జీవితకి రెండేళ్ళ జైలు శిక్ష

 

నటుడు డాక్టర్ రాజశేఖర్ భార్య, నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్‌కి చెక్ బౌన్స్ కేసులో రెండేళ్ళ జైలుశిక్ష, 25 లక్షల రూపాయల జరిమానాహైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు విధించింది. ఈ కేసు విషయంలో జీవితకి గతంలో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. ‘ఎవడైతే నాకేంటి’ సినిమాకి సంబంధించి నిర్మాత శేఖర్ రెడ్డికి జీవిత 22 లక్షల చెక్ ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అయింది. ఈ విషయాన్ని శేఖర్ రెడ్డి జీవిత దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ జీవిత పట్టించుకోలేదు. దాంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఆ కేసులో జీవితా రాజశేఖర్‌కి జరిమానా, జైలుశిక్ష పడింది. ఇదిలా వుంటే జీవితా రాజశేఖర్ మీద మరో 36 లక్షల రూపాయల చెల్లని చెక్కు కేసు కూడా వుందని సమాచారం.