లేడీ డాక్టర్ని కొట్టిన సి.కల్యాణ్

 

టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ ఈసారి మరో వివాదం ద్వారా వార్తల్లోకి ఎక్కారు. సి.కల్యాణ్ తనపై చేయి చేసుకున్నారంటూ కవిత అనే ఓ మహిళా డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సి. కల్యాణ్, డాక్టర్ కవిత ఒకే అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయంలో వీరిద్దరికి వివాదం జరిగింది, అదికాక మెట్రోరైలు నష్టపరిహారం విషయంలో కూడా వీరికి వాగ్వాదం జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ గొడవ కారణంగా తమను బెదిరించి, దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా తనపై చేయి కూడా చేసుకున్నారని డాక్టర్ కవిత జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు సి. కల్యాణ్పై 506, 509, 345c సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.