గుప్పెడు గుండెకు ..గ్లాసుడు జ్యూస్
posted on Jun 11, 2019 12:03PM
ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు మరణాల్లో 50 శాతానికి పైగా, అధిక రక్తపోటు కారణంగానే సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి అధిక రక్త పోటును అదుపులో వుంచగలిగితే గుండెకు ముప్పు తగ్గినట్టే. అందుకు వ్యాయామం , మంచి ఆహరం ముక్య సూత్రాలు . వీటితో పాటు ఉదయాన్నే ఓ గ్లాసుడు జ్యూస్ తాగండి చాలు అంటున్నారు పరిశోధకులు. ఏ ఏ జ్యూసులు గుండెకు మంచివంటే ..
* బీట్రూట్ పేరు వినగానే, మొహం చిట్లిస్తారు చాలామంది. కాని రోజు ఉదయాన్నే ఓ చిన్న గ్లాసు బీట్రూట్ రసం తాగితే రక్త పోటు అదుపులో ఉంటుందట. బీట్రూట్ లో వుండే నైట్రేట్ కంటెంట్ రక్త నాళాలని శుభ్రపరచి అవి విచ్చుకునేలా చేస్తుంది అంటున్నారు లండన్ స్కూల్ అఫ్ మెడిసిన్ పరిశోధకులు .
* యూనివర్సిటీ అఫ్ వేస్కోసిన్ పరిశోధకుల ప్రకారం రోజుకి ఒక గ్లాసుడు ద్రాక్ష రసం చాలు గుండె గట్టిగా ఉండటానికి . ద్రాక్ష రక్త నాళాలు రిలాక్స్ అయ్యేలా చేస్తుందట . దాంతో రక్త సరఫరా సజావుగా సాగుతుంది. అంతేకాకుండా బ్యాడ్ కొలస్ట్రాల్ ని కూడా తగ్గించగలదు. రక్తనాళాలలో ఆటంకాలు వంటి ముప్పు తగ్గుతుంది.
* ఇక ఫ్రెంచ్ వైద్య నిపుణులు కమలా రసం తప్పక తాగాలి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే అంటున్నారు. కమలాల లో వుండే హెస్పిరిడిన్ అనే మిశ్రమం రక్తపోటును క్రమంగా తగ్గిస్తుందని చెబుతున్నారు. అధిక రక్తపోటుతో బాధ పడేవారు రోజు ఈ జ్యూస్ తాగితే నెలరోజుల్లో రక్త పోటులో తరుగుదల కనిపిస్తుందని తేలింది వీరి పరిశోధనలలో . అయతే బిపి తో పాటు షుగర్ కూడా వుంటే మాత్రం ఒకసారి వైద్యుల సలహా తీసుకోవటం మంచిది అంటున్నారు.
చివరిగా ఒక్క మాట జ్యూస్ లు మంచివన్నారు కదా అని వాటిలో ఇంత పంచదార వేసుకుని తాగకండి అని గట్టిగా చెబుతున్నారు నిపుణులు. పంచదార ఏ రకంగా చూసినా మంచిది కాదని తెలిసిందే గా . అందులోనూ జ్యూస్ ల లో కొంచం ఎక్కువ మొతాదులోనే వేస్తారు . కాబట్టి ఒట్టి రసాలని తీసుకు తాగండి ..గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి .