ఏపీకి హోదా రాదు.. సింగపూర్ లా అమరావతి కలే.. వెంకయ్య

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు.. ఏపీ రాజధాని అమరావతిని సింగపూర్, టోక్యో వంటి నగరాల స్థాయిలో నిర్మించడం కలే.. ఇంతకీ ఈ మాటలు ఎవరంటున్నారా అని అనుకుంటున్నారా.. నాడు పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా కాదు.. తాము అధికారంలోకి వస్తే ఏకంగా పదేళ్లు ప్రత్యేక హోదా కల్సిస్తాం అని చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా చేసిన వ్యాఖ్యలు. ఎన్డీయే ప్రభుత్వం పాలన రెండెళ్లు పూర్తయిన సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పై విధంగా వ్యాఖ్యలు చేసి తెలుగు ప్రజలకు నిరాశని మిగిల్చారు. దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుతున్నాయి.. ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చి పరిస్థితి లేదు అని అన్నారు. అంతేకాదు రాజధాని అంటే.. అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాసానికి క్వార్టర్లు ఉంటే చాలు.. అభివృద్ధి నిదానంగా సాగుతుంది అని చెప్పుకొచ్చారు.  హైదరాబాద్ తో అమరావతిని పోల్చవద్దని.. హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మిస్తామని చెప్పి టీడీపీ ప్రజలను మోసం చేయోద్దని హితవు పలికారు. మొత్తానికి వెంకయ్య నాయుడు కూడా ఏపీకి ప్రత్యేక హోదా రాదని తేల్చి చెప్పేశారు. ఇంక మిగిలింది ప్రధాని మోడీ ఒక్కరే. ఆయన ఒక్కరే ప్రత్యేక హోదా రాదని డైరెక్ట్ గా చెప్పలేదు.