సెక్షన్ 66ఏ కొట్టివేత
posted on Mar 24, 2015 2:35PM
మంగళవారం సుప్రీంకోర్టు ఐటీ చట్టం-2000 సెక్షన్ 66 ఏను కొట్టిపారేస్తూ ఇది రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పునిచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు, పోస్టులు చేస్తే ఆ వ్యక్తులకు పోలీసులకు అరెస్ట్ చేసే అధికారంతో పాటు జైలు శిక్ష కూడా అధికారం ఉంటుంది. 2012లో షహీన్ ధర అనే యువతి ముంబయిలో శివసేన అధినేత బాల్ ఠాక్రే చనిపోయునప్పుడు బంద్ పాటించడాన్ని ఫేస్‌బుక్‌లో ప్రశ్నించగా రేణు శ్రీనివాసన్ అన్ యువతి ఆ పోస్టుకు లైక్ కొట్టండంతో ఇద్దరు యువతులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేయడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సహా, లా విద్యార్థిని శ్రేయా సింఘాల్ తో పాటు మరి కొన్ని ప్రయివేటు సంస్థలు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లేననీ, ఐటీ చట్టంలోని ఆ సెక్షన్‌ను తొలగిం చాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) వేసిన విషయం తెలిసిందే.