శంకర్ ‘ఐ’ కొత్త పోస్టర్ అదుర్స్

 

విక్రమ్, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఐ’ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కొత్త పోస్టర్ శనివారం నాడు విడుదలైంది. హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఈ పోస్టర్ వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇంతకుముందు విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కి కూడా మంచి స్పందన లభించింది.