టీటీడీ చైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి
posted on Apr 27, 2015 10:58PM
.jpg)
తెదేపా మాజీ శాసనసభ్యుడు చదలవాడ కృష్ణమూర్తిని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి చైర్మన్ గా నియమిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఎవరూ ఊహించని విధంగా ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు డా. కె. రాఘవేంద్ర రావు పేరు కూడా పాలకమండలి సభ్యుడిగా ఖరారయింది. తెలంగాణా నుండి ఇద్దరు యం.యల్యేలు సండ్ర వెంకట వీరయ్య, సాయన్నలను పాలక మండలి సభ్యులుగా నియమించబడ్డారు. వీరు గాక ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, బాల వీరాంజనేయ స్వామి, కోళ్ల లలిత కుమారి సభ్యులుగా నియమింపబడ్డారు. పుట్ట సుధాకర్ యాదవ్, పి. హరిప్రసాద్, రవి నారాయణ్, భాను ప్రకాష్ రెడ్డి, దండు శివరామరాజు, వైటి రాజ, ఏవి రమణ, జె.శేఖర్, వి.కృస్ణమూర్తి మరియు డిపి అనంత్ పాలక మండలి సభ్యులుగా నియమించబడ్డారు. ఈరోజు రాత్రి లేదా మంగళవారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయవచ్చును.