కరువు మండలాలపై కేసీఆర్ సమీక్ష.. కేంద్రానికి నివేదిక


 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరువు మండలాలపై క్యాంపు ఆఫీస్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలో 231 కరువు మండలాలను గర్తించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కరువు ఉందని..కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పాక్షికంగా కరువు ఉందని.. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షపాతం బాగానే ఉందని గుర్తించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం  కేంద్రానికి నివేదిక పంపింది. కేంద్రం తక్షణం రాష్ట్రానికి రూ. 1000 కోట్లు సాయం అందించాలని.. రాష్ట్రానికి వెంటనే కేంద్ర బృందాన్ని పంపాలి అని కోరారు.