మోహన్ బాబు పరిస్థితి విషమం ? 

78 ఏళ్ల ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి  విషమంగా ఉన్నట్లు  సమాచారం. బుధవారం రాత్రి అధిక రక్తపోటుతో గచ్చిబౌలిలోని ఒక హాస్పిటల్ లో చేర్పించారు.  ప్రస్తుతం ఆయనకు కార్డియాక్ మానిటరింగ్ చేస్తున్నారు. తలకు స్వల్ప గాయాలయ్యాయి. సీటీ స్కాన్ చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడౌతాయి. జల్ పల్లి నివాసంలో జర్నలిస్టులతో మోహన్ బాబు  మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ మీదే మోహన్ బాబుపై కేసు నమోదైంది. అధిక రక్తపోటు తో బాటు గుండెదడ ఎక్కువైంది.  గత మూడు రోజుల నుంచి మోహన్ బాబుకు  నిద్ర కరువైంది. రాత్రంతా ఆవేదనతో ఉన్నట్లు  ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.