రవితేజ, ఎన్టీఆర్‌ వంటి హీరోలతో బ్లాక్‌ బస్టర్స్‌ చేసిన పూరికి ఈమధ్యకాలంలో హిట్‌ అనేది కరువైపోయింది. వరస ఫ్లాపులతో సతమతమవుతున్న పూరికి ఇస్మార్ట్‌ శంకర్‌తో మంచి కంబ్యాక్‌ వచ్చింది. కానీ, ఆ తర్వాత చేసిన లైగర్‌ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత తనకు కంబ్యాక్‌  ఇచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌కి సీక్వెల్‌గా చేసిన డబుల్‌ ఇస్మార్ట్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ, అది కూడా నిరాశపరిచింది.  పూరి దగ్గర స్టఫ్‌ అయిపోయింది, ఇక రిటైర్‌ అయితే మంచిది అనే కామెంట్స్‌ వచ్చాయి. అయితే అవి ఇండస్ట్రీ నుంచి వచ్చాయి తప్ప ఆడియన్స్‌ నుంచి కాదు. పూరి నుంచి ఒక డిఫరెంట్‌ మూవీ వస్తే హిట్‌ చెయ్యడానికి వాళ్ళు రెడీగానే ఉన్నారు. అది పూరి చేతుల్లోనే ఉంది. తనకు వచ్చిన గ్యాప్‌లో కథలు రెడీ చేసుకుంటూనే హీరో కోసం సెర్చింగ్‌ మొదలుపెట్టారు. అదే సమయంలో అక్కినేని కాంపౌండ్‌ నుంచి పూరీకి పిలుపు వచ్చింది. అక్కినేని కాంపౌండ్‌లో కూడా ఈమధ్య హిట్లు అనేవి కరువైపోయాయి.  ఈ ఏడాది సంక్రాంతికి నా సామిరంగాతో సందడి చేసిన నాగార్జున ప్రస్తుతం ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర చిత్రంలో నటిస్తున్నారు. నాగచైతన్యకు ఈమధ్యకాలంలో హిట్స్‌ లేవు. ఇక అఖిల్‌ విషయానికి వస్తే.. ఇప్పటివరకు ఓ అరడజను సినిమాలు చేసినా ఒక్కటి కూడా విజయం సాధించలేదు. అతని చివరి సినిమా ఏజెంట్‌ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సమయంలో పూరి జగన్నాథ్‌ వంటి డైరెక్టర్‌ అయితేనే తమని ఫ్లాపుల నుంచి గట్టెక్కించగలరని అక్కినేని హీరోలు భావిస్తున్నట్టున్నారు. అందుకే అక్కినేని ఫ్యామిలీలోని ముగ్గురు హీరోలలో ఎవరికైనా సెట్‌ అయ్యే కథ రెడీ చేస్తే సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం పూరి అదే పనిలో ఉన్నారని సమాచారం. మరి వీరిలో ఎవరికి కథ సెట్‌ అవుతుందో, పూరి ఎవరితో సినిమా చేస్తారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడక తప్పదు. 
Liam Payne was an English Singer who was famous for being a member of English pop boy band, One Direction. He was found dead after a fall from third floor from his Bueno Aires, Argentina hotel room. Officials confirmed his death with multiple contusions and injuries to his body.  He was part of the most successful boy bands ever and also had a highly sensational solo career. Payne was an athlete in his childhood and later started his career as a singer after he auditioned for reality show, X Factor.  There he joined four other contestants to form One Direction in 2008. Till 2015, the band produced highly albums and then went into a indefinite hiatus. Every band member started their solo career and Payne has an independent artist amassed over 3.2 Billion streams as well, in just three years.  Now, he went to Argentina to support one of his former band members and stayed with his girlfriend Kate Cassidy. Early in the morning before his death, he did share a snapchat video with her. The officials state that hotel manager claims to have heard heavy ruckus from his room due to drug abuse and alcohol overdose. Liam Payne openly admitted to his alcohol addiction and wanted to change his lifestyle. While the officials still did not confirm if it is a suicide or an accident. Post autopsy, they would make an official announcement. Few witnesses claim that Payne has been restless under the influence of drugs and alcohol.  If that's the truth, then we have to state that vices have claimed another soul. Well, as the news spread like a wildfire, the 31-year old singer's fans have been conducting memoriam and have been expressing their shock and pain with tributes, over his untimely death. 
పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమా థియేటర్లలో సందడి చేసి చాలా కాలమైంది. ఇప్పటికే పవన్‌ పూర్తి చేయాల్సిన మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. కొంతకాలం పవన్‌ ఎన్నికల హడావిడిలో ఉన్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత బిజీ అయిపోయారు. దీంతో ఆయన కమిట్‌ అయిన సినిమాలు ఆగిపోయాయి. మళ్ళీ పవన్‌ సెట్స్‌కి వస్తేనే తప్ప అవి పూర్తయ్యే అవకాశం లేదు. అయితే పవన్‌కళ్యాణ్‌ సినిమాలు ఎప్పుడు రిలీజ్‌ అవుతాయి అనే క్యూరియాసిటీతో అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే అభిమానుల కోరిక తీరబోతోంది. బ్యాలెన్స్‌ ఉన్న షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు పవన్‌.  ఈ న్యూస్‌తో పవర్‌స్టార్‌ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్‌ మొదలైంది. ప్రస్తుతం ఫిలింసిటీలో షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్‌ భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఓజీ చిత్రానికి కూడా పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆ సినిమా కోసం కొన్ని డేట్స్‌ కేటాయించారు. దాని ప్రకారం షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసుకుంటున్నారు ఓజీ మేకర్స్‌. ఈ కొత్త షెడ్యూల్‌ కోసం ఫిలింసిటీలో సెట్స్‌ వేశారు. ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఓజీ సెటనలో మరో రెండు రోజుల్లో ఎంట్రీ ఇస్తారు. వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌.  ఈ రెండు సినిమాలు కాకుండా హరీష్‌శంకర్‌ కాంబినేషన్‌లో చేయబోయే ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ కూడా సిద్ధంగా ఉంది. ఈ సినిమా గురించి ఎనౌన్స్‌ చేసి చాలా కాలమైంది. కానీ, హరి హర వీరమల్లు, ఓజీ గురించే అందరూ మాట్లాడుతున్నారు తప్ప ఉస్తాద్‌ గురించి ఎవరూ ఆరా తీయడం లేదు. అసలు ఈ సినిమా ఉందా, లేదా అనే సందేహం కూడా అభిమానుల్లో ఉంది. ఇటీవల విడుదలై ఫ్లాప్‌గా నిలిచిన మిస్టర్‌ బచ్చన్‌ దానికి కారణం అని తెలుస్తోంది. ఆల్రెడీ పవన్‌ బయటికి వచ్చి షూటింగ్స్‌ కోసం డేట్స్‌ కేటాయిస్తున్నారు కాబట్టి ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రాన్ని కూడా స్టార్ట్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ విషయంలో పవన్‌కళ్యాణ్‌, నిర్మాతల డెసిషన్‌ ఎలా ఉంటుందో చూడాలి. 
Director AR Murugadoss made a Pan-India successful film way back in 2005-2008 before Baahubali took it to next level. Well, it is kinda Pan-India success as before Baahubali remaking one blockbuster film in another language is more in fashion and if it is done by same director, we can say that was Pan-India back in those days.  Jokes apart, Ghajini film directed by AR Murugadoss created a huge market for Suriya in Tamil and Telugu states, as well. The movie even prompted many Telugu heroes to work with the director and he did make Stalin, with Megastar Chiranjeevi, too. And Telugu producer Allu Aravind took initiative in taking Ghajini to Bollywood.  Aamir Khan created a huge box office sensation with the film, opening Rs.100 crores club for Indian Cinema. Now, the director is thinking about revisiting Ghajini for a sequel, it seems. According to the Tamil media reports, he has plans to make this movie on a massive budget and explore the character even deeper.   The new movie might go on floors once Suriya finishes his recent commitments and AR Murugadoss, too. The director scored disasters with Mahesh Babu's Spyder and Rajinikanth's Darbar. He is looking for a big comeback with Sivakarthikeyan in South Indian languages and with Salman Khan in Bollywood. So, once he finishes these projects, he wants to move ahead with Ghajini sequel, it seems.  It would be great to see him take on Ghajini character post two decades but will he introduce a new problem to the old character or just take the character and give an entire new story. Let's wait and see. 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)రెబల్ స్టార్ ప్రభాస్(prabhas)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు.కొన్ని లక్షల మంది అభిమానులు ఆ ఇద్దరి సొంతం.పవన్ ప్రస్తుతం హరిహరవీరమల్లు(hari hara veeramallu)షూటింగ్ లో పాల్గొంటుండగా ప్రభాస్ తన అప్ కమింగ్ మూవీ ది రాజా సాబ్(raja saab)షూట్ లో పాల్గొంటున్నాడు.ఈ రెండు చిత్రాలపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ రెండు చిత్రాల్లోను ఇస్మార్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్(niddhi agerwal)హీరోయిన్ గా చేస్తుంది.కాకపోతే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఈ రెండు సినిమా షూటింగ్స్‌ ఒకే రోజు జరుగుతుండగా, ఆ రెండింటిలోను తన పాత్రకు సంబంధించిన షూట్‌లో నిది పాల్గొంటోంది.అంటే ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ ని జరుపుకుంటున్నాయి.వీరమల్లు ఆంధ్రలో షూటింగ్ ని జరుపుకుంటుంటే, రాజాసాబ్ తెలంగాణాలో జరుపుకుంటుంది. దీంతో నిధి ఒకే రోజు ఆంధ్ర,తెలంగాణాకి జర్నీ చేస్తూ షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ విషయాన్నీ స్వయంగా తనే ట్విటర్ వేదికగా వెల్లడి చెయ్యడమే కాకుండా ఒకే రోజు ఇద్దరు అగ్ర హీరోలతో రెండు స్టేట్స్ లో వర్క్ చెయ్యడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.ఈ రెండు సినిమాలు కూడా వీలైనంత త్వరగా షూటింగ్ ముగించుకునేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న వీరమల్లు కి జ్యోతికృష్ణ(jyothi krishna)దర్శకుడు కాగా, రాజా సాబ్ కి మారుతి(maruthi)దర్శకుడు.  
Hansika Motwani is on a roll with upgrading her lifestyle. She recently bought a BMW Car costing up to Rs.76 Lakhs. Now, she announced that she completed Griha Pravesh - house warming ceremony for her new home in Mumbai.  The actress debuted as a child actor in Hindi Cinema and found stardom in Telugu and Tamil films. She became a star heroine with a successful debut like Deshamuduru and in Tamil, she has been part of films like Engeyum Kadhal, Oru Kal Oru Kannadi, Singam II, Biriyani, Maan Karate, Aranmanai, Meaghamann kind of successful films.  She married Sohael Khaturiya and took a break from films. She is currently working in Dhee program in Telugu TV. The actress is seen very happy and thrilled in her housewarming photos. She wore a green saree in Marathi style and looked stunningly beautiful as ever. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఈ ప్రపంచంలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన ఆడపిల్ల గురించి దారుణాలు వినబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఆ దుర్ఘటన తాలూకూ అనుభవాల నుండి ఏదో ఒక చట్టాన్ని చేస్తూనే ఉంది. ఎన్ని చట్టాలు చేసినా ఆడపిల్లల మీద అమానుష సంఘటనలు మాత్రం ఆగడం లేదు. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో గొంతు చించుకొని ఎంత ఆవేదన వెలిబుచ్చినా అదంతా గాలిగీతంలా క్షణానికే మాయమవుతోంది. మరి ఇలాంటప్పుడు ఆడపిల్లలు బయటకు ఎక్కువ వెల్లకపోవడం మంచిదని చాలామంది చెబుతారు. కానీ భవిష్యత్తును వదులుకోవడం ఎంతవరకు సమంజసం అనిపిస్తుంది మరి. అయితే అమ్మాయి బయటకు వెళ్లి క్షేమంగా తిరిగి ఇంటికి రావడం అనేది ప్రతి తల్లిదండ్రిలో ప్రతీరోజును ఒక భయానక కాలంగా మార్చేస్తోంది. అలా కాకుండా తమ ఇష్టాలను లక్ష్యాలను  ఏమాత్రం విడిచిపెట్టకుండా, ఇంట్లో వాళ్లకు భరోసా ఇవ్వగలిగే కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే ఎలాంటి చీకు చింతా ఉండవు. దగ్గరగా…. దగ్గరగా….. చదువుకునే పిల్లల నుండి ఉద్యోగం చేసే అమ్మాయిలు, మధ్యవయసు ఆడవాళ్లు ఇలా అందరూ చూసుకోవాల్సిన మొదటి ఎంపిక స్కూల్ లేదా కాలేజి లేదా ఆఫీసు వంటివి దగ్గరలో ఉండేలా వాటికి దగ్గరలో ఇల్లు, లేదా హాస్టల్ చూసుకోవడం. దీనివల్ల అక్కడ కాస్త ఆలస్యం అయినా ఇంటికి చేరుకునే సమయం తక్కువే కాబట్టి పెద్దగా భయపడనవసరం లేదు.  కొంచం టచ్ లో ఉంటే బాగుంటుంది దూరబార ప్రయాణాలు, సిటీ లోనే కాలేజ్ లు, స్నేహితులతో ఎక్కడికైనా దూరం వెళ్లడం వంటి సందర్భాలలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికి లైవ్ లొకేషన్ షేర్ చేయాలి. అంతేకాదు రాత్రి పూట తప్పనిసరి అయి ఆటో లు, క్యాబ్ లు ఎక్కాల్సి వచ్చినప్పుడు కూడా లైవ్ లొకేషన్ షేర్ చేయాలి. నమ్మకానికి ఆమడదురం ఈ కాలంలో ఎవరిని నమ్ముతాం పూర్తిగా. కాలమే మారిపోతూ ఉంటుంది అలాంటపుడు మనుషులు మారకుండా ఉంటారా. అలాగని ఎప్పుడూ అనుమానంతో ఉండమని కాదు. అతినమ్మకం ఉండకూడదు అని. కాబట్టి ఎవరిని వారు పూర్తి విమర్శ చేసుకుని అప్పుడు అవతలి వారిని నమ్మాలి. ఏదో మోహమాటానికి పోయి సమస్యలలో చిక్కుకోవద్దు సుమా!! స్వీయ రక్షణే కొండంత భరోసా ఇప్పటికాలం ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ వంటి విద్యలు నేర్పడం వల్ల శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా ప్రమాదంలో ఉన్నపుడు అవే కొండంత భరోసా ఇస్తూ తమని తాము కాపాడుకునేలా చేస్తాయి.  అంతే కాదండోయ్ ఆడపిల్లలు ఆటలలో చురుగ్గా ఉంటే వారు ఎంతో దృఢంగా తయారవుతారు. అదే వారికి స్వీయ రక్షణ గా తోడ్పడుతుంది కూడా. డోంట్ టచ్…. ఇప్పట్లో మొబైల్స్ ను చాలా సులువుగా హాక్ చేసేస్తారు. వాటి ద్వారా, బ్యాంక్ అకౌంట్స్ మాత్రమే కెమెరా ఆక్టివేట్ చేసి అమ్మయిల ఫొటోస్, వీడియోస్ రికార్డ్ చేసి బ్లాక్మైల్ చేసి డబ్బు గుంజుతూ పైశాచికానందం పొందుతుంటారు. ఇలాంటి సంఘటనలు చాలా  తక్కువగా బయటపడుతుంటాయి. కాబట్టి తెలియని వాళ్లకు ఫోన్ ఇవ్వడం వంటివి చేయకూడదు. ఎవరైనా మీ వస్తువులను ముట్టడానికి ప్రయత్నం చేసినా సున్నితంగా డోంట్ టచ్ అని చెప్పేయండి. ఒకవేళ హెల్పింగ్ నేచర్ ఉన్నా తెలియని వ్యక్తులు అడిగినప్పుడు ఒక చిన్నపాటి కీప్యాడ్ మొబైల్ ఇవ్వడం ఉత్తమం.  సోషల్ మీడియా ఎంత మంచి చేస్తుందో చెడు కూడా చేస్తుంది. కాబట్టి తెలివిగా దాన్ని ఉపయోగించుకోగలగాలి. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన దిశ యాప్ లాంటివి సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. రాత్రి పూట ప్రయాణాలలో వీలైనంతవరకు నిద్రను అవాయిడ్ చేయాలి. ప్రయాణం చేసి బస్ లేదా ట్రైన్ వంటివి దిగే  సమయానికి ఆయా స్టాప్ లలో కుటుంబసభ్యులు లేదా స్నేహితులు, లేదా చుట్టాలు ఇలా ఎవరో ఒకరు అక్కడికి చేసురుకుని రిసీవ్ చేసుకునే ఏర్పాటు చేసుకోవాలి.  దేన్నీ నిర్లక్ష్యంగా చూడద్దు. అమ్మాయిలు బయటకు వెళ్లినప్పటి నుండి తిరిగి ఇంటికి చేరుకునేదాకా స్పృహతో ఉండాలి. పరిసరాలను గమనిస్తూ ఉండాలి.  కాలంతో పాటు ఎన్నో అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే మహిళల విషయంలో సమాజం దిగజారిపోతోంది. కాబట్టి జగరూకత ఎంతైనా అవసరం. ◆ వెంకటేష్ పువ్వాడ
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప దశ. పెళ్లికి ముందు, పెళ్లి తరువాత జీవితం గురించి చాలా మార్పులు స్పష్టంగా ఉంటాయి.  ఊహకు కూడా అందని విధంగా పెళ్లి తరువాత ఇద్దరి వ్యక్తుల జీవితాలకు మార్పులకు లోనవుతాయి.  అంతేకాదు.. పెళ్లికి ముందు ప్రతి జంట మనసులో చాలా ప్రశ్నలు ఉంటాయి.  అవి వివాహం తరువాత ఆర్థిక పరిస్థితులు కావచ్చు,  పిల్లల ప్లానింగ్ కావచ్చు,  పిల్లల భవిష్యత్తు కావచ్చు.. కాబోయే జంట ఎన్నో విషయాలలో ఎలా ఉండాలనే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎలాగైతే పెట్టుకుని ఉంటారో.. అదే విధంగా  అవి సరిగా జరుగుతాయా లేదా అనే సందిగ్ధంలో కూడా ఉంటారు.  ముఖ్యంగా భార్యాభర్తల బంధం ఎలా సాగుతుందో.. భాగస్వామి తమతో ఎలా ఉంటారో అనే విషయాలలో కూడా బోలెడు సందేహాలు ఉంటాయి.  అందుకే పెళ్లికి ముందు కాబోయే జంట కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిదని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు అంటున్నారు. అపరిచితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కలసి ఒక జంటగా ఏర్పడి జీవితాన్ని కొనసాగించడం బోలెడు సవాళ్లతో కూడుకుని ఉంటాయి. ఒకరి మీద ఒకరికి ఎన్నో సందేహాలు,  మరెన్నో అంచనాలు ఉంటాయి.  అదే ఇద్దరూ కలసి కౌన్సెలింగ్ తీసుకుంటే భార్యాభర్తల బంధం మీద ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలో.. ఏ విషయాన్ని అయినా ఎలా సంభాషించాలో అర్థం అవుతుంది. ఒక బంధం బలంగా ఉండాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యునికేషన్ ప్రదానమైనది.  ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్  సాగాలంటే ఇద్దరు ఒకరికి ఒకరు గౌరవం ఇవ్వాలి.  ఒకరు చెప్పే విషయాన్ని మరొకరు శ్రద్దగా వినగలగాలి.   పెళ్లికి ముందు కౌన్సెలింగ్ ఇవ్వడం వల్ల  భార్యాభర్తలు వైవాహిక జీవితంలో తమకున్న అంచనాలను చర్చించుకుని తెలుసుకునే అవకాశం ఉంటుంది.  పెళ్లి తరువాత ఈ అంచనాలకు తగ్గట్టు ఒకరికొకరు సర్దుబాటు కావచ్చు.  జీవితంలో ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి.  ప్రతి ఒక్కరి భవిష్యత్తు గురించి కొన్ని అంచనాలు ఉంటాయి.  పెళ్లికి ముందు కౌన్సిలింగ్ తీసుకుంటే వీటి గురించి ఇద్దరికీ ఒక అవగాహన వస్తుంది. ఇద్దరూ కలిసి జీవితం గురించి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. కౌన్సెలర్ ముందు కాబోయే జంట తమ అభిప్రాయాలు, ఆలోచనలు, లక్ష్యాలు వివరించడం వల్ల కాబోయే జంటకు భవిష్యత్తు గురించి, తాము ఇద్దరూ చేయాల్సిన విషయాల గురించి ఒక అవగాహన వచ్చేస్తుంది. మనసులో ఉన్న చాలా సందేహాలకు అక్కడే సమాధానాలు దొరుకుతాయి. వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రణాళికలు చక్కగా వేసుకోవడానికి సులువుగా ఉంటుంది. కాబోయే జంటలో ఎవరికైనా ఎవైనా బలహీనతలు,  సమస్యలు, లోపాలు ఉంటే వాటిని కౌన్సిలింగ్ లో బయట పెట్టడం ద్వారా భాగస్వామి తోడు, భరోసాను పెళ్లికి ముందే స్పష్టం చేసుకోవచ్చు. దీని వల్ల వివాహం తరువాత కొన్ని భయాలు తగ్గిపోతాయి. మానసిక ప్రశాంతత,  వైవాహిక జీవితంలో సంతోషం సాధ్యమవుతుంది.                                               *రూపశ్రీ.
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు.  సంతోషంగా ఉంటే జీవితంలో చాలా సమస్యలు జయించవచ్చు. కానీ సంతోషంగా ఉండనీయకుండా చేసే సందర్బాలు,  సమస్యలు చాలా ఉంటాయి. మరీ  ముఖ్యంగా సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని ఆలోచనతో, తెలివిగా ఎదుర్కోవాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు గందరగోళంలో, ఒత్తిడిలో ఉంటే సంతోషం అనే మాట దూరంలోనే ఉండిపోతుంది.  జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనసును, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలంటే.. శ్వాస.. శ్వాస అనేది ప్రతి క్షణం, ప్రతి మనిషిలో జరిగే అసంకల్పిత చర్య.  అయితే శ్వాస వ్యాయామాలు మనిషిని సంతోషంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ శ్వాస వ్యాయామాలు చేస్తుంటే.. ముఖ్యంగా లోతైన శ్వాస వ్యాయామాలు చేస్తే ఆందోళన తగ్గుతుంది. ఒత్తిడి నియంత్రణలోకి వస్తుంది.  మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆహారం.. ఆహారం శరీరానికి శక్తి వనరు. అయితే ఆహారం తినే విధానం మనసును ప్రభావితం చేస్తుంది. మైండ్ ఫుల్ ఈటింగ్ అనేది ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతోంది. అంటే మనసు పెట్టి ఆహారాన్ని శ్రద్దగా తినడం.  తినేటప్పుడు ఆహారాన్ని ఆస్వాదించడం.  ఆహారం వాసన,  ఆహారం ఎలా ఉంది అని దాన్ని మనసుతో పరిశీలించి తినడం.  ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం శరీరానికి మాత్రమే కాదు.. మనసుకు కూడా తృప్తిని ఇస్తుంది. నడక.. నడక చాలామంది చేసే వ్యాయామంలో భాగం. అయితే నడిచేటప్పుడు నడకను కూడా పరిశీలించాలి. నడిచేటప్పుడు పాదాల కదలిక, అడుగులలో లయ మొదలైనవి క్షుణ్ణంగా పరిశీలిస్తే మీరు వాకింగ్ చేయడంలో లవ్ లో పడతారు. ఇది మనసుకు చాలా తృప్తిని ఇస్తుంది. శ్రద్ద.. శ్రద్దగా ఏ పనిని అయినా చేస్తే ఎంత పరిపూర్ణ ఫలితాలు వస్తాయో.. ఇతరులు ఏదైనా చెప్పేటప్పుడు అంతే శ్రద్దగా వెంటే వ్యక్తులతో బంధాలు బాగుంటాయి.  శత్రుత్వం లేకుండా స్నేహభావంతో కూడిన బంధాలు ఉంటే మనసుకు ప్రశాంతత, జీవితంలో సంతోషం లభిస్తాయి. పని.. నేటి కాలంలో చాలామంది మల్టీ టాస్కర్లే.. ఇది మనిషిని ఒత్తిడిలోకి నెట్టుతుంది.  జీవితంలో సంతోషం కావాలంటే మల్టీ టాస్కింగ్ ను పక్కన పెట్టి సింగిల్ టాస్క్ లను చేస్తూ ఉండాలి. పైగా మల్టీ టాస్క్ చేసేటప్పటితో పోలిస్తే.. సింగిల్ టాస్క్ చేసేటప్పుడు పని మీద ఎక్కువ శ్రద్ద పెట్టడం, పనిని చాలా బాధ్యతగా ఆసక్తిగా పూర్తీ చేయడం దాని ఫలితాలు కూడా మెరుగ్గా ఉండటం గమనించవచ్చు.  ఇవి జీవితంలో సంతోషాన్ని మెరుగు పరుస్తాయి. కమ్యూనికేషన్.. ఇతరులతో కమ్యూనికేషన్ బాగుంటే  చాలా వరకు ప్రశాంతంగా ఉండవచ్చు.  వ్యక్తిగతంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా కమ్యునికేషన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది వ్యక్తులతో బంధాలు మెరుగ్గా ఉండేలా సహాయపడుతుంది. అలసట.. అలసట మనిషిని ఒత్తిడిలోకి నెట్టుతుంది. అందుకే ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని ఒకే పని చేయకూడదు.  పని నుండి అప్పుడప్పుడు కాస్త దృష్టి మరల్చడం,  రిలాక్స్ అవ్వడం మనిషిని అలసటకు లోను కానీయవు.                                                *రూపశ్రీ.  
  సర్వేంద్రియానాం నయనం ప్రాధానం అంటే మనకు కళ్ళే కీలకం సమస్త సృష్టిని చూసేది మన కళ్ళే. మనకంటికి కనపడిన వెంటనే మనసు స్పందిస్తుంది. అయితే కళ్ళు ఉండీ నిజాన్ని చూడలేని వాళ్ళ కన్నా. కళ్ళు లేనువాళ్ళే స్పందించే తీరు జీవితం లో వేరుగా ఉంటుంది. వారి జీవితం సవాళ్లతో కూడుకుని ఉంటుంది.సవాళ్ళను అధిగమిస్తూ మేము ఎవరికీ తీసిపోము అన్నట్లుగా తమ జీవితాన్ని పలువురికి ఆదర్శ ప్రాయంగా ఉంటారు అంధులు అయితే అయితే కళ్ళను చూసి మనకు ఉన్న వ్యాధులను గుర్తించ వచ్చని నిపుణులు పేర్కొన్నారు.కంటిద్వారా మనకు ఉన్న వ్య్సధులను ఖచ్చితంగా అంచనా వేయవచ్చని. అవికూడా ప్రస్తుతం ఉన్న వ్యాధులను. భవిష్యత్తులో వచ్చే వ్యాధులను కూడా గుర్తించవచ్చని. ఇది భారతీయులు ముఖ్యంగా మన పూర్వీకులు మనకు ఇచ్చిన నాడీ వైద్యం లో ప్రస్తావించారని పెర్కిన్నారు.మన కళ్ళను బట్టి మన అనారోగ్య సమస్యను గుర్తించవచ్చు. చలామంది హెల్త్ చెకప్ పేరుతో ఆరోగ్యం పై హెల్త్ చెకప్ అందరూ చేయించు కోలేరు.అయితే వారి వారి కళ్ళను చూసి వారి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం సాధ్యమని అంటున్నారు ప్రముఖ నాడీ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణం రాజు. మీకళ్ళు నిప్పుకనాళ మాదిరిగా ఎర్రగా ఉన్నాయా... కొందరి కళ్ళు నిప్పుకనాళ లాగా ఎర్రగా ఉంటాయి. వైద్యుడు పరీక్షించి చూస్తే రెటీనా పైన చిన్న చిన్న రక్తకణాలు కనబడతాయి.దీనికి కారణం అధిక రక్త పోటు అధిక రక్త పోటు కారణంగా కంటిలోని నరాలు ఎర్రగా మారుతాయి. కొన్ని సార్లు అవి పగిలిపోవడం కూడా జరగ వచ్చు. దాంతో కళ్ళు ఎర్రగా కనబడతాయి. అయితే ఈ విషయం నాలుగో వంతు మందికి తెలియదు. ఇలాంటి సమస్య ఉన్నవారు గుండె పోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువేఅని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కళ్ళు ఎర్రబడితే ఆ ఏం జరుగుతుంది లె అని వదిలి వేయకండి ఇది హై బిపి కార్డియోక్ ఇండికేషన్ అని జాగ్రత పడాలి అని అంటున్నారు నిపుణులు. కళ్ళు తెల్లగా పాలిపోయి నట్లు ఉంటె.. దీనిని ఎనిమియా సమస్యగా పేర్కొన్నారు.అంటే రక్త హీనత అని చెప్పవచ్చు. ఇది మీ అనారోగ్య సమస్యగా చెప్పవచ్చు.శరీరంలో సరైన పోషకాలు లేనండువల్లె శరీరంలో రక్త హీనత వస్తుందని ఒక్కోసారి రక్త హీనత మరిన్ని సమస్యలకు దారితీయ వచ్చు. కళ్ళు ఎర్రగా రక్తం కారినట్లు ఉంటె.. ఒక్కొకరిలో కళ్ళలో రక్తం కారినట్లు ఉంటాయి. రక్తంలో ప్లేటి లెట్స్ తగ్గడం వల్ల ఇలా కనిపిస్తుంది. కను గుడ్డు పోటు రావడం.. శరీరంలో డీ హైడ్రేషన్ వల్ల లేదా మెడ నరాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కనుగుడ్డు ముందుకు వస్తుంది. కంటి రెప్పల పై ఉండే హెయిర్ ఊడిపోవడం.. కనురెప్పల పైన ఉండే జుట్టు ఊడి పోవడం అంటే ఇది క్యాన్సర్ కు ఇండికేషన్ గా చెప్పవచ్చు.కనురెప్పలు ఒక్కోసారి డ్రై కావడం--కంటి నుండి ఎక్కువనీరుకారడం. సైనస్ లేదా నోజేల్ సూబ్ బ్లాక్స్ ఉండడం. ఈ కారణంగా సైనస్ సమస్యలు ఉంటె ఇలాంటి సమస్యలు వస్తాయి. కళ్ళు పెద్దవి గా కనిపించడం.. శరీరంలో హార్మోన్స్ సమస్యల వల్ల లేదా సమతౌల్యం లేదా థైరాయిడ్ వల్ల కళ్ళు ముందుకు వచ్చినట్లు. పెద్దవిగా కనిపిస్తాయని నిపుణులు విశ్లేషించారు.కంటి వెనుక భాగం లో పసుపు పచ్చగా కొవ్వు ఉన్నట్లు కనబడుతుంది లేదంటే రెటీనా చిన్న చిన్న నీటిబొట్లు కనబడుతుంది.ఇలాంటి వారిలో టైపు 2 డయాబెటీస్ వ్యాధి వచ్చే అవకాసం ఉంది. కళ్ళు పసుపు పచ్చగా ఉంటె.. కొందరి కళ్ళు పసుపు పచ్చగా కనిపిస్తే దాని ఆర్ధం కాలేయ సమస్య ఉందని అంటున్నారు. కళ్ళు ఇలా మారిపోడానికి కాలేయం పనితీరులో తేడా ఉండడమే. అందువల్ల వెంటనే వైద్యుడిని సలహా తీసుకుని సంప్రదించడం ఉత్తమం సమస్యనుండి బయట పడగలం.దీనిని వైద్య పరిభాషలో లివర్ బైల్ సేక్రేషణ్ ఎక్కువకవాడమని వైద్యులు నిర్ధారించారు. కళ్ళు పొడి బారడం -లేదా అయిడ్రై నెస్.. సహజంగా శరీరానికి అందాల్సిన విటమిన్ ఏ సరిగా అందక పోవడం జిరాప్ గాల్దిమియా అని అంటారు. కళ్ళలో నీరు కారడం.. కండ్లకలకఅంటే కండ్ల లో వచ్చ్ఘే ఇన్ఫెక్షన్ సహజంగా వర్స్ఘాకాలం లో వచ్చే సమస్య.ఇది ఒక్కోసారి ఒకరి నుండి మరొకరికి సోకే అవకాసం ఉంది కాబట్టి కండ్లకలకకు దూరంగా ఉండడం అవసరం సకాకంలో వైద్యుని సూచన మేరకు కంటి లో డ్రాప్స్ వాడాలేతప్ప సొంత వైద్యం చేయరాదని అలా చేస్తే కళ్ళు పోయే ప్రమాదం ఉందని తెలిపారు. కండ్లు గడ్డ కట్టి నట్టుగా ఉండడం.. ఐ స్టేయ్స్ అంటే కండ్లలో గడ్డలు.. కంటిలో ఏవిధమైన డస్ట్ వచ్చి చేరినా కండ్లలో గద్దలగా తయారు అవుతుంది.  కళ్ళు నీలి రంగులోకి మారడం.. మనశరీరం లో బ్రెయిన్ కిఆక్సిజన్ సరిగా అందక పోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల కళ్ళు నీలిరంగులోకి మారవచ్చని తెలుస్తోంది. ఐ బ్యాగ్స్.. కంటికింద బ్యాగ్ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. సహజంగా అతిగా మధ్యం తాగేవారిలో లివర్ సమస్యలు కంటికింద ఐ బ్యాగ్స్ లాగా వస్తాయి. కళ్ళు మండడం.. కళ్ళు మండడం సహజంగా వచ్చే సమస్య. అయితే కళ్ళు మండ దానికి కారణాలలో ఎక్కువ కాంతి చూడడం.లేదా ఎక్కువ కాంతిలో పనుచేయడం. ఒత్తిడికి గురికావడం. నిద్రలేమి వంటి సమస్యలు ఉన్నందున కళ్ళు మండడం లేదా మీరు పనిచేసే ప్రాంతాలలో రసాయనాల మధ్య లేదా దుమ్ము ధూళి ఉన్నచోట కళ్ళు మండడం సహజంగా ఉంటుంది. కళ్ళు మూతలు పడడం.. కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. ఇది ఒక న్యురోలోజికల్ దిజార్దర్ గా పెర్కిన్నారు. ఈ సమస్యకు కారణం బాగా నిల్వ ఉన్న తీసుకున్న వారికి వస్తుందని నిపుణులు నిర్దారించారు. కంటి కింద నల్లటి వలయాలు .. కొందరిలో కంటికింద నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. దీనికి కారణం స్టమక్ దిజార్దర్ గా పేర్కొన్నారు. కాగా సహజంగా ఒత్తిడికి గురికావడం. లేదా యాన్కజైయిటీ వల్ల కంటికింద న్హల్లటి వలయాలు వస్తాయని నిపుణులు తేల్చి చెప్పారు. కళ్ళు డీవియేట్ కావడం.. శరీరంలో కళ్ళు ఒక్కోసారిషిఫ్ట్ అవుతూ ఉంటాయి.దీనికి కారణం  పోషక ఆహార లోపంగా పేర్కొన్నారు. అంటే సరైన పోషకాలు  లేనండువల్లె కళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటాయికళ్ళను పరిశీలించడం ద్వారా ఎన్నోరకాల రుగ్మతలను చెప్పవచ్చ్గు. నాడీ పతి ద్వారా ఎన్నోరకాల రుగ్మతలను చెప్పుకోవచ్చు. ఈ పద్దతిని నాడీ పతి లో ఇరిదోలజీ అని అంటారు.మనం చెప్పుకున్న కొన్ని అంశాలు పైకి కనిపించే కళ్ళ యొక్క సిమ్టమ్స్  ను ఆధారంగా ఏదైనా లక్షణం కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. దీనిఆదారంగానే చికిత్చ తీసుకోవచ్చు అని నిపుణులు పేర్కొన్నారు.  
  ఆహారం శరీరానికి శక్తి వనరు.  ఆహారం లేకుండా ఒక పూట,   ఒక రోజు ఉండగలరు.  బలవంతంగా ఉండేవారు మహా అయితే రెండు రోజులు ఉండగలరు. కానీ ఆహారం లేకుండా రోజువారీ కార్యకలాపాలను నిర్వర్తించడం చాలా కష్టం.  శరీరానికి ఆహారం ఎంత అవసరమో.. ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు కూడా అంతే అవసరం.  ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు అంటూ లెక్క గట్టేవారు ఫైబర్ గురించి పెద్దగా ఆలోచించరు.  ఆహారంలో పీచు ఎక్కువగా ఉన్న వాటిని తప్పనిసరిగా తీసుకోవాలని ఆహార నిపుణులు చెబుతూ ఉంటారు. అసలు ఆహారంలో పీచు పదార్థాలు ఎందుకు తీసుకోవాలి? ఆహారంలో పీచు పదార్థాలు తీసుకోకపోతే ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. ఫైబర్.. శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు,  కార్బోహైడ్రేట్లతో పాటు పీచు కూడా అవసరం.  తిన్న ఆహారం సరిగా జీర్ణం కావడంలోనూ, జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా ఉండటంలోనూ పైబర్ కీలక పాత్ర పోషిస్తుంది.  ఇక ఫైబర్ చాలా మెల్లిగా జీర్ణం అవుతుంది కాబట్టి ఫైబర్ కలిగిన ఆహారం  తీసుకుంటే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.  ఇది బరువు తగ్గడానికి, ఆకలి నియంత్రణకు, అతిగా తినే అలవాటుకు చెక్ పెట్టడానికి సహాయపడుతుంది. ఫైబర్ కోసం పండ్లను నేరుగా తినాలి.  వాటిని జ్యూస్ తీసి అందులో ఉన్న పైబర్ ను చెత్తబుట్ట లో తోయకూడదు. ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.  పొట్టను శుభ్రం చేస్తుంది.  అదే ఆహారంలో పైబర్ లేకపోతే పొట్ట ఆరోగ్యం, జీర్ణ ఆరోగ్యం దెబ్బ తిని మలబద్దకం సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రేగులలో మంచి గట్ మైక్రోబ్స్ ఉంటాయి.  ఇవి పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి.  కానీ ఫైబర్ తీసుకోకపోతే ఈ సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది. గట్ ఆరోగ్యం దెబ్బతింటుంది. మంచి బ్యాక్టీరియా తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్లు, వాపులు వంటి కడుపు సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది. రోజువారీ శరీరానికి అవసరమైనంత ఫైబర్ అందకపోతే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల ఊబకాయం వస్తుంది. దీని వల్ల రక్తపోటుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. గుండె జబ్బుల ప్రమాదం పెరగడానికి కూడా పైబర్ లేకపోవడం కారణం అవుతుంది. ఫైబర్ లేకపోతే కొలెస్ట్రాల్ పెరగడం, రక్తపోటు పెరగడం జరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.                                                *రూపశ్రీ.
థైరాయిడ్ మానవ శరీరంలో ముఖ్యమైన గ్రంథి.   ఇది హార్మోన్లను విడుదల చేయడం ద్వారా  పలు శారీరక విధులు సక్రమంగా ఉండేలా చేస్తుంది.  ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగా లేకుంటే శరీరంలో చాలా కార్యకలాపాలు గాడి తప్పుతాయి.  థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. లేకపోతే థైరాయిడ్ గ్రంథి పనితీరు మరింత దెబ్బతింటుంది. ఇంతకీ ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలంటే.. సోయా ఉత్పత్తులు.. సోయా ఉత్పత్తులు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది.  ఇది థైరాయిడ్ కోసం వాడే మందుల శోషణను అడ్డుకుంటుంది.  సోయా ఉత్పత్తులైన సోయా బీన్స్,  సోయా పాలతో చేసే పనీర్,  సోయా పాలు,  పచ్చిగా బీన్స్ లాగా ఉన్న సోయాను ఎడమామ్ అంటారు.. ఇవన్నీ కూడా సోయాకు సంబంధించినవే.. వీటిని థైరాయిడ్ ఉన్నవారు తీసుకోకూడదు. క్రూసిఫరస్ కూరగాయలు.. బ్రోకలి, కాలిఫ్లవర్,  క్యాబేజీ వంటి కూరగాయలను క్రూసిఫరస్ జాతికి చెందిన కూరగాయలు అంటారు.  వీటిలో గోయిట్రోజెన్ లు ఉంటాయి.  ఇవి పెద్ద మొత్తంలో తీసుకుంటే ప్రమాదం.  ముఖ్యంగా వీటిని చాలామంది డైట్ లో భాగంగా పచ్చిగానే తింటూ ఉంటారు. కానీ ఇవి థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తాయి. గ్లూటెన్.. ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ఉన్నవారు గ్లూటెన్ ఆహారాలు తీసుకోకూడదు. గ్లూటెన్ ఉన్న ఆహారాలు తీసుకుంటే థైరాయిడ్ వాపు మరింత పెరుగుతుంది. గోధుమలు, బార్లీ,  బియ్యం మొదలైనవాటికి దూరంగా ఉండాలి. చక్కెర.. చక్కెర చాలామందికి సాధారణం అయిపోయింది. కానీ చక్కెరతో కూడిన స్నాక్స్,  డ్రింక్స్ బరువు పెరగడానికి దారి తీస్తాయి. అంతే కాదు ఇవి ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తాయి. థైరాయిడ్ సమస్యలను క్లిష్టతరం చేస్తాయి. ప్రాసెస్ ఫుడ్స్.. ప్రాసెస్ ఫుడ్స్ కూడా థైరాయిడ్ సమస్య ఉన్నవారు తినకూడదు.  వీటిలో  ప్రిజర్వేటివ్ లు అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.  ఇవి థైరాయిడ్ వాపుకు,  బరువు పెరగడానికి దారితీస్తాయి. అయోడిన్.. అయోడిన్  ఆరోగ్యానికి మంచిదే కానీ.. అయోడిన్ అధికంగా ఉన్న ఉప్పును తీసుకుంటే థైరాయిడ్ పనితీరుకు అంతరాయం ఏర్పడుతుంది. థైరాయిడ్ ఉన్నవారు  అయోడిన్ ను చాలా పరిమితంగా తీసుకోవాలి. ఫ్రైస్.. వేయించిన ఆహారాలు కూడా థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తాయి. వేయించిన ఆహారాలు బరువు పెరగడానికి థైరాయిడ్ గ్రంథి వాపుకు దారితీస్తాయి.  థైరాయిడ్ ఆరోగ్యా్న్ని ప్రతికూలంగా మారుస్తాయి. కెపిన్.. కెఫిన్ ఉన్న కాఫీ, టీ,  శీతలపానీయాలు తీసుకుంటే థైరాయిడ్ పనితీరు దెబ్బ తింటుంది. ఆందోళనను పెంచుతుంది.  ఇది థైరాయిడ్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.                                                   *రూపశ్రీ.