పేరు చెబితేనే జగన్ కు పిచ్చెక్కుతోంది



టీడీపీ మంత్రి ఉమామహేశ్వరరావు వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. పోలవరం ప్రాజెక్టుపై ఉమా మాట్లాడుతూ పట్టిసీమ, పోలవరం విషయంలో జగన్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని.. ప్రజలకు నీటి కొరత తీర్చడంపై జగన్ ఇలా మాట్లాడటం సబబు కాదని విమర్శించారు. అంతేకాదు 2010 లో పోలవరం ప్రాజెక్టును చేపట్టాలని భావించినా దాని నిర్మాణానికి వచ్చిన కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గారు ఆవిషయం గుర్తులేదా? 2013లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టు పనులను ట్రాన్స్‌స్ట్రాయ్‌ కంపెనీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలుసా? అని ప్రశ్నించారు. అంతేకాదు ఇప్పటికే 11 కేసుల్లో ఇరుక్కుపోయిన జగన్ కు  కొత్తచట్టం పేరు చెబితేనే పిచ్చెక్కుతోందని ఎద్దేవ చేశారు.