జమిలీ ఎన్నికలకు ఈ వింటర్ లోనే బిల్లు ? 

ఒకే దేశం ఒకే ఎన్నిక వర్కవుట్ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. చాలా రోజుల నుంచి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ఎన్ డి ఏ ప్రభుత్వం యోచిస్తున్నప్పటికీ ఈ వింటర్ సీజన్ లో జరగనున్నపార్లమెంటు సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశ పెట్టే ఆలోచన కేంద్రం చేస్తోంది. ఇప్పటికే రామ్ నాథ్ కోవింద్ కమిటీ జమిలీ ఎన్నికలకు సిఫారసు చేసింది. కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని కేంద్రం యోచిస్తుంది. రామ్ నాథ్ కోవింద్ కమిటీ రెండు సిఫార్సులు చేసింది. ఒకటి లోకసభతో బాటు అసెంబ్లీ ఎన్నికలు , రెండోది ప్రభుత్వం అధికారంలో వచ్చిన వంద రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు  జరపడం. పొరుగు దేశమైన నేపాల్ 2015లోనే జమిలి ఎన్నికలు నిర్వహించింది. హిందుత్వ దేశంగా ముద్ర పడిన నేపాల్ తర్వాత మన దేశం కూడా జమిలీ ఎన్నికలకు ఆసక్తి చూపడం గమనార్హం. బెల్జియం, స్వీడన్, దక్షిణాఫికా దేశాల్లో ఇలాంటి తరహా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఆ దేశాల జనాభా  మనతో పోలిస్తే అతి తక్కువ.