మోడీజీ భార్యగా నాకున్న హక్కులేంటో చెప్పండి...
posted on Nov 25, 2014 10:13AM
ప్రధాని నరేంద్రమోడీ భార్యగా వెలుగులోకి వచ్చిన యశోదా బెన్ తన భర్త పిలిస్తే ఆయన దగ్గరకు వెళ్ళాలని ఎదురుచూస్తూ వుంటానని ఎప్పుడూ చెబుతూ వుంటారు. అయితే మోడీకి, యశోదా బెన్‌కి ఆయనకు 17 సంవత్సరాల వయసులో వివాహమైంది. అయితే నరేంద్ర మోడీ వివాహ బంధాలను వదులుకుని వెళ్ళిపోయారు. ఇదిలా వుంటే, మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రభుత్వం యశోదా బెన్‌కి సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని భార్యగా తనకు ప్రొటోకాల్ ప్రకారం లభించే హక్కులేమిటో తెలియజేయాలని ఆమె సమాచార హక్కు చట్ట ప్రకారం పిటిషన్ దాఖలు చేశారు. భద్రతకు సంబంధించి తనకు లభించే హక్కులేమిటో చెప్పాలని యశోద కోరారు. నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత పది మంది పోలీసులతో రక్షణ కల్పిస్తున్నారు. ఈ అంశంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల కాపీ కూడా ఇవ్వాలని యశోదా బెన్ కోరారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆమె సెక్యూరిటీ గార్డులే చంపారని, తన చుట్టూ ఆయుధాలు పట్టుకుని వుంటున్న సెక్యూరిటీ సిబ్బంది విషయంలో కూడా తనకు అలాంటి భయాలే కలుగుతున్నాయని, ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.