బెల్లంకొండలో మొండెం లేని తల
posted on Nov 19, 2014 6:18PM
గుంటూరు జిల్లా బెల్లంకొండలో నివాసాల మధ్య వున్న పశువుల ఎరువు దిబ్బలో గుర్తు తెలియని వ్యక్తి శవం లభించింది. కవర్లో చుట్టి పడేసిన ఈ తల బయటపడటంతో స్థానికంగా కలకలం రేగింది. బుధవారం ఉదయం నుంచి ఈ ప్రాంతంలో దుర్వాసన వస్తూ వస్తూ వుంది. ఈ దుర్వాసన ఎందుకు వస్తోందో స్థానికులకు అర్థం కాలేదు. అయితే కుక్కలు కవర్ని కదిలించడంతో అందులోంచి తల బయటపడింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియసేశారు. పోలీసులు తలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా వుండగా, రెండు రోజుల క్రితం కృష్ణ, గుంటూరు జిల్లాల మధ్య వున్న పెనుమూడి వంతెన వద్ద ఓ తలలేని మొండెం కనిపించింది. ఇప్పుడు బయటపడిన తల ఆ మొండానికి సంబంధించిందే అయి వుంటుందన్న అనుమానాలు వున్నాయి.