రేషన్ బియ్యం మాయం... పేర్ని జయసుధపై కేసు 

మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకున్న ఆరోణలు ఎదుర్కొంటున్న జయసుధ తన గౌడౌన్ లో మాయం అయిన బియ్యం ఖరీదు లెక్కగట్టి ఇస్తామని సివిల్ సస్లయ్ డిపార్ట్ మెంట్ కు లేఖ రాసింది. పెనాల్టీ కూడా చెల్లిస్తానని జయసుధ ఆ లేఖలో పేర్కొన్నారు. కాకినాడ పోర్టులో ఇటీవల రేషన్ బియ్యం పట్టు బడటంతో కూటమి ప్రభుత్వం దర్యాప్తు మమ్మురం చేసింది. గత ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన పేర్ని నాని భార్య పేరిట ఉన్న గోడౌన్ లో రేషన్ బియ్యం దాచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. సివిల్ సప్లయ్ అధికారి కోటి రెడ్డి ఫిర్యాదు మేరకు జయసుధపై కేసు నమోదైంది.  నిబంధనల ప్రకారం రేషన్ బియ్యం మాయం అయితే రెట్టింపు నష్టపరిహారం కట్టాల్సి ఉంది. జయసుధ లేఖతో తాను నేరాన్ని అంగీకరించట్లైంది