నాగార్జున వర్సిటీలో మళ్లీ ర్యాగింగ్ కలకలం.. మంత్రి గంటా ఆగ్రహం

 

గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీలో మళ్లీ ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్ విద్యార్ధులు తమను ర్యాగింగ్ చేస్తున్నారని జూనియర్ విద్యార్ధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది. ర్యాగింగ్ పై కఠిన చర్యలు తీసకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఐదుగురు విద్యార్ధులను సస్పెండ్ చేశామని.. ర్యాగింగ్ కు పాల్పడినందుకు కాలేజ్ హాస్టల్ నుండి వినితేశ్వర్, శ్వేత, మంజునాథ, సురేంద్ర, మనోజ్ లను సస్పెండ్ చేశామని.. సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని జూనియర్ విద్యార్ధులు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నామని రిజిస్ట్రార్ రాజశేఖర్ తెలిపారు.

కాగా నాగార్జున యూనివర్సిటీ ర్యాగింగ్ పై మంత్రి గంటా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రితికేశ్వరీ మృతి తర్యాత ర్యాగింగ్ పై చర్యలు తీసుకున్నప్పటికీ మళ్లీ ఈ ఘటన జరగడంతో గంటా మండిపడుతున్నారు. వీసీ, రిజిస్ట్రార్ రాజశేఖర్ ను అడిగి గంటా వివరాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. రేపు నాగార్జున వర్సిటీలో గంటా పర్యటించనున్నారు.