ఎపి ప్రభుత్వంతో గూగుల్  సంస్థ ఎంఓయు

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలక పురోగతి కనిపిస్తుంది.  ఎపిలో గూగుల్ ఫోకస్ పెట్టింది.  దీంతో ఎపిలో కీలక పరిశ్రమ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. 
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు వేసింది. ఎఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది.
ఈజ్ ఆఫ్ లివింగ్ ఏపీ ప్రభుత్వ విధానమని మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు. దైనందిక జీవితంలో ప్రజలు తమకు అవసరమైన వివిధ రకాల సర్టిఫికేట్లు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి అందుబాటులో ఉండే సెల్ ఫోన్ వంటి సాధనం ఆయా సేవలను అందుబాటులోకి తేవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యువతకు ఎఐ ఆధారిత భవిష్యత్ అవకాశాలను కల్పించేందుకు గూగుల్ సంస్థ ఎపి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు.
నూతన పారిశ్రామిక విధానాల వల్ల  పెట్టుబడులు పెట్టడానికి  ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.  గూగుల్ వైస్ ప్రెసిడెంట్ బికాశ్ కొలె  బృందం డిసెంబర్ 12న (బుధవారం )అమరావతిలో చంద్రబాబును కలిసింది. రాష్ట్ర ప్రభుత్వంపై గూగుల్ సంస్థ ఎంఓయు కుదుర్చుకుంది.