బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించిన కర్నాటక హైకోర్టు

కర్నాటక రాష్ట్రంలో బైక్ ట్యాక్సీలను నిషేధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లోగా రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ ఆపరేటర్లు తమ కార్యకలాపాలను నిలిపివేయాలని  కర్నాటక హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో రాపిడో, ఊబర్ సహా  అన్ని బైక్ ట్యాక్సీ కార్యకలాపాలు రాష్ట్రంలో నిలిచిపోనున్నాయి. ఇక పోతే మోటారు వాహనాల చట్టం కిందకు బైక్ ట్యాక్సీ సేవలను తీసుకు రావడానికి కర్నాటక ప్రభుత్వానికి కోర్టు మూడు  నెలల గడువు ఇచ్చింది.

  మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 93 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించే వరకు బైక్ ట్యాక్సీలపై నిషేధం అమల్లో ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. తెలుపు నంబర్‌ ప్లేట్‌లతో కూడిన ద్విచక్ర వాహనాలను వాణిజ్యపరంగా వినియోగించేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది.