ముంబై ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 3 మృతి.. 150 మందికి గాయాలు

 

ముంబైలో భారీ పేలుడు సంభవించింది. ముంబైలోని డాంబివిలి పారిశ్రామిక వాడలో ఆచార్య కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. దాదాపు 150 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఎయిమ్స్ బాంబివిలి, ఆర్ఆర్ హాస్పిటల్, శాస్త్రినగర్ హాస్పిటల్, శివమ్ ఆస్పత్రులకి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు డజనుకు పైగా ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి చేరుకొని మంటల్ని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.  ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.