జపాన్ సంస్థలతో చంద్రబాబు భేటీ

 

జపాన్ పర్యటనలో భాగంగా రెండో రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం జపాన్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు జపాన్ సంస్థల ప్రతినిధులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచే ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతులు చేసుకోవచ్చని ఆయన వివరించారు. పరిశ్రమలకు అనుమతుల నిబంధనలను సరళతరం చేశామని, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయనున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ సంస్థలను చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. ఈ సమావేశంలో మంత్రులు యనమల, నారాయణ, ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.