Publish Date:Apr 20, 2015
Publish Date:Apr 20, 2015
Publish Date:Apr 13, 2015

EDITORIAL SPECIAL
  ప్రపంచ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్టుకు 300 మిలియన్ డాలర్ల రుణాల నుండి వైదొలగాలని నిర్ణయించింది.  Working Group on International Financial Institutions (WGonIFIs) మరియు అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ యొక్క బాధిత సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. ప్రజల ఉద్యమాలు, పౌర సమాజ సంస్థల వ్యతిరేకత మరియు ప్రభావిత వర్గాల వారి నుంచి తనిఖీ ప్యానెల్ కి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో బ్యాంక్ ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ విషయంపై నర్మదా బచావ్ ఆందోళన్ మరియు నేషనల్ అలియన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ యొక్క సీనియర్ కార్యకర్త మేధా పట్కర్ స్పందించారు. "అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్టులో పాల్గొన్న స్థూల ఉల్లంఘనలను ప్రపంచ బ్యాంక్ గ్రహించి, ఈ నిర్ణయం తీసుకోవడం మాకు సంతోషంగా ఉంది. నర్మదా మరియు టాటా ముంద్రా తరువాత, ఇది ప్రపంచ బ్యాంక్ గ్రూపుపై సాధించిన మూడవ అతిపెద్ద విజయం. నర్మదా బచావ్ ఆందోళన్ పోరాటం కారణంగా ఏర్పడిన తనిఖీ ప్యానెల్ ఈ విషయంలో కీలక పాత్ర పోషించినందుకు మేము సంతోషంగా ఉన్నాం. ప్రజల అనుమతి లేకుండా వారి ఎజెండాను ముందుకు తీసుకురావద్దని మేము ప్రభుత్వం మరియు ఆర్థిక సంస్థలను హెచ్చరిస్తున్నాం" అన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ కు 2014 లో శ్రీకారం చుట్టినప్పటి నుండి.. పర్యావరణ నిపుణులు, పౌర సమాజ సంస్థలు మరియు ఉద్యమ సంఘాలు.. పర్యావరణ చట్టాల ఉల్లంఘన, ఆర్థిక అసమర్థత, సారవంతమైన భూమిని భారీగా స్వాధీనం చేసుకోవడంపై తమ ఆవేదన వ్యక్తం చేశాయి. సారవంతమైన వ్యవసాయ భూములు తీసుకోవడం వల్ల జీవనోపాధిని కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసాయి. రాజధాని ప్రాంత రైతు సమాఖ్యకు చెందిన మల్లెల శేషగిరిరావు మాట్లాడుతూ.. "మా భూమి మరియు జీవనోపాధికి సంబంధించి అనిశ్చితితో మేము ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. ఈ పోరాటం మా జీవితంలో మరచిపోలేని ఒక ముద్ర వేసింది. ప్రపంచ బ్యాంక్ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగడంతో ఇప్పటికైనా రాష్ట్రం మరియు ఇతర ఫైనాన్షియర్లు అర్డంచేసుకొని.. ప్రజల ఆందోళనలను నిజాయితీ మరియు నిబద్ధతతో పరిష్కరిస్తాయని ఆశిస్తున్నాము." అన్నారు. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB) యొక్క మరొక సహ-ఫైనాన్షియర్.. తమను తాము పారిస్-పోస్ట్ బ్యాంక్‌గా అంచనా వేస్తూ.. వాతావరణ అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి నిబద్ధతను సూచిస్తూ, ఇప్పుడు దృష్టి సారించింది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ వారి అధికారిక పత్రాలలో పరిశీలనలో ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టులో కో-ఫైనాన్షియర్‌గా మాత్రమే ప్రవేశించి.. AIIB ఈ ప్రాజెక్టులో కట్టుబడి ఉండటానికి ప్రపంచ బ్యాంక్ విధానాలను ఉపయోగించింది. అయితే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు వైదొలగడంతో సహ-ఫైనాన్షియర్‌గా, ఇప్పుడు AIIB యొక్క స్థితి అస్పష్టంగా ఉంది. WGonIFIs రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరవల్సినవి: 1. సిఆర్‌డిఎ ల్యాండ్ పూలింగ్ యాక్ట్‌.. 2013 కేంద్ర చట్టానికి విరుద్ధంగా ఉంది. అమరావతి క్యాపిటల్ రీజియన్‌లోని బాధిత ప్రజలందరి విషయంలో భూసేకరణ మరియు పునరావాస చట్టం, 2013 ను పూర్తిగా అమలు చేసి. అలాగే, ప్రజల నుండి అసంకల్పితంగా తీసుకున్న స్థలాలను ప్రభుత్వం తిరిగి ఇవ్వాలి.  2. వ్యవసాయం, కార్మికులు, అద్దెదారులు, భూమిలేని కుటుంబాలు, భూసేకరణ మరియు స్థానభ్రంశం ప్రక్రియ కారణంగా తీవ్రమైన ఒత్తిడి మరియు భయానికి గురైన దళితుల సామాజిక-ఆర్థిక నష్టం, భూ లావాదేవీలు అంశాలపై న్యాయ విచారణను ప్రారంభించాలి. 3. గత ఐదేళ్లలో వారి సామాజిక జీవితం చాలా వరకు దెబ్బతిన్నందున దళితులు మరియు భూ యజమానుల కోసం ప్రత్యేక పరిహార ప్యాకేజీని ప్రకటించాలి. 4. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మరియు క్యాపిటల్ రీజియన్ ప్రకటించిన తరువాత కేటాయించిన భూములను కొనుగోలు చేసిన ఇతర వ్యక్తులను ప్రాసిక్యూట్ చేయాలి. 5. డాక్యుమెంటరీ తారుమారు ద్వారా దళిత రైతులను రికార్డుల నుండి తొలగించే ప్రయత్నాలను ఆపివేసి, 2013 చట్టం ప్రకారం పరిహారం మరియు ఆర్‌అండ్‌ఆర్ ప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకున్న భూమికి అసలు యజమానులుగా దళితులని పరిగణించాలి. ప్రాజెక్ట్ గురించి: జూన్ 2014 లో ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తరువాత, కొత్తగా ఏర్పడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు హైదరాబాద్‌ను 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని నిర్ణయించుకున్నాయి. 2014 సెప్టెంబరులో, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అమరావతిని ప్రతిపాదిత రాజధాని నగరంగా ప్రకటించారు, దీనిని చాలా సంవత్సరాలు పాటు అభివృద్ధి చేయనున్నారు. 715 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రపంచ బ్యాంక్ మరియు AIIB పరిశీలనలో ఉన్నాయి. రిస్క్ అసెస్‌మెంట్‌లో కూడా, ప్రపంచ బ్యాంక్ సామాజిక మరియు పర్యావరణ ప్రభావాలను సూచిస్తూ ఈ ప్రాజెక్ట్ కి కేటగిరి A ని కేటాయించింది. కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో నగరాన్ని నిర్మించడం, సారవంతమైన వ్యవసాయ భూములు మరియు అడవులను తొలగించడం, సుమారు 20 వేల కుటుంబాలను స్థానభ్రంశం చేయడం, బలవంతంగా భూములు స్వాధీనం చేసుకోవడం మరియు నగర నిర్మాణానికి కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం వంటి విషయాల్లో ఈ ప్రాజెక్టుపై విమర్శలు వచ్చాయి. ప్రపంచ బ్యాంకు యొక్క భద్రతా విధానాలను ఉల్లంఘించినందుకు ఈ ప్రాజెక్టుపై దర్యాప్తు చేయడానికి ప్రపంచ బ్యాంకు యొక్క తనిఖీ ప్యానెల్ కు 2017 లో బాధిత సంఘం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ప్రక్రియలో ఉంది మరియు తనిఖీ బోర్డు నుండి దర్యాప్తు అర్హతపై సిఫారసు కోసం బ్యాంక్ బోర్డు వేచి ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్టుకు 300 మిలియన్ డాలర్ల రుణాల నుండి వైదొలగాలని నిర్ణయించింది. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకోవడంపై.. అధికార వైసీపీపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో అమరావతి నిర్మాణం మీద వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. అప్పుడు ప్రపంచబ్యాంకు బృందం అమరావతిని సందర్శించి పూర్తిస్థాయిలో సంతృప్తి చెందడమే కాకుండా మరింతగా ఆర్థికంగా సహాయపడాలని నిర్ణయించింది. కానీ వైసీపీ నేతలు కొందరు రాజ‌ధాని విష‌యంలో కోర్టుల‌కు, గ్రీన్ ట్రిబ్యూన‌ల్ కి కూడా ఫిర్యాదులు చేశారు. వ‌ర‌ద‌ముప్పు, వివిధ పంట‌లు పండించే ప్రాంతం, సామాజిక‌, ప‌ర్యావ‌ర‌ణ కోణంలో జ‌రిగేన‌ష్టం వంటి అంశాల‌ను ముందుకు తీసుకొచ్చారు. అక్కడితో ఆగక ప్ర‌భుత్వం రాజ‌ధాని విష‌యంలో ప్ర‌జాభిప్రాయానికి భిన్నంగా వెళుతుందంటూ రాజ‌ధాని ప్రాంత రైతుల పేరిట కొంద‌రు 2017 మే 25 నాడు ప్ర‌పంచ‌బ్యాంక్ కి ఈమెయిల్స్ పంపి ఫిర్యాదు చేశారు. ఆ విషయాలను గుర్తుచేస్తూ టీడీపీ విమర్శిస్తోంది. ప్రతిపక్షం నుంచి అధికారంలోకీ వచ్చిన వైసీపీ ఇప్పుడు రాజధాని విషయంలో ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.
  మహిళలు తలుచుకుంటే కుటుంబాన్నే కాదు, సమాజాన్ని కూడా చక్కదిద్దగలరని.. మహిళలు ఎందులోనూ తక్కువకాదని.. సహనంలోనైనా, సాహసించి పోరాడటంలోనైనా వారి తరువాతే ఎవరైనా అని ఎందరో మహిళలు రుజువు చేసారు. అలాంటి వారిలో 'దుర్గాబాయి దేశ్‌ముఖ్' ముందు వరుసలో ఉంటారు. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా.. ఆమె సాహసాలను, ఆమె సేవలను గుర్తు చేసుకొని స్ఫూర్తి పొందుదాం. దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో.. 1909 జూలై 15 న మధ్య తరగతి కుటుంబంలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. 8 ఏళ్ళ వయసులోనే ఆమెకు మేనమామ సుబ్బారావుతో వివాహమయింది. అయితే తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకించారు. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు కూడా అంగీకరించారు.  బాల్యం నుండి ప్రతిభాపాటవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించారు. దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాలుపంచుకున్నారు. ఓ వైపు చదువుకుంటేనే మరోవైపు స్వాతంత్ర్య పోరాటంలో తనవంతు పాత్ర పోషించారు. తన 12 ఏళ్ళ వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించి.. రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను నెలకొల్పారు. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఆమె విరాళాలను సేకరించి ఆయనకు అందచేశారు. తన చేతులకు ఉన్న బంగారు గాజులను సైతం విరాళంగా అందించారు. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణంగా ఆయనను అనుమతించలేదు. తన కర్తవ్య నిర్వహణకు గాను నెహ్రూ నుండి ఆమె ప్రశంసలు పొందారు. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కూడా అయ్యారు. స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి.. బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసారు. న్యాయశాస్త్రం చదివిన తరువాత మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించారు. తరువాత ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరు సంపాదించారు. స్వాతంత్ర్య పోరాటంలోనే కాదు సేవా కార్యక్రమాల్లోనూ ఆమె ముందుండేవారు. దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేశారు. ఆమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది. 1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బ్రుందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించారు. 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. స్వాతంత్ర్యం తర్వాత.. భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పనిచేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసారు. ఆ సందర్భములో సి.డి.దేశ్‌ముఖ్తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న జరిగింది. ఈవిడ 1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా, ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పనిచేసారు. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు మరియు వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు.  ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఆమె 1975 లో పద్మ విభూషణ్ పొందారు. దుర్గాబాయి..1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు. అయితేనేం మరణంలేని ఓ వ్యవస్థగా ఆమె ఎప్పుడూ మనమధ్యనే చిరస్థాయిగా నిలిచి ఉంటారు. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో ఈవిడ పేరున డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను నెలకొల్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 2006లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌గా నామాంతరం చెందింది.
  పోలవరం ప్రాజెక్ట్ అసలు ఇప్పట్లో పూర్తవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పోలవరం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. వందల మంది కార్మికులు, భారీ యంత్రాలతో హడావుడిగా కనిపించే పోలవరం ప్రాంతంలో ఇప్పుడు స్తబ్దత నెలకొంది. ఇప్పటికే ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వరద సీజన్‌ కాబట్టి డయాఫ్రంవాల్‌, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు కూడా నిలిచిపోయాయి. స్పిల్‌వే వద్ద కాంక్రీటు పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. రాబోయే రెండు మూడు నెలలు వరదల ప్రభావం ఉంటుంది. మరోపక్క వర్షాలు కూడా వస్తాయి. ఇలా కొంతకాలం ఈ పనులు పుంజుకునే అవకాశం లేదు. ఇటీవల ఈ ప్రాజెక్టు నిర్మాణ అంచనాను రూ.55వేల కోట్లకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కానీ కేంద్ర బడ్జెట్‌లో నిధులు ఏమీ కేటాయించలేదు. ఇప్పటికే కేంద్రం నుంచి రూ.వేల కోట్లు రావలసి ఉంది. ఈ నేపథ్యంలో పోలవరం పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రూ.కోట్లాది బిల్లులు పెండింగ్‌ పడడంతో కాంట్రాక్టు సంస్థలు మెల్లగా సర్దుకుంటున్నాయి. ఇంతకాలం మట్టి పనులు చేసిన త్రివేణీ సంస్థ ఇప్పటికే ప్రాజెక్టు పని నుంచి తప్పుకుంది. తన కంటైనర్లతోపాటు ఇతర ఎక్విప్‌మెంట్‌ను కూడా తరలించుకుని పోతోంది. ఈ సంస్థకు సుమారు రూ.70 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌ ఉన్నాయట. దీనికంటే ముందు ఎల్‌అండ్‌టీ సంస్థ కాఫర్‌ డ్యామ్‌ బెడ్‌ పనులు చేసి వెళ్లిపోయింది. ఆ సంస్థకు కూడా రూ.కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం నవయుగ, మరో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ మాత్రమే ఉన్నాయి. వీటికి కూడా రూ.వందల కోట్ల బిల్లు బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. పోలవరం ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులు గత నెలలోనే ఆగిపోయాయి. పోలవరం ప్రాజెక్టు అథార్టీ ఆదేశాల మేరకు ఈ పనులు ఆపేశారు. ఉభయగోదావరి జిల్లాల్లోని పోలవరం, దేవీపట్నం మండలాల మధ్య గోదావరిలో నిర్మించనున్న ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం, దానికి ఎగువ, దిగువ భాగాలలో కాఫర్‌ డ్యామ్‌లు నిర్మాణం చేపట్టారు. 2.47 కిలోమీటర్ల పొడవు లక్ష్యంగా పెట్టుకుని రెండు కరకట్టల మధ్య దీని నిర్మాణం చేపట్టారు. అందులో గత నెల వరకూ 1.7 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఇంతలో ఈ పనులు ఆపేయమని పీపీఏ ఆదేశించడంతో పనులు ఆగిపోయాయి. దీనిని తర్వాత పూర్తి చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. కానీ ప్రస్తుతం వరదల వల్ల ఇంతవరకూ నిర్మించిన కాఫర్‌డ్యామ్‌ దెబ్బతినకుండా పీపీఏ ఓ డిజైన్‌ ఇచ్చింది. దాని ప్రకారం రక్షణ చర్యలు చేపట్టారు. మరో వారం రోజుల్లో ఇవి పూర్తి కావచ్చని చెబుతున్నారు. మరోవైపు దేవీపట్నం మండలంలో 34 గ్రామాలకు వరద ముప్పు ఉందని, ప్రజలు ఆ గ్రామాలను ఖాళీ చేయాలని చెబుతున్నారు. కానీ తూర్పుగోదావరి జిల్లాలో పునరావాస కాలనీలు ఇంకా పూర్తి కాకపోవడంతో అధికారులు ఏ నిర్ణయం తీసుకోవాలని తటపటాయిస్తున్నారు. కొందరు ప్రజలు స్వచ్ఛందంగానే తరలివెళ్లిపోతున్నారు. ఎందుకంటే సాధారణంగా ప్రతీ ఏటా వరదల వల్ల దేవీపట్నం మండలంలో చాలా గ్రామాలు మునిగిపోతుంటాయి. పడవ ప్రయాణమే శరణ్యం. కానీ ఈసారి గోదావరిలో కాఫర్‌ డ్యామ్‌ నిర్మించారు. ఇక్కడ గోదావరి వెడల్పు 2.45 కిలోమీటర్లు. గతంలో ఇంత వెడల్పున గోదావరి వరద నీరు కిందకు ప్రవహించేది. కానీ ఇప్పటికే 1.7 కిలోమీటర్ల కాఫర్‌ డ్యామ్‌ను గోదావరికి అడ్డంగా కట్టారు. సుమారు 25మీటర్ల ఎత్తులో ఉంది. దీనికి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల వైపు నదిలో కొంత భాగం వదిలేశారు. ప్రస్తుతం వరద నీరు కాఫర్‌ డ్యామ్‌ కట్టగా, మిగిలిన నదీ భాగం నుంచే కిందకు లాగవలసి ఉంది. ప్రస్తుతం పోలవరం వైపు పైపుతో నిర్మించిన వంతెన ద్వారా నదిని మళ్లించారు. కానీ గోదావరి వరద ఉధృతమైతే ప్రాజెక్టు వద్ద తక్కువ భాగంలో నుంచి మొత్తం నీరు లాగదు. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతం అంటే పాపికొండల వైపు వరదనీరు ఎగదన్నే అవకాశం ఉంది. ఆయా గ్రామాలలో ఎక్కువ నీరు నిల్వ ఉండి, గ్రామాలలో జనం ఉండే పరిస్థితి ఉండకపోవచ్చని ప్రజల ఆందోళన చెందుతున్నారు.
ALSO ON TELUGUONE N E W S
తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్ గా ద‌క్షిణాదినే టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా వెలుగొందుతున్న న‌య‌న పారితోష‌కం గురించి ఇప్పుడు ఆస‌క్తిదాయ‌క‌మైన ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈమె ఏ భాషైన స‌రే. ప్ర‌తి సినిమాకు ఏకంగా ఐదు కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు పారితోష‌కం డిమాండ్ చేస్తోంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ద‌క్షిణాదిలో న‌య‌న‌తార స్టార్ హీరోయిన్. లేడీ సూప‌ర్ స్టారే అందులో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు లేవు క‌నుకే ఆమెతో సినిమాలు చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యూక‌డుతున్నారు. త‌న‌కు వ‌స్తున్న ఆఫ‌ర్లు ద‌క్కుతున్న విజ‌యాల‌ను చూసి న‌య‌న‌తార కొండెక్కి కూర్చుంటోద‌ట‌. షూటింగ్ స‌మ‌యంలో త‌న‌కు స్టార్ హోట‌ల్స్ లోనే బ‌స ఏర్పాటు చేయాల‌నీ, ఆ స్థాయిలోనే మెను ఉండాలన్న కోరిక‌ల‌తో పాటు మ‌రికొన్ని కోరిక‌ల చిట్టా త‌న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అందిస్తోంద‌ట‌. ఐతే డిమాండ్ అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం న‌య‌న‌తార ఈ మాత్రం పారితోష‌కం తీసుకోవ‌డంలో వింత ఏమీ లేదని సినీ విశ్లేష‌కులు అంటున్నారు.అస‌లే నిర్మాణ వ్యాయాన్ని ఎలా త‌గ్గించుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న నిర్మాత‌ల‌కు న‌య‌న కోరిక చిట్టా చూసి క‌ళ్లు తారుగుతున్నాయ‌ట‌. మొత్తానికి స్టార్ హీరో స్థాయిలో డిమాండ్ చేస్తున్న న‌య‌న‌తార కన్నా మ‌రో హీరోయిన్ బెట‌రేమో అన్న ఆలోచ‌న చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కాక‌పోతే ఆ స్థాయిలో మ‌రో హీరోయిన్ లేక‌పోవ‌డం న‌య‌న అదృష్ట‌మంటున్నారు సినీ జ‌నాలు. 
మ‌రి కొన్ని గంట‌ల్లోనే బిగ్ బిస్ సీజ‌న్ 3 ప్రారంభం కానున్న స‌మ‌యంలో వివాదాలు బిగ్ బిగ్ చుట్టూ వేగంగా అల్లుకుంటున్నాయి. ఇప్ప‌టికే గాయ‌త్రి గుప్త‌, శ్వేత రెడ్డి, కేతిరెడ్డి త‌దిత‌రులు కేసులు పెట్టి బిగ్ బిస్ ను వివాదాల పాలు చేసారు.  బిగ్ బాస్ లాంటి షోస్ వ‌ల్ల యూత్ పెడ‌దోవ ప‌డుతుందంటూ కేతి రెడ్డి తెలంగాణ హై కోర్టులో పిటిష‌న్ వేసారు.  ఇక దీనికి స‌పోర్ట్ చేస్తూ ఓయూ స్టూడెంట్స్ కూడా బిగ్ బాస్ పై క‌న్నెర్ర చేస్తూ షోను విప‌రీతంగా వ్య‌తిరేకిస్తున్నారు. బిగ్ బాస్ స్టార్ట్ కాకుండా నిలిపివేయ‌డానికి ఓయూ విద్యార్థులు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు బంజారాహిల్స్ లోని అన్న‌పూర్ణ స్టూడియోను చుట్టుముట్టారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.  ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్ నిర్వాహ‌క కార్యాల‌య్యాన్ని, నాగార్జున ఇంటిని కూడా ముట్ట‌డించే అవ‌కాశాలు కూడా ఉండ‌టంతో ఈ రెండు చోట్ల పోలీస్  సెక్యూరిటీని క‌ల్పించారు. దీంతో బిగ్ బాస్ షో ప్రారంభం వాయిదా ప‌డే అవ‌కాశాలున్న‌ట్లు కొంత అంటున్నారు. చూద్దాం చివ‌ర‌కు ఎలా ఉంటుందో మ‌రి. 
అడివి శేష్ నటిస్తున్న తాజా సినిమా 'ఎవరు'. శుక్రవారం టీజర్ విడుదలైంది. ఈ కార్యక్రమానికి సమంత ముఖ్య అతిథిగా విచ్చేశారు. తనకు టీజర్ నచ్చిందని, అడివి శేష్ కొత్త కంటెంట్‌తో సినిమాలు తీస్తున్నాడని, ఇండస్ట్రీని ముందుకు తీసుకు వెళ్తున్నాడని సమంత ప్రశంసల వర్షం కురిపించారు. 'ఎవరు'కు ముందు అడివి శేష్ నటించిన సినిమా 'ఓ బేబీ'. అందులో అతడిది అతిథి పాత్రే. సమంతతో స్నేహం కారణంగా చిన్న పాత్రలో నటించాడని అనుకోవచ్చు. ఎందుకంటే... శేష్‌కి స‌మంత సెంటిమెంట్ అని ఇండ‌స్ట్రీ టాక్‌. తన ప్రతి సినిమా టీజ‌ర్‌ను స‌మంత‌తో విడుద‌ల చేయిస్తున్నాడు మరి. 'ఎవరు' చిత్రానికి ముందు అడివి శేష్ సోలో హీరోగా నటించిన సినిమా 'గూఢచారి'. సమంతే ఆ సినిమా టీజర్ విడుదల చేశారు. అంతకు ముందు సోలో హీరోగా నటించిన సినిమా 'క్షణం' టీజ‌ర్‌నూ సమంతే విడుదల చేశారు. 'బ్రహ్మోత్సవం' సెట్‌లో మ‌హేష్‌ బాబుతో క‌లిసి! అడివి శేష్ నెక్స్ట్ సినిమా టీజర్ కూడా సమంత విడుదల చేస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. 'ఎవరు' టీజర్ విషయానికి వస్తే... కొత్త కాన్సెప్ట్‌తో మరో మర్డర్ మిస్టరీ థ్రిల్ల‌ర్‌తో అడివి శేష్‌ వస్తున్నట్టున్నాడు. ప్రేక్షకుల్లో ఈ టీజర్ ఆసక్తి రేపింది.
సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుపై డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ డిస్కషన్ పాయింట్ అయ్యాయి. 'ఇస్మార్ట్ శంకర్' ప్రచారంలో భాగంగా ఒక ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మ‌హేష్‌పై పూరి గట్టి సెటైర్ వేశాడు. హిట్టుల్లో ఉంటేనే మహేష్ అవకాశం ఇస్తాడని ఆయన వ్యాఖ్యానించారు. మహేష్ అభిమానులకు తనపై నమ్మకం ఉన్నప్పటికీ... మ‌హేష్‌కి లేద‌నీ, అవకాశం ఇవ్వడం లేదని పూరి స్పష్టంగా చెప్పాడు. 'ఇస్మార్ట్ శంకర్' విజయం సాధించింది కనుక ఇప్పుడు మహేష్ మీకు అవకాశం ఇస్తారేమో అని యాంకర్ అనగా... 'నాకో క్యారెక్టర్ ఉంటుంది కదా. నేను ఓకే అనాలి కదా' అని పూరి సెలవిచ్చారు. పూరీని మహేష్ పిలిచి సినిమా చేద్దామని అడిగినా... పూరి చేయరు అన్నమాట. పూరి వ్యాఖ్యలపై మహేష్ అభిమానులు గుస్సా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ దర్శకుణ్ణి ఒక ఆట ఆడుకుంటున్నారు. భీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. మహేష్-పూరి కాంబినేష‌న్‌లో 'పోకిరి', 'బిజినెస్‌మేన్‌' వచ్చాయి. ఈ రెండు సినిమాలకు ముందు పూరి సూపర్ డూపర్ హిట్స్ ఇవ్వలేదని, ఫ్లాపుల్లో ఉన్నాడని మహేష్ అభిమానులు చెబుతున్న మాట. మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఆ రెండు సినిమాలు పూరి హిట్స్ ఇచ్చినప్పుడు మహేష్ అంగీకరించినవి అట. పూరి కోపానికి కారణం కూడా మహేష్ అంటున్నారు. 'జనగణమణ' కథ విని, అనౌన్స్ చేయమని పూరీతో చెప్పిన మహేష్, ఆ తరవాత మరో మాట చెప్పకుండా పూరీని పక్కన పెట్టారట. ఇదెంతవరకూ నిజమో మరి! ఓ పక్క ఈ డిస్కషన్ జరుగుతుండగా... 'సరిలేరు నీకెవ్వరు' సినిమా గురించి జగపతిబాబు క్లారిఫికేషన్ ఇచ్చారు. తాను ఇప్పటికీ 'సరిలేరు నీకెవ్వరు' చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఆ సినిమా కోసం రెండు సినిమాలను వదులుకున్నానని జగపతిబాబు వివరంగా చెప్పారు. ఆయన మాటలకు మద్దతు ఇస్తూ అనిల్ రావిపూడి కూడా వివరణ ఇచ్చారు. ఈ వివాదంలోనూ త‌ప్పు మ‌హేష్‌దేన‌ని ఇండస్ట్రీ గుసగుస. జగపతి బాబును వద్దని, ప్రకాష్ రాజ్‌ను తీసుకోమని దర్శకుడితో మహేష్ చెప్పారట.
  తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ షో మూడో సీజన్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. హౌస్‌లోకి వెళ్లబోయేది ఎవరన్నది ఇప్పటి వరకు మా టీవీ, బిగ్ బాస్ యాజమాన్యం సస్పెన్స్ కొనసాగిస్తోంది. కొంతమంది పేర్లు బయటకు వచ్చినా అది నిజమో కాదో తెలీక సస్పెన్స్ అలాగే కొనసాగిస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ షోలో పాల్గొనబోయేది వీరేనంటూ గత సీజన్ లో కామన్ మ్యాన్ గా పార్టిసిపేట్ చేసిన నూతన్ నాయుడు వెల్లడించాడు. బిగ్‌బాస్ షో పోటీదారులు వీరేనంటూ 15 మంది పేర్లను లీక్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.   నూతన్ నాయుడు వెల్లడించిన ఆ 15 మంది సెలబ్రిటీలు ఎవరంటే నటి హేమ, యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, నటి హిమజా రెడ్డి, నటుడు వరుణ్ సందేశ్-వితికా షెరు(జంట), సీరియల్ నటుడు రవికృష్ణ, సీరియల్ యాక్టర్ అలీ రెజా, టీవీ9 న్యూస్ యాంకర్ జాఫర్, నటి పునర్వీ భూపాలం, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యూట్యూబ్ కామెడీ స్టార్ మహేశ్, సీరియల్ నటి రోహిణి, డబ్‌స్మాష్ స్టార్ అశు రెడ్డి(సమంతా డూప్) ఉన్నారు.  ఈ జాబితా తనకు ఎలా వచ్చిందీ అంటే సీక్రెట్ అంటున్న నూతన్ నాయుడు రెండు రోజులు ఓపిక పడితే తను చెప్పింది నిజమే అని మీరే ఒప్పుకుంటారంరని అంటున్నాడు నూతన్ నాయుడు. చూద్దాం ఎంతవరకూ నిజం అవుతుందో ?
  కర్నూలు జిల్లాలో కీలక నియోజకవర్గం గా పేరొందిన ఆళ్లగడ్డలో రాజకీయాలు పలు కీలక మలుపులు తిరుగుతున్నట్టు చెబుతున్నారు. తల్లి మరణంతో వైసీపీ నుంచి ఏకగ్రీవంగా విజయం సాధించి ఆ తర్వాత పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరి తండ్రి మరణంతో మంత్రి పదవి దక్కించుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ స్థానం నుండి ఓడిపోయారు. గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు గంగుల బిజేంద్ర రెడ్డి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు.  ఆమె మాత్రమే కాక ఆమె సోదరుడు కూడా నంద్యాల నుండి పోటీ చేసి ఓడిపోవటంతో వారింట ముసలం పుట్టినట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎన్నికల ముందే ఆమె మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ వీడి వైసీపీలో చేరిపోయారు. అలాగే సొంత బాబాయ్ గా భావించే సుబ్బారెడ్డి కూడా తనకు ప్రాధాన్యత తగ్గించిన క్రమంలో వారి కుటుంబానికి దూరం అయ్యారు. భూమా అఖిలప్రియ భార్గవ్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్నాక భూమా కుటుంబంలో చీలిక వచ్చినట్టు సమాచారం.  అఖిలప్రియ భర్త అన్నీ తానై వ్యవహరించడం కూడా భూమా వర్గీయులను దూరంగా జరగడానికి కారణమైందని అంటున్నారు. మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు కూతురిని వివాహం చేసుకున్న భార్గవ్ ఆ తర్వాత అఖిల ప్రియతో ప్రేమలో పడి ఆమెకి విడాకులు ఇచ్చి మరీ అఖిల ప్రియను పెళ్లి చేసుకున్నారనే ప్రచారం ఉంది. ఆ విషయం పక్కన పెట్టినా ఆమెను వివాహం చేసుకున్న నాటి నుండే మంత్రి భర్తగా ఆయన తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు.  అధికారిక పర్యటనలు మొదలు పార్టీ పర్యటనల దాకా అఖిల్ వెన్నంటే ఉండేవారు. ఇదే భూమా వర్గీయులకి కోపం తెప్పించిందట. భూమా తర్వాత భూమ వారసుడిగా జగత్ విఖ్యాత్ రెడ్డిని తెరమీదకు తేవాలని భూమా వర్గం భావిస్తోంది, కానీ అఖిలప్రియ భర్త హోదాలో భార్గవ్ తానే భూమా వారసుడిననేలా ప్రవర్తిస్తుండడంతో అఖిలప్రియకు బదులుగా భూమా వర్గాన్ని లీడ్ చేసేందుకు విఖ్యాత్ రెడ్డిని, అలాగే వీరికి సోదరుడు వరసయ్యే కిషోర్ రెడ్డిని తెరపైకి వచ్చారు.  ఇప్పటికే వైసీపీలో గంగుల వర్గం ఉంది కాబట్టి, కిషోర్ రెడ్డి బీజేపీలో చేరి భూమా లీగసీని నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీంతో అఖిలప్రియకు ఇప్పుడు ఆమె సోదరుడు కిషోర్ కుమారే పోటీ అని భూమా వర్గం భావిస్తుందట. విఖ్యత్ రెడ్డి ప్రస్తుతం చదువుకుంటున్నాడు, ఆయన లైన్ లోకి వచ్చే దాకా కిషోర్ రెడ్డిని నిలబెట్టాలని చూస్తున్నారని అంటున్నారు.    
  ఐటీ శాఖలో రూ. 25 వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ గత ఏడాది సెప్టెంబర్ లో అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు మీదా ఐటీ శాఖామంత్రిగా ఉన్న ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్‌ మీద హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అవినీతిపై సీబీఐ, ఈడీ విచారణ కోరుతూ మాజీ న్యాయమూర్తి శ్రావణ్‌ కుమార్‌ అప్పట్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గత టర్మ్ లో ఏపీఎన్‌ఆర్టీ చైర్మన్‌ గా ఉన్న వేమూరి రవికుమార్‌, మాజీ ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాధరెడ్డిలకి కూడా ఈ అవినీతి కుంభకోణంలో హస్తం ఉందని ఆయన ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.  దొంగ ఎంవోయూలతో వేల ఎకరాల భూమిని ధారదత్తం చేశారని, దీని ద్వారా లబ్ది పొంది భారీ ఎత్తున ఆస్తులను పెంచుకున్నారని అప్పట్లో పిటిషనర్ పేర్కొన్నారు. కనీస అర్హత కూడా లేని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని నాలుగేళ్లుగా కార్యకలపాలు చేపట్టలేదని పిటిషన్‌లో వెల్లడించారు. ఐటీ కంపెనీల పేరుతో జరిగిన క్విడ్‌ ప్రోకోపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని ఆయన హైకోర్టును కోరారు. అయితే ఈ విషయం మీద పూర్తి వివరాలతో అంటే ఆరోపణలు చేస్తున్న కంపెనీల పూర్తి వివరాలతో మళ్ళీ రమ్మని కోర్టు పేర్కొనడంతో అసలు ఆర్టీఏ ద్వారా సమాచారం కోరినా తనకు ఆ వివరాలు ఇవ్వడం లేదని పిటిషనర్‌ హైకోర్టుకు విన్నవించుకుని కేసు ఉపసంహరించుకున్నారు.  ఈ విషయం మామూలు వార్తలాగా వచ్చి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి అంతామారిపోయి జగన్ సీఎం కావడంతో లోకేష్ అవినీతిని జగన్ సర్కార్ టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఈ మధ్యనే పార్టీ మారి కాషాయం కండువా కప్పుకున్న ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ హైలైట్ చేశారు. లోకేష్‌ మంత్రిగా వ్యవహరించిన ఐటీశాఖలో భారీగా ఎత్తున అవినీతి జరిగిందనే విషయం మీద విచారణ చేపట్టమని కోరేందుకు రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుస్తానని ఆయన చెప్పారు.  కేంద్రంతో కూడా మాట్లాడి సీబీఐ విచారణ జరమని ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. లోకేష్‌ తో కలిసి పనిచేయడం ఇష్టం లేకనే టీడీపీకి రాజీనామా చేశానని చెప్పిన ఆయన లోకేష్‌ కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలయిందని అన్నారు. ఇక త్వరలో పార్టీ ఖాళీ కాబోతుందని అది కూడా లోకేష్ కారణంగానే జోస్యం చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే గత ప్రభుత్వ అవినీతి కోసం భూతద్దం వేసుకుని మరీ వెతుకున్న జగన్ కి ఊతం ఇచ్చినట్టు అవుతుంది.  వెదకబోయే తీగ కాలికి తగిలినట్టు జగన్ కి లోకేష్ అవినీతి కేసు దొరికిందని అంటున్నారు విశ్లేషకులు. నిజంగా అవినీతి జరిగిందా ? లేదా అనేది పక్కన పెడితే ఈ విషయం మళ్ళీ హైలైట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ యంత్రాంగం, బీజేపీ కలిస్తే లోకేష్ ని అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తమకి ఎదురుతిరిగిన వారికి షా-మోడీలు ఎంత వరకూ చుక్కలు చూపిస్తారో లాలూ వంటి వారి విషయంలో చూశాం కదా.  
  ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ప్పటి నుండి అవినీతిలేని పాలన అందిస్తానని వాగ్దానాలు చేస్తున్నారు. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. అయితే తన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ‘ఎన్నికల్లో అప్పులు చేసి మరీ కోట్లు ఖర్చుపెట్టుకున్నాం. తీరా గెలిచాక పైసా తీసుకోవద్దంటున్నారు. ఇలా అయితే ఇక రాజకీయాలు చేసినట్టే.’ అని కొందరు ఎమ్మెల్యేలు తెగ ఫీలై పోతున్నారట. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఎవరు అవినీతికి పాల్పడినా సహించబోనన్న జగన్ నిర్ణయం వారికి ఇబ్బందికరంగా మారిందట. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఇంటిలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్న జగన్.. ఎమ్మెల్యేలు, మంత్రుల లావాదేవీలపై దృష్టిసారిస్తున్నారు. ఇదే క్రమంలో ఉద్యోగుల బదిలీల్లో జోక్యం చేసుకున్న నలుగురు మంత్రులకు జగన్ ఇప్పటికే ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే బాటలో సీఐల బదిలీల్లో రూ.10 లక్షలు తీసుకున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేను తన వద్దకు పిలిపించుకుని మరీ సదరు సీఐకి డబ్బులు వెనక్కి ఇప్పించారు. సీఐల బదిలీల్లో పది లక్షలు రూపాయలు తీసుకున్న ఎమ్మెల్యే నుంచి జగన్ డబ్బులు వెనక్కి ఇప్పించడం ఇప్పుడు ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోందట. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డబ్బులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అసాధ్యం అన్న వాదన స్ధిరపడిపోయింది. ఏపీలో ఇటీవల ఎన్నికల్లో కూడా సగటున ప్రతీ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే అభ్యర్ధి దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు ఓ అంచనా. చాలా మంది పొలాలు, స్ధలాలు అమ్ముకుని, కొందరైతే అప్పులు చేసి మరీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే తన హయాంలో అవినీతి రహిత పాలన సాగాలన్న జగన్ నిర్ణయం వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యాక కాంట్రాక్టులు, పైరవీల ద్వారా ఎంతో కొంత సంపాదించుకుందామనుకుంటున్న సమయంలో.. జగన్ ఇలాంటి అవినీతి రహిత పాలన నిర్ణయం తీసుకోవడం కొందరు ఎమ్మెల్యేలకు రుచించడం లేదట. ఇదే పరిస్ధితి కొనసాగితే ఇక రాజకీయాల్లో కొనసాగడం కూడా కష్టమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టింది అధికారంలోకి వస్తే తిరిగి సంపాదించుకునేందుకేనని, ఇప్పుడిలా ఆంక్షలు విధిస్తే తమ భవిష్యత్తు ఏం కావాలని వారు ప్రశ్నిస్తున్నారట. మరోవైపు ఇంటిలిజెన్స్ వర్గాలతో తెప్పించుకుంటున్న సమాచారం ఆధారంగా నియోజకవర్గాలతో పాటు సచివాలయంలో సైతం ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు జగన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఐదారుగురు మంత్రులు, వారి వద్ద పనిచేస్తున్న సిబ్బంది చేస్తున్న దందాలు జగన్ దృష్టికి చేరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ వారి విషయంలో సీరియస్ గా ఉన్నారట. ఇదే పరిస్ధితి కొనసాగితే కఠిన చర్యలకు వెనుకాడేది లేదనే హెచ్చరికలు కూడా పంపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట.
  గత ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలలో ముఖ్యమైన హామీ మద్యపాన నిషేధం. ఈ పధకం నచ్చి ఆడపడుచులు వోట్లు వేశారో లేదో ? తెలీదు కానీ, ఆ పధకం అమలు చేయకుంటే ప్రతిపక్షాల నుండి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెబుత్నున్నారు. అందులో భాగంగా ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ప్రభుత్వమే స్వయంగా మద్యం వ్యాపారంలోకి ప్రవేశించనుందట.  దానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసేందుకు వీలుగా చట్ట సవరణ కూడా చేయాలని భావిస్జోంది. ఆ ముసాయిదా బిల్లును మంత్రివర్గం నిన్న ఆమోదించింది. మరో రెండు రోజుల్లో ఈ బిల్లు ఉభయ సభలకు రానుందని అంటున్నారు. చట్ట సవరణ తరువాత అక్టోబర్ 1 నుంచి ఏర్పాటయ్యే నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రైవేటు మద్యం దుకాణాల స్ధానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు అవుతాయి. తొలి దశలో 1,095 మద్యం దుకాణాలు రద్దు చేయాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు.  రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం దుకాణాలకు లైసెన్సులు ఉండగా, వీటిలో 25 శాతం అంటే 1,095 దుకాణాలు రద్దుచేయాలని తీర్మానించింది. దీంతో ఇప్పటి దాకా  బ్రూవరీస్‌ల్లో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి, మద్యం లైసెన్సుదారులకు విక్రయించటానికే పరిమితం అయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) స్వయంగా మద్యం దుకాణాలను నడపనుంది. ఇక మద్యం ధరలను కూడా పెంచడం ద్వారా ఎక్సైజ్ సుంకం ఆదాయాన్ని రూ. 2,500 కోట్లకు పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.  వ్యాట్‌ రూపంలో వచ్చే ఆదాయం దీనికి అదనం. ధర అధికంగా ఉంటే, తాగేవారి సంఖ్య తగ్గుతుందన్నది ఎక్సైజ్ వర్గాల లాజిక్. అయితే మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా లైసెన్సుల రూపంలో వచ్చే ఆదాయం కోల్పోతుంది. కానీ, అదే సమయంలో లైసెన్సుదారులకు ప్రభుత్వం చెల్లించే కమీషన్‌ మొత్తం మిగులుతుందని ప్రభుత్వం భావిస్తోంది.  నిజానికి ఆంధ్రలో 1937లో మొదటిసారి ఎన్నికల ద్వారా ఏర్పాటయిన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చోట్ల మద్యనిషేధాన్ని అమలు చేసింది.  అయితే 1969లో మద్య నిషేధం తొలగిపోయి ఆంధ్రప్రదేశ్‌ అంతా సారా సామ్రాజ్యంగా ఏర్పడింది. టార్గెట్లు పెట్టి ప్రజల చేత ఎక్కువ తాగించి పన్నులు వసూళ్లు చేసుకునే స్థితికి ఎక్సైజ్‌ శాఖ చేరుకుంది. అలాంటి సమయంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహించి పన్నుల బదులు, లాభాలు సంపాదించవచ్చుననే ఆలోచనతో వారుణివాహిని అనే సారా తయారుచేసి ప్రభుత్వ సారా దుకాణాల్లో (ప్రసాదు) అమ్మించడం ప్రారంభించింది.  దీంతో కొన్నాళ్ళకి సారా అమ్మకాలు బంద్ చేయాలని 1990లలో ఉద్యమం మొదలైంది. సారా దుకాణాలను తగులబెట్టడం, సారా పారబోయడం వంటి క్రియాశీల పోరాట రూపాలు మొదలయ్యాయి. అప్పుడు ప్రభుత్వం స్వయంగా పోలీసు స్టేషన్లలో, పోలీసులతో సారా అమ్మించడం కూడా చేసింది అంటే ఆలోచించండి. అది ఎంతలా జనాన్ని ప్రాభావితం చేసింది అంటే 1993లో నెల్లూరు జిల్లా దూబగుంటలో రోశమ్మ నాయకత్వాన ప్రారంభమైన మద్యపాన నిషేధం చరిత్రాత్మక పోరాటంగా మారింది.  అదే 1994 ఎన్నికలలో నాటి ఎన్టీఆర్ తెలుగుదేశం నినాదంగా కూడ మారి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మద్యనిషేధం ప్రకటించవలసి వచ్చింది. కానీ ఆదాయ వనరులు సరిపోక చంద్రబాబు నాయుడు 1997 లో ఆ నిషేధాన్ని ఎత్తివేసినప్పటి నుంచీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో సారా ఏరులై పారింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏడాదికేడాదికీ ఎక్కువ ఆదాయ లక్ష్యాలు నిర్ణయించి ప్రజలచేత మరింతగా తాగించడానికి పూనుకుంది. ఆ ఎక్సైజ్‌ విధానాలనే ఆ తర్వాత రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వాలు కొనసాగించాయి.  కానీ ఇప్పటి జగన్ సర్కార్ ఆదాయం వద్దు, ప్రజల సుఖ సంతోషాలే ముద్దు అని ఆలోచించడం బాగానే ఉంది, కానీ ఆనాటిలా ఇప్పుడు కూడా స్వయంగా పోలీసు స్టేషన్లలో, పోలీసులతో మద్యం అమ్మిస్తే ఏమిటో పరిస్థితి. ఆదాయం చాలదు అనుకున్నప్పుడు అసలు ఇలాంటి హామీలు ఇవ్వకుండా ఉండాల్సింది. కానీ ఇప్పుడు పాతిక వంతున దుకాణాలను రద్దు చేస్తే ఆజనం అంతా మిగతా షాపుల మీద పడతారు. తద్వారా సమయాభావం ఏర్పడి అక్కడే తోపులాటలు కొట్లాటలు వంటి సమస్యలు ఏర్పడినా ఏర్పడవచ్చు. చూద్దాం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంత మేరకు సత్ఫలితాన్ని ఇస్తుందో ?  
  అనుకున్నదే అయ్యింది, గతంలో మేము ప్రస్తావించినట్టే అమరావతి నిర్మాణం మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీ నూతన ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్ పెద్ద షాకే ఇచ్చింది. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్ విషయంలో చేతులెత్తేసింది. రాజధాని నిర్మాణానికి రుణం కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా అలాంటిది ఏదీ ఇవ్వమని చెబుతూ రుణ సహాయాన్ని నిలిపివేసింది. ఏపీ ప్రభుత్వం 300 మిలియన్‌ డాలర్ల రుణ సాయాన్ని ప్రపంచ బ్యాంక్ ని కోరగా దాని నుంచి తప్పుకుంటున్నట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది.  ఈ మేరకు బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని పొందుపరిచారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచబ్యాంకు ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకున్నట్టయింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణం మీద ఇప్పటి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలోప్ ఉండి సంచలన ఆరోపణలు చేసింది.  అయితే అప్పుడు ప్రపంచబ్యాంకు బృందం అమరావతిని సందర్శించి పూర్తిస్థాయిలో సంతృప్తి చెందడమే కాకుండా మరింతగా ఆర్థికంగా సహాయపడాలని నిర్ణయించింది. ప్రపంచ బ్యాంక్ నుండి అమరావతి నిర్మాణం రూపేణా రుణం కోసం చంద్రబాబు ప్రభుత్వం 2016 నుంచి ప్రయత్నాలు చేస్తోంది. ప్రయత్నాల్లో భాగంగా రాజధాని నిర్మాణానికి అమరావతి అభివృద్ధి కోసం రూ.7200కోట్ల రుణానికి ప్రతిపాదనలు ప్రపంచ బ్యాంకుకి సీఆర్డీయే పంపింది. దీనిలో భాగంగా తొలివిడతగా 3200కోట్లు, రెండో విడతగా మరో 3200కోట్లు తీసుకునేలా ఒప్పందం కుదిరింది.  కానీ అప్పుడే అప్పటి ప్రతిపక్షంలో జగన్ పార్టీ నుండి కొందరు రాజ‌ధాని విష‌యంలో కోర్టుల‌కు, గ్రీన్ ట్రిబ్యూన‌ల్ కి కూడా ఫిర్యాదులు చేశారు. వ‌ర‌ద‌ముప్పు, వివిధ పంట‌లు పండించే ప్రాంతం, సామాజిక‌, ప‌ర్యావ‌ర‌ణ కోణంలో జ‌రిగేన‌ష్టం వంటి అంశాల‌ను ముందుకు తీసుకొచ్చారు. అక్కడితో ఆగక ప్ర‌భుత్వం రాజ‌ధాని విష‌యంలో ప్ర‌జాభిప్రాయానికి భిన్నంగా వెళుతుందంటూ రాజ‌ధాని ప్రాంత రైతుల పేరిట కొంద‌రు 2017 మే 25 నాడు ప్ర‌పంచ‌బ్యాంక్ కి ఈమెయిల్స్ పంపి ఫిర్యాదు చేశారు.  ప్ర‌పంచ‌బ్యాంక్ ప్ర‌తినిధి బృందం స్వ‌యంగా వ‌చ్చి ప‌రిశీల‌న చేయాల‌ని కోరారు. అదే సంవ‌త్స‌రం జూన్ 12నాడు ఫిర్యాదుని స్వీక‌రించిన ప్ర‌పంచ‌బ్యాంక్ బృందం 2017 సెప్టెంబ‌ర్ లో ఇండియాలో ప‌ర్య‌టించింది. ఆ స‌మ‌యంలో ల్యాండ్ ఫూలింగ్ విధానంపై అభ్యంత‌రాల‌తో పాటు స‌మ‌ర్థిస్తున్న రైతులు కూడా ప్ర‌పంచ‌బ్యాంక్ పానెల్ బృందాన్నిక‌లిశారు. ఏపీ ప్ర‌భుత్వ అధికారులు కూడా ప్రపంచ‌బ్యాంక్ బృందం ముందు త‌మ వాద‌న‌ వినిపించారు.  అయితే అమరావతి వచ్చి స‌మ‌గ్ర విచార‌ణ చేయడం అవ‌స‌రమని ప్ర‌పంచ‌బ్యాంక్ బృందం తేల్చింది. అప్పుడు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అమరావతి వచ్చి అంతా గమనించి క్లియరెన్స్ ఇచ్చారు. కానీ నిధులు కావాలంటే మరొమారు తనిఖీలు నిర్వహించాల్సిందేనని తేల్చిన ప్రపంచబ్యాంక్ తమ అభిప్రాయాన్ని ఈ నెల 23వ తేదీలోపుగా చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి బ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయాలని స్పష్టం చేసిన నేపధ్యంలో ఈ మేరకు కేంద్రం నుండి రాష్ట్రానికి వరల్డ్ బ్యాంకు నుండి సమాచారం అందింది.  అయితే ఈ విషయమై తమకు మరింత గడువు కావాలని కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది కానీ ఆ లేఖకు ప్రపంచ బ్యాంకు స్పందించలేదు. కానీ కేంద్రం ఈ వ్యవహారంలో తమ నిర్ణయాన్ని రాష్ట్రానికి చెప్పేసింది .ప్రపంచబ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయడం అనేది కొత్త సంప్రదాయమని, అది ఇక్కడ చేయనిస్తే  దేశంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న అన్ని ప్రాజెక్టులకు కూడా తనిఖీలు చెయ్యాలని చూస్తారని ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.  ఈ తరుణంలో అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులను తీసుకెళ్లే ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్రం రాష్ట్రానికి సూచించినట్టుగా తెలుస్తోంది. ఇతర మార్గాల ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులను సమీకరించాలని కేంద్రం సూచించినట్టుగా చెబుతున్నారు. కానీ ప్రపంచ బ్యాంకు నుండి నిధుల సేకరణ ఆలోచన విరమించుకోవాలని తెలిపింది. ఆ విధంగా చివ‌ర‌కు తాజాగా ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్న‌ట్టు ప్ర‌పంచ‌బ్యాంక్ తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.  ఇప్పుడు ప్రపంచబ్యాంకు నిర్ణయం నేపథ్యంలో ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రుణాల మీద కూడా అనుమానలు ఏర్పడ్డాయి. అమరావతి నిర్మాణం కోసం ఏడీబీ రూ.1400 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు ప్రపంచబ్యాంకు ఈ నిర్ణయం తీసుకోవడంతో ఏడీబీ కూడా అదే బాటలో పయనిస్తే జగన్ ఏమి చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే అప్పటి బాబు సర్కార్ ని ఇబ్బంది పెట్టాలని జగన్ పార్టీ చేసిన ఈమెయిల్స్ ఫిర్యాదులు ఇప్పుడు తమ ప్రభుత్వానికి పెను పరీక్షను తెచ్చిపెట్టాయి.
  అప్పట్లో ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ.. 2014 లో అధికారంలోకి వచ్చిన తరువాత ఫిరాయింపులను ప్రోత్సహించి విమర్శలు ఎదుర్కొంది. అటు కార్యకర్తల్లో, ఇటు ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకొని.. పతనం దిశగా అడుగులు వేసింది. ఫిరాయింపుల విషయంలో టీడీపీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ రెండు నాలుకల ధోరణి. ఓ వైపు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్ని కొన్నట్టు కొంటుంది అంటూ గోల చేసిన టీడీపీ.. తీరా ఏపీలో అదే ఫిరాయింపులను ప్రోత్సహించింది. అప్పటి ప్రతిపక్ష వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను, నేతలను పార్టీలో చేర్చుకొని విమర్శలు ఎదుర్కొంది. అంతేకాదు ఫిరాయింపు నేతలకు పదవులు కట్టబెట్టి ఎప్పటినుంచో పార్టీనే నమ్ముకొని ఉన్న నేతల్లో అసంతృప్తిని కలిగించింది. తమ మీద పోటీ చేసిన నేతలు, ఇప్పుడు తమ పార్టీలోకి వచ్చి తమ మీదే పెత్తనం చెలాయించడం వారు తట్టుకోలేకపోయారు. ఈ ఫిరాయింపుల వల్ల కార్యకర్తల్లో కూడా అసహనం పెరిగింది. మొన్నటివరకు తమ నాయకులను, తమ పార్టీని తిట్టిన వారికి.. ఇప్పుడు తాము జై కొట్టాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేసారు. మరోవైపు ఈ ఫిరాయింపులను వైసీపీ అస్త్రంగా మలుచుకొని ఈ విషయాన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. మొత్తానికి ఫిరాయింపులు కూడా ఓ రకంగా టీడీపీ ఓటమికి కారణమయ్యాయనే చెప్పాలి.
ఒక ఊరిలో జనమంతా కలిసి తమకి ఇష్టమైన దేవుని శిల్పాన్ని ప్రతిష్టించాలనుకున్నారు. అందుకోసం చుట్టుపక్కల అంతా వాకబు చేసి ఒక శిల్పిని రప్పించారు. శిల్పి వచ్చీరాగానే తన పనిని ప్రారంభించాడు. శిల్పం కోసం సరైన శిలను ఎన్నకున్నాడు. ఊరి ప్రజల అభీష్టాన్నీ అనుసరించి వారి ఇష్టదైవాన్ని ఆ శిల్పంలో తొలవడం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి. రోజులు వారాలుగా మారాయి. వారాలు కాస్తా రెండు నెలలయ్యాయి. శిల్పి చెక్కుతున్న శిల్పం తుదిరూపుకి చేరుకుంది. కానీ మనసులో ఏం తోచిందో ఏమో కానీ, ఒక రోజున ఆ శిల్పాన్ని కాస్తా పక్కనపెట్టేశాడు శిల్పి. విగ్రహాన్ని చెక్కే పనిని మళ్లీ మొదటినుంచి మొదలుపెట్టాడు. ఒక రోజు శిల్పిని వెతుక్కుంటూ అతని స్నేహితుడు వచ్చాడు. దీక్షగా విగ్రహాన్ని చెక్కుతూ కూర్చున్న శిల్పిని చూశాడు. ఆ పక్కనే పడేసి ఉన్న విగ్రహమూ అతనికి కనిపించింది. ‘‘ఆ విగ్రహం ఇంచుమించుగా పూర్తయిపోయింది కదా! మళ్లీ రెండో విగ్రహాన్ని చెక్కుతున్నావేంటి’’ అంటూ వాకబు చేశాడు స్నేహితుడు. ‘‘ఆ విగ్రహం సరిగా రాలేదు’’ అంటూ బదులిచ్చి తన పనిలో నిమగ్నం అయిపోయాడు శిల్పి. ఆ మాటలకు స్నేహితుడు శిల్పం దగ్గరకి వెళ్లి పరీక్షగా చూశాడు. ఎంతగా చూసినా అతనికి ఎలాంటి లోపమూ కనిపించలేదు. ‘‘అదేంటి శిల్పం అద్భుతంగా వచ్చింది కదా! నేను చూసిన గొప్ప శిల్పాలలో ఇది ఒకటని ఖచ్చితంగా చెప్పగలను,’’ అన్నాడు స్నేహితుడు. శిల్పి చిరునవ్వుతో ‘‘ఒక్కసారి ఆ శిల్పం కళ్లని పరీక్షగా చూడు. అవి సరిగ్గా కుదరలేదు,’’ అని చెప్పాడు. స్నేహితుడు మరోసారి ఆ శిల్పాన్ని పరీక్షగా చూస్తే ఆ మాట నిజమేననిపించింది. కానీ అంత చక్కటి శిల్పాన్ని పక్కన పెట్టడాన్ని అతని మనసు ఇంకా ఒప్పుకోలేదు. ‘‘ఆ శిల్పాన్ని ఎక్కడ ఉంచుతున్నారు!’’ అని అడిగాడు స్నేహితుడు. ‘‘ఈ ఊరి దేవాలయంలో, పది అడుగుల ఎత్తైన పీఠం మీద,’’ బదులిచ్చాడు శిల్పి. ‘‘నీకేమన్నా మతి పోయిందా! పది అడుగుల ఎత్తైన పీఠం మీద, మరో పది అడుగుల ఎత్తున్న ఈ విగ్రహంలోని కళ్లలో చిన్నపాటి లోపం ఎవరికి కనిపిస్తుంది. పైగా కాస్త రంగు పూశావంటే ఆ ఉన్న కాస్త లోపమూ ఎవ్వరికీ తెలియనే తెలియదు. దాని కోసం రెండు నెలలుగా పడ్డ కష్టాన్ని వృధా చేసుకుంటావా! ఈ పల్లెటూరి బైతుల కోసం ఇంత కష్టం అవసరమా!’’ అంటూ దులిపేశాడు స్నేహితుడు. శిల్పి చిరునవ్వుతో- ‘‘ఈ విగ్రహంలో లోపం ఎవ్వరికీ, ఎప్పటికీ తెలియకపోవచ్చు. కానీ నాకు తెలుసు కదా! ఒక లోపంతో ఉన్న శిల్పాన్ని చెక్కానన్న విషయం నా మనసులో నిలిచిపోతుంది. అది జీవితాంతం నా వృత్తి మీద ఒక మచ్చగానే మిగిలిపోతుంది. ఇక కష్టాన్ని వృధా చేసుకోవడం అంటావా... అది నా దృష్టిలో పనితీరుని మరింతగా మెరుగుపరుచుకోవడమే! మనం చేసే పనికి ఎంత ధర వస్తోంది? ఎవరి కోసం పనిచేస్తున్నాం? అన్న విషయం ఎప్పుడూ ముఖ్యం కాదు. మనసుకి తృప్తి కలిగించేలా పనిని పూర్తిచేశామా లేదా అన్నదే ముఖ్యం. ఆ తృప్తి కోసం పడే తపన మన పనిని మరింతగా మెరుగుపరుస్తుంది. అదే చివరివరకూ నిలుస్తుంది,’’ అంటూ చెప్పుకొచ్చాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
  సంగీతానికి శిశువుల నుంచి పశువుల వరకు స్పందించి తీరతాయంటారు పెద్దలు. శాస్త్రీయ సంగీతాన్ని వినడం వల్ల జ్ఞాపకశవక్తి, గ్రహణశక్తి మెరుగుపడతాయని ఇప్పటికే ఓ పరిశోధన రుజువుచేసింది. సంగీతం వినగానే మనసు సంతోషంతో నిండిపోవడం, ప్రతి ఒక్కరికీ అనుభవంలో ఉన్న విషయమే! ఇప్పుడు ఈ విషయాన్ని కూడా శాస్త్రీయంగా రుజువు చేసే ప్రయత్నం చేశారు ఫిన్లాండుకి చెందిన పరిశోధకులు.   రెండు ఆసుపత్రులు: మెదడు మీద సంగీతపు ప్రభావాన్ని తేల్చుకునేందుకు ఇటలీలోని రెండు ఆసుపత్రులలోని రోగులను ఎన్నుకొన్నారు. వీరికి తొలుత సంగీతాన్నీ ఆ తరువాత సాధారణ శబ్దాలనూ వినిపించారు. ఈ రెండు రకాల ధ్వనులనూ వినేటప్పుడు వారి మెదడులో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించారు. సంగీతం విన్నప్పుడు మెదడులో ఉండే డోపమైన్‌ అనే రసాయనంలో మార్పులు వస్తున్నట్లు తేలింది. డొపమైన్‌కు చెందిన DRD2 rs1076560 అనే వ్యవస్థ ఉత్తేజితం అవుతోందని గ్రహించారు.   ఏమిటీ డోపమైన్‌ : మెదడులోని వివిధ కణాల మధ్య సమాచారాన్ని ప్రసారం చేసే రసాయనమే డోపమైన్‌. ఈ డోపమైన్‌ పనిచేయకుంటే శరీరంలోని కండరాలు ఒక్క అంగుళం కూడా కదలవు. శరీరాన్ని నిస్సహాయంగా మార్చివేసే పార్కిన్సన్స్‌ వ్యాధి కూడా ఈ డోపమైన్ లోపం వల్లే ఏర్పడుతుంది. అంతేకాదు! మనిషి ఉద్వేగాలను కూడా ఈ డోపమైన్ నియంత్రిస్తుంది. డోపమైన్ స్థాయి ఎక్కువైనప్పుడు మనిషి సంతోషంగా ఉంటాడు.   సంగీతం – డోపమైన్‌ : సంగీతం విన్నప్పుడు ఈ డోపమైన్‌లో సానుకూల మార్పులు వస్తున్నాయని తేలింది. దీని వల్ల శ్రోతలలోని భావోద్వేగాలు చాలా సానుకూలంగా మారిపోయాయట. అదే సమయంలో కర్ణకఠోరమైన శబ్దాలను విన్నప్పుడు డోపమైన్‌లో ప్రతికూలమైన మార్పులని గమనించారు. అయితే మనలోని జన్యవులని బట్టి ఈ మార్పులు ఉంటాయని తేల్చారు. సంగీతం కొందరిలో ఉధృతమైన మార్పుని కలిగిస్తుందనీ, మరికొందరిలో సాధారణ మార్పులను తీసుకువస్తుందనీ బయటపడింది.   మనిషి మనసు మీద ధ్వని ప్రభావం ఉంటుందని తేలిపోయింది. అయితే ఎలాంటి ధ్వని ఏ ప్రభావం చూపుతుందో తెలుసుకుంటే... మనలోని రోగాలను నయం చేసేందుకూ, మనసుని కుదుటపరిచేందుకు కూడా సంగీతాన్ని ఓ చికిత్సగా ఉపయోగించే అవకాశం ఉంది. ఆ దిశగా పరిశోధనలు మొదలయ్యాయి కూడా! - నిర్జర.  
పూర్వం చైనాలో లిలి అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి తనకి నచ్చిన అబ్బాయితోనే పెళ్లి జరిగింది. అంతవరకూ బాగానే ఉంది కానీ, లిలికి ఆమె అత్తగారంటే పడేది కాదు. ఏదో ఒక విషయంలో వారిద్దరూ నిరంతరం గొడవపడుతూనే ఉండేవారు. పైగా భర్త కూడా తల్లి మాటలలో నిజం ఉందని తేల్చడంతో లిలి అహం తరచూ దెబ్బతినేది. అత్తగారు లిలిని ఏదో ఒక విషయంలో సరిదిద్దేందుకు ప్రయత్నించడం, దానికి లిలి ప్రతిఘటించడం వారి రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. కొన్నాళ్లకి లిలి విసిగివేసారిపోయింది. ఎలాగైనా సరే తన అత్తగారి పీడను వదిలించుకోవాలని అనుకుంది. అందుకు తగిన మార్గం ఏమిటా అని ఆలోచిస్తుండగా, తన కుటుంబ స్నేహితుడైన ఒక వైద్యుడు గుర్తుకువచ్చాడు. ఆ పెద్దాయన దగ్గరకు వెళ్లి తన క్షోభ అంతా వెళ్లగక్కింది లిలి. ఎలాగైనా ఏదో ఒక మందు ఇచ్చి తన అత్తగారి పీడని వదిలించమని వేడుకొంది. లిలి మాటలు విన్న పెద్దాయన కాసేపు ఆలోచించాడు. ఆ తరువాత తన ఇంటి వెనుక ఉన్న గదిలోకి వెళ్లి, ఒక మందు సీసాతో తిరిగివచ్చాడు. ‘‘చూడు! ఇది మనుషులను నిదానంగా చావుకి చేరువచేసే మందు. మీ అత్తగారికి అనుమానం రాకుండా రోజూ ఆమె తినే తిండిలో కలుపుతూ ఉండు. ఒక మూడు నెలల నుంచి ఈ మందు తన ప్రభావం చూపడం మొదలుపెడుతుంది. ఆర్నెళ్లు తిరిగేసరికల్లా మీ అత్తకి ఆఖరి ఘడియలు ముంచుకొస్తాయి. కాకపోతే ఒక్క విషయం! మీ అత్త చావుకి కారణం నువ్వే అన్న అనుమానం ఎవ్వరికీ రాకుండా ఉండాలి. అందుకోసం నువ్వు ఆమెతో ప్రేమగా ఉంటున్నట్లు నటించాలి,’’ అంటూ ఆ మందు సీసాని లిలి చేతిలో ఉంచాడు వైద్యుడు. అర్నెళ్లు తిరిగే సరికి తన అత్త తన జీవితంలో ఉండదన్న సంతోషంతో పొంగిపోతూ లిలి ఇల్లు చేరుకుంది. ఆ రోజు నుంచి తన అత్తతో ప్రేమగా ఉంటూ కొంచెంకొంచెంగా ఆ విషాన్ని ఆమె ఆహారంలో కలపసాగింది. రోజులు గడిచేకొద్దీ ఆమె చూపించే అనురాగానికి అత్త లొంగిపోయింది. లిలిలాంటి కోడలు తనకి దొరకడం అదృష్టమంటూ ఊరూవాడా చెప్పుకొని తిరిగేది అత్త. లిలి మనసులో కూడా అత్త పట్ల అనురాగం మొదలైంది. ఆమెని చూస్తుంటే చనిపోయిన తన తల్లి గుర్తుకురాసాగింది. అలా ఓ మూడు నెలలు గడిచేసరికి, ఆమెను తన చేతులతో చంపుతున్నానన్న విషయాన్ని సహించలేకపోయింది లిలి. వెంటనే ఆ వైద్యుడి దగ్గరకు పరుగులెత్తింది. ‘‘ఏదో మొదట్లో నేనూ మా అత్తా గొడవపడిన మాట నిజం. కానీ రోజులు గడిచేకొద్దీ ఆమె నా మంచి కోసమే విమర్శించేదని తెలిసొచ్చింది. నేను ప్రేమగా ఉండేసరికి మా అత్త కూడా నాలో లోపాలను వెతకడం మానివేసింది. దయచేసి ఇన్నాళ్లూ నేను ఆమెకు పెట్టిన విషానికి విరుగుడు మందుని ఇవ్వండి,’’ అంటూ వైద్యుని ప్రాధేయపడింది లిలి. వైద్యుడు చిరునవ్వుతో- ‘‘నేను నీకిచ్చిన మందులో విషం లేనేలేదు. విషం ఉన్నదల్లా నీ మనసులోనే. ఆ విషానికి విరుగుడు స్నేహం, సహనం అని నాకు తెలుసు. ఆ విషయాన్ని నీకు తెలిసేలా చేసేందుకు ఈ నాటకం ఆడాను. నీలో ఎప్పుడైతే ప్రేమ కనిపించడం మొదలైందో... అది నీలోనూ, నీ అత్తగారిలోనూ ఉన్న ద్వేషాన్ని జయించింది. వెళ్లి నీ అత్త, భర్తలతో హాయిగా ఉండు,’’ అంటూ పంపించాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)
    కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లి తనకు పుట్టిన పసిగుడ్డును డ్రైనేజ్ లోకి విసిరేస్తే, నోరు లేని, విశ్వాసం గల కుక్కలు ఆ బిడ్డను కాపాడాయి. ఈ దారుణమైన  సంఘటన హర్యానా లో చోటు చేసుకుంది. హర్యానా రాష్ట్రంలోని కైతల్ ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసిపాపను ప్లాస్టిక్ కవర్‌లో చుట్ట ఒక తల్లి  డ్రైనేజీలో విసిరేసింది. డ్రైనేజీలో ఉన్న ప్లాస్టిక్ మూటలో ప్రాణంతో ఉన్న పసిగుడ్డును చూసి కుక్కలు అరవటంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ పాపను రక్షించి హాస్పిటల్ కు తరలించారు. ఐతే ఆ పాప బరువు తక్కువ ఉండటంతో పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా అక్కడ ఉన్న సిసి కెమరా ఫుటేజ్ ఆధారంగా ఆ పసిగుడ్డుని వదిలించుకునే ప్రయత్నం చేసిన ఆ తల్లిని గుర్తించి ఆమె ను వెతికే పనిలో పడ్డారు పోలీసులు.   
    గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన కెసిఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ మంత్రులుగా  కొంత మందికే అవకాశం ఇచ్చి తరువాత జరిగే ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్యేల పని తీరుని బట్టి మంత్రి వర్గ విస్తరణ లో మరి కొంత మందికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఐతే ఎన్నికల హడావిడి ముగిసినా ఇప్పటి వరకు మంత్రి వర్గ విస్తరణ ఉస్ లేదు. తాజాగా ఆగస్టు 15  నాటికీ మంత్రివర్గ విస్తరణ చేసి పూర్తి స్థాయిలో పరిపాలన చేపట్టబోతున్నట్లు సీఎం కెసిఆర్ పార్టీ లోని ముఖులతో అన్నట్లుగా తెలుస్తోంది. త్వరలో జరిగే జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పరిధి లోని ఒక వర్గం ఓట్ల కోసం ఖమ్మం జిల్లా నుండి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుకు కానీ లేదా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కు కానీ స్థానం కల్పించనున్నట్లు సమాచారం. ఐతే ఎమ్మెల్యే అజయ్ కు సీనియర్ నేతల తో సన్నిహిత సంబంధాలు లేకపోవటం, అలాగే తుమ్మలకు  అందరిని కలుపుకు పోయే గుణం ఉండటంతో పాటు సీఎం కు అత్యంత సన్నిహితుడు కావటంతో  కెసిఆర్ తుమ్మల వైపే  మొగ్గుతున్నారని ముందుగా ఆయనను మంత్రిని చేసి ఆ తరువాత ఎమ్మెల్సీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విస్తరణ లో భాగంగా మహేశ్వరం నుండి గెలిచిన సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి కి కూడా చోటు దక్కనున్నట్లు సమాచారం.  
    సీనియర్ కాంగ్రెస్ మహిళా నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఈ రాజు కన్ను మూసారు. ఆమె వయసు 81 సంవత్సరాలు.  పంజాబ్ రాష్ట్రం లోని కపుర్తలలో 1938 మార్చి 31న షీలా దీక్షిత్ జన్మించారు. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీ  సీఎంగా 15 ఏళ్ల పాటు  ఆమె బాధ్యతలను నిర్వహించారు.  వ్యవహరించారు. కొంత కాలం ఆమె కేరళ గవర్నర్ గా కూడా ఆమె పని చేశారు. ఈ రోజు ఉదయం ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా మారడంతో ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.30 గంటలకు షీలా దీక్షిత్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె మృతికి అన్ని పార్టీలకు చెందిన పలువురు నేతలు సంతాపం తెలిపారు. 
సెక్స్..మానవజాతి తన గమనాన్ని కొనసాగించేందుకు సృష్టి ఇచ్చిన అద్భుతమైన వరం. కేవలం పిల్లల్నికనడానికే కాదు..రెండు శరీరాలకు సాంత్వన కలిగించే క్రియ ఇది. ఎంత ఒత్తిడిలో ఉన్నా..ఎన్ని కష్టాల్లో ఉన్నా వాటన్నింటిని చిత్తు చేసే శక్తి సెక్స్‌కు ఉంది. అందుకే భారతీయులు దానికి అంతటి ప్రాధాన్యతనిచ్చారు. లైంగిక వాంఛ అన్నది ప్రతి మనిషిలోనూ అత్యంత సహజంగా ఉండే భావన. ఇది జీవితంలోని  తృప్తికీ, గాఢమైన అనుభూతికీ, మరెన్నో భావోద్వేగాలకూ కీలకమైన కేంద్రం. అందుకే మన పురాణాల్లోనూ..దేవాలయ శిల్పాలుగానూ రతి అన్నదానిని చేర్చారు మన పెద్దలు. కాలంతో పాటే ఈ ప్రక్రియలోనూ అనూహ్యమైన మార్పులు వచ్చాయి.   నాలుగు గదుల మధ్యలో సాగే వ్యవహారాన్ని..నలుగురికి తెలిసేంతగా బరితెగిస్తోంది నేటీ తరం..అతి ఎక్కడైనా పనికిరాదు అన్నట్లు విచ్చలవిడి శృంగారం వల్ల చేటు తప్పదు. ఆ తప్పుకు శిక్షగా సుఖవ్యాధులు మానవాళిని కబలిస్తున్నాయి. అయితే కాలంతో పాటే సుఖవ్యాధుల్లోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సిఫిలిస్, గనోరియా, షాంక్రాయిడ్ వంటివే ఎక్కువగా కనబడేవి. కానీ ఇటీవలి కాలంలో లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌ కనిబెట్టిన తర్వాత సుఖవ్యాధులను జయించవచ్చని మనిషి సంబరపడ్డాడు. కానీ ఇప్పుడు వైరస్‌ల ద్వారా వ్యాపించే సుఖవ్యాధులు విపరీతంగా ప్రబలిపోతున్నాయి.   ఒకప్పుడు యాంటీబయోటిక్స్‌కు తేలికగా లొంగిన సుఖవ్యాధులు కూడా ఇప్పుడు వాటికి ఏ మాత్రం లొంగకుండా..మొండిగా తయారవుతున్నాయి. శరీర నిర్మాణపరంగా పురుషులకంటే స్త్రీలకే సహజంగా సుఖవ్యాధులు సోకే అవకాశాలున్నాయని ఒక పరిశోధనలో తేలింది. వీరికి సుఖవ్యాధులు సోకినా వెంటనే లక్షణాలేవి కనబడకపోవచ్చు. వీటి కారణంగా దీర్ఘకాలంలో తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, సంతాన రాహిత్యం, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటివి ముంచుకొచ్చే ప్రమాదముంది. కొన్ని రకాల సుఖవ్యాధుల బారిన పడిన స్త్రీలకు పుట్టే బిడ్డలకూ ఆ ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో దాదాపు 20 ఏళ్లకే యువతీయువకులు సెక్స్‌లో పాల్గొంటున్నారు. ఈ వయసులో ఆకర్షణ, ప్రేమ వంటి వ్యవహారాల వల్ల ఒకరి కంటే ఎక్కువ మందితో అసురక్షిత శృంగారంలో పాల్గొని సుఖవ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు.   ఇక్కడ శృంగారం అంటే సంభోగమే కాదు. ముద్దులు ఇతర లైంగిక చర్యలు కూడా శృంగారం కిందకే వస్తాయి. చాలా మంది వీటి గురించి బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ..నలుగురికీ తెలిస్తే ఏమవుతుందోనని భయపడుతూ లోలోపల తామే కుంగిపోతున్నారు. కొందరు వైద్యుల వద్ద కూడా దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ తీవ్ర సమస్యల్లోకి జారిపోతున్నారు. ఇలాంటి వారి జీవితం నరకం కావడమే కాకుండా..వీరి ద్వారా ఇతరులకూ వ్యాపించి సమాజం మొత్తాన్ని విష వలయంలోకి నెట్టేస్తాయి. అందుకే సుఖవ్యాధులు దరిచేరకుండా పూర్తి సురక్షితమైన లైంగిక పద్ధతులు పాటించడం ఒక్కటే సరైన మార్గం.    * తెలిసీ తెలియక లైంగిక ప్రయోగాలకు దిగవద్దు. *  నమ్మకమైన జీవిత భాగస్వామితో తప్ప ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకపోవడం మంచింది. * అపరిచితులతో సెక్స్‌లో పాల్గొంటే తప్పనిసరిగా కండోమ్ ధరించాలి * శృంగారంలో అసహజ పద్ధతులకు దూరంగా ఉండాలి.
ఇల్లు పాతబడిపోతే దానికి తగిన మరమ్మతులు చేసి, రంగులేసి, రాళ్లు పరిచి కొత్తదానిలా మెరిసిపోయేలా చేయవచ్చు. కూలిపోయే ఇంటిని కూడా మరో పదేళ్లు నివాసయోగ్యంగా మార్చేయవచ్చు. ఇప్పుడు శరీరానికి కూడా కావల్సినన్ని మరమ్మతులు చేయవచ్చునని ఓ పరిశోధన రుజువు చేస్తోంది.   డీఎన్‌ఏ ఎడిటింగ్‌ మన శరీరంలో ప్రతి కణాన్నీ కూడా అందులో ఉండే డీఎన్ఏ శాసిస్తుందనే విషయం తెలిసిందే! కాబట్టి ఏదన్నా అవయవం దెబ్బతిన్నదంటే ఆ అవయవ నిర్మాణంలో ముఖ్యమైన డీఎన్‌ఏ కూడా దెబ్బతిన్నట్లు లెక్క. అందుకనే ఒక వ్యక్తి డీఎన్ఏలో తగిన మార్పులు చేయడం ద్వారా అతనికి మళ్లీ ఆరోగ్యాన్ని కలిగించే ప్రయత్నాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. అందులో ఓ ముఖ్యమైన ప్రయత్నమే డీఎన్‌ఏ ఎడిటింగ్. ఇందులో ఇప్పటికే Crispr-Cas9 అనే తరహా చికిత్స దాదాపు అందుబాటులోకి వచ్చేసింది. చైనా శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని ఉపయోగించి క్యాన్సర్‌ను సైతం నయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. Crispr-Cas9 చికిత్సలో భాగంగా కొన్ని మార్పులు చేసిన కణాలను శరీరంలోకి ప్రవేశపెడతారు. అవి డీఎన్ఏలోని హానికారకమైన భాగాలను తొలగించే కత్తెరలా ఉపయోగపడతాయట. మొండి క్యాన్సర్లను సైతం నిర్మూలించడంలో ఈ ప్రక్రియ అమోఘంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.   మరో అడుగు చైనా శాస్త్రవేత్తలు కృషి ఇలా ఉండగా, మరో పక్క అమెరికాకు చెందిన కొందరు పరిశోధకులు అసలు ఏకంగా డీఎన్‌ఏలో తెగిపోయిన భాగాలను అతికించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు ఈ విధానం కేవలం చర్మం, జీర్ణవ్యవస్థ వంటి చిన్ని చిన్న అవయవాలకే పరిమితం అయ్యేది. ఎందుకంటే అక్కడి కణాలు ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటాయి. కానీ మెదడు, కళ్లు, కాలేయం, గుండె వంటి అవయవాలు దెబ్బతింటే వాటిలోని డీఎన్ఏ మళ్లీ సాధారణ స్థితికి రావడం కష్టం. అందుకోసం ఇప్పుడు  అమెరికాకు చెందిన పరిశోధకులు మరో తరహా డీఎన్‌ఏ ఎడిటింగ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఏదన్నా ముఖ్యమైన అవయవం దెబ్బతింటే, అందులోని డీఎన్ఏను మళ్లీ సరిదిద్దేందుకు, డీఎన్‌ఏల మధ్య తెగిపోయిన బంధాన్ని తిరిగి సరిచేసేందుకు రోగి శరీరంలోకి సరికొత్త కణాలను ప్రవేశపెడతారు. ఈ తరహా చికిత్సను HITI టెక్నాలజీ అంటున్నారు.   ఫలితాలు మొదలయ్యాయి HITI టెక్నాలజీ ద్వారా ఇప్పటికే అంధత్వం వచ్చిన ఎలుకలలో మళ్లీ చూపుని తీసుకువచ్చారు. మున్ముందు ఈ సాంకేతికను మరింత అభివృద్ధి చేయగలిగితే ఎలాంటి రోగాన్నైనా నివారించవచ్చని చెబుతున్నారు. అంతేకాదు, మనలో వృద్ధాప్యం వచ్చేందుకు డీఎన్ఏలో వచ్చే మార్పులే కారణం కదా! కాబట్టి, డీఎన్‌ఏలో తగిన మార్పుని తీసుకురావడం ద్వారా వృద్ధాప్యాన్ని కూడా వాయిదా వేయవచ్చునంటున్నారు.   - నిర్జర.
  ఇరవై ఏళ్ల క్రితం, రోడ్డు మీద ఎక్కడ చూసినా సైకిళ్లే కనిపించేవి. గ్లోబలైజేషన్‌ పుణ్యమా అని ఇప్పుడు రోడ్లన్నీ మోటర్‌ సైకిళ్లతో నిండిపోయాయి. ఒళ్లు అలవకుండా ఉండేందుకో, ప్రతిష్ట కోసమో... ఇప్పుడు జనాలంతా బైక్‌ల మీదే కనిపిస్తున్నారు. కానీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బైక్‌లని కాస్త పక్కన పెట్టి సైకలెక్కితే ఆయుష్షు పెరుగుతుందని సూచిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా ఓ సర్వేని చూపిస్తున్నారు. బ్రిటన్‌లోని దాదాపు 22 ప్రాంతాలలో ఈ సర్వేను నిర్వహించారు. 2,50,00 మంది ఉద్యోగుల మీద ఓ ఐదేళ్ల పాటు నిర్వహించిన ఈ సర్వేలో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఈ రెండులక్షలా యాభైవేలమందిలో ఐదేళ్లకాలం ముగిసేసరికి 2,430 మంది చనిపోయారు. 3,748 మందికి కేన్సర్‌ సోకింది. 1,110 మంది గుండెజబ్బుల బారిన పడ్డారు. అయితే ఈ గణాంకాలకీ వారిలో సైకిల్ తొక్కడానికీ మధ్య సంబంధం ఉండటమే ఆశ్చర్యం కలిగించే అంశం. వాహనాల మీద ఆఫీసుకి వెళ్లేవారితో పోలిస్తే, సైకిల్‌ తొక్కేవారిలో కేన్సర్‌ సంభవించే అవకాశం 45 శాతం తక్కువని తేలింది. వీరిలో గుండెజబ్బు సోకే ప్రమాదం కూడా 46 శాతం తక్కువగా నమోదైంది. ఏతావాతా.... సైకిల్‌ మీద ప్రయాణం చేసేవారు, ఇతరులతో పోలిస్తే అర్థంతరంగా చనిపోయే ప్రమాదం దాదాపు 40 శాతం తక్కువని వెల్లడైంది. సైకిల్ మీద ఆఫీసుకి వెళ్లేవారు, సగటున వారానికి 30 మైళ్ల వరకూ ప్రయాణం చేస్తున్నట్లు తేలింది. ఇదేమీ మామూలు వ్యాయామం కాదు కదా! క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్తే ఎంత లాభమో, రోజూ సైకిల్‌ తొక్కడం వల్ల అంతే లాభమని చెబుతున్నారు. ఒక్కసారి కనుక ఈ అలవాటు మన జీవితంలో భాగమైతే, అదిక పెద్ద కష్టంగా తోచదని భరోసా ఇస్తున్నారు. అంతేకాదు! ఊబకాయం, పొగత్రాగడం, ఆహారనియమాలు పాటించపోవడం వంటి సందర్భాలలో కూడా సైకిల్‌ తొక్కడం వల్ల లాభం కనిపించిందట. ఇంతాచేసి పరిశోధకులు చెబుతున్న విషయం ఏమిటంటే... వీలైనప్పుడల్లా బైక్‌ని పక్కనపెట్టి సైకిల్‌ మీద స్వారీ చేయమనే! దీని వల్ల డబ్బు ఆదా అవుతుంది, పర్యావరణానికీ మేలు జరుగుతుంది, బస్సుల కోసం నిరీక్షించే సమయమూ మిగులుతుంది. అన్నింటికీ మించి ఆరోగ్యం దక్కుతుంది, ఆయుష్షు పెరుగుతుంది. ఇక నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. -నిర్జర.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.