ఫ్యామిలీ ఫైరింగ్.. ఐదుగురి మృతి

 

కుటుంబ కలహాల కారణంగా కాల్పులు జరిగి ఐదుగురు మరణించారు. అమెరికాలోని ఫోయెన్సిక్ నగరంలో ఒక ఇంటిలో ఐదుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. తుపాకీ కాల్పుల కారణంగా ఈ ఐదుగురూ మరణించారు. మృతుల్లో ముగ్గురు అన్నదమ్ములు, వారి తల్లి, మరో మహిళ ఉన్నట్టు గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా జరిగిన కాల్పుల కారణంగానే వీరు మరణించారని పోలీసులు చెప్పారు. ఈ కాల్పుల ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే వున్న మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.