ఆ తర్వాత కలిసేది ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ9 రవిప్రకాష్ నేనా!
posted on Sep 28, 2015 2:56PM
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి... ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావును కలవడంపై రకరకాల కథనాలు వచ్చినా అవన్నీ ఊహాగానాలేనని తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఆఫ్ ద రికార్డ్ చెబుతున్న సమాచారం మేరకు అవన్నీ కట్టుకథలేనని తేలిపోయింది. రామోజీ-జగన్ భేటీలో ఎలాంటి మతలబు లేదని, కేవలం సలహాలు తీసుకోవడానికే రామోజీని జగన్ కలిశారని ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పగా, మరో సీనియర్ నేత తమ్మినేని సీతారాం కూడా అందుకే కలిశారంటూ చెప్పుకొచ్చారు. రామోజీరావు ప్రముఖ మీడియా అధిపతి, పైగా సమాజంలో పెద్దమనిషి...అందుకే జగన్ కలిశారు, అదేవిధంగా మిగతా మీడియా బాస్ లను కలుస్తారంటూ కొత్త బాంబు పేల్చారు
చంద్రబాబు సర్కార్ తీసుకునే ప్రజావ్యతిరేక విధానాలపై తాను ఎంతగా పోరాడుతున్నా అనుకున్న స్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని, కేవలం ‘సాక్షి‘ని మాత్రమే నమ్ముకుంటే పని జరగదని, అనుకున్న లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేమని జగన్ గుర్తించారట, ప్రత్యేక హోదా ఇష్యూ కావొచ్చు, రాజధాని భూసమీకరణ కావొచ్చు... ఇష్యూ ఏదైనా మీడియా మద్దతు దొరికితేనే ఏ పోరాటం చేసినా ప్రజలకు చేరువ కాగలమని, మీడియా విషయంలో శత్రుత్వం వద్దని జగన్ నిర్ణయానికి వచ్చారట, ఈ నేపథ్యంలో రామోజీని కలిశారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.
ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసం తాను చేయబోతున్న దీక్షకు మద్దతు కోరడానికే రామోజీని జగన్ కలిసినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు, ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో చేయబోతున్న దీక్ష సక్సెస్ కావాలంటే అందరి మద్దతు అవసరమని భావించే జగన్మోహన్ రెడ్డి రామోజీని కలిశారని... త్వరలో ఆంధ్రజ్యోతి అధిపతిని, ఆ తర్వాత టీవీ9 రవిప్రకాష్ ను కూడా కలుస్తారని అంటున్నారు.
ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి తర్వాత కలిసేది ఏబీఎన్ రాధాకృష్ణనే, మరి భేటీ ఎన్ని సంచలనాలు రేపుతుందో