20 రూపాయల కోసం హత్య

 

ఇరవై రూపాయల కోసం స్నేహితుడినే హత్య చేసిన సంఘటన నల్గొండ జిల్లా కోదాడ మండలం మంగలి తండాలో జరిగింది. తండాకి చెందిన నాగేశ్వరరావు, జిత్తు అనే ఇద్దరు వ్యక్తులు ఎప్పటి నుంచో స్నేహంగా వుంటున్నారు. వారి మధ్య విభేదాలు కూడా ఏమీ లేవు. సోమవారం నాడు నాగేశ్వరరావు రోడ్డు మీద వెళ్తూ వుండగా జిత్తు ఎదురై చనువుగా అతని జేబులో చెయ్యి పెట్టి, అందులో వున్న 20 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. దాంతో ఆగ్రహం పట్టలేకపోయిన నాగేశ్వరరావు జిత్తు తల మీద వెనుక నుంచి కర్రతో తలమీద బలంగా బాదాడు. దాంతో జిత్తు అక్కడికక్కడే మరణించాడు. అది చూసి నాగేశ్వరరావు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.