అదే మా లక్ష్యం.. జైట్లీ
posted on Aug 5, 2015 6:33PM
రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రరాష్ట్ర ఆర్ధికంగా ఎంతో ఇబ్బంది పడుతోందని.. ఒక్క హైదరాబాద్ లేకపోవడంవల్ల ఏపీ ఆదాయానికి గండి పడిందని కేంద్ర కేంద్ర ఆర్థికశాఖా మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. హైదరాబాద్ నగరం దేశంలోనే గర్వించదగ్గ నగరమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆలోచనలు చేస్తున్నామని.. భవిష్యత్ లో ఏపీకి ఆర్ధికంగా సహాయపడటమే తమ లక్ష్యమని.. ప్రత్యేకహోదా అనేది తమ అంజెండాలో ఉందని అన్నారు. ఆర్థికలోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. అభివృద్ధి అంశంలో తమకు ఏపీ ప్రధానమైనదని జైట్లీ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసి ఏపీకీ తీరని నష్టాన్ని మిగిల్చిందని.. అలాంటి కాంగ్రెస్‌కు ఏపీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.