జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నా.. పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్
posted on Apr 2, 2025 1:50PM

బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ… ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలు చేపట్టిన నిరసనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు పలు పార్టీల నేతలు కూడా బీసీలకు రజర్వేషన్లకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నాయి. తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహనుమంతరావు, మాజీ ఎంపీ అంజనీకుమార్ యాదవ్, సినీ నటుడు సుమన్ తదితరులు జంతర్ మంతర్ వద్ద జరిగిన బీసీ సంఘాల నిరసనలో పాల్గొన్నారు.
అలాగే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే తదితరులు ఈ ధర్నాకుకు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ బిల్లును ఆమోదించి పార్లమెంటుకు పంపిందనీ, దానిని ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఇలా ఉండగా తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను వేలం వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా జంతర్ మంతర్ వద్ద ఆందోళనక దిగారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు.