రామలింగ రాజుకి బెయిలు మంజూరు
posted on May 11, 2015 7:54PM
సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో దోషులుగా నిరూపించబడి ఏడేళ్ళ జైలు శిక్ష విధింపబడినరామలింగ రాజు, ఆయన సోదరుడు రామరాజుతో సహా పదిమందికి నాంపల్లి సెషన్స్ కోర్టు ఈరోజు బెయిలు మంజూరు చేసింది. ఈరోజు బెయిలు పొందినవారిలో వడ్లమాని శ్రీనివాస్, ఎస్. గోపాలకృష్ణ, తాళ్లూరి శ్రీనివాస్, బి. సూర్యనారాయణ రాజు, జి. రామక్ణృ, జి. వెంకటపతిరాజు, సీహెచ్. శ్రీశైలం, వీఎస్పీ గుప్తా ఉన్నారు. రామలింగరాజు ఆయన సోదరుడు రామరాజులను చెరో లక్ష రూపాయల పూచీకత్తు మరియు ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీ సమర్పించమని, మిగిలిన వారందరూ చెరో రూ.50, 000 పూచీకత్తు మరియు చెరో ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీ సమర్పించమని కోర్టు ఆదేశించింది. అయితే తమకు సీబీఐ కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలనే వారి అభ్యర్ధనను మన్నించలేదు. తదుపరి విచారణలో ఆ విషయం తేల్చే అవకాశం ఉంది. సీబీఐ తీర్పుతో గత కొన్ని రోజులుగా జైలులో గడుపుతున్న రామలింగరాజు తదితరులకు ఒకవేళ సెషన్స్ కోర్టు కూడా బెయిలు పిటిషను తిరస్కరించి ఉండి ఉంటే మళ్ళీ వారు హైకోర్టులో అప్పులు చేసుకొనే వరకు జైలులోనే గడుపవలసి వచ్చేది. కానీ అదృష్టవశాత్తు సెషన్స్ కోర్టులో వారికి చాలా ఊరటలభించింది.